హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక భద్రత / ఫింఛను, కుటుంబ మరియు మాతృత్వ సహాకారం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఫింఛను, కుటుంబ మరియు మాతృత్వ సహాకారం

1995 ఆగస్టు 15వ తేదీనుండి అమలులోకి వచ్చిన జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి), రాజ్యాంగంలో ఆర్టికల్ 41 మరియు 42 లో ఉన్న ఆదేశిక సూత్రాలను నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన కార్యసాధనంగా తెలియ చేస్తుంది.

జాతీయ సామాజిక సహాయ పథకం
(ఎన్ ఎస్ ఎ పి )
1995 ఆగస్టు 15వ తేదీనుండి అమలులోకి వచ్చిన జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి), రాజ్యాంగంలో ఆర్టికల్ 41 మరియు 42 లో ఉన్న ఆదేశిక సూత్రాలను నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన కార్యసాధనంగా తెలియ చేస్తుంది.
ఇది వృద్ధాప్యంలో ఉన్న పేదవారికి, సంపాదించే వారు మరియు తల్లి మరణించిన వారికి సామాజిక సహాయం చేయడానికి నేషనల్ పాలసీ ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో మూడు విభాగాలు ఉన్నాయి. అవి

 • జాతీయ వృద్ధాప్య పింఛను పథకం (ఎన్ ఒ ఎ పి ఎస్)
 • జాతీయ కుటుంబ సహాయ పథకం (ఎన్ ఎఫ్ బి ఎస్)
 • జాతీయ మాతృత్వ సహాయ పథకం (ఎన్ ఎమ్ బి ఎస్)

భారత రాజ్యాంగం:
41 వ ఆర్టికిల్ - పని, విద్య హక్కు కొన్ని కేసులలో ప్రభుత్వ సహకార హక్కు
తన ఆర్ధిక స్థోమత మరియు వికాస పరిధిలో, పనికి మరియు, విద్యకు హక్కు కల్పించడానికి ఉపయుక్తమైన చర్యలను చేపడ్తు నిరుద్యోగము, వృద్ధ, రోగ మరియు వికలాంగుల మరియు ఇతర యోగ్యతకుమించిన అవసరాలలో ప్రభుత్వ సహకారం అందించి సార్ధకమైన ఏర్పాట్లు రాష్ట్రం చేయాలి.

42 వ ఆర్టికిల్- పనిలో న్యాయమైన, మానవత్వముగల పరిస్థితులను మరియు మాతృత్వ సహాయము
పనిలో న్యాయమైన, మానవత్వముగల పరిస్థితులను మరియు మాతృత్వ సహాయము కల్పించడానికి రాష్ట్రం ఏర్పాట్లు చేయాలి.

జాతీయ వృద్ధాప్య ఫింఛను పథకం ( ఎన్ ఒ ఎ పి ఎస్ )

ఈ పథకం క్రింద, జాతీయ వృద్ధాప్య ఫింఛను పథకానికి, కేంద్ర సహాయం ఈ క్రింది ఇచ్చిన సూత్రము ప్రకారము లభ్యమవు తుంది.

 • ధరఖాస్తుదారుని వయస్సు(మగ లేదా ఆడ) 65 సంవత్సరములు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి.
 • ధరఖాస్తుదారుడు, అతని/ఆమె స్వంత ఆదాయం లేదా కుటుంబ సభ్యుల లేదా ఇతర వనరుల ఆర్థిక సహాయంతో జీవనము సాగక ధరఖాస్తుదారుడు దిక్కులేనివాడై ఉండాలి.
 • వృద్ధాప్య ఫింఛను అర్హత నెలకి 75 రూపాయలు.

జాతీయ కుటుంబ సహాయ పథకం (ఎన్ ఎఫ్ బి ఎస్)

ఈ పథకం క్రింద, నష్టపోయిన కుటుంబంలో ప్రాథమికంగా సంపాదిస్తున్నవారు మరణించి నపుడు, దారద్ర్యరేఖ దిగువనున్న కుటుంబాల వారికి కొంత మొత్తాన్ని కుటుంబ సహాయంగా ఇస్తారు. ఈ పథకం క్రింద, ఈ క్రింద నిచ్చిన సూత్రాలను అనుసరించి కేంద్ర సహాయం చేస్తారు.

 • ప్రాథమికంగా సంపాదిస్తున్నవారు కుటుంబం సభ్యులై ఉండాలి, మగ లేదా ఆడవారై ఉండి మొత్తం కుటుంబం ఆదాయంలో వారి సంపాదన ఎక్కువై ఉండాలి.
 • 18 సంవత్సరాల కన్నా ఎక్కువ మరియు 65 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు లో ప్రాథమిక సంపాదనా పరుని మరణం సంభవించి ఉండాలి.
 • భారత ప్రభుత్వంచే ముందుగా నిర్ణయించిన సూ త్రాల ప్రకారం, నష్టపోయిన కుటుంబం, ద్రారిద్ర్యరేఖకు దిగువన ఉండాలి.
 • ప్రాథమికంగా సంపాదనా పరుని, సహజంగా గాని లేదా అకస్మాత్తుగా గాని మరణానికిగల కారణానికి సంబంధం లేకుండా 10,000 రూపాయలు సహాయం లభిస్తుంది.
 • స్థానికంగా పరిశీలించిన తరువాత, చనిపోయిన వారి కుటుంబంలోని పెద్దవారికి కుటుంబ సహాయం లభిస్తుంది.

జాతీయ మాతృత్వ సహాయ పధకం ( ఎన్ ఎమ్ బి ఎస్)

ఈ పథకం క్రింద, దారిద్ర్య రేఖ దిగువనున్న ఇంటిలోని గర్భవతులకు ఈ క్రింది సూత్రాలననుసరించి కొంత మొత్తాన్ని డబ్బు రూపంలో సహాయాన్ని అందచేస్తారు.

 • 19 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ ఉన్న గర్భవతులకు మొదటి రెండు కాన్పుల వరకు ఈ సహాయం లభిస్తుంది.
 • భారత ప్రభుత్వముచే ముందుగా నిర్ణయించబడిన సూత్రాలననుసరించి లబ్దిదారులు ద్రారిద్ర్యరేఖకు దిగువన ఉండాలి.
 • 500 రూపాయల సహాయం లభిస్తుంది.
 • కాన్పుకు 12-8 వారాల ముందు ఒకే మొత్తంగా మాతృత్వ సహాయం ఇవ్వబడుతుంది.
 • సరియైన సమయానికి మాతృత్వ సహాయం అందేలా చూడాలి. ఒకవేళ ఆలస్యం అయితే, ఈ సహాయాన్ని లబ్ధిదారునికి కాన్పు అయిన తరువాత కూడా ఇవ్వవచ్చు.

లక్ష్యాలు

 • రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం లేదా భవి ష్యత్తులో ఇచ్చే సహాయమే కాకుండా, 100% స్పాన్సరు చేస్తున్న కేంద్ర జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి), కనీస జాతీయ ప్రమాణ సామాజిక సహాయం అందిం చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
 • ఏ మాత్రం అడ్డంకు లేకుండా, దేశంలో ప్రతీ చోటా సమానంగా అందరి లబ్దిదారులకు సామాజిక రక్షణ కల్పించడానికి 100% కేంద్ర సహాయాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు.
 • సామాజిక సంరక్షణ పథకాలపై రాష్ట్రం తమ స్వంత వ్యయం పై కేంద్ర సహాయం మార్పుని తీసుకు రానీయదు. రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు స్వతంత్రంగా సామాజిక సహ కారం ఎక్కడైనా చేయదలచుకుంటే వారు వారి కవరేజిని విస్తరించవచ్చు
 • సామాజిక సహాయ ప్యాకేజిలని పేదరికాన్ని తగ్గించే మరియు కనీస అవసరాల్ని కల్పించే పథకాలలో కలపడానికి అవకాశాలని జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి) కల్పిస్తుంది. ఉదాహరణకి మాతృత్వ సహాయాన్ని, మాతృత్వ మరియు పిల్లల సంరక్షణ పథకాలతో కలపవచ్చు.

పథకం అమలు పరచడం

 • పంచాయతి మరియు పురపాలక సంఘాల సహ కారంతో రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా జాతీయ సామాజిక సహాయ పథకాలు(ఎన్ ఎస్ ఎ పి) అమలు చేయబడుతున్నవి.
 • జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి) మార్గదర్శక సూత్రాల ప్రకారము ఎన్ ఎస్ ఎ పి లను అమలు చేయడానికి ప్రతి రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం నోడల్ డిపార్టుమెంటుని గుర్తించింది.
 • నోడల్ డిపార్ట్ మెంట్ యొ క్క సెక్రెటరి ఆ యొక్క రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతానికి నోడల్ సెక్రెటరీ గా వ్యవహరించాలి
 • ఎన్ ఎస్ ఎ పి మీద, జిల్లాలలో జిల్లా స్థాయి కమిటీలు ఉన్నాయి.
 • తమ ప్రాంతాలలో ఎన్ ఎస్ ఎ పి క్రింద పథకాలని అమలు చేయడానికి, తమ జిల్లా మెజిస్ట్రేట్ /జిల్లా కలెక్టరు అధ్యక్షతన జిల్లా స్థాయి అమలు చేసే అధికారుల నియామకాన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రకటించాయి.
 • సహాయాల్ని అమోదించే ధరఖాస్తుల్ని పరి శీలించడం మరియు లబ్దిదారులకు ఆ సహాయాల్ని అందేలా చేసే బా ధ్యత జిల్లా కలెక్టరు లేదా నోడల్ బా ధ్యతలను అప్పగించిన అధికారులకు ఉంది.
 • సొమ్ము ఇచ్చే అధికారులు, ముందుగా నిర్ణయించిన సూత్రాల/నియమాల ప్రకారం డబ్బుని నగదు రూపం లో ఇవ్వడంతో పాటు ఇతర/వివిధ రకాలుగా చెల్లించే విధానాన్ని అనుసరించవచ్చు.
 • ఎన్ ఎస్ ఎ పి మూడు పథకాల క్రింద, లబ్దిదారులను గుర్తించడంలో గ్రామ పంచాయితీలు / పురపాలక సంఘాలు చురుకైన పాత్ర వహించాలని అనుకుంటున్నారు.
 • తగిన విధంగా లబ్దిదారులను లక్ష్యాల కనుగుణంగా పంచాయితీలు /ఇరుగు పొరుగు/ మొహల్లా కమిటీలచే లబ్దిదారులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వృద్ధాప్య ఫింఛను పథకం, జాతీయ కుటుంబ సహాయ పథకం మరియు జాతీయ మాతృత్వ సహాయ పథకం లక్ష్యాల్ని పంచాయితీలకు / పురపాలక సంఘాలకి తెలియ పరచాలి.
 • గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సభా సమావేశా లు మరియు పట్టణ ప్రాంతాలలో ఇరుగు పొరుగు/ మొహల్లా కమీటీ మీటింగులు వంటి ప్రజా మీటింగులలో కూడా జాతీయ వృద్ధాప్య ఫింఛను పథకం, జాతీయ కుటుంబ సహాయ పథకం మరియు జాతీయ మాతృత్వ సహాయ పథకం క్రింద క్రేంద్ర సహాయాన్ని లబ్ధిదారులకు అందచేయవచ్చు/ ఇవ్వవచ్చు.
 • జాతీయ సామాజిక సహాయ పథకం యొక్క సమాచారం గురించి మరియు వాటి క్రింద లభించే సహాయం గురించి చెప్పడం పంచాయితీల / పురపాలక సంఘాల భాధ్యత. ఈ పని లో, స్వచ్చంద సంస్థల పాత్రని మరియు సహ కారాన్ని కూడా వారు ప్రోత్స హించవచ్చు.

ఆధారము : rural.nic.in and wikipedia

2.93793103448
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు