పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జీఎస్టీ కింద విలువ లెక్కింపు

సాధారాణ వస్తూ సేవల పన్ను

జీఎస్టీ కింద పన్ను చెల్లింపు జరపాల్సిన విలువ ఎలా లెక్కిస్తారు.

పన్ను విధించాల్సిన సరుకులు మరియు సేవల సరఫరా విలువ అనేది సాధారణంగా 'లావాదేవీ విలువ'గా, అంటే ఇరు వ్యాపార పక్షాలు పరస్పర సంబంధం కలిగి ఉండని సందర్భాల్లో మరియు ధర చెల్లింపు అనేది మాత్రమే ఏకైక ఉద్దేశమైనప్పుడు లావాదేవీ కింద చెల్లించిన లేదా చెల్లించాల్సిన ధర అన్నమాట. నమూనా జీఎస్టీ చట్టం లావాదేవాల విలువ నుంచి కొన్ని చేర్పులు, మినహాయింపుల గురించి వివరిస్తుంది. ఉదాహరణకు వాపసు చేసే ధరావతు, సరఫరాకు ముందు లేదా తర్వాత ఇచ్చే తగ్గింపు అనేవి లావాదేవీల విలువ కిందకు రావు.

లావాదేవీ విలువ అంటే ఏమిటి.?

లావాదేవీ విలువ అనేది సాధారణంగా ఇరు వ్యాపార పక్షాలు పరస్పర సంబంధం కలిగి ఉండని సందర్భాల్లో మరియు ధర చెల్లింపు అనేది మాత్రమే ఏకైక ఉద్దేశమైనప్పుడు చెల్లించిన లేదా చెల్లించాల్సిన ధర లావాదేవీ విలువగా పరిగణించబడుతుంది. సరఫరాదారు చెల్లించాల్సి ఉండి, సరఫరా గ్రహీత భరించిన మొత్తం కూడా ఇందులో భాగమే.

సీజీస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ మరియు సరుకులు మరియు సేవల కింద వేరువేరు విలువ లెక్కింపు విధానాలు ఉంటాయూ.?

లేదు. మూడుపన్నులకు సెక్షన్ 15 ఉమ్మడిగానే ఉంటుంది. అలాగే సరుకులు మరియు సేవలకూ ఇది ఉమ్మడిగానే వర్తిస్తుంది.

కాంట్రాక్టు ధర అనేది సరఫరా విలువ లెక్కింపునకు సరిపోతుందా?

కాంట్రాక్టు ధర అనేది లావాదేవీ విలువగా విశ్లేషించి పిలువబడుతుంది. పన్ను లెక్కింపునకు అదే ప్రాతిపదికగా ఉంటుంది.

అయితే ధర అనేది వ్యాపార పక్షాల మధ్యన గల సంబంధం మీద ఆధారపడి ఉండడం, కొన్నిరకాల లావాదేవీలు ఎలాంటి ధర లేకుండానే జరిగినట్టుగా భావించబడడం వల్ల, లావాదేవీ విలువ సరిగా అంచనాను ఈ అంశాలను అధిగమించి నిర్ధారించాల్సి ఉంటుంది.

అన్ని సందర్భాలలోనూ జీఎస్టీ మదింపు నిబంధనల అన్వయం అవసరమా?

అవసరం లేదు... చట్టంలోని సెక్షన్ 15 ఉప సెక్షన్ (1) కింద విలువను నిర్ధారించలేని సందర్భాలలో మాత్రమే జీఎస్టీ మదింపు నిబంధనలను అన్వయించడం అవసరం.

సెక్షస్ 15(1) కింద ప్రకటించిన లావాదేవీ విలువకు ఆమోదం ఉంటుందా?

ఉంటుంది. సెక్షన్ 15(2) కింది చేరికలేవైనా ఉన్నయేమో పరిశీలించిన అనంతరం ఆమోదించవచ్చు. అంతేకాకుండా సరఫరాదారు, స్వీకర్తల మధ్య ఏదైనా బాంధవ్యం ఉన్నప్పటికీ అది ధరను ప్రభావితం చేయని పక్షంలో లావాదేవీ ప్రకటిత విలువను ఆమోదించే వీలుంది.

సరఫరా అనంతర రాయితీ లేదా ప్రోత్సాహకాలను లావాదేవీ విలువలో చేర్చవచ్చా?

చేర్చవచ్చు... ఒప్పందం ప్రకారం సరఫరా అనంతర రాయితీ ఖరారైనట్లు సరఫరా సమయంలోనే సమాచారం ఉన్నప్పుడు, సదరు రాయితీ నిర్దిష్టంగా బిల్లుతో ముడిపడి ఉన్నప్పుడు, సదరు రాయితీకి వర్తించే ఉత్పాదక పన్ను జమను స్వీకర్త వాపసు చేసిన సందర్భాల్లో జీఎస్టీ నమూనా చట్టంలోని సెక్షన్ 15 కింద సరఫరా అనంతర రాయితీని లావాదేవీ విలువలో చేర్చేందుకు అనుమతించవచ్చు.

సరఫరాకు ముందు లేదా సరఫరా సమయంలో అనుమతించే ముందస్తు రాయితీలు లావాదేవీ విలువలో చేర్చదగినవేనా?

లేదు. సాధారణ వర్తక వ్యవహారాలలో భాగంగా అనుమతించి ఉండి, బిల్లులో తగువిధంగా నమోదు చేసి ఉంటే తప్ప అలా చేసేందుకు వీల్లేదు.

మదింపు నియమాలలోని నిబంధనలు ఎప్పుడు వర్తిస్తాయి?

మదింపు నిబంధనలు ఎప్పుడు వర్తిస్తాయంటే..

 • ప్రతిఫలం పూర్తిగా లేదా పాక్షికంగా నగదు రూపంలో లేనప్పుడు;
 • లావాదేవీలోని పక్షాల మధ్య బంధుత్వం ఉన్నపుడు లేదా సరఫరాదారు ప్రత్యేక వర్గానికి చెందినప్పుడు;
 • ప్రకటించిన లావాదేవీ విలువ నమ్మదగినది కానప్పుడు...

లావాదేవీ విలువకు జోడించదగినవిగా సెక్షస్ 15(2)లో చేర్చిన అంశాలేవి?

లావాదేవీ విలువకు జోడించదగినవిగా సెక్షన్ 15(2)లో చేర్చిన అంశాలు కిందివిదంగా ఉన్నాయి:-

 1. సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంతోపాటు వస్తువులు-సేవల పన్ను (ఆదాయనష్టంపై రాష్ట్రాలకు పరిహారం) చట్టం-2016 కాకుండా ఇతర చట్టాల కింద స్వీకర్తపై సరఫరాదారు విదించే పన్ను, సుంకం, రుసుము, ఫీజు, ఇతర చార్టీలు;
 2. సరఫరాలకు సంబంధించి స్వీకర్త భరించిన వ్యయాన్ని అతడు పొందిన వస్తువులు లేదా సేవలకు చెల్లించిన/చెల్లించాల్సిన వాస్తవ ధరలో చేర్చనిపక్షంలో సరఫరాదారు చెల్లించాల్సిన మొత్తం;
 3. వస్తువులు/సేవలు లేదా రెండింటి సరఫరాలో స్వీకర్తపై సరఫరాదారు విధించే కమీషన్, ప్యాకింగ్ వంటి యాదృచ్చిక ఖర్చులతోపాటు ఇతరత్రా సేవలు లేక సదరు వస్తుసేవల చేరవేతకు ముందు లేదా తర్వాత విధించే ఇతర చార్టీలు;
 4. వడ్డీ లేదా ఆలస్య రుసుము లేదా సరఫరాకు ప్రతిఫలం చెల్లింపులో ఆలస్యంపై జరిమానా;
 5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు కాకుండా ధరతో ప్రత్యకంగా ముడిపడిన రాయితీలు.

ప్రకటిత లావాదేవీ విలువను ఎప్పుడు అనుమానించాల్సి వస్తుంది ?

ముసాయిదా జీఎస్టీ విలువ లెక్కింపు నిబంధనల్లోని రూల్ 7(బీ)లో ఇందుకు సంబంధించిన కారణాలు వివరించడమైంది. అవి (1) సాపేక్ష సరఫరాలలో అధికంగా విలువ పెరుగుదల ఉండడం, (2) సరఫరాల మార్కెట్ విలువలో గణనీయమైన తగ్గింపు లేదా హెచ్చింపు ఉండడం, మరియు (3) వివరణ, పరిమాణం, నాణ్యత, తయారైన సంవత్సరం వంటి వివరాల్లో తప్పుడు ప్రకటనలుండడం, మొదలైనవి. ఇది కేవలం సూచనప్రాయంగా ఉద్దేశించింది మాత్రమే, సంపూర్ణ జూబితా కాదు.

ముసాయిదా జీఎస్టీ విలువ లెక్కింపు నిబంధనల్లో విలువ నిర్దరాణకు ఇచ్చిన పద్ధతులేమిటి.?

లావాదేవీ విలువ నిర్ధారణకు ముసాయిదా జీఎస్టీ విలువ లెక్కింపు నిబంధనల్లో మూడు పద్దతులు ఇవ్వడమైంది. అవి సాపేక్ష పద్దతి, లెక్కింపు పద్ధతి, మిగులుబడి పద్ధతి. వీటని వరుస క్రమంలో వినియోగించాలి. ప్యూర్ ఏజెంట్స్ మనీ చేంజర్స్ విషయంలో ప్రత్యేక విలువ లెక్కింపు పద్దతులు సూచించబడ్డాయి. ఇన్షూరర్, ఎయిర్ ట్రావెల్ ఏజంటు, లాటరీల పంపిణీదారు, అమ్మకందారు వంటివారి విషయంలో తదుపరి మరిన్ని ప్రత్యేక నిబంధనలు రూపందించవచ్చు.

లావాదేవీ విలువలో కలపడానికి సంబంధించి సెక్షస్ 15(2)లో నిర్దేశించిన చేర్పులు ఏమిటి..?

లావాదేవీ విలువలో కలపడానికి అవకాశమున్న సెక్షన్ 15(2)లో నిర్దేశించిన చేర్పులు ఈ కింది విధంగా ఉన్నాయి.

 1. సరఫరాదారు చెల్లించాల్సి ఉండి, సరఫరాల గ్రహీత జరిపిన చెల్లింపులు,
 2. సరుకులు లేదా సేవలు ఉచితంగా లేదా రాయితీ కింద సరఫరా చేసినవి
 3. గ్రహీత సరఫరా షరతు ప్రకారం చెల్లించాల్సిన రాయల్టీస్ మరియు లైసెన్స్ ఫీజులు,
 4. మరే ఇతర చట్టాల కింద విధించిన పన్నులు (ఎస్జీఎస్టీ / సీజీఎస్టీ లేదా ఐజీఎస్టీయేతరమైనవి)
 5. సరఫరాదారు సరఫరాకు ముందు భరించిన ఖర్చులు, విడిగా చార్జి చేయబడినవి
 6. సరఫరాపై సరఫరాదారు పొందిన సబ్సిడీలు
 7. సరఫరాదారు విడిగా క్లెయిమ్ చేసిన రీఇంబర్స్మెంట్లు
 8. సరఫరాకు ముందే వెల్లడయినవి కాకుండా సరఫరా తర్వాత ఇచ్చిన తగ్గింపులు (మామూలు వ్యాపార విధానంలో భాగంగా ఇచ్చినవి, ఇన్వాయిస్ లో చూపనవి ఇందులో చేర్చరాదు)

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

3.01879699248
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు