హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక భద్రత / సామాజిక అంశాల పై అవగాహన స్పందన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సామాజిక అంశాల పై అవగాహన స్పందన

సామాజిక అంశాల పై అవగాహన స్పందన.

మానవుడు సంఘజీవి. పాఠశాల సమాజంలో ఒక భాగం. పిల్లలు కుటుంబంలో తన వ్యక్తిగత అగసరాలు తీర్చుకొనే వైపుణ్యాలను అందిస్తాయి. వీటితోబాటు వృత్తి నైపుణ్యాలను కూడా పూర్వకాలంలో అందించేవి. కుటుంబం నుండి ఇరుగుపొరుగువారితో ఆదుకునే సమయంలో- సహకారము, కలసి పనిచేయడం అందులోని ఆనందాన్ని గ్రహిస్తారు. పాఠశాల విద్యార్థులను ఒక పరిపూర్ణ సంఘసభ్యులుగా తయారుచేయడంలో తర్పీదునిస్తుంది. ఒక వ్యక్తి తన అవసరాలను తీర్చుకుంటూ, ఎదో ఒక వృత్తిని చేపడుతూ తన ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడంతోబాటు, సమాజ అభివృద్ధికి కూడా సహాయపడతారు. ఈ విధంగా సమాజంలోని సభ్యులందరి సమిష్టి ఆలోచనలే సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి.

ప్రతి వ్యక్తి తన అభివృద్ధిని ఏ విధంగా వైతే సమాజ సమకారం తీసుకుంటున్నాడో అదే విధంగా ముందుతరాల అభివృద్ధికి కూడా తన వంతు సహాయ సహకారాలు సమాజానికి అందించాల్సి ఉంటుంది. అంటే సహజ అభివృద్ధికి తనవంతు సహకారం అందించడాన్ని సామాజికశృతిహా, సామజిక అంశాల పై స్పందన అంటాము.

ప్రస్తుతం మనం ఉన్న సమాజం యెక్క స్ధితికి, ఎంతోమంది ఎన్నో తరాలనుండి, తమ ఆలోచనలను ఆచరణలో పెట్టడం వలెనే ఈ అభివృద్ధి సాధ్యమైనది. ప్రతి సమాజంలో కొంతమంది సమాజ అభివృద్ధికి, మానవ సుఖసంతోషాలకు ఆటంకాలు కలిగించేవారు కూడా లేకపోలేదు. ఐనప్పటికీ సమాజము అభివృద్ధి చెందుతూనే ముందుకు పయనిస్తుంది.

విద్యార్థులకు పాఠశాల స్ధాయి నుండి సామజిక అంశాల పై స్పందించే సృహన కలిగించి వారిని వివిధ కార్యక్రమాలలో పాల్గొవే విధంగా సంసిద్దులను చేయడమే దీని లష్యము.

సామజిక సృహ ఇంటినుండి మెదలవుతుంది. ఇంట్లో వున్నా వృద్ధిలకు సహాయసహకారాలు అందించడం, ఇంట్లోవుండే పెంపుడు జంతువులకు కావాల్సిన నీరు, ఆహారము సమకూర్చడం, సహాయ సహకారాలకోసం ఇంటికి వచ్చిక వారికి సహాయపడటం.

పిల్లలు పాఠశాలలో చేరినప్పుడు, తరగతిలో గల, పాఠశాలలో వివిధ కుల, మాత, సాంస్కృతిక నేపధ్యము నుంచి వచ్చిన పిల్లలతో కలిసిమెలిసి ఉండే అవకాశం లభిస్తుంది. కావున పాఠశాల విద్యార్థులను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దవల్సిన అవసరం ఉపాధ్యాయులమీద ఉంది. పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యక్రమాల ద్వారా కలిసి జీవంచడంలో ఉండే ఆనందాన్ని విద్యార్థులు గ్రహించే విధంగా కార్యక్రమాలను నిర్వహించి సామజిక సమస్యల పై సరియైన అవగాహనను పెంపొందింప జేయాలి.

ఇంటినుండి సమాజము వరకు - ఒక వ్యక్తి సుఖసంతోషాలతో జీవంచాలంటే వ్యక్తిగతంగా మనం ఎం చేయాలి. అనే అంశాన్ని విద్యార్థులతో చర్చించాలి. కుటుంబంలో ఒక వ్యక్తి ఏ విధంగా సహాయసహకారాలు అందించగలడో, అదేమాదిరి పాఠశాలలో, క్రమంగా సహజంలో తన వంతును నిర్వర్తిస్తూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ఏవిధంగా ఉపకరించగలడో - తెలియజేయాలి.

లింగవివక్ష నిర్ములన, బాలల హక్కుల పరిరక్షణ, లంచగొండితన నిర్ములన, అత్యాచారాలు, రూపుముపడం, సామజిక సంపదను పరిరశించుట, పర్యావరణ పరిరక్షణ; ప్రజలందరి కనీస అవసరాలు తీర్చుట; వృద్ధుల, వికలాంగుల సంరక్షణ వంటి అంశాలలో సరియైన అవగాహన కలిగిఉండేటట్లు విద్యార్థులను తయారుచేయుట. సమాజంలో పనిచేసే వివిధ స్వచ్ఛందసంధాలలో పనిచేసి పై కార్యక్రమాల అమలులో కృషిచేయుట.

ఇందులోని అంశాలు

 • తరగతిలో తన బాధ్యతులు సక్రమంగా నిర్వర్తించడము.
 • కుటుంబంలో తల్లి, దండ్రులకు పనుల్లో సహాయపడడము.
 • పెద్దలపట్ల గౌరవభావం తనవంతు కల్గి ఉండడం
 • వికలాంగులు, వృద్దులకు తనవంతు సహాయం చేయడము.
 • నీరు, విద్యుత్, ఆహారము, గ్యాసు మె. వాటిని పొదుపుగా అవధారమైనంత వరకే ఉపయెగించాలి. దాని గురించి విస్తృత ప్రచారము చేయడము.
 • పర్యావరణ పరిరక్షణ కొరకు కృషిచేయడమా తద్వారా ప్రకృతిని, వనరులను సమతుల్యంగా ఉంచడము.
 • ప్రభత్వ ఆస్తుల పట్ల పరిరక్షణ కై అప్రమత్తంగా ఉండడం.
 • సంసృక్తి, సంప్రదాయాలు పరిరశించడానికి వాటిని ఆచరించాలి పదుగురు ఆచరించేలా చూడాలి.
 • చారిత్రక కట్టడాలు సంరక్షణలో తన వంతు బాధ్యత విర్వర్తించడం.
 • భూమిలో కలిసిపోని వస్తువులు Reduse, Reuse, Recycle ద్వారా పున:వినియాగము, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడం.
 • పాఠశాలలో, ఇంటి దగ్గర వీధిలో మొక్కలు నాటడం మరియు వాటిని పరి రాశించడం.
 • పై తెల్పిన అందాలన్నింటిని స్వయంగా ఆచరించడం ఇతరులకు ఆదర్శంగా ఉండటం.
 • పునరుద్ధరింపలేని వనరులు (కొండలు, పెట్రోలు, గ్యాసు, బొగ్గునిషేపాలు మె, నవి) పై తనకు మాత్రమే కాక భావితరాలకు అవసరమని గుర్తించడండ.
 • పొదుపుగా వాడటానికి, అవసరానికి మించి వాడటానికి మధ్యగల తేడాను గుర్తించాలి, ఇతరులకు వివరించగలగాలి.
 • సమాజము అంటే తాను తన కుటుంబం మాత్రమే కాదు యావత్ ప్రప్రంచము కూడా,"వనరులు ఒక్కరిది కాదు అందరివీ" అనే విశాల దృక్పధం అలవదలి అప్పుడే సామికిక అంశాల పట్ల హక్కైలతో పాటుగా బాధ్యతలు మరింతగా నిర్వర్తించుటకు వీలవుతుంది.
 1. తరగతి గదిలో కసువు/చెత్త ఉద్వతం, దానిని ఎత్తి సంబంధిత ప్రదేశంలో వేయడం.
 2. ఇంటర్వల్, భోజన విరామం సమయాల్లో తమ చుట్టూ పడ్డ చిన్న కాగితాలు ఏరి కసువుబుట్టలో వేయడం.
 3. పాఠశాలలోని బోరు / కుళాయి నీరు పాఠశాలలోని మొక్కలకు పేరెలా చేయడం.
 4. మధ్యాహ్న భోజన సమయంలో తగినంతగా ఆహారాన్ని పెట్టించు కోవాలి. క్రైందపడిన వాటిని శుభ్రంగా తీసి కంపోస్టుగుంతలో వేయాలి.
 5. ఇంటిదగ్గర తల్లి, దండ్రులు, పెద్దలకు వారి పనులలో సహాయం చేయాలి.
 6. వృద్దులు, మహిళలు, పెద్దలు, వికలాంగులను గౌరవించాలి, తగు సందర్భాలలో వారికి సహాయపడాలి.
 7. తమ గ్రామంలోను, పాఠశాలలోనూ మొక్కలు నాటడం, సంరశంచడము చేయాలి.
 8. ప్రభుత్వ ఆస్తులు (పాఠశాల, ఆసుపత్రులు మె. వని) వాహనాలు, రహదారులు సమ్మె, ధర్నాలు చేయు సందర్భాలలో ధ్వంసం చేయకుండా ఉండడం / కాపాడటం.
 9. తమ ఇంట్లో వాడే ఆహారము, నీరు విద్యుత్ మరియు ఇతర వనరులు అవసరమైనంత మేరకే వినియెగించాలి. దుబారాగా ఎట్టి పరిస్ధితుల్లో వాడరాదు.
 10. అవసరం లేకున్నా ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్, టి.వి. మె. అన్ చేసి ఉంచరాదు.
 11. తమచుట్టూ ఉన్న పర్యావరణమును పరిరశించడములో తనవంతు పాత్ర సక్రమంగా విర్వహించాలి.
 12. భూమిలో కలిసిపోని (ప్లాస్టిక్ బ్యాగులు, వస్తువులు మె.నవి) బదులుగా కాగితము, బట్ట సంచులు ఉపయెగించాలి. 3 పాటించాలి. (Reduse, Reuse, Recycle)
 13. ప్రార్ధనా మందిరాలు, చారిత్రక కట్టడాలు మె. వాటిని సంరశించుకోవాలి.
 14. సంసృక్తి, మాప్రదాయాలను పాటించాలి, భావితరాలకు వాటిని అందించి కొనసాగేలా కృషిచేయాలి.
 15. పునరుద్దరించలేని  వనరులు అవసరమైనంత మేరకే వాడి, భావితరాల కొరకు వాటిని మిగల్చడము అన్న భావనను పెంపొందించుకోవాలి.
 16. పొదుపుకు దుబారాకు తేడా గుర్తించాలి.
 17. దోచుకోవడం కంటే దాచొకొని ఇతరుల మేలుకు, వనరుల వినియెగంలో ఉన్న తృప్తిని ఆస్వాదించాలి.

ఆధారం : రాష్ట్ర విద్వా పరిశోధనా శిక్షణ సంస్ధ

2.96551724138
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు