పన్ను చెల్లింపు ప్రవేశ పరిధిలోనికి వచ్చే ప్రతి పన్ను చెల్లింపుదారు రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రూ. 9 లక్షల వార్షిక టర్నోవరు దాటిన సరఫరాదారు రిజిస్టేషన్ చేయించుకోవాలి. అయితే రూ.10 లక్షల పరిధి దాటితేనే అతను పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తాడు. అంటే రూ.10 లక్షల పరిధి దాటిన అనంతరం అతడు రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అంతర్ రాష్ట్ర సరఫరాదారులు, టీడీఎస్ రాబట్టుకునేవారు, ఈ-కామర్స్ ద్వారా సరుకులు సరఫరా చేసేవారు మొు. ప్రత్యేక తరగతి కిందకు వచ్చే వ్యక్తులు మూత్రం తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకొని రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. (చూ. షెడ్యూల్ 3 మరియు రిజిస్టేషన్అధ్యాయంలోని 6వ ప్రశ్న).
రిజిస్టర్డ్ వ్యక్తులకు జరిపే సరఫరాలు, రిజిస్టర్ కాని వ్యక్తులకు (వినియోగదారులకు) జరిపే సరఫరాలు, క్రెడిట్/డెబిట్ నోట్స్, జీరో రేటు మరియు మినహాయింపు కింద జరిపే, నాన్-జీఎస్టీ సరఫరాలు, ఎగుమతులు, మరియు భవిష్యత్ సరఫరాల నిమిత్తం అందుకున్న అడ్వాన్స్‌లు తదితర నెలరోజులల లోపల జరిగిన వివిధ రకాల సరఫరాలకు సంబంధించిన వివరాలు జీఎస్టీఆర్-1లో ఫైల్ చేయాల్సి ఉంటుంది.
లేదు. ఇన్వాయిసెస్ యొక్క స్కాస్ట్ కాపీలు జీఎస్టీఆర్-1తోపాటుగా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్వాయిస్ ల లోని కొన్ని నిర్దేశిత భాగాలలోని కొంత సమాచారాన్ని మాత్రమే అప్లోడ్ చేయాలి.
లేదు. బీ2బీ లేదా బీ2సీ ప్లస్ మరియు రాష్ట్రం లోపలి సరఫరాలు లేదా బయటి సరఫరాలు అనేదానిని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.బీ2బీ సరఫరాల్లో అన్ని సరఫరాల ఇన్వాయిస్ లు, అవి రాష్ట్రం లోపలి లేదా బయటి సరఫరాలు అయినప్పటికీ, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సరఫరాల గ్రహీతలు ఐటీసీ పొందుతారు కనుక సరిపోల్చడం అవసరమవుతుంది. బీ2సీ సరఫరాల్లో సాధారణంగా అప్ లోడింగ్ అవసరం రాదు. ఎందుకంటే కొనుగోలుదారు ఎలాంటి ఐటీసీ తీసుకోడు. అయితే అయితే గమ్య ఆధారిత సూత్ర ప్రాతిపదికపై రూ.2.5 లక్షల వైచిలుకు విలువ కలిగిన అంతర్ రాష్ట్ర బీ2బీ సరఫరాల ఇన్వాయిస్ లను అప్లోడ్ చేయాలి. రాష్ట్రం లోపలి సరఫరాలలో రూ.2.5 లక్షల లోపు ఇన్వాయిస్ లు మరియు అన్ని రాష్ట్ర అంతర్గత ఇన్వాయిస్లకు సంబంధించి రాష్ట్రాల వారీగా సారాంశ ఇస్తే సరిపోతుంది.
లేదు. అసలు ఎలాంటి వివరణ అప్లోడ్ చేయాల్సిన అవసరముండదు.సరుకుల సరఫరాకు సంబంధించి హెచ్ఎస్ఎన్ కోడ్, సేవల సరఫరాకు సంబంధించిఅకౌంటింగ్ కోడ్ ఇస్తే సరిపోతుంది. ఫైల్ చేసే వ్యక్తి ఎన్ని డిజిట్ల మేరకు అప్లోడ్చేయాలనేది గత ఏడాది టర్నోవరుపై ఆధారపడి ఉంటుంది.
అవును. కేవలం విలువ మాత్రమే కాకుండా పన్ను విధించే విలువను ఫీడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో రెండూ విభిన్నంగా ఉండవచ్చు.ఒకవేళ చెల్లింపు అనేది లేకపోతే, అది పెడ్యూల్ 1 కిందకు వచ్చే సరఫరా అయితే, పన్ను వేయదగ్గ విలువను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
జీఎస్టీఆర్-2లో చాలా భాగాలు వాటంతట అవే నిండిపోతాయి. అయితే దిగుమతులు, నాన్ రిజిస్టర్డ్ వ్యక్తుల నుంచి జరిపిన కొనుగోళ్లు లేదా కంపోజిషన్ సరఫరాదార్లు మరియు నహాయింపు/నాన్-జీఎస్టీ/సున్నా జీఎస్టీ కింద జరిగిన సరఫరాలు మొు. గ్రహీత మాత్రమే నింపదగిన వివరాలు మాత్రం అతడే నింపాల్సి ఉంటుంది.
జవాబు: జీఎస్టీఆర్-2లోని వివరాలు అవతలి పక్షం సమర్పించిన జీఎస్టీఆర్- 1లోని వివరాలతో సరిపోలకపోతే, ఉభయపక్షాలకూ తెలియపర్చిన తర్వాత కూడా తేడాలు కొనసాగితే, దిద్దుబాటు జరుగకపోతే, ఐటీసీ వెనుకకు తీసుకోబడుతుంది. తేడాలు రెండు కారణాల వల్ల రావచ్చు. మొదటిది గ్రహీత వైపు నుంచి పొరపాటు జరగడం. అప్పుడు తదుపరి చర్య ఉండదు. రెండవది సరఫరాదారు ఇన్వాయిస్ జారీచేసినప్పటికీ దానిని అప్లోడ్ చేసి పన్ను కట్టకపోయి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో సరఫరాదారుకు వ్యతిరేకంగా సదరు మొత్తం వసూలుకు చర్య చేపట్టడం జరుగుతుంది. సరఫరాదారు సరఫరా జరిపి దానిపై పన్ను చెల్లించని అన్ని సందర్భాల్లో తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఏ దశలోనైనా, తదుపరి ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ లోగా సరఫరాదారు ఇన్వాయిస్ ను అప్లోడ్ చేయవచ్చు. గల్లంతయిన అలాంటి ఇన్వాయిస్ లను అప్లోడ్ చేసిన నెలలోనే జీఎస్టీఆర్-3 ద్వారా పన్నును, వడ్డీతో సహా చెల్లించాలి. అప్పుడు గ్రహీత సదరు ఇన్వాయిస్ పై యధాతథంగా ఈటీసీ పొందుతారు. దానిని వెనుకకు తీసుకునే సందర్భంలో గ్రహీత చెల్లించిన వడ్డీ కూడా అటోమేటెడ్ జీఎస్టీఎన్ వ్యవస్థ ద్వారా తిరిగి పొందగలుగుతాడు.
జీఎస్టీఆర్-2 లోని ప్రత్యేకత ఏమిటంటే సరఫరాదారు తన జీఎస్టీఆర్- 1లో తెలిపిన వివరాల ఆధారంగా జీఎస్టీఆర్-2 లో గ్రహీత పొందిన సరఫరాల వివరాలు వాటంతట అవే నిండిపోతాయి.
ఐటీసీ వెనుకకు తీసుకున్న సరఫరా జరిగిన తర్వాత ఎప్పుడైనా, అయితే తదుపరి ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ లోపల, సరఫరాదారు సదరు సరఫరాకు చెందిన ఇన్వాయిస్ ను అప్లోడ్ చేస్తే, వెనుకకు తీసుకున్న క్రెడిట్ పునరుద్ధరించబడుతుంది. వెనుకకు తీసుకునే సందర్భంగా చెల్లించిన వడ్డీ కూడా వాపసు చేయబడుతుంది.
లేదు. కంపోజిషన్ పన్ను చెల్లింపుదార్లు బయటికి లేదా లోపలికి జరిగే సరఫరాలపై ఎలాంటి స్టేట్ మెంట్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. త్రైమాసికం ముగిసిన తర్వాత వచ్చే 1వ తేదీన వారు జీఎస్టీఆర్-4 ఫారంతో త్రైమాసిక రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వారు ఎలాంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు అర్హత కలిగి ఉండరు కనుక జీఎస్టీఆర్-2తో వారికి పనే ఉండదు. వారు గ్రహీతలకు అలాంటి క్రెడిట్‌ను దాఖలు పర్చలేరు కనుక జీఎస్టీఎన్-1 అవసరం ఏర్పడదు. వారు తమ రిటర్న్‌లో బయటికి జరిగే సరఫరాలు వాటిపై చెల్లించిన పన్ను వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. వారు జరిపిన కొనుగోళ్ల వివరాలు కూడా అందులో తెలియపర్చాల్సి టుంది. అవి చాలావరకు వాటంతట అవే నమోదవుతాయి.
లేదు. ఐఎస్డీలు కేవలం జీఎస్టీఆర్-6 ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందులో సేవలు సమకూర్చినవారి నుంచి లభించిన క్రెడిట్ వివరాలు మరియు అనుబంధ సంస్థలకు పంపిణీ చేసిన క్రెడిట్ వివరాలు చేర్చాలి. ఈ అంశాలన్నీ రిటర్న్ లో ఇస్తారు కనుక లోపలికి, బయటికి జరిగే సరఫరాలపై విడిగా స్టేట్మెంట్ సమర్పించాల్సిన అవసరముండదు.
జీఎస్టీ కింద పన్ను రాబట్టుకునేవారు ఆ నెలలో ఎవరెవరి దగ్గర ఎంత పన్ను రాబట్టుకున్నదీ, మొత్తం ఎంత పన్ను రాబట్టుకున్నదీ జీఎస్టీఆర్-7 ఫాం ద్వారా తదుపరి నెల 10వ తేదీలోగా సమర్పించే రిటర్న్ లో తెలియజేస్తారు.పన్ను రాబట్టుకున్న వ్యక్తి అప్లోడ్ చేసిన పన్ను వివరాలు పన్ను రాబట్టబడిన వ్యక్తి యొక్క జీఎస్టీఆర్-2లో వాటంతట అవే వచ్చి చేరుతాయి. పన్ను చెల్లింపుదారు తన తరపున జరిగిన చెల్లింపులపై క్రెడిట్ పొందేందుకు తన జీఎస్టీఆర్-2లో వీటిని ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ పొందేందుకు అతడు ఎలాంటి పత్రం కాగితం మీదగానీ, ఎలక్ట్రానిక్ రూపంలో గానీ సమర్పించాల్సిన అవసరం లేదు. పన్ను చెల్లింపుదారు తాను నిర్వహించే రికార్డుల కొరకు సర్టిఫికెట్ కావాలంటే ఉమ్మడి పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అప్పుడప్పుడు పన్ను చెల్లించేవారు కంపోజిషన్ స్కీం కింద పన్ను చెల్లించేవారు మినహా, జీఎస్టీఆర్- 1 నుంచి 3 పారాల కింద రిటర్న్ ఫైల్ చేసేవారందరూ, వార్షిక రిటర్న్ పైల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడూ పన్ను కట్టేవారు, నివాసేతర పన్ను చెల్లింపుదార్లు, ఐఎస్డీలు, మూలంలో పన్ను రాబట్టుకునే అధికారం కలిగిన వ్యక్తులు వార్షిక రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు.
లేదు. సాధారణ లేదా కాంపౌండింగ్ రూపంలో పన్ను చెల్లించేవారు వార్షిక రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రిజిస్టేషన్ రద్దుకు దరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే అంతిమ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రద్దు చేసుకున్న తేదీకి లేదా రద్దు ఆర్డరు జారీ అయిన తేదీకి మూడు నెలల లోపల దీనిని దాఖలు చేయాలి.
జీఎస్టీ కింద విడివిడి లావాదేవీల ఆధారంగా రిటర్న్ రూపొందుతాయి కనుక సవరించిన రిటర్న్ అనేది దాఖలు చేయాల్సిన అవసరం రాదు. ఇన్వాయిస్ లేదా డెబిట్/క్రెడిట్ నోట్స్‌ను మార్చాల్సిన సందర్భం తలెత్తితేనే సవరించిన రిటర్న్ అవసరం ఏర్పడుతుంది. ఈసరికే సమర్పించిన రిటర్న్ సవరించే బదులుగా సవరించాల్సిన లావాదేవీలను (ఇన్వాయుస్లు లేదా డెబిట్/క్రెడిట్ నోట్స్) మార్చేస్తే సరిపోతుంది. భవిష్యత్తులో సమర్పించే జీఎస్టీఆర్1/లో అదివరకటి వివరాల మార్పునకు ఇవ్వబడిన పట్టికల్లో వాటిని సవరించవచ్చు.
పన్ను చెల్లింపుదార్లు వివిధ పద్ధతుల్లో స్టేట్మెంట్లు మరియు రిటర్న్ దాఖలు చేయవచ్చు. మొదటగా కామన్ పోర్టల్‌లో నేరుగా ఆన్లైన్ ద్వారా స్టేట్మెంట్లు మరియు రిటర్న్ ఫైల్ చేయవచ్చు. అయితే పెద్ద సంఖ్యలో ఇన్వాయిస్లు ఉండే పన్ను చెల్లింపుదారులకు ఈ పద్దతి బాదరబందీగానూ మరియు అధిక సమయం తీసుకునేదిగానూ ఉండవచ్చు. అలాంటి పన్ను చెల్లింపుదారుల కోసం ఆఫ్ లైన్లో స్టేట్మెంట్ రూపొందించుకునే సౌకర్యం ఉంటుంది. వారు అటోమెటిక్ గా వివరాలు సమకూర్చుకునే పేజీలను డౌన్లోడ్ చేసుకుని తర్వాత వాటిని కామన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. జీఎస్టీఎన్ కామన్ పోర్టల్ తోఅనుసంధానమయ్యే జీఎస్టీ సువిధా ప్రొవైడర్స్ పర్యావరణాన్ని కూడా రూపొందించింది.
జీఎస్టీ వ్యవస్థలో అతిముఖమైన విషయం బయటకు జరిపిన సరఫరాలపై తదుపరి నెల 10వ తేదీ నాటికి అన్ని వివరాలను సకాలంలో అప్లోడ్ చేయడం. పన్ను చెల్లింపుదారు జారీచేసే బీ2బీ ఇన్వాయిస్ ల సంఖ్య మీద ఇది ఎంత బాగా చేస్తామనేది ఆధారపడి ఉంటుంది. సంఖ్య తక్కువగా ఉంటే ఒక్కదెబ్బకు అప్లోడ్ జరిగిపోతుంది. అయితే ఇన్వాయిస్ లు పెద్దసంఖ్యలో ఉంటే క్రమం తప్పకుండా ఇన్వాయిస్ లు (లేదా డెబిట్/క్రెడిట్ నోట్స్) ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. వాస్తవ సమయం ప్రాతిపదికన ఇన్వాయిస్ లు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేందుకు జీఎస్టీఎన్ అనుమతిస్తుంది. వాస్తవిక స్టేట్మెంట్ సమర్పించేంత వరకు అప్లోడ్ చేసిన ఇన్వాయిస్ల సవరణలు కూడా అనుమతిస్తుంది. కనుక పన్ను చెల్లింపుదారులు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా అప్లోడ్ చేయడం మంచిది. చివరి నిమిషంలో పరుగులు పెడితే అప్లోడింగ్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. బకాయిలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. తమ సరఫరాదార్లు తమకు జరిపే సరఫరాలపై ఇన్వాయిస్ లు అప్లోడ్ చేసేలా జాగ్రత్తలు తీసుకోవడం రెండో ముఖ్యమైన అంశం. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అందుబాటులోకి వస్తుంది. గ్రహీతలు తమ సరఫరాదార్లు చివరినిమిషం దాకా ఆగి లేదా గడువు తేదీవరకు ఆగకుండా ఎప్పటికప్పుడు తమ ఇన్వాయిస్ లు అప్లోడ్ చేసేలా ప్రోత్సహించాలి. తమ సరఫరాదార్లు ఇన్వాయిస్ లు అప్లోడ్ చేశారా లేదా అనేది సరిచూసుకునే వీలు జీఎస్టీ వ్యవస్థ కల్పిస్తుంది. తమ పన్ను చెల్లింపు తీరుతెన్నులను, ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఆటో రివర్సల్స్ వివరాలు తెలియజేసే సరఫరాదారు ఇన్వాయిస్లు అప్లోడ్ అవుతున్నాయా, అనేది గమనించే అవకాశం ఉంటుంది. జీఎస్టీ కామన్ పోర్టల్‌లో అఖిలభారత స్థాయిలో డేటా అంతా ఒకచోటే ఉంటుంది. దీనిద్వారా పన్ను చెల్లింపుదారుకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇన్వాయిస్ లను వీలైనంత సులభంగా అప్లోడ్ చేసే సౌకర్యం కల్పించేందుకు కృషి జరుగుతున్నది. త్వరలో ఇందుకు అనుగుణమైన పర్యావరణం అందుబాటులోకి వస్తుంది. పన్ను చెల్లింపుదార్లు ఈ వ్యవస్థను ప్రభావయుతంగా ఉపయోగించుకుని వ్యవస్థతో అనుగుణ్యత సాధించాలి.
లేదు. రిజిస్టర్డ్ పన్ను చెల్లింపుదారు కేంద్ర లేదా రాష్ట ప్రభుత్వాల గుర్తింపు పొందిన ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ ద్వారా రిటర్న్ ఫైల్ చేయవచ్చు.
గడువు తేదీలోగా రిటర్న్ పైల్ చేయని వ్యక్తి ఆలస్యానికి ప్రతిరోజుకూ రూ.వంద చొప్పున గరిష్టంగా రూ.ఐదు వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.