పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉపాధి

దారిద్ర్య నిర్మూలన వ్యూహరచన వివిధ రకాలైన పేదరికాన్ని తగ్గించే మరియు ఉపాధి కల్పనా కార్యక్రమాల్ని కలిగి ఉంది. ఇందులో చాలా వరకు చాలా సంవత్సరముల నుండి అమలులో ఉన్నాయి మరియు ఉపాధి కల్పించి, ఫలవంతమైన ఆస్తులను సృష్టించి, సాంకేతిక మరియు వ్యాపార నైపుణ్యాలను ఇచ్చి వాటిని పటిష్టం చేసి పేదవారి ఆదాయాన్ని పెంచారు.

భారతదేశంలో ఉపాధి కల్పన

దారిద్ర్య నిర్మూలన వ్యూహరచన వివిధ రకాలైన పేదరికాన్ని తగ్గించే మరియు ఉపాధి కల్పనా కార్యక్రమాల్ని కలిగి ఉంది. ఇందులో చాలా వరకు చాలా సంవత్సరముల నుండి అమలులో ఉన్నాయి మరియు ఉపాధి కల్పించి, ఫలవంతమైన ఆస్తులను సృష్టించి, సాంకేతిక మరియు వ్యాపార నైపుణ్యాలను ఇచ్చి వాటిని పటిష్టం చేసి పేదవారి ఆదాయాన్ని పెంచారు. ఈ పథకాల క్రింద, ఉపాధి మరియు స్వయం ఉపాధి రెండూ దారిద్ర్యరేఖ దిగువనున్న వారికి ఇచ్చారు. పలురకాల పేదరికాన్ని తగ్గించే మరియు ఉపాధికల్పనా కార్యక్రమాల్ని 1998-99 సంవత్సరం నుండి క్రింద నిచ్చిన రెండు గ్రూపులుగా వర్గీకరించారు.

భారతదేశంలో అవ్యవస్థీకృతరంగంలో పనివారు

“అవ్యవస్థీ కృత రంగంలోని పనివారు” అంటే, ఎవరైతే వేతనము లేదా ఆదాయం కొరకు, నేరుగా లేదా ఏదైనా సంస్థ / కంట్రాక్టరు ద్వారా; స్వయంగా అతను లేదా ఆమె లేదా స్వయం ఉపాధి; ఏదైనా ప్రదేశంలో అతని లేదా ఆమె గృహములో, ఫీల్డులో లేదా ఏదైనా పబ్లిక్ ప్రదేశంలో పని చేసేవారు మరియు ఎవరైతే ఎంప్లోయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కా ర్పొ రేషన్ చట్టం మరియు ప్రోవిడెంట్ ఫండ్ చట్టం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొ రేషన్ యొక్క ఒక్కొ క్క ఇన్సూరెన్స్ మరియు ఫింఛను పథకం, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా లాభం పొందనివారు లేదా సమాయాన్ని బట్టి అధికారులు నిర్ణయించిన లాభాలు పొందని వారు.

ఉపాధి కల్పన - ప్రభుత్వ చొరవలు

గ్రామీణ పేదలకు 100 రోజులు ఉపాధిని కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన చట్టం ఎన్ ఆర్ ఇ జి ఎ) అమలు చేయబడింది. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి సామా జిక సంరక్షణ కలిగించే చట్టం ఏదీ చేయలేదు. ఈ చట్టం క్రింద, దేశంలో 200 జిల్లాలు నుండి క్రమంగా మొత్తం 614 గ్రామీణ జిల్లాలకి 2008 సంవత్సరము ఏప్రిల్ నెల నుండి విస్తరింప జేశా రు.
చిన్న మరియు గ్రామీణ పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధులను కల్పించడానికి ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కె వి ఐ సి) ని పునరుద్ధరించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో, పెద్ద మొత్తంలో జీవనాధారమైన ఉపాధి కల్పనావకాశములు కలిగించే ఈ వ్యాపార సంస్థల యొక్క ఉత్పాదకతను మెరుగు పరచడానికి “అవ్యవస్ధిత రంగంలో వ్యాపార సంస్థల కొరకు జాతీయ కమిషన్” (ఎన్ సి ఇ యు ఎస్)ని సలహా ఇచ్చే సంఘంగా మరియు అనియమిత రంగాన్ని గమనించ డానికి నియమించారు. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఏలియన్స్ ప్రభుత్వం తన సామాన్య కనీస పథకంలో వాగ్ధానం చేసిన ప్రకారం; క్రొత్త గ్లోబల్ వాతావరణంలో, రంగంలో పోటీ తత్వాన్ని మెరుగు పరచడానికి మరియు క్రెడిట్, ముడి పదార్థాలు, ఉపకరణ పరికరాలు, సాంకేతిక అభివృద్ధి మరియు మార్కెటింగు వంటి విషయాలలో సంస్థాగత విధానాలతో రంగాన్ని కలపడానికి తగిన పద్ధతుల్ని సిఫార్సు చేయ డానికి వ్యవస్థీ కృతం కాని రంగంలో ఆ రంగ నైపుణ్య వికాసానికి కావలసినంత మేర జోక్యము చేసుకోవడం కూడా కమిషన్ పరిగణలో ఉంది.

ప్రత్తిపై సాంకేతిక అభివృద్ధి నిధి పథకం మరియు సాంకేతిక యంత్రాంగం (టెక్నాలజీ మిషన్) పన్నుల ఉపశమనంతో పెద్ద ప్యాకేజ్ ని ఇచ్చారు. దేశంలో గరిష్ట విలువలని మరియు పురోగతిని సాధించ డానికి పన్నుల విధానాన్ని హేతుబద్ధంగా వివరించారు. సాంకేతిక అభివృద్ధి నిధి పథకం మరియు ప్రత్తిపై టెక్నాలజీ మిషన్ వంటి పథకాల ఉద్దేశము ప్రకారము పెట్టుబడిని, పరిశ్రమ రంగాన్ని నవీన పరచడానికి మరియు నాణ్యత గల ముడి సరుకులు పోటీ ధరలకి లభ్యమయ్యేలా చేయడానికి పెంపొందించారు. అదనపు క్రెడిట్ తో పాటు 10% పెట్టుబడి రాయితీలు ఇవ్వడం మొదలు పెట్టడంతో, సాంకేతిక అభివృద్ధి నిధి పథకం ద్వారా పెట్టే పెట్టుబడి 2003-04 లో 1300 కోట్ల రుపాయల నుండి 2006-07లో సుమారు 20,000 కోట్ల రుపాయల వరకు పెరిగింది. ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్కుల పథకాన్ని ఉపకరణ సౌకర్యాలని పటిష్టం చేయడానికి ప్రారంభించారు. ఈ పథకం క్రింద, 40 ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కులను స్థాపించాలని ప్రతిపాదించారు. 11 వ పంచవర్ష ప్రణాళికలో టెక్స్టైల్ పై టెక్నాలజీ మిషన్ ని అమలు చేస్తారు.

జాతీయ జనపనార బోర్డు

ముడి జనపనార కనీస సహాయ ధర క్వింటాలుకు 2004-05 లో 890 రూపాయల నుండి 2008 - 09 లో 1250 రూపాయల వరకు క్రమంగా పెంచారు. చాలినంత డిమాండు రావడానికి, పంచదార మరియు ధాన్యాల ప్యాకేజీలలో తప్పనిసరిగా జనపనారని ఉపయోగించాలి. జనపనారని పండించే వారి ప్రయోజనాలని రక్షించడానికి మరియు జనపనార డిమాండుని పెంచడానికి మొదటి సారిగా విస్తారమైన జాతీయ జనపనార పా లసీని ప్రకటించారు. జూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాని పునరుద్ధ రించారు. జనపనార రంగ వికాసానికి జూట్ టెక్నాలజీ మిషన్ ని ప్రారంభించారు. జనపనార రంగంలో, వివిధ సంస్థల చర్యలలోని ఉమ్మడి శక్తిని తీసుకురావడానికి జాతీయ జనపనార బోర్డు స్థాపనని ప్రారంభించారు.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం- ఆంధ్రప్రదేశ్

ఉత్పాదక స్థానం: జాతీయ సామాన్య కనీస పథకం, అమలు పరిచే స్థానము 2008

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.93793103448
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు