অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డ్

స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డ్

మొదటి దశ

పార్ట్నర్ కాగలవారు బాధ్యతాయుత పౌరులు / సంస్థలు / ప్రభుత్వేతర సంస్థలు / వ్యాపార రంగాల వారు / ప్రజా ప్రతినిధులు దిగువ పేర్కొన్న వివిధ పద్ధతులను అనుసరించి నమోదు చేసుకోవచ్చును

  • ఎ. smart.ap.gov.in  వెబ్ సైట్ లో గల "Interested in becoming a Partner Register" బటన్ పై క్లిక్ చేసి మీకు ఆసక్తి ఉన్న గ్రామ పంచాయతి / వార్డును ఎంపిక చేసుకోగలరు. వివరాలను నింపి Submit బటన్ ను క్లిక్ చేయగలరు.
( లేదా )
  • బి.  వెబ్ సైట్ లోని "Enter My Village" బటన్ క్లిక్ చేసి చిత్రపటం ద్వారా నియోజక వర్గం వరకు వెళ్ళగలరు. డ్రాప్ డౌన్ బాక్స్ లో మండలం / పురపాలక ను ఎంపిక చేసుకొని గ్రామ పంచాయతి / వార్డు కు సంబంధించిన మౌలిక వివరాలను చూసేందుకు Village Profile ను క్లిక్ చేయగలరు. Partner View పై క్లిక్ చేసినపుడు ఎంపిక చేసిన గ్రామ పంచాయతి / వార్డుకు Partner అనబడే ఆరంజ్ కలర్ బటన్ పై క్లిక్ చేసి వివరాలను నింపి నమోదు పద్ధతిని పూర్తి చేయగలరు.

 

దరఖాస్తుదారునికి వివరాలతో ఒక acknowledgement ఈమెయిల్ వెంటనే అందుతుంది.

మీరు అందజేసిన వివరాలను పంపిన అనంతరం జిల్లా కలెక్టర్ పరిశీలించి మీ నమోదును ఆమోదిస్తారు. కలెక్టర్ ఆమోదించిన అనంతరం మీ లాగిన్, పాస్ వర్డ్ వివరాలతో పాటు సంప్రదించవలసిన మండలం / మున్సిపాలిటీ / గ్రామ పంచాయతి / వార్డు ప్రతినిధి వివరాలుతో కూడిన ఆమోద ఈ-మెయిల్ మీకు అందుతుంది.  గ్రామ పంచాయతి / వార్డు కమిటి అనుమతి పొందిన అనంతరం జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీ ఆమోద ప్రక్రియను ఆమోదిస్తారు. ఇందుకు కొంత సమయం పడుతుంది.

రెండవ దశ

గ్రామ పంచాయతి / వార్డు మరియు దానికమిటీ సభ్యులతో పరిచయస్తులుగా మారండి

మీ పార్ట్నర్ షిప్ ఆమోదించిన తరువాత, సంబంధిత ఎంపిడిఓ / మునిసిపల్ కమీషనర్, గ్రామ పంచాయతి / వార్డు కమిటీ సభ్యులను సంప్రందించాల్సిన వివరాలు మీకు ఆమోద ఈమెయిల్ ద్వారా పంపుతారు. ఈ వివరాలతో ఎంపిడిఓ / మునిసిపల్ కమీషనర్ మరియు గ్రామ పంచాయతి కమిటి / వార్డు కమిటి సభ్యులను దయ చేసి ఒక్క సారీ సంప్రదించండి. అనంతరం వారితో కలసి మీరు అభివృద్ధి చేయదలచుకున్న గ్రామ పంచాయతి / వార్డులో  వ్యక్తిగతంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. గ్రామ పంచాయతి / వార్డు సభ్యులు, పౌరులతో కలసి పరిచయం ఏర్పరచుకొని పరిచయస్తులుగా మారండి. అలాగే  మీ ప్రతినిధిని నియమించడం లేదా నెట్ సమావేశం / వీడియో చాట్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడా మీరు ఈ దశను చేయవచ్చును.

 

పోర్టల్ లో  సంచరిస్తూ గ్రామ పంచాయతీ / వార్డ్ గురించి గణాంక మరియు ప్రాథమిక సమాచారం తెలుసుకొనవచ్చును. "Enter My Village" పై క్లిక్ చేసి జిల్లా,  నియోజకవర్గం, మండలం / మున్సిపాలిటీ / కార్పొరేషన్ మరియు గ్రామ పంచాయతి / వార్డు ఎంపిక కోసం సంచరించండి. "Village Profile Tab" పై దయ చేసి క్లిక్ చేయండి. మీరు మీ ప్రాథమిక అవగాహన కోసం ఆ గ్రామ పంచాయతీ / వార్డులకు సంబంధించి కొన్ని చారిత్రక వివరాలు చూడగలరు. సంబంధిత గ్రామ పంచాయతి / వార్డు యొక్క ఎడమ చేతి వైపు ఉన్న మెనులోని వేర్వేరు అంశాలపై క్లిక్  చేయడం ద్వారా మీరు మరింత అర్థం చేసుకోగలరు.

మూడవ దశ

20 Non Negotiables పని తీరు సూచికల పై గ్రామ పంచాయతి / వార్డుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులను ఏర్పాటు చేయుట

పార్ట్నర్ గ్రామ పంచాయతి కమిటీ సభ్యులతో కలసి గ్రామ పంచాయతి / వార్డుకు సంబంధించి 20 Non Negotiables నిబద్ధతల ప్రకారం ప్రస్తుత పరిస్థితులను పరిశిలిస్తారు. పార్ట్నర్ గ్రామ కమిటీ సభ్యులతో కలసి 20 Non Negotiables అభివృద్ధి నిబద్ధతల వాస్తవాలను సేకరించడం కోసం ఓ బేస్ లైన్ సర్వే చేస్తారు.

 

వెబ్ సైట్ లోని Download/About సెక్షన్ నుండి గ్రామ / వార్డు సర్వే ఫార్మాట్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా గ్రూప్ లో బేస్ లైన్ సర్వే ను మానవీయంగా  చేసుకొనవచ్చును. గ్రామ పంచాయతి / వార్డు కమిటీ, రేషన్ / ఎఫ్ పి దుకాణ యజమాని, స్వయం సహాయక సంఘం బుక్ కీపర్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఆ గ్రామ పంచాయతి / వార్డుకు సంబంధించి చురుకైన సభ్యులు ఒక గ్రూప్ గా ఉండవచ్చును.  మానవీయంగా తయారు చేసిన సర్వే షీట్ ను గ్రామ / వార్డు కమిటీ పోర్టల్ లాగిన్ లో పొందుపరచిన డేటా ఎంట్రీ ఫోరం ద్వారా నమోదు చేయవచ్చును. గ్రామ / వార్డు కమిటీ లాగిన్ వివరాలను సంబంధిత ఎంపిడిఓ (రూరల్) లేదా పురపాలక కమిషనర్ (అర్బన్) నుండి పొందవచ్చును. దీనిని సర్పంచ్ / పార్ట్నర్ / గ్రామ పంచాయతి / వార్డు చురుకైన కమిటీ సభ్యులకు అందజేస్తాము.

 

పోర్టల్ Download Section నుండి స్మార్ట్ విలేజ్ మొబైల్ అప్లికేషను ను డౌన్ లోడ్ చేసుకొని జియో టాగింగ్ ద్వారా కూడా బేస్ లైన్ సర్వే ను చేయవచ్చును. స్మార్ట్ విలేజ్ - స్మార్ట్ వార్డ్ ప్రోగ్రామ్ యొక్క20 Non Negotiables అభివృద్ధి నిబద్ధతల వాస్తవ పరిస్థితులను ఈ సర్వే ఖచ్చితంగా అందిస్తుంది.  గ్రామ పంచాయతి / వార్డులోని  గృహాలు, ఆస్తులను జియో-ట్యాగ్ చేసి ఈ సర్వే ద్వారా చిత్రీకరించిన చిత్రాలను గూగుల్ మ్యాప్ లో ఉంచుతాము. ఈ సర్వే ఫలితాలు  పోర్టల్ ను నేరుగా ప్రతిబింబించి ఆటోమేటిక్ గా నివేదికలు వస్తాయి.  గ్రామ పంచాయతి / వార్డు లోని క్రియాశీల ఇంటర్నెట్ / మొబైల్ యాప్ వినియోగదారులు ఈ సర్వే చేయవచ్చును. ఈ విధమైన సర్వే ను నిపుణులు చేత కూడా చేయబడును, దీనికి మీరు smartap@ap.gov.in ను సంప్రదించండి. స్మార్ట్ కార్యక్రమం 20 Non Negotiables పని తీరు సూచికలకు అనుసరించి గ్రామ పంచాయతి / వార్డు యొక్క వాస్తవిక మరియు నిజ సమయ వీక్షణ  ఈ రకమైన స్మార్ట్ సర్వే అందిస్తుంది. గ్రామ పంచాయతి / వార్డు సరిహద్దులు, రోడ్డులు, ప్రధాన ప్రజా ఆస్తులు, గృహల చిత్రాలను చిత్రీకరించి, డిజిటైజ్ చేసి మ్యాప్స్ లో ఉంచడం ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆ సంబంధిత గ్రామ పంచాయతి / వార్డు ను వీక్షించవచ్చును మరియు నావిగేట్ చేయవచ్చును. నమూనా తో వృత్తిపరంగా పూర్తి జియో-ట్యాగ్ సర్వే ని వీక్షించండి "Chittoor- Chandragiri- Kandulavaripalle". బేస్ లైన్ సర్వే పూర్తి అయిన వెంటనే Report Card తో కూడిన 20 Non Negotiables Summary Report ఆటోమేటిక్ గా పోర్టల్ లో రుపోదించ పడుతుంది.

నాలుగవ దశ

Donorable Assets/Activities స్థాపించుట.

బేస్ లైన్ సర్వే పూర్తి అయిన తరువాత ఆస్తులు మరియు జీవనాధార పరిస్థితుల అనుగుణంగా దానపుర్వక ఆస్తులు / చర్యలు ఆటోమేటిక్ గా ఏర్పడుతాయి. ఈ దానపుర్వక ఆస్తులు / చర్యలు  ప్రతి గ్రామ పంచాయతి / వార్డు వెబ్ సైట్ లో20 Non Negotiables నిబద్ధత సుచికలకు అనుగుణంగా ఆటోమేటిక్ గా పొందుపరచబడుతుంది.  గ్రామ పంచాయతి / వార్డులో గుర్తించిన ప్రతి దానపుర్వక ఆస్తి / చర్యల విలువను పార్ట్నర్ తో పాటు గ్రామ పంచాయతి / వార్డు కమిటీ విషయ నిపుణుల సహకారంతో ప్రచురిస్తారు.

ఐదవ దశ

అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలకు దరకాస్తు చేసుకోవడం, సెక్టోరల్ పార్ట్నర్ అర్థం చేసుకొని అవసరమైన నిధుల కొరతను ఏర్పాటు చేయడం

20 Non Negotiables నిబద్ధత సుచికలలోని ప్రతిదానికి ప్రభుత్వ పథకాలు కలవు. సెక్టోరల్ పార్టనర్లు కూడా కొన్ని ప్రత్యేక రంగాలకు / ఆసక్తి ఉన్నవాటి అభివృద్ధి  కొరకు నమోదు చేసుకుని ఉండవచ్చు. మీ పార్ట్నర్ లాగిన్ వివరాలతో మీరు సెక్టోరల్ పార్ట్నర్ కు సంబంధించిన ఈ వివరాలతో పాటు సంప్రదించే వివరాలు కూడా పొందవచ్చును. విలేజ్ / వార్డు కమిటీ మరియు ఎంపిడిఓ / మునిసిపల్ కమీషనర్ తో కలసి ఈ పథకాలకు దరఖాస్తు చేయవచ్చును. నిధుల కొర

 

తలు విశ్లేషణ చేసి, ఏ Donorable Assets/Activitiesకు ఎంత నిధుల కొరత అవసరమో చూడటం. పార్ట్నర్ లాగిన్ వివరాలను ఉపయోగించి, గ్యాప్ నిధులు, అవసరమయ్యే ఆస్తులు / చర్యలు అంచనాలు పాటు జోడించవచ్చు.  సబ్జెక్టు నిపుణులను ఉపయోగించుకొని అంచనాలు రూపొందించవచ్చును.

ఆరవ దశ

నిధుల కొరత కోసం సపోర్ట్ పార్ట్నర్ లను తీసుకురావడం

గ్రామ పంచాయతి / వార్డు లోని Donorable Assets/Activities కు సంబంధించి నిధుల కొరతను పూరించడానికి పౌరులు / ఎన్.ఆర్.వి లు / ఎన్.ఆర్.ఐ లను గ్రామ కమిటీ తో కలసి పార్ట్నర్ ఆహ్వనించవచ్చును.  వారు ఏదైన Donorable Assets/Activities కు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చి సపోర్ట్ పార్ట్నర్ గా రిజిస్టర్ కావచ్చును."Enter My Village" పై క్లిక్ చేసి శక్తివంతమైన సపోర్ట్ పార్టనర్లు Donorable Assets/Activities ను వీక్షించవచ్చును. జిల్లా, నియోజకవర్గం, మండల / మున్సిపాలిటీ / కార్పొరేషన్ మరియు గ్రామ పంచాయతీ / వార్డును ఎంచుకొనవచ్చును. అన్ని Donorable Assets/Activities అంచనాలను "Donorable Assets" ట్యాబ్ పై క్లిక్ చేసి చూడవచ్చును. సపోర్ట్ పార్ట్నర్ కావాలనుకునే వారు "Sponsor" బటన్ పై క్లిక్ చేసి సపోర్ట్ పార్ట్నర్ కావచ్చును. సపోర్ట్ పార్టనర్స్ కు కూడా లాగిన్ వివరాలు అందజేయబడుతుంది. సపోర్ట్ పార్టనర్స్ వారి లాగిన్ వివరాలను ఉపయోగించుకొని వారు స్పాన్సర్ చేస్తున్న దానికి సంబంధించిన పురోగతి, గ్రామస్తుల వ్యాఖ్యలను వీక్షించిన పిదప చెల్లింపులు చేయవచ్చును.

ఏడవ దశ

పురోగతి మరియు నివేదిక పర్యవేక్షణ

పార్ట్నర్ గ్రామ కమిటీతో కలసి దానపుర్వక కార్యాచరణ / పురోగతిని తెలుసుకొని అర్ధ సంవత్సరం నివేదికలను అప్ డేట్ చేయడం.20 Non Negotiables సూచికలు అనుసరించి అభివృద్ధిని పార్ట్నర్ భేరీజు వేసి, అన్ని సక్రమంగా ఉన్నపుడు దానిని స్మార్ట్ విలేజ్ గా స్వీయ ప్రకటన చేయడం జరుగుతుంది.Report Card తో కూడిన గ్రేడింగ్ గ్రేడింగ్ సిస్టం ఆటోమేటిక్ గా పోర్టల్ లో అందించబడుతుంది.20 Non Negotiables సూచికలు అనుసరించి 'A ' గ్రేడ్ చేరడానికి అన్ని పనులు పూర్తి చేయాలి. కమిట్మెంట్ ఇండికేటర్ ను సాధించడానికి ఏదైన ఉత్తమ విధానాలు అనుసరించి ఉంటే. వాటిని పార్ట్నర్ లాగిన్ లోని Best Practices Data Entry Form  ద్వారా ప్రచురించవచ్చును.20 Non Negotiables నిబద్ధత సూచికలు అనుసరించి 'A'  గ్రేడ్ సాధించడానికి అలవరచిన ఉత్తమ విధానాలు, విజయాలకు ప్రభుత్వ పురస్కారం పొందవచ్చును. పురోగతి పర్యవేక్షించేందుకు మరియు నెలవారీ రిపోర్ట్ తాయారు చేయుటకు ప్రతి గ్రామ పంచాయితీ లేదా వార్డు కోసం ఒక ప్రత్యేక అధికారిని కేటాయిస్తారు.

 

డౌన్ లోడ్ చేయునప్పుడు వెబ్ సైట్ www.smart.ap.gov.in శిక్షణ విభాగం నందు పొందుపరచిన ట్రైనింగ్ మెటీరియల్ ను పరిశీలించి step by step నిర్ధారించుకొనగలరు. పార్ట్నర్ షిప్ విధానం, పార్ట్నర్ లాగిన్, విలేజ్ / వార్డు కమిటీ లాగిన్ తదితర వాటికి ట్రైనింగ్ మెటీరియల్ చాలా ముఖ్యం.

ఆధారం :  స్మార్ట్ ఆంధ్రప్రదేశ్  వెబ్సైట్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate