మానవ మనుగడకి గృహము ఒక కనీస అవసరము. గృహము, గ్రామీణ పేదలకి ఒక పెద్ద ప్రాముఖ్యతని సంతరిస్తుంది. దానితో గృహము లేదనే వ్యాకులతను పారద్రోలి మరియు స్పష్టమైన, సురక్షితమైన గుర్తింపు పొంది మర్యాదయైన జీవనానికి పునాది వేస్తుంది. ఆ విధంగా ఇండియాలో పేదరికాన్ని తొలగించడానికి, గృహాల కొరతని తగ్గించడం చాలా ముఖ్యమైన వ్యూహరచన.
ఇందిరా ఆవాస్ యోజన (IAY) మన దేశం ఇప్పటివరకు చేపట్టిన అతి పెద్ద సమగ్ర, గ్రామీణ గృహనిర్మాణ పథకం. దీని మూలాలు 1980లో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (NREP)లోని వేతన ఉపాధిలో ఉన్నాయి. ఆ తర్వాత ఇదే పథకం 1983లో గ్రామీణ భూమిలేని పేదల ఉపాధి హామీ పథకం (RLEGP) గా మారింది. ఈ పథకం కింద ఇళ్లు నిర్మించడం అనుమతించబడింది. ఈ పథకం కాలక్రమంలో IAYగా రూపొందించబడింది. IAY 1996లో జనవరి 1న ప్రారంభించబడింది.
ఇందిరా ఆవాస్ యోజన (IAY) మన దేశం ఇప్పటివరకు చేపట్టిన అతి పెద్ద సమగ్ర, గ్రామీణ గృహనిర్మాణ పథకం. దీని మూలాలు 1980లో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (NREP)లోని వేతన ఉపాధిలో ఉన్నాయి. ఆ తర్వాత ఇదే పథకం 1983లో గ్రామీణ భూమిలేని పేదల ఉపాధి హామీ పథకం (RLEGP) గా మారింది. ఈ పథకం కింద ఇళ్లు నిర్మించడం అనిమతించబడింది. ఈ పథకం కాలక్రమంలో IAY గా రూపొందించబడింది. IAY 1996లో జనవరి 1న ప్రారంబించబడింది.
IAY 1985లో ప్రారంభిందిన గ్రామీణ భూమిలేని పేదల ఉపాధి హామీ పథకానికి అనుబంధ పథకంగా ప్రారంబించబడింది. అంతకు మునుపు వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన ఎస్సీ/ఎస్టీలకు ఈ పథకం కింద ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరిగింది. 1985 ఏప్రిల్ లో జవహర్ రోజ్ గార్ యోజనను ప్రారంభించినపుడు, ఆ నిధులలో 6 శాతాన్ని ఎస్సీ/ఎస్టీలకు, వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన వారి ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. 1993-94లో జేఆర్ వైకు కేటాయించిన నిధులను 10 శాతానికి పెంచి ఆ అదనపు 4 శాతాన్ని ఈ పథాకాన్ని ఎస్సీ/ఎస్టీయేతరులకు కూడా వర్తింపజేశారు.
IAYను 1998 జనవరి 1 నుంచి స్వతంత్ర పథకంగా వేరు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పథకం కేంద్ర గ్రామీణాభివృద్ధి ప్రతిష్టాత్మక పథకంగా మార్ంది. గ్రామీణ పేదరిక నిర్మూలనలో భాగంగా – పేదలకంటూ ఒక చిరునామా, వారికి వివిధ రకాల గ్రామీణాభివృద్ధి పథకాలు అందుబాటులోకి తెచ్చే విధంగా దీనిని ప్రారంభించారు.
ప్రతిష్టాత్మక IAY పథకం ప్రధాన లక్ష్యం పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం. వివిధ రాష్ట్రాలలో వివిధ పథకాల పేరిట, వివిథ రకాలుగా దీనికి నిథులిస్తున్నారు. ఉదా: ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ పథకం, గుజరాత్ లో సర్థార్ పటేల్ ఆవాస్, తమిళనాడులో సమత్వపురం పేరిట ఇది నిర్వహించబడుతోంది. ప్రతి రాష్ట్రామూ తమ సొంత విధానాలు, పద్ధతులలో ఈ పథకం కింద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నాయి. పేద ప్రజలకు సామాజిక భధ్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం.
పేద ప్రజల గృహనిర్మాణంలో పెలు మెచ్చుకోదగిన పద్ధతులను పాటిస్తున్నారని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో గృహనిర్మాణ విధానాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడానికి ఒక పరిశోధనను నిర్వహించి ఆ ఫలితాలను ప్రచురించాలని నిర్ణయించడం జరిగింది.
లక్ష్యబృందం
IAYను దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాలు, వృద్ధులు, వితంతువులు, నిస్సహాయ స్థితిలో ఉంటూ గుడిసెలు, కచ్చా ఇళ్లలో ఉండే సొంత ఇళ్లులేని, స్థలం లేని నిరుపేదల కోసం ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రభుత్వం పేదలు ఒక పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాన్ని కూడా ఉచితంగా ఇస్తుంది.
ఈ పథకం కింద గ్రామసభల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలను ముందుగా నిర్దెశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా గుర్తిస్తారు. ఆ తర్వాత వారికి స్థలాన్ని కేటాయించి, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తారు.
2001 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశం ఇంకా 14.67 మిలియన్ యూనిట్ల నివాసాల కొరత ఎదుర్కొంటోంది. 2011 జనాభా లెక్కల నాటికి ఇది 14.83 మిలియన్ యూనిట్లకు చేరుకొంది. 2021 నాటికి ఈ సంఖ్య 14.99 మిలియన్లు చేరుకోవచ్చని నిపుణుల అంచనా.
నూతన గృహం నిర్మించుకోవడానికి సహాయం
ఒక ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన ఖర్చును ఆయా భౌగోళిక ప్రాంతాన్ని అనుసరించి నిర్ణయిస్తారు. ఉదా: అది కొండ ప్రాంతమా లేదా మైదాన ప్రాంతమా అన్నది. మైదాన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం కంటే, కొండ ప్రాంతాలలో ఇంటి నిర్మాణ ఖర్చు ఎక్కువ ఉండటంతో, తదనుగుణంగా ప్రభుత్వ సాయమూ ఎక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతానికి రోడ్లు సరిగా లేకపోవడం, దగ్గరలో నిర్మాణ సామాగ్రి లేకపోవడం మొదలైన కారణాల వల్ల నిర్మాణ సామాగ్రి అక్కడికి చేరవేయడం కష్టం.
రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా IAY లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. రాష్ట్రస్థాయిలో ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్ శాఖ పర్యవేక్షిస్తాయి. జిల్లాస్థాయిలో ఈ పథాకాన్ని జిల్లా ఛైర్మన్ షిప్ కింద ఉండే జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజన్సీ (DRDA) పర్యవేక్షిస్తుంది.
గ్రామస్థాయిలో:
రాష్ట్రస్థాయిలో గ్రామాన్ని ప్రాథమిక యూనిట్ గా తీసుకుంటారు. దీనిని స్థానిక గ్రామ పంచాయితీ పర్యవేక్షిస్తుంది. స్థానిక గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామంలోని పెద్దలు, పంచాయితీ కార్యదర్శులు అందరూ కలిసి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న భూమిలేని, ఇళ్లు లేని, లేదా కచ్చా ఇళ్లలో ఉంటున్న వారిని గుర్తించి, ఆయా లబ్ధిదారుల పేర్లను అధికారుల ఆమోదం కోసం పంపిస్తారు.
మండలస్థాయి లేదా బ్లాక్ స్థాయి:
గ్రామపంచాయితీలు మండల లేదా బ్లాక్ స్థాయి అధికారుల (MPDOలు) పర్యవేక్షణ కింద ఉంటాయి. ఈ MPDOలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తారు. స్థానిక mro లేదా తహసీల్దార్ ఇళ్లకు అసరమైన భూమిని సమకూర్చుతారు. మండల, బ్లాక్ స్థాయి అధికారులు ఉన్నతాధికారుల సూచనలు/నిబంధనలు, నియంత్రణకు లోబడి పని చేస్తారు.
జిల్లాస్థాయి:
మండల లేదా బ్లాక్ స్థాయి అధికారులను జిల్లా గృహనిర్మాణ విభాగానికి చెందిన జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. ఈ జిల్లాస్థాయి గృహనిర్మాణ విభాగ అధికారులు జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా ఉండే DRDA కింద పని చేస్తారు. రాష్ట్రస్థాయిలో జరిగే సమావేశాలలో జిల్లా ప్రతినిధిగా వ్యవహరిస్తారు. ఈ విధంగా రాష్ట్రస్థాయిలో అధికార క్రమాన్ని అనుసరిస్తారు.
గ్రామస్థాయిలో తుది ఎంపిక జాబితా:
స్థానిక గ్రామ సభ లబ్ధిదారుల ఎంపికను చేస్తుంది. ఈ సమావేశానికి స్థానిక సర్పంచ్, వార్డు మెంబర్లు, అధికారులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్ పీటీసీలు, ఎమ్ పీటీసీలాంటి ఎన్నికైన ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ఈ సమావేశం సందర్భంగా ఇల్లు కావాల్సిన వారంతా దరఖస్తు చేసుకోవచ్చు. ఈ మొత్తం కార్యక్రమం వల్ల గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. బ్లాక్/మండలస్థాయిలో స్థానిక అధికారులు ఈ జాబితాను పరిశీలిస్తారు. మండలస్థాయిలో ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను జిల్లాస్థాయిలో ఆమోదిస్తారు. కొన్ని రాష్ట్రాలలో తుది లబ్ధిదారుల జాబితాను తమ వ్యక్తిగత స్వార్ధం కోసం స్థానిక అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు.
గ్రామస్థాయిలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మిస్తుండగా, పట్టణ స్థాయిలో ప్రభుత్వం నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలలో రాజీవ్ గృహకల్ప కింద ఇళ్లను నిర్మించి ఇస్తున్నారు.
భూసేకరణ
ప్రత్యేక ప్రాజెక్టులు:
ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తులు, హింసాత్మక సంఘటనలు, చట్టపరమైన సమస్యలు తదితర సమస్యల కారణంగా నష్టపోయి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల కుటుంబాలు, మరీ ప్రత్యేకించి గిరిజన బృందాలు, వెట్టి చాకిరి నుంచి విముక్తి అయినా వారు, పారిశుధ్య కార్మికులకు కోసం ప్రత్యేక కేటాయింపులు జరుపుతుంది.
నిధుల కేటాయింపు విధానం
ఇళ్ల స్థలాలకు అయ్యే ఖర్చును మినహాయించి ఆ పథకం ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 : 25 నిష్పత్తిలో పంచుకొంటాయి. అదే ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే ఈ నిష్పత్తి 90 :10గా ఉంటుంది. ఇళ్ల స్థలాల ఖర్చు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చును 50 : 50 నిష్పత్తిలో పంచుకొంటాయి. అదే కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుంది.
నిధుల ప్రత్యేక కేటాయింపు:
జాతీయ స్థాయిలో 60 శాతం నిధులను ఎస్సీ/ఎస్టీ వర్గాల కోసం మాత్రమే ఖర్చు చేస్తుంది. అంతే కాకుండా 15 శాతం నిధులను మైనారిటీ వారి కోసం ఖర్చు పెడుతుంది. లబ్ధిదారుల్లో కనీసం 3 శాతం మంది వికలాంగులు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకొంటుంది.
నిధుల కేటాయింపు
మొత్తం బడ్జెట్లో 95 శాతం నిధులను కొత్త ఇళ్ల నిర్మాణం, ఉన్న ఇళ్ల అప్ గ్రేడేషన్, ఇళ్ల స్థలాల కొనుగోలు, అధికారిక నిర్వహణా ఖర్చుల కోసం వ్యయం చేయాలి. మిగిలిన 5 శాతం నిధులను ప్రత్యేక ప్రాజెక్టుల కోసం పక్కకు తీసిపెట్టాలి.
ప్రస్తుతం జరుగుతున్న సామాజిక ఆర్థిక కులపరమైన జనాభాగణన పూర్తయ్యే వరకు కేంద్రం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు, వాటి నుంచి జిల్లాలు, బ్లాకులకు, లేదా రాష్ట్రాలు కావాలనుకుంటే గ్రామ పంచాయతీలకు ఎస్సీ/ఎస్టీలు, మైనారిటీలు, ఇతర వర్గాల వారిలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి ప్రాతిపదికగా నిధుల కేటాయింపు చేయాలి. అలాంటి కేటాయింపులు చేయడానికి అవసరమైనంత సమాచారం లభించేంత వరకు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వార్షిక కేటాయింపులను స్థూలంగా – 75
శాతం వెయిటేజ్ ను గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల కొరత ప్రాతిపదికగా, మిగతా 25 శాతం వెయిటేజిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల సంఖ్య ప్రాతిపదికగా కేటాయించాలి. ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని ఎస్సీ/ఎస్టీ, మైనారిటీలకు కేటాయింపులు ఎలాంటి అక్రమాలు జరిగే అవకాశం లేకుండా లక్ష్యబృందంలోని జనాభా సంఖ్య ప్రాతిపదికగా జరగాలి. పథకానికి సంబంధించిన ఇతర ప్రత్యామ్నాయ సమాచారాన్ని ఉపయోగించుకోదలచిన రాష్ట్రాలు దానికి చట్టబద్ధత కల్పించడానికి ముందుగా సాధికార కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేటాయింపుల్లో 20 శాతం రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదల కచ్చా ఇల్లు/శిథిలావస్థలో ఉన్న ఇళ్లను మెరుగుపరచడానికి ఉపయోగించుకోవచ్చు.
అమలుకు ప్రత్యేక సంస్థ
కొన్ని రాష్ట్రాలలో ఈ పథకం అమలును జిల్లా పరిషత్ కు అప్పగించవచ్చు. స్థానిక స్థాయిలో గ్రామ పంచాయతీ, అవి లేని చోట దానికి తత్సమానమైన సంస్థలు ఈ పథకం అమలును పర్యవేక్షిస్తాయి. ఒకవేళ గ్రామ పంచాయితీలు ఈ పథకాన్ని అమలు పరచడానికి మరీ చిన్నగా ఉన్నట్లైతే, రాష్ట్రం ఆ బాధ్యతను మధ్యస్థ స్థాయిలో ఉన్న పంచాయితీలకు అప్పగించవచ్చు. అలాంటి సందర్భాలలో గ్రామ పంచాయితీలకు ఆవాసాలు, లబ్ధిదారుల ఎంపిక, పర్యవేక్షణలో స్పష్టమైన బాధ్యతను అప్పగించాలి.
సాధికార కమిటీలు:
కార్యదర్శి (గ్రామీణాభివృద్ధి/అదనపు కార్యదర్శి గ్రామీణ కార్యదర్శి (RD) అధ్యక్షుడిగా ఉన్న ఒక సాధికార కమిటీ ఉంటుంది. జాతీయ స్థాయిలో దానిలో ఈ క్రింది సభ్యులుంటారు :
ఈ సాధికార కమిటీ గృహనిర్మాణ విధానంపై సమీక్ష కొరకు నిపుణుల అభిప్రాయాలను ఆహ్వానించవచ్చు. సమావేశాలకు తోడుగా ఈ కమిటీ ఈ పథకంలోని అన్ని అంశాలను సమీక్షించి, చర్చించవచ్చు. నిర్ణీత ఏడాదిలో పూర్తి చేయాల్సిన ఇళ్లు, జిల్లాలవారీగా కేటాయింపులు, వివిధ అంశాల విషయంలో తలెత్తే సమస్యలు, నిధుల కేటాయింపు, ప్రత్యేక ప్రాజెక్టులకు 5 శాతం కేటాయింపులు, నిధుల పునః కేటాయింపు, వాయిదాసొమ్ము మంజూరు, గృహ నిర్మాణం విషయంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి తదితర అంశాలపై సలహాలు ఇవ్వవచ్చు.
ఇందిరా ఆవాస్ యోజన అమలు
అమలు విధానాలు
IAY సమర్థంగా అమలు కోసం ప్రతి రాష్ట్రం తన అవసరాలకు అనుగుణంగా నివాస సముదాయమా లేక వ్యక్తిగత ఇళ్ల నిర్మాణమా అన్న దానిపై ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి.
నిర్మాణపరమైన సౌకర్యం, పేద కుటుంబాలకు కనీస అవసరాలు తీర్చే నిమిత్తం మరియు పర్యవేక్షణ సులభంగా ఉండడానికి IAYలో వీలైనంత వరకు నివాస సముదాయ విధానాన్ని అనుసరించడం మేలు. ఈ క్రింది విభాగాలకు చెందిన వారి కోసం నివాస స్థలాలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఇతర స్థానిక, పారదర్శక సామాజిక ఆర్థిక అంశాల ప్రాతిపదికగా నివాస స్థలాలను గుర్తించవచ్చు.
అయితే, ఒక గ్రామ పంచాయితీ పరిధిలో నివసించే కొన్ని విభాగాలకు చెందిన అర్హులైన లబ్ధిదారుల విషయంలో వ్యక్తిగత ఇళ్ల విధానాన్ని అనుసరించవచ్చు. ఈ విధానాన్ని అనుసరించే సమయంలో, మొదట పారిశుద్ధ్య కార్మికులు, పునరావాసం పొందుతున్న వాళ్లు, వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించిన వారికి ప్రాధాన్యతనివ్వాలి. ఆ తర్వాత క్రింది విధానాన్ని అనుసరించి ప్రాథాన్యతలు నిర్ణయించుకోవాలి.
విపత్కర పరిస్థితులలో ఉన్న మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, భర్తలచే వదిలివేయబడిన మహిళలు, హింసాత్మక సంఘటనలు ఎదుర్కొన్న మహిళలు, 40 శాతం వైకల్యం ఉన్న మానసిక వికలాంగులు; శారీరక వికలాంగులు; లింగమార్పిడి చేయించుకున్నవారు; వితంతువులు, రక్షణ/పారామిలటరీ/ పోలీస్ బలగాలలో మరణించిన వారి భార్యలు లేదా వారి పిల్లలు (వారు దారిద్ర్య రేఖకు పైబడినవారు); కుష్టు లేదా కాన్సర్ తో బాధపడుతున్న వారి కుటుంబీకులు; HIV (PLHIV) తదితర వాటితో జీవిస్తున్న వారు మొదలైన వారికి ప్రాధాన్యతనివ్వాలి.
నివాసస్థలాల గుర్తింపు:
రాష్ట్ర పభుత్వం రూపొందించిన పారదర్శకమైన నిబంధనలకు అనుగుణంగా నివాసస్థలాలను గుర్తించాలి. ఇందుకోసం వార్షిక ప్రాధాన్యత, పంచవర్ష జాబితా రూపొందించుకోవడం మేలు.
నివాస సముదాయాలను ఎంపిక చేసుకున్న వెంటనే, ఈ పథకాన్ని అమలు చేసే పర్యవేక్షక సంస్థ సంబంధిత పంచాయితీల సహకారంతో ఒక సవివరమైన సర్వేను చేపట్టాలి. అక్కడ ఉన్న ఇళ్ల వివరాలు, దానిని చేరుకోవడానికి ఉన్న రహదారి మార్గాలు, విద్యుత్ సదుపాయం, నీటి సరఫరా, పర్యావరణ పరిశుభ్రత, అంగన్ వాడి కేంద్రాలు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, వర్క్ షెడ్లు మొదలైన సామాజిక మౌలిక సదుపాయాల వివరాలు సేకరించాలి. సర్వే జరుగుతున్నపుడు దానికి అనుబంధంగా బృందచర్చలు, ప్రజల సహాయంతో ప్రణాళికలు మొదలైనవి కూడా జరగాలి. ఆ ప్రాంతంలో అర్హత కలిగిన లబ్ధిదారులందరి వివరాల జాబితా సిద్ధం చేసుకోవాలి.
రాష్ట్రాలు లబ్ధిదారుల కోసం ఎన్ని ఇళ్లును సముదాయ రూపంలో నిర్మించాలి, ఎన్ని ఇళ్లను విడివిడిగా ఉండే విధంగా నిర్మించాలి అన్నదానిపై నిర్ణయించుకోవచ్చు.
లబ్ధిదారుల వార్షిక ఎంపిక తుది జాబితా:
IAY లబ్ధిదారుల వార్షిక ఎంపిక జాబితాను ఖరారు చేయడానికి, పైన పేర్కొన్న విధానాలను తూచ తప్పకుండా అనుసరించి, పంచవర్ష ప్రాధాన్యతా జాభితాను గ్రామ సభ ముందు ఊంచడం, ఆ జాబితా ఆధారంగా సాముదాయిక, విడివిడి ఇళ్లను ఎంపిక చేయడం జరుగుతుంది.
ఆ వార్షిక ఎంపిక జాబితాను జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన వ్యక్తి ఒకరు గ్రామసభ సమావేశానికి హాజరై దానిని ఆమోదిస్తారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో రూపంలో చిత్రీకరిస్తారు. ఇదంతా జరిగేప్పుడు, జాబితాలోకి ఎవరినైనా కొత్తగా చేర్చినా, ఎవరి పేరునైనా తొలగించినా, దానికి కారణాలను నమోదు చేస్తారు.
ఇళ్ల కేటాయింపు:
వితంతువు/పెళ్లికానివారు/విడాకులు పొందిన వారి విషయంలో తప్ప సాధారణంగా IAY ఇళ్ల కేటాయింపు భార్యాభర్తలిద్దరి పేరిటా జరుగుతుంది. ప్రభుత్వం ఇంటిని కేవలం మహిళల పేరిట మాత్రమే కేటాయించాలని కూడా నిర్ణయించవచ్చు. ఒకవేళ లబ్ధిదారులను వికలాంగుల కోటా నుంచి ఎంపిక చేసినట్లైతే, కేటాయింపు వారి పేరిట మాత్రమే జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే ఇంటి పట్టాను కేటాయించాలి. ఇళ్ల స్థలాల విషయంలో అయితే, అంతా పురుషులే ఉంటే తప్ప, గుర్తించిన స్థలాన్ని ఇంటిలోని అతి పెద్ద వయసు మహిళ పేరిట కేటాయించాలి. పక్కాటైటిల్, పట్టా మరియు ఇల్లు కేటాయించిన వారి పేరిట ఉండాలి. కనీసం 15 ఏళ్ల పాటు వారు దానిని విక్రయించుకోవడానికి వేల్లేదు.
నిర్మాణం:
ఇంటి నిర్మాణాన్ని లబ్ధిదారులే చూసుకోవాలి. IAY పథకంలో కాంట్రాక్టర్ల జోక్యం ఉండరాదు.
ఏదైనా కారణాల చేత కాంట్రాక్టర్ల జోక్యం చేసుకున్న విషయం బయటపడితే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇంటిని ఏ ప్రభుత్వ విభాగం కానీ, సంస్థ కానీ నిర్మించరాదు.
అయితే 60 ఏళ్లు పైబడిన వృద్ధులు కానీ దీర్ఘకాలంపాటు ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించే బలం లేనట్టి వికలాంగులు కానీ రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లైతే నిర్మాణభారాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలకు అప్పగించవచ్చు.
డిజైన్, నిర్మాణ ప్రమాణాలు:
ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి ప్రత్యేక డిజైన్ లేకపోయినప్పటికీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక డిజైన్ ను సూచించవచ్చు. ఆయా రాష్ట్రాలకు చెందిన గృహనిర్మాణ విభాగం ఒక నమూనాను రూపొందించినట్లైతే, దానిని అనుసరించవచ్చు. ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులు తప్ప ఏ రాష్ట్రానికి చెందిన గృహనిర్మాణ శాఖాధిపతులు ఈ భవన నిర్మాణ పదార్థాలు సరఫరాను అందజేయడం లేదు. వీరు స్టీల్, సింమెంట్, కిటికీలు, తలుపు, చౌకోట్లు (ఫ్రేములు) మొదలైన వాటిని అందజేస్తున్నారు.
కొన్ని రాష్ట్రాలలో లబ్ధిదారులు స్థానిక మేస్త్రీల సహాయంతో ఇళ్లను నిర్మించుకుంటున్నారు. అంతేకాకుండా వికలాంగుల అవసరాలకు అనుగుణంగా కూడా ఇళ్లను నిర్మించుకునే వీలుంది.
నిర్మాణంలో వివిధ దశలు, వాయిదా సొమ్ము విడుదల:
లబ్ధిదారులకు సొమ్ము విడుదల చేసే వాయిదాలను మూడుకు పరిమితం చేశారు. నిర్మాణం ఏ దశకు చేరుకుందన్న దానిని బట్టి నిధుల విడుదల ఆధారపడి ఉంటుంది.
ఇంటి నిర్మాణం పూర్తియిన తర్వాత గృహనిర్మాణ శాఖ అధికారులు ఇంటితో పాటు లభిదారుల ఫోటోను తీసుకుంటారు. దానిని మండల కార్యాలయానికి పంపడం, దానిని పరిశీలించిన పిమ్మట. జిల్లా అధికారులకు పంపడం జరుగుతుంది.
ప్రతి వాయిదా విడుదలకు ముందు ఇందుకు కేటాయించిన అధికారులు ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి, పని జరుగుతుందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత దానిని ధృవీకరిస్తూ ప్రోగ్రామ్ వెబ్ సైట్ (ఆవాస్ సాఫ్ట్)లో ఇంటి ఫోటోను పెట్టాలి.
నిధుల విడుదల, నిర్వహణ
రాష్ట్రాల విజ్ఞప్తికి అనుగుణంగా భారత ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వివిధ జిల్లాలకు కేటాయిస్తుంది.
భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుకోవడానికి రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వమ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ప్రతి వాయిదాకు జిల్లాలవారీ సమాచారాన్ని ఇస్తూ ఒక ఏకీకృత ప్రతిపాదన పంపుతుంది. ఈ సమాచారమంతా ఆవాస్ సాఫ్ట్ కు అనుగుణంగా ఉండాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాస్థాయిలో పత్రాల పరిశీలన కోసం ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే జిల్లాస్థాయి ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది. మొదటి వాయిదాకు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ఏకీకృత ప్రతిపాదనలో జిల్లాలవారీ కేటాయింపుల వివరాలు, ఆ కేటాయింపులు చేయడానికి అనుసరించిన విధానాలు, ఫార్ములాలు కూడా ఉండాలి. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో అనుసరించాల్సిన నిబంధనలను, పర్యవేక్షణ వ్యవస్థలను నిర్ధారించి ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా; ఒక జిల్లాలో ఆటంకాలు ఏర్పడితే అది మొత్తం నిధుల కేటాయింపుపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఈ ఏకీకృత ప్రతిపాదన ఆధారంగా – ఏదైనా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందిమ్చుకునే వరకు కేంద్రం సరాసరి జిల్లాలకు నిధులను విడుదల చేయడం ప్రారంభిస్తుంది.
నిధుల విడుదల
నిధులను ఈ క్రింది విధంగా విడుదల చేస్తారు:
IAY అకౌంట్ నిర్వహణ
దేశవ్యాప్తంగా IAY పరిస్థితి:
కొన్ని రాష్ట్రాలలో లబ్ధిదారుల ఎంపిక స్థానిక నేతలు, డబ్బు ప్రభావం వల్ల ప్రభావితమై, ఈ పథకం దుర్వినియోగమవడం కనిపిస్తుంది. అధికారులు కొన్ని చోట్ల స్థానిక నాయకులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కొన్నిసార్లు పనులను వాయిదా వేయడం వల్ల ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతోంది. మంజూరు చేసిన సొమ్ము ఇళ్లు పూర్తి చేయడానికి సరిపోవడం లేదు. నిర్మాణ సామాగ్రి, కూలీలఖర్చు మొదలైనవి గ్రామీణ ప్రాంతాలలో చాలా భారంగా పరిణమిస్తున్నాయి. అందువల్ల ప్రజలు ప్రభుత్వ సాయం, సబ్సిడీ ఇంకా ఎక్కువగా అందాలని ఆశిస్తున్నారు.
ముగింపు: తనదైన సొంత ఇంటిలో నివసించాలన్న పేదల కలలను నిజం చేయడమ్ IAY పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద ఎస్సీ/ఎస్టీలు, మైనారిటీలు, వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యతనిస్తారు. అది మైదాన ప్రాంతమా, కొండ ప్రాంతమా అన్న భౌగోళీక తేడాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు ఉంటుంది. లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా జరుగుతుంది. IAY పథకాన్ని గతంలో కన్నా మెరుగ్గా తీర్చిదిద్దడానికి గృహ నిర్మాణంలో క్లస్టర్ విధానం, SHGలతో కలపడం, NREGAలతో కలపడంలాంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి దీనిని ఇలాంటి ఇతర పథకాలతో మేళవింపు చేయడమ్; ఇతర సామాజిక, వృత్తుల బృందాలతో కలసి ఏకం చేయడం ఉత్తమమనే సూచనలు వస్తున్నాయి. ప్రస్తుతం జాతీయ గ్రామీణ గృహనిర్మాణ మరియు నివాస విధానం ఈ పథకాన్ని సమర్థంగా నిర్వహించడానికి దీనిని ఇతర పథకాలలో కలిసి ఒకే పథకంగా అమలు చేయాలని ప్రతిపాదిస్తోంది. దీని వల్ల పేదలు, నిస్సహాయుల శ్రేయస్సు పరిరక్షించబడుతుందని ఆశిస్తున్నారు.
ఆధారము: జీవనోపాధులు మాసపత్రిక
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
పొగాకు తినడం లేదా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ...
జాతీయ మధ్యాహ్న భోజన పథకం, పరిపూర్ణ బాలల వికాస సేవల...
భారతీయ సమాజంలో కుల వ్యవస్థ వినాశ హేతువవుతోంది. ఈ క...
ఈ విభాగంలో వివిధ జీవనోపాధులు మరియు వాటి వివరాల గుర...