హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక భద్రత / ఆర్ధిక వ్యవస్థ – పర్యావరణంపై తక్కువ ధరలకు విక్రయించే వస్తువుల ప్రభావం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆర్ధిక వ్యవస్థ – పర్యావరణంపై తక్కువ ధరలకు విక్రయించే వస్తువుల ప్రభావం

మన పర్యావరణంపై తక్కువ ధరకు అమ్మే ఇతర దేశాలనుండి దిగుమతి అయిన బొమ్మలు, విద్యుత్ పరికరాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన వాటి ప్రభావాన్ని తెలుసుకుందాం.

లక్ష్యం

మన పర్యావరణంపై తక్కువ ధరకు అమ్మే ఇతర దేశాలనుండి దిగుమతి అయిన బొమ్మలు, విద్యుత్ పరికరాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన వాటి ప్రభావాన్ని తెలుసుకుందాం.

నేపథ్యం

వాణిజ్య రంగాలలో సరళీకృత విధానాల వల్ల వివిధ దేశాల నుండి ఎన్నో రకాల వస్తువులు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా నిలుచేసుకోగలిగినవి, ఎక్కువకాలం మన్నికగా ఉండే వస్తువులూ వచ్చాయి. వీటిని కొనడంలో కొన్నిసార్లు ధర, ఆకర్షణీయంగా ఉండటం, నూతనత్వం వంటి లక్షణాలతోపాటు వాటి ఉపయోగాలు కూడా కారణమవుతాయి. ఐతే చాలా వరకు నాణ్యత, మన్నిక, విశ్వసనీయతలను పరిగణనలోకి తీసుకోవడంలేదు. స్థానికంగా ఉత్పత్తిచేసే వస్తువులకన్నా తక్కువ ధరకు దిగుమతి చేసుకునే వస్తువుల విషయంలో ఇది వాస్తవికంగా ఉంది. అయితే తక్కువ ధరలకు అమ్మే దిగుమతి చేస్తున్న వస్తువులు కొన్ని చాలా ప్రమాదకరమైనవి. కొన్నిసార్లు పర్యావరణానికి, వ్యక్తులకు కూడా హాని కలిగించవచ్చు. అంతేకాకుండా తక్కువ ధరలకు లభించే వస్తువులను అధిక పరిమాణంలో వినియోగించటం వల్ల వాటికి వుండే తక్కువ జీవితకాలం లేదా అస్థిర జీవితం వంటి కారణం వల్ల వ్యర్గాలు ఎక్కువగా పోగయ్యే అవకాశం ఉంది.

పద్ధతి

1. స్థానికంగా తయారైన వస్తువుల కన్నా తక్కువ ధరకు లభించే రెండు లేక మూడు దిగుమతి చేసుకున్న వస్తువులను సేకరించండి.

ఉదాహరణకు బొమ్మలు, అలంకరణ వస్తువులు, బ్యాటరీలు, విద్యుత్తు పరికరాలు, కాలెండర్లు, దీపాలు మొదలైనవి.

2. దిగుమతి చేసుకునే వస్తువులనమ్మే స్థానిక దుకాణదారులను కలిసి కింది సమాచారాన్ని సేకరించండి.

ఎ) ఒకరోజు లేదా వారం లేదా నెలలో ఎన్ని వస్తువులు అమ్ముతున్నారు. మరియు వస్తువు ఖరీదు.

బి) కొనుగోలుదారు తక్కువ ధరకు లభించే వస్తువులు కొనడానికి కారణాలు తెలుసుకోండి.

3. వీలైనంత మంది ఎక్కువ కొనుగోలుదారులు నుండి వారు తక్కువ ధరకు అమ్మే దిగుమతి చేసుకున్న వస్తువులు కొనడానికి గల కారణాలను కింది అంశాల ఆధారంగా తెలుసుకోండి.

ఎ) దిగుమతి చేసుకున్న వస్తువుల వంటివి స్థానికంగా ఉత్పత్తి అయినప్పటికీ ఎందుకు వాటిని కొనుగోలు చేయటం లేదో కారణాలు తెలుసుకోండి.

బి) వారు కొనుగోలు చేసిన వస్తువుల పనితీరు, ఎంతకాలం సరిగా పనిచేస్తున్నాయి, వాటి పనితీరు పట్ల సంతృప్తితో పాటు నాణ్యతను గురించి తెలుసుకోండి.

సి) వస్తువుల జీవితకాలం పూర్తయిన తర్వాత లేక ఉపయోగపడని సందర్భాలలో వాటిని ఏం చేస్తారు? ఎలా తొలగిస్తారు?

డి) భవిష్యత్తులో ఎటువంటి దిగుమతి చేసుకున్న వస్తువులను కొనాలని భావిస్తున్నారు?

ముగింపు

ప్రస్తుత కాలంలో వినియోగం కన్నా ఉత్పత్తి ఎక్కువయింది. అందువల్ల కంపెనీలు అవసరం లేకపోయినా కోనేటట్లు కొనుగోలుదారుల్ని అడ్వటైజ్మెంట్ల ద్వారా ఊదరగొడుతున్నాయి. మన్నికలేని చౌకగా లభించే వస్తువులతో మార్కెట్ల నిండిపోతున్నాయి. ఇలాంటి పరికరాలలో వాడే రసాయనాలు హానికరంగా ఉండడం వల్ల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. ఆహార పదార్ధాలలో కలిపే రంగులు మొదలు పిల్లల ఆట పరికరాలలో వాడే రంగుల వరకు అన్నీ కాలుష్యం కలిగించేవిగానే ఉంటున్నాయి. రంగులు కలిపిన, నిలువ ఉన్న నూనెలతో చేసిన ఆహార పదార్థాలను తినడంవల్ల అనేక వ్యాధులు కలుగుతున్నాయి. మన్నికలేని వస్తువుల ఉత్పత్తి వలన ముడిసరుకు ఎక్కువగా ఖర్చవుతుంది. పదేపదే కొనాల్సిరావడం వలన ఉత్పత్తిని పెంచుతారు. ఇది వనరుల దుర్వినియోగానికి, పర్యావరణానికి ఎంతో హానికరంగా పరిణమిస్తోంది. అందువల్లనే మనం అవసరమైన వస్తువుల్ని అవసరమైన పరిమాణంలోనే కొనాలి. కొనేటప్పడు వాటి తయారీలో వాడిన పదార్గాలు, వాటి ప్రభావాలు, మన్నిక, నాణ్యత మొదలైనవన్నీ దృష్టిలో ఉంచుకుందాం.

మీరు సేకరించిన సమాచారం ఆధారంగా తక్కువ ధరకు లభించే వస్తువులు లేదా ఉత్పత్తులు కొనుగోలు చేయటం ఆర్థికంగా, పర్యావరణ పరంగా సరైనదేనా అనేది నిర్ణయించండి. అదే విధంగా తక్కువ నాణ్యత కలిగిన వస్తువుల జీవితకాలం తక్కువగా ఉండటం వల్ల వ్యర్థ పదార్థాలు పెరుగుతాయా? ఆలోచించండి.

తదుపరి చర్యలు

స్థానిక పురపాలకసంఘం, గ్రామపంచాయతీలు ఎలక్షానిక్ వ్యర్థ పదార్ధాలు, వస్తువులను ఏవిధంగా తొలగిస్తున్నాయో తెలుసుకోండి.

ఆధారము: http://apscert.gov.in/

3.01282051282
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు