హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక భద్రత / భారతదేశంలో సర్వోన్నత శాసనం భారత రాజ్యాంగమే
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భారతదేశంలో సర్వోన్నత శాసనం భారత రాజ్యాంగమే

భారతదేశంలో సర్వోన్నత శాసనం భారత రాజ్యాంగమే

డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్తు కు అధ్యక్షుడిగావ్యవహరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా సంఘానికిఅధ్యక్షత వహించారు. రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ రచన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో పూర్తి అయింది. ప్రాథమిక హక్కులు,సభా వ్యవహారాల సంఘం,నియమావళి సంఘం వంటిసంఘాలు పనిచేశాయి. రాజ్యాంగం ప్రతిపై 1949 నవంబర్ 26 నాడుసంతకాలయ్యాయి. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ ప్రతిని డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ కు అప్పగించారు. రాజ్యాంగం 1950 జనవరి 26 వ తేదీ నుంచిఅమలులోకి వచ్చింది. భారతదేశ రాజ్యాంగమే దేశంలోకెల్లా సర్వోన్నత శాసనం. ఇది మౌలికరాజకీయ సూత్రాల రూపాన్ని నిర్దేశిస్తుంది. ప్రభుత్వ సంస్థల విధులను, విధానాలను,అధికారాలను, నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ప్రపంచంలో మరేసార్వభౌమ దేశానికైనా ఇంత దీర్ఘమైన లిఖిత రాజ్యాంగం లేదు. దేశ ప్రజలు దీని చేతనేపాలింపబడుతున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ను భారతీయ రాజ్యాంగ ప్రధాననిర్మాతగా గౌరవించుకొంటున్నాము.

పీఠిక

భారతదేశ రాజ్యాంగ పీఠిక ఈ పత్రం యొక్కలక్ష్యానికి, నియమాలకుమార్గదర్శనం చేసేటటువంటి సంక్షిప్త ప్రకటన. ఈ పత్రం దేని నుంచయితే అధికారాన్ని,అర్ధాన్ని అంటే ప్రజలనుపొందుతున్నదో దానిని సూచిస్తున్నది. ప్రజల ఆశలు, ఆకాంక్షలతో పాటు మన దేశం ముందున్న ఆదర్శాలనురాజ్యాంగ పీఠికలో స్పష్టమైన పదాలలో అభివ్యక్తం చేయడం జరిగింది. దీనిని రాజ్యాంగంయొక్క ఆత్మగా భావించవచ్చు. మొత్తం రాజ్యాంగంలోని ముఖ్యాంశాలను వివరించేఉఫోద్ఘాతంగా సంకేతించవచ్చును. రాజ్యాంగ పరిషత్తు దీనిని 1949నవంబర్ 26న స్వీకరించింది. కాగా రాజ్యాంగం అమలులోకివచ్చిన తేదీ మాత్రం 26 జనవరి,1950.

రాజ్యాంగ పరిషత్తు

భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి మార్గదర్శి,సంపూర్ణ ప్రజాస్వామ్యసమర్ధకుడు అయిన శ్రీ ఎమ్.ఎన్. రాయ్1934లో రాజ్యాంగ పరిషత్తు ఆలోచనను ప్రతిపాదించారు. 1935లో ఈ అంశం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఆధికారికడిమాండ్ గా మారింది. బ్రిటిషు వారు దీనిని 1940 ఆగస్టు లో ఒప్పుకొన్నారు. 1940 ఆగస్టు 8వ తేదీన వైస్ రాయ్ లార్డ్ లిన్ లిత్ గో ఒకప్రకటన విడుదల చేశారు. అందులో గవర్నర్-జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలినివిస్తరిస్తున్న విషయంతో పాటు యుద్ధ సహాయక మండలిని స్థాపిస్తున్నట్లుగాపేర్కొన్నారు. ఈ ప్రతిపాదన ‘ఆగస్టు ప్రతిపాదన’గా ప్రసిద్ధమైంది. అల్పసంఖ్యాక అభిప్రాయాలకుపూర్తి విలువను ఇవ్వడం, ఇంకా భారతీయులకువారి సొంత రాజ్యాంగాకృతిని రచించుకొనేందుకు అనుమతిని ఇవ్వడం ఇందులో కలిసిఉన్నాయి.  1946 కేబినెట్ మిషన్ ప్లాన్ లో భాగంగా, రాజ్యాంగ పరిషత్తుకు ప్రప్రథమంగా ఎన్నికలునిర్వహించారు. రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగ ముసాయిదాకు రూపురేఖలనిచ్చింది.దీనిని 1946 మే 16వ తేదీన కేబినెట్ మిషన్ ప్లాన్ లో భాగంగాఅమలుపరిచారు. ప్రొవిన్సియల్ అసెంబ్లీలు దామాషా ప్రాతినిధ్యంతో కూడిన మార్చదగ్గవోటు వ్యవస్థతో రాజ్యాంగ పరిషత్తు కు సభ్యులను ఎన్నుకొన్నాయి. రాజ్యాంగ పరిషత్తుమొత్తం సభ్యుల సంఖ్య 389. 292 మంది రాష్ట్రాలప్రతినిధులు కాగా, 93 మంది ప్రిన్స్లీ స్టేట్స్ కు ప్రాతినిధ్యం వహించే వారూ, మిగతా నలుగురు సభ్యులూ చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ లైన ఢిల్లీ, అజ్మీర్- మేవాడ్, కూర్గ్ (మదికెరి సమీపంలోని), ఇంకా బ్రిటిష్ బలూచిస్తాన్ లకు ప్రాతినిధ్యంవహించే వారూను.

ప్రాథమిక హ‌క్కులు

ప్రాథ‌మిక హ‌క్కులు భార‌తీయ రాజ్యాంగంలోని మూడ‌వభాగంలో పొందుప‌ర‌చ‌బ‌డ్డాయి.  ప్రాథమికహక్కులు, పౌరులకు తమవ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకోవడానికి, మరియు బాధ్యత కలిగిన పౌరులుగా హుందాగా జీవించేందుకు  ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్య్రములు.ఇవి వ‌రుస‌గా సమానత్వపు హక్కు, స్వాతంత్ర్యపుహక్కు.  దోపిడిని నివారించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, రాజ్యాంగ పరిహారపు హక్కు. సమానత్వపు హక్కు,రాజ్యాంగం అధికరణలు 14,15, 16, 17 మరియు 18 ల ప్రకారం ప్రసాదించబడింది. ఈ హక్కు చాలాప్రధానమైనది, స్వేచ్ఛాసమానత్వాలు ప్రసాదించే ఈ హక్కు, భారత రాజ్యాంగము,తన అధికరణలు 19,20, 21 మరియు 22, ల ద్వారా స్వాతంత్ర్యపు హక్కును ఇస్తున్నది.ఇది వైయక్తిక హక్కు. ప్రతి పౌరుడూ ఈ హక్కును కలిగివుండడం, రాజ్యాంగ రచయితల అసలు అభిలాష. అధికరణ 19,క్రింది ఆరు స్వేచ్ఛలనుపౌరులకు ఇస్తోంది. అధికరణలు 23 మరియు 24 ల ప్రకారం, కట్టు బానిసత్వం మరియు బాలకార్మిక విధానాలునిషేధం. మరియు 14 సంవత్సరాలకులోబడి గల బాలబాలికలకు అపాయకరమైన పనులు (కర్మాగారాలలో, గనులలో) చేయించుట నిషేధం. భారతదేశంలోపౌరులందరికీ మత స్వాతంత్ర్యపు హక్కును, అధికరణలు (ఆర్టికల్స్) 25, 26, 27 మరియు 28 ల ప్రకారంఇవ్వబడింది. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం సెక్యులరిజం సూత్రాలను స్థాపించుటకుఉద్ద్యేశించినవి. భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని అన్ని మతాలు సమానమే, ఏమతమూ ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారంమతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పింపబడ్డాడు. పౌరులు తమ మతాలగూర్చిఉపన్యసించవచ్చు, అవలంబించవచ్చుమరియు మతవ్యాప్తికొరకు పాటుపడవచ్చు. అలాగే, మతపరమైన సంప్రదాయాలను ఉదాహరణకు సిక్కులుకృపాణాలను తమ ఉద్యోగాలు చేయు సమయాన ధరించడానికి, ప్రజల శ్రేయస్సును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి,నిరోధించవచ్చు. భారతదేశం,అనేక మతాలకు, భాషలకు మరియు సంస్కృతులకు నిలయం. రాజ్యాంగంవీరికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తూంది. అధికరణ 29 మరియు 30 ల ప్రకారం, మైనారిటీలకు కొన్ని హక్కులు ఇవ్వబడినవి. ఏ మైనారిటీలకుచెందినవాడైననూ, ప్రభుత్వం వీరికి,ప్రభుత్వ మరియుప్రభుత్వసహాయం పొందిన సంస్థలలో ప్రవేశానికి నిషేధించరాదు. మైనారిటీలు, అనగా మతం, భాష మరియు సాంస్కృతిక పరమైన మైనారిటీలు,తమ మతాన్ని, భాషలనూ, సంస్కృతినీ రక్షించుకొనుటకు, మైనారిటీ సంస్థలు స్థాపించుకొనవచ్చును. ఆసంస్థల ద్వారా వారు, తమ అభ్యున్నతికిపాటుపడవచ్చును.ఈ సంస్థలలో దుర్వినియోగాలు జరుగుతున్న సమయాన ప్రభుత్వాలు తమప్రమేయాలు కలుగజేసుకోవచ్చును. ప్రాథమిక హక్కులకు ఏపాటియైనా భంగం కలిగితే, రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూన్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఉదాహరణకు, పౌరుడు, జైలు శిక్షనుపొందితే, ఆ వ్యక్తి,న్యాయస్థానాలను ఆశ్రయించి,ఇది దేశచట్టాలనుసారంగావున్నదా లేదా అని ప్రశ్నించే హక్కును కలిగి ఉన్నాడు. ఒకవేళ, న్యాయస్థానం నుండి జవాబు "కాదు" అనివస్తే, ఆవ్యక్తికితక్షణమే విడుదలచేయవలసి వస్తుంది.

భారత రాజ్యాంగం- ఆదేశక సూత్రాలు

భారతదేశంలో ఆదేశక సూత్రాలు( Directive Principles of State Policy). భారతరాజ్యాంగం, పౌరులకు ప్రాథమికహక్కులను ప్రకటించింది. వీటితో పాటుగా ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలే ఆదేశక సూత్రాలు. భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గ దర్శకాలుచేసింది.  రాజ్యాంగం ప్రకటించిన పౌరులహక్కులైన ప్రాథమిక హక్కులు కాపాడడానికి మరియు సవ్యంగా అమలుజరుపడానికి ఈమార్గదర్శకాలు లేదా ఆదేశాలను రాజ్యాంగంలో ర‌చించ‌డం జ‌రిగింది. దీని ప్ర‌కారంపౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడం ప్రభుత్వ విధి.

ప్రాథ‌మిక విధులు

1976లో 42వ రాజ్యాంగ సవరణద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు అధికరణ 51-ఎ ప్రకారం ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోపొందుపరిచారు. ప్రారంభంలో పది ప్రాథమిక విధులు ఉండేవి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక విధిని రాజ్యాంగంలో చేర్చడంతో వీటి సంఖ్య 11కు పెరిగింది. వీటిని న్యాయ‌స్థానంలో ప్ర‌శ్నించ‌లేము.ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ప్రాథమిక విధులకు సంబంధించి1999లో నియమించిన వర్మ కమిటీ చేసిన సిఫార్సుల‌ ప‌ట్లపౌరుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది.

భారత రాజ్యాంగ సవరణలు

సెప్టెంబ‌ర్ 2016 నాటికి భార‌త రాజ్యంగానికి 101 స‌వ‌ర‌ణ‌లు జ‌రిగాయి. వీటిలో జీఎస్టీ బిల్లుకోసం చేసిన సవరణ తాజాది. రాజ్యాంగంలో మార్పులకు, చేర్పులకు, తొలగింపులకు సంబంధించి పార్లమెంటుకు రాజ్యాంగంఅపరిమితమైన అధికారాలిచ్చింది. వీటిలో రెండు ర‌కాల స‌వ‌ర‌ణ‌లు ఉన్నాయి. మొద‌టిదానిలో  సభలో హాజరైన సభ్యుల్లో మూడింటరెండు వంతుల ఆధిక్యం, మరియు మొత్తంసభ్యులలో సాధారణ ఆధిక్యంతో మాత్రమే బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే ప్రత్యేకించినకొన్ని అధికరణలు, షెడ్యూళ్ళకుసంబంధించిన సవరణల బిల్లులు పార్లమెంటు ఉభయ సభలతో పాటు రాష్ట్రాల శాసనసభలలో కనీసంసగం సభలు కూడా ఆమోదించాలి. ఈ విధంగా రాజ్యాంగంలో చేసిన ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ‌లే3,6,7,8,13,14,15,16,22,23,24,25,28,30,31,32,35,38,39,42,43,44,45,46,51,54,61,62,70,73,74,75,79,84,88,95,99మరియు 101 లు.

రాజ్యాంగ సంస్కరణల కమిషన్

రాజ్యాంగ ప‌నితీరును సమీక్షించేందుకు నియ‌మించినజాతీయ‌ కమిషన్ (ఎన్ సి ఆర్ డబ్ల్యు సి) ‘జస్టిస్ మానేప‌ల్లి నారాయణ రావు వెంకటాచలయ్య కమిషన్’గా కూడా ప్ర‌సిద్ధికెక్కింది. శ్రీ అటల్ బిహారీవాజ్ పేయి నేతృత్వంలో అప్ప‌టి ఎన్డీఏ ప్రభుత్వం 22 ఫిబ్రవరి 2000 న  ఒకతీర్మానం ద్వారా ఈ క‌మిష‌న్ ను ఏర్పాటు చేసింది. భార‌త‌ రాజ్యాంగానికి సవరణలేమయినాఅవసరమేమో సూచించేందుకు ఈ క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ క‌మిటీ 2002 లో తన నివేదికను సమర్పించింది.  సర్వోన్నత న్యాయస్థానం ప్రాథమిక హక్కులనుఎటువంటి సవరణలకు లోబడనివిగా చేసింది. అయితే 1971లో రాజ్యాంగంలోని 13వ, 368వ అధికరణాలను 1971 లో సవరించడంద్వారా పార్లమెంట్ తన అధికారాన్ని మరో మారు స్పష్టం చేసుకొంది.

* ప్రతి ఏటా 26 నవంబర్ ను దేశమంతటా రాజ్యాంగ దినంగా పాటిస్తూవస్తున్నారు.


ఆధారం: - డాక్టర్ పి.జె. సుధాకర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి), హైదరాబాద్

3.06666666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు