హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక భద్రత / గ్రామీణ ప్రాంతాల పట్టణీకరణ – ఉపాధి అవకాశాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గ్రామీణ ప్రాంతాల పట్టణీకరణ – ఉపాధి అవకాశాలు

స్థానిక పరిశ్రమలలో లభించే ఉపాధి అవకాశాలను గురించి తెలుసుకుందాం.

లక్ష్యం

స్థానిక పరిశ్రమలలో లభించే ఉపాధి అవకాశాలను గురించి తెలుసుకుందాం.

నేపథ్యం

ప్రతి రాష్ట్రానికీ ప్రతి ప్రాంతానికీ స్థానిక ప్రజలకు ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కలిగించే సత్తావుంటుంది. అయితే అందుకు సరైన ప్రణాళిక మరియు ప్రభుత్వ మద్దతు అవసరమవుతుంది. ఇలా స్థానిక పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహం వల్ల ప్రాథమిక రంగమైన వ్యవసాయంపై కొంత ఒత్తిడి తగ్గుతుంది. స్వయం ఉపాధి పథకాలు మరియు కుటీర పరిశ్రమలైన రవాణా సేవలు, బట్టలు కుట్టడం, తోళ్ళ వస్తువుల తయారీ మొదలైనవి ఎంతగానో ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి.

పద్ధతి

మీ సమీపంలోని రైస్ మిల్, తేనె సేకరణ కేంద్రం, కుండల తయారీ పరిశ్రమ, ఇటుకల తయారీ, చిన్న చిన్న గనులు వంటి వాటిని సందర్శించి కింది అంశాలపై సమాచారం సేకరించండి.

1. ఎంత మందికి ఉపాధి లభిస్తున్నదో కనుక్కోండి.

2. ఈ పరిశ్రమలు మరి కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించగలవా?

3. స్థానిక పరిశ్రమలలో పనిచేసే కొందరు ఉద్యోగులతో కింది విషయాలపై మాట్లాడండి.

ఎ) ఆదాయం (నెలకు) ఎంత ?

బి) కుటుంబ అవసరాలకు సరిపడే ఆదాయం

లభిస్తుందా?

సి) పరిశ్రమలలో కనీస సౌకర్యాలు ఉన్నాయా?

4. పరిశ్రమల యజమానులు పర్యావరణ పరిరక్షణకై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?

5. స్వయం ఉపాధికి అవకాశాలున్నాయా?

ముగింపు

విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు గ్రామీణప్రాంతాలలో లేకపోవడం వల్ల చాలామంది ప్రజలు గ్రామాలనుండి పట్టణాలకు వలసపోతున్నారు, గ్రామాలు ప్రధానంగా వ్యవసాయ ఆధారితం కాబట్టి వ్యవసాయ అనుబంధ పనులను గ్రామాలలో నెలకొల్పాలి. పూర్వకాలంలో కమ్మరం, కుమ్మరం, వడ్రంగం మొదలైన వృత్తి నిపుణులందరూ గ్రామాలలో ఉండేవారు అందరికి జీవనోపాది లభించేది. పట్టణీకరణమంటే పెద్దపెద్ద భవనాలుండడం కాదు. గ్రామీణ పనులలో వాడుతున్న యంత్రపరికాలను మరమ్మత్తు చేసే సౌకర్యాలుండడం. పనివారలందరికీ ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండడం. గ్రామీణ ఉత్పత్తుల అమ్మకానికి రవాణా సదుపాయాలు ఉండడం అవసరం గ్రామీణ ప్రాంతాలలో సౌకర్యాలు కల్పిస్తే వలసలు తగ్గుతాయి. అందువల్ల పట్టణాలు, నగరాలపై ఒత్తిడి తగ్గుతుంది. అవి మురికి కూపాలుగా మారకుండా ఉంటాయి. అందుకనే గ్రామాలను స్వయం సంవృద్ధి వ్యవస్థలుగా రూపొందించుకోవాలి. మీరు నివశిస్తున్న గ్రామాలలో ప్రజలు తక్షణం ఏమేమి సౌకర్యాలు ఆశిస్తున్నారో సమాచారం సేకరించండి. ఆయా వనరుల కల్పనకు చేయవచ్చు ప్రణాళికలు రాయండి.

మీ పరిశీలనలను ఆధారం చేసుకొని ఒక నివేదిక తయారుచేయండి. పని చేసేచోట సౌకర్యాల పెంపుదల, అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడంపై సూచనలు ఇవ్వండి.

తదుపరి చర్యలు

  1. పర్యావరణంపై స్థానిక చిన్న తరహా పరిశ్రమల ప్రభావాన్ని తెలుసుకోండి.
  2. ఉపాది కోసం ప్రజలు ఒకచోటనుండి మరొక చోటకు ఎందుకు వలసపోతారు? మీ ఊరిలో ఎవరైనా ఇలా వలస పోయారా ? ఊరిలో మిగిలి ఉన్న కుటుంబం పరిస్థితి ఏమిటి ?
  3. మీ గ్రామంలో ఏఏ సౌకర్యాలు కల్పించాలని మీరు భావిస్తున్నారు? వాటి వల్ల మీకు కలిగే లాభాలేమిటి?

 

ఆధారము: http://apscert.gov.in/

3.07352941176
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు