జాతీయ మధ్యాహ్న భోజన పథకం, పరిపూర్ణ బాలల వికాస సేవలు ( ఐ సి డి ఎస్ ), కిషోరి శక్తి యోజన ద్వారా పోషణ సంరక్షణ జరుగుతూ ఉంది. మధ్యాహ్న భోజన పథకం సుమారుగా మొత్తం అంతా అమలు చేసారు, ఐ సి డి ఎస్ మాత్రం అంచెలంచెలుగా అమలు చేయబడుతోం ది. 11 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికల ఆరోగ్య మరియు పోషణని పెంపొందించడానికి కిషోరి శక్తి యోజనని కూడ ప్రభుత్వం అమలు చేసింది.
4,882 కోట్ల రూపాయలతో ప్రభుత్వం జాతీయ ఆహార సంరక్షణ మిషన్ ని ప్రారంభించింది. 2008-09 సంవత్సరములో ప్రభుత్వం 225 లక్షల టన్నుల గోధుమలని కొనుగోలు చేసింది. ఇదివరకె ప్పుడూ ఇలా కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం, 265 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసింది. ఇదివరకె ప్పుడూ ఇంత అత్యధిక స్థాయిలో ఈ విధంగా బియ్యాన్ని కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం గోధుమల కనీస సహకార ధర ( ఎమ్ ఎస్ పి ) నాలుగు సంవత్సరములలో క్రమంగా పెంచింది. ఇది 2004-2005 సంవత్సర స్థాయి కన్నా 56% ఎక్కువ. ఇది 2008-2009లో క్వింటాలుకి 1000 రూపాయలు. 2004 లో బియ్యం కనీస సహకార ధర ( ఎమ్ ఎస్ పి ) క్వింటాలుకి 546 రూపాయల నుండి 850 రూపాయలకు పెరిగింది. 2007-2008 లో తగినంత గోధుమల నిల్వలు మరియు స్థిరమైన గోధుమల ధరల ద్వారా ఆహార సంరక్షణ కల్పించడానికి ప్రభుత్వం 17.69 లక్షల టన్నుల గోధుమల్ని దిగుమతి చేసుకుంది.
ఎంతో కాలం నుండి చేస్తున్న డిమాండులలో ఒక్కటైన ఆహార ఉద్యమమే (మరియు ఇండియాలలో శ్రామిక ఉద్యమం ) ఈ జాతీయ “ ఉపాధి హామీ చట్టం ”జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్ ఆర్ ఇ జి ఎ, 2005) వచ్చిన తరువాత ఈ డిమాండ్ పాక్షికంగా 2005 సంవత్సర మధ్యలో తీరింది. ఈ చట్టం క్రింద, ఎవరైనా యువకులు రోజూవారీ శ్రామికునిగా కనీస వేతనానికి చేయదలచుకుంటే, వారు 15 రోజులలో స్థానిక ప్రభుత్వ పనులలో ఉపాధికి అర్హులు. ఈ ఉపాధి సంవత్సరానికి ఒక ఇంటికి 100 రోజుల వరకు పరిమితము.
ఆహార సంరక్షణ కల్పించడంలో పౌర సరఫరాల వ్యవస్థ ( పి డి ఎస్) ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. 4 లక్షలకన్నా ఎక్కువ చౌకదుకాణాల నెట్ వర్కుతో, ప్రతి సంవత్సరము 15,000 కోట్ల రూ పాయలు విలువచేసే నిత్యావసర వస్తువుల్ని సుమారు 16 కోట్ల కుటుంబాలకి సరఫరా చేస్తున్న ట్లు చెపు తున్నారు. ఇండియాలో పౌరసరఫరాల వ్యవస్థ బహుశా ప్రపంచంలో ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్కు.
ఉత్పాదకత లేని ఋతువు మరియు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కలిగే కరువు నుండి కాపాడడానికి గ్రామీణ ధాన్య బ్యాంకులకు ఎక్కువ కవరేజి మరియు ఎక్కువ అర్థవంతం అయ్యేలా సమీక్షించారు. ఇంతకు ముందు, షెడ్యూలు తెగల వారికి మరియు గిరిజన ప్రాంతాలలో ఉండే షెడ్యూలు కులాలలో ఇష్టమైన వారికి ఈ పథకం వర్తించేది. కరవుకు లోనయ్యే ప్రాంతాలలో ఎడారి ప్రాంతాలలో మరియు ఆహార కొరత ఉన్న దేశ భాగాలలో సరైన మార్గంలేని కొండ ప్రాంతాలలో, గత నాలుగు సంవత్సరాలలో అనుమతించిన గ్రామీణ ధాన్యపు బ్యాంకులు 4,858 నుండి 18,129 వరకు పెరిగాయి.
అంత్యోదయ అన్నయోజన, అదనంగా ఒక కోటి గృహాల వరకు విస్తరించింది. ఇది 67% విస్తారం వరకు వ్యాపించింది. మొత్తం జనాభాలో సుమారు 5% జనాభా రెండు పూర్తి బోజనములు లేకుండా నిద్ర పోతుందన్న నిజాన్ని “జాతీయ సేంపిల్ సర్వే ఎక్సర్ సైజ్ ” చెప్పింది. ఈ జనాభా విభాగాన్ని“ఆకలి ” అని పిలుస్తారు. ఈ తరగతికి చెందిన జనాభా లక్ష్యంగా పెట్టడానికి మరియు టార్గెటెడ్ పౌర సరఫరా విధానమును మరింత క్రేందీకృతం చేయడానికి, 2000 సంవత్సరము డిసెంబరులో అంత్యోదయ అన్న యోజన ని (ఎ ఎ వై ) ఒక కోటి అతి పేద కుటుంబాల కొరకు ప్రారంభించారు.
రాష్ట్రా లలో టార్గెటెడ్ పౌర సరఫరా విధానము పరిధిలో ఉండే దారిద్ర్య రేఖ క్రిందనున్న కుటుంబాలలో ఒక కోటి అతి పేద కుటుంబాలను గుర్తించడము మరియు ఆహర ధాన్యాలను అతి తక్కువ ధరలో అంటే గోధుమ కిలో 2 రూపాయలకు, బియ్యం కిలో 3 రూపాయలకు ఇవ్వడానికి (ఎ ఎ వై ) ఆలోచిస్తుంది. డీలర్ల మార్జిన్ తో పాటు సరఫరా ఖర్చు మరియు రవాణా ఖర్చు రాష్టాలు / కేంద్రపాలిత ప్రాంతాలు భరించాల్సి ఉంటుంది. ఈ పథకం క్రింద ఆహారం యొక్క మొత్తం రాయితీలను వినియోగ దారులకు అందజే యబడుతుంది.
ఉత్పాదక స్థానం: జాతీయ కనీస అవసరాల కార్యక్రమము, అమలు స్థాయి 2008
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
ఈ విభాగంలో వివిధ జీవనోపాధులు మరియు వాటి వివరాల గుర...
మానవ మనుగడకి గృహము ఒక కనీస అవసరము. గృహము, గ్రామీణ ...
పొగాకు తినడం లేదా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ...
భారతీయ సమాజంలో కుల వ్యవస్థ వినాశ హేతువవుతోంది. ఈ క...