చాలా మందికి, సూక్ష్మ ఆర్ధిక సహాయమంటే ఉత్పాదక కార్యకలాపాలను చేసుకోవడానికి లేదా వారి చిన్న వ్యాపారాలను పెంచుకోవడానికిగాను నిరుపేద కుటుంబాలకు అతి తక్కువ ఋణాలను (సూక్ష్మ ఋణాల ను- మైక్రోక్రెడిట్) ఇవ్వడం. పేదలు, నిరుపేదలు, సాంప్రదాయకమైన లాంఛనప్రాయపు వ్యవస్థల నుండి రక రకాలైన ఆర్ధిక ఉత్పాదనలను అందుకోలేక పోవడమనేది గ్రహించినందువలన నిర్ణీత కాల పరిమితిని దాటి అదనపుకాలంలోనే విస్తృత స్థాయిలో సేవలను (ఋణాలు, పొదుపు, భీమా మొదలగునవి) కూడ ఈ పధ్ధతి కలుపుకుంది.
1980 సంవత్సరానికి మునుపే, అనగా ముప్పై సంవత్సరాల క్రితమే బంగ్లాదేశ్, బ్రెజిల్, మరికొన్ని ఇతర దేశాలలో ఈ సూక్ష్మ ఋణాలను ప్రయోగాత్మకంగా చేసినప్పటికిని, 1980వ దశకానికి ప్రత్యేకత వచ్చింది. సూక్ష్మ ఋణాలను ఇవ్వడంలో ప్రస్పుటంగా కన్పించే భేదం ఏమిటంటే, ఋణమివ్వడానికి ప్రత్యామ్నాయ వనరు లైన అనియత రంగ ఖాతాదారు వర్గాలపై దృష్టి సారించడం ద్వారా, తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడం ద్వారా, ఇచ్చిన అరువు అప్పగింతలో తన మూల్యాన్ని కలుపుకునే వడ్డీలను వేయడం ద్వారా ఋణాల ను ఇచ్చి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న పూర్వపు వ్యవస్థలోని లోపాలని తప్పించింది. పేదవారికి సేవ చేయడానికి, త్వరితగతిలో రాయితీ ఋణాలను ఇవ్వడం నుండి, ప్రాధాన్యత, స్థానిక, నిలకడగల సంస్థల నిర్మాణాత్మకతను సాధించే లక్ష్యాత్మక రంగానికి మారింది. సూక్ష్మ ఋణాలు ఇవ్వడానికి ప్రైవేట్ రంగం (లాభపేక్ష లేని రంగం) పూనుకుంది కాబట్టి మితిమీరిన రాజకీయం లేకుండా అయ్యింది. దీనివల్ల అన్నిరకాలైన అభివృద్ధి కోసం ఇచ్చిన ఋణాలన్నిటి కంటే ఎక్కువ పనితనం చూపించింది.
సాంప్రదాయకంగా, సూక్ష్మ ఆర్ధిక సాయాన్ని ఇవ్వడమన్నది చాలా ప్రామాణికతగల క్రెడిట్. ఇది ముఖ్యంగా ఉత్పాదకతకపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఆస్తులను ఏర్పరచుకునేందుకు,, సంసారానికి అవసరమైన స్థిరమైన పరికరాలను కల్పించుకునేందుకూ, ఆపదలనుంచి తమకుతాము భద్రత కల్పించుకునే సామర్ధ్యం కల్పించడానికీ , మిగతావారి వలెనే బీదప్రజలకి వివిధ విస్తారమైన ఆర్ధిక సాధనాల అవసరం ఉంటుంది. ఆ విధంగా, విస్తరింపబడిన సూక్ష్మ ఆర్ధిక సాయం యొక్క భావనని మనము చూస్తాము... సూక్ష్మ ఉత్పత్తుల సమృద్ధి అయిన ఒక మెనూని అందించే సమర్ధవంతమైన, విశ్వసనీయమైన మార్గాలని కనుగొనడమే మన ముందున్న ప్రస్తుత సవాలు.
గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలు, పట్టణప్రాంతాలలోగల పేదలకి అతి తక్కువ సొమ్ము పొదుపు, ఋణము, ఇతర ఆర్ధిక సేవలు మరియు ఉత్పత్తులు కల్పించి, వారి ఆదాయాన్ని పెంచే మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడాన్ని సూక్ష్మ ఋణంగా నిర్వచిస్తారు. ఈ సౌకర్యాలను సూక్ష్మ ఋణాల సంస్థలు అందిస్తాయి.
వాస్తవిక ఆధారాలతో తాము స్వంతంగా ఇచ్చే ఋణాల విధానాలకు బ్యాంకులు స్వేచ్చను కల్గి ఉన్నాయి. తగిన ఋణము, పొదుపు ఉత్పాదనలు మరియు ఋణ పరిమాణం, ప్రామాణికధర, ప్రామాణిక పరిమాణం, కాలపరిపక్వత, ఉదార వ్యవధి, లాభాలు మొదలగు వాటితో సంబంధిత నిబంధనలు, షరతులని ప్రణాళీకాబద్ధంగా సూత్రీకరించమని వారిని అడిగారు. వ్యవసాయ, వ్యవసాయేతర కార్యకలాపాలకి వినియోగ ఋణాలు, ఉత్పాదక ఋణాలే గాక ఇంటిని కట్టు కోవడానికీ, మెరుగుపరచడం కొరకు కూడా ఈ సూక్ష్మ ఋణాలు పేదవారికి ఇస్తారు.
ఋణాలు, పొదుపులు, బీమా, సొమ్ము బదిలీ సేవలు మరియు ఇతర ఆర్ధిక ఉత్పాదనలను అల్పాదాయ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని ఇచ్చేది, సూక్ష్మ ఆర్ధిక సహాయంగా చెప్పవచ్చు. బ్యాంకు నుంచి గాని ఇతర సంస్థ నుంచి గాని ఖాతాదారులకు ఇచ్చే తక్కువ ఋణాలని, సూక్ష్మ ఋణంగా చెప్పవచ్చు. ఇది తరచుగా అదనపు హామీ లేకుండా ఒక వ్యక్తికి లేదా గ్రూపు కు సూక్ష్మ ఋణాలని ఇవ్వవచ్చు.
లాంఛనప్రాయపు ఆర్ధిక సంస్థలు అందుబాటులో లేని అల్పాదాయ ఖాతాదారులే సూక్ష్మ ఆర్ధిక సహాయానికి అర్హులవుతారు. స్వయంఉపాధి పొందేవారు, తమకు నచ్చిన వ్యాపారాన్ని ఇంటివద్దనే చేయ గలిగేవారు దీనికి ఖాతాదారులుగా ఉంటారు. మామూలుగా, చిల్లర వర్తకం మరియు తినుబండారాలు తయారుచేసే కార్యకలాపాల వంటి స్వల్ప ఆదాయాన్ని పొందగలిగేవారు మరియు సన్నకారురైతులు గ్రామీణ ప్రాంతాలలో ఉంటారు. పట్టణప్రాంతాలలో సూక్ష్మ వ్యాపార కార్యకలాపాలు ఎక్కువ విభిన్నంగా ఉండి దుకాణ దారులు, సేవలనందించేవారు, చేతివృత్తులవారు/కార్మికులు, వీధి వెంబడితిరిగి అమ్ముకునే చిల్లర వ్యాపారులు మొదలైనవారు కలిగి ఉంటారు. సూక్ష్మ ఆర్ధిక సహాయాన్ని పొందే ఖాతాదారులెవరంటే, బీదవారు, అంతేగాకుండా ఇతరులతో పోలిస్తే, పేదవారుకానటువంటి కొంత నిలకడైన ఆదాయ వనరులు ఉండి హానికి లోనయ్యేవారు.
అనేక కారణాలవలన, సాంప్రదాయ ఆర్ధిక సంస్థల అందుబాటు నేరుగా ఆదాయంతో సంబంధం కలిగి ఉంటుంది. మీరెంత పేదవారైతే, మీకు అంత తక్కువ ఆర్థిక సహాయం అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. మరొక వైపు, మీరెంత పేదవారైతే మీకంత ఎక్కువ ఖర్చు అయ్యే లేదా బరువు బాధ్యతలతో కూడిన అంశాలు ,అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అటువంటి ఏర్పాట్లు కొన్ని ఆర్ధిక అవసరాలను తీర్చడానికి తగినవిగా ఉండవు లేదా ఒక్కొక్కసారి ఏ విధంగానైనా మిమ్మల్ని మినహాయించవచ్చు. ఇందులో వ్యక్తులు మినహాయింపబడి, సేవామార్కెట్ శాఖ కింద పనిచేస్తున్న వారు సూక్ష్మ ఆర్ధిక సహాయానికి ఖాతాదారులుగా ఉంటారు.
సూక్ష్మ ఆర్ధిక సహాయం చేసే అన్నిరకాల సేవలను విశాలమైన దృక్పధంతో చూస్తే, మార్కెట్ అవకాశంగల ఖాతాదారులు కూడ విస్తరింపబడతారు. ఉదాహరణకి, వివిధ రకా లైన పొదుపు ఉత్పత్తులు, చెల్లింపు లు, పంపిన పైకము సేవలు, వివిధ రకాలైన బీమా ఉత్పత్తులు కలిగి ఉండే వివిధ రకా లైన ఆర్ధిక సేవలకన్నా సూక్ష్మ ఋణానికి మార్కెట్ లో అవకాశం తక్కువ పరిమితిలో ఉండవచ్చు. ఉదాహరణకి, చాలామంది పేదవారైన రైతులు నిజానికి అరువు తెచ్చుకోవడానికి ఇష్టపడకపో వచ్చు కాని తమ పంటల నుండి వచ్చే ఆదాయాన్ని దాచడానకి సురక్షితమైన ప్రదేశం కావాలి. ఎందుకంటే, నిత్య జీవితావసరాలకు చాలా నెలలవరకు ఇవి ఉపయోగపడతాయి.
సూక్ష్మ ఆర్ధిక సాయం పేదల ఆదాయాన్ని పెంచేదిగానూ, క్లిష్ట పరిస్థితులను అధిగమించి వ్యాపారంలో నిలద్రొక్కుకొనేలా చేసేదిగానూ, బయటివారి నుండి కలిగే ఇబ్బందు ల నుండి వచ్చే నష్టాలు తగ్గించేదిగానూ దోహదపడుతుందని మన అనుభవం తెలుపుతోంది. అంతేగాకుండా పేదల స్వశక్తిని పెంచే శక్తివంతమైన సాధనంగాను ముఖ్యంగా స్త్రీలను ఆర్ధికంగా శక్తిమంతులుగా చేయడంలోనూ ఈ సూక్ష్మ ఆర్ధిక సాయం మార్పు తీసుకురావచ్చు.
పేదరికం చాలా క్లిష్ట మైనది. ఆర్ధిక సేవలను అందుబాటులోనికి తీసుకురావడం ద్వారా, అన్ని కోణాల లోను పేదరికాన్ని ఎదుర్కోవడంలో సూక్ష్మ ఆర్ధిక సాయం ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఉదాహరణకి, వ్యాపారంలోని ఆదాయఉత్పత్తి, వర్తక కార్యకలాపాలను విస్తృతపరచడంలో దోహదపడడమే కాకుండా, ఇంటి ఆదాయానికి మరియు కుటుంబాన్నిపోషించే వ్యక్తికి ఆహార భద్రతను కల్పించి లాభాన్నికల్గించడమే గాక , వారి పిల్లల చదువుకు సాయం కూడా చేస్తుంది. అంతేకాకుండా, చాలా సందర్భాలలో బయట ప్రదేశాల నుండి వేరుగా ఉంచే స్త్రీలకు, వారు ప్రామాణిక సంస్థలతో లావాదేవీలు చేయడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం , బలం వస్తుంది .
దారిద్ర్యరేఖకు దిగువనున్న వారిలో దినసరివేతనం పొందేవ్యక్తికి జబ్బుచేయడం, వాతావరణ పరిస్థితులు, సొమ్ము దొంగలింపబడడం, లేదా ఇతర ఇటువంటి కారణాలవల్ల వారి జీవన సరళిలో తల్లడిల్లి పోయే ఇబ్బందులు ఎంతవరకు కలుగుతున్నాయో ఇటీవలి పరిశోధనలవల్ల తెలుస్తున్నది. దీనివలన పరిమిత ఆర్ధిక వనరులు గలవారి కుటుంబంలో భారీ ఎత్తున కోలుకోలేని నష్టం ఏర్పడుతోం ది. పటిష్ట మైన ఆర్ధిక సేవలు లేక పోవడం, మరింత పేదరికంలో కూరుకు పోయి, దానినుండి యధాస్థితికి రావడానికి వారికి చాలకాలం పట్టవచ్చు.
ప్రత్యేకమైన లక్ష్యంతో ఆత్మీయతా భావనతో, స్వచ్చందంగా పదిహేను నుండి ఇరవై మంది సభ్యుల తో ఏర్పడే చిన్న బృందాన్నే స్వయం సహాయక బృందమని అంటారు. ఈ బృంద సభ్యులు పొదుపు చేయడంలోను, ఋణాలు పొందడంలోనూ, ఆంతేగాకుండ సామాజిక సేవలలోనూ బలోపేతమైన సాధనంగా కలసి పని చేస్తారు.
పొదుపు చేయడం మరియు ఋణాలనివ్వడం వంటి కార్యకలాపాలు. బృందాల పర్యవేక్షక నిర్వహణ పాత్ర.
బృంద స్థాయిలో పేదరికాన్ని తగ్గించే ప్రణాళికలను అమలు చేయడం
ఆర్ధికంగా పేదరికంలోఉన్న వ్యక్తి బృందంలోని వ్యక్తిగా శక్తివంతమౌతాడు. అంతేకాకుండా, బృందం ద్వారా ఋణా లివ్వడం వలన, జరిగే ఆర్ధిక లావాదేవీల కయ్యే ఖర్చు అప్పు ఇచ్చేవారికీ మరియు అప్పుతీసుకొనేవారికి కూడా తగ్గుతుంది. పెద్ద సంఖ్యలో చిన్న పరిమాణంగల వ్యక్తిగత అకౌంట్లు బదులుగా అప్పుఇచ్చేవారు ఒకే ఎస్ హెచ్ జి అకౌంట్ నిర్వహిస్తున్నప్పుడు, ఎస్ హెచ్ జి లో భాగంగా అప్పుఇచ్చేవారు పేపరు వర్కు పూర్తి చేయడానికి, రాకపోకలకూ అయ్యే ఖర్చులు (శాఖ మరియు ఇతర ప్రదేశాల కు/నుండి) మరియు అప్పు ల వసూళ్ళ కొరకు నష్ట పోయే పనిదినాలకి అయ్యే ఖర్చులు తగ్గించవచ్చు.
బీదప్రజలకు సులభమైన, సరళమైన విధానంలో బ్యాంకింగ్ సౌకర్యాలను అందచేసే దృష్టితో, స్వయం సహాయక బృందాలతో బ్యాంకులను అనుసంధానం చేయడం ద్వారా, సూక్ష్మఋణాలను సమకూర్చడానికి 1991-92 సంవత్సరంలో నాబార్డ్ చేత మార్గదర్శక పథకంగా ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ అనుసంధాన కార్యక్రమంలో, చురుకుగా పాల్గొనేటట్లుగా వాణిజ్య బ్యాంకులకు భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్ బి ఐ) సలహానిచ్చింది. ఆర్ ఆర్ బి లకు, సహకార బ్యాంకులకు కూడ ఈ పథకం అప్పటి నుండి విస్తరింప బడుతోం ది.
నిఘంటువు ప్రకారం ఫెడరేషన్ అంటే, “ఉమ్మడి ప్రయోజనాలను చూసే స్వతంత్ర ప్రతిపత్తిగల కూటమి”. “ఉమ్మడి ప్రయోజనాలను చూసే స్వతంత్ర ప్రతిపత్తిగల ఐక్య సంఘం”. (ఎఫ్ డబ్ల్యు డబ్ల్యు బి,1998).
ఈ ఫెడరేషన్ , ప్రాథమిక నిర్వాహక సంస్థలతో కూడినది. ఆర్ధిక వ్యవస్థల అవసరాన్ని గుర్తించి లేదా ఒక ఆసక్తిగల బృందంలా బలాన్ని పొందడానికి ప్రాథమిక సంస్థలు కలువవచ్చు. సహకార కూటము లకు ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. (నాయర్ 2002).
ఫెడరేషన్ లోని సముదాయపు (క్లస్టర్) స్థాయి అంటే అనేకమైన ఎస్ హెచ్ జి ల కలయిక మరియు స్వయం సహాయక బృంద సభ్యులకు మద్దతునిచ్చే ఉద్దేశంతో, స్వయం సహాయక బృందాల ప్రతినిధులతో ఏర్పాటైన నిర్మాణాత్మక కూటమి. ఆర్ధికం గాను మరియు సామాజికం గానూ ఆ మహిళా సభ్యులను బలోపేతం చేయడమనే లక్ష్యాలతో ఎస్ హెచ్ జి పని చేస్తుంది. (టిఎన్ సిడి డబ్ల్యు1999).
ఇతర పదాలలో, ఇది ఆర్ధిక, మరియు సామాజిక అవసరాల ఆధారంగా సమగ్రమైన అభివృద్ధి సాధించే, ఎస్ హెచ్ జి సభ్యుల సమిష్టి కృషి ప్రయోజనాన్ని తీసుకుని మహిళా సభ్యుల అభివృద్ధి కొరకు ఎస్ హెచ్ జి లు ఏర్పరిచిన మరొక వేదిక. ఎస్ హెచ్ జి కూటమి అనేది నిర్దుష్టమైన భౌగోళిక ప్రాంతంలో, ఉమ్మడి కారణం కొరకు అటువంటి ఎస్ హెచ్ జి లని కలిపే లక్ష్యంతో ఏర్పడిన డెమోక్రేటిక్ బాడీ మరియు ప్రత్యేక మైన ఒక ఎస్ హెచ్ జి సాధించలేని ఈ ఉమ్మడి ఫలితాలని సాధించడానికి ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎస్ హెచ్ జి కూటమి తప్పనిసరిగా ఎస్ హెచ్ జి యొక్క, ఎస్ హెచ్ జి ద్వారా మరియు ఎస్ హెచ్ జి కొరకై ఏర్పడి ఉండాలి.
కింద పేర్కొన్న ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ లక్ష్యాలతో కూటము లు ఏర్పాటవుతాయని గత అనుభవాలు తెలియ చేస్తున్నాయి:
పేరులో సూచించినట్లు, నాణ్యతా నిర్ధారణ (క్యు ఎ) అంటే ప్రతిపాదింపబడిన సేవలను అందించే సంస్థల నాణ్యతా పనితీరును అంచనా వేయడం. సూక్ష్మ ఆర్ధిక సాయంలో, స్వయం నిర్వాహక సూక్ష్మ ఆర్ధిక సంస్థ (ఎస్ ఎమ్ ఎఫ్ ఐ లు)ల గురించి ప్రస్తావిస్తే , వీటి రూపకల్పన, నిర్మాణం, పనితీరు యొక్క సమగ్ర మూల్యాంకనాన్ని ఎస్ ఎమ్ ఎఫ్ ఐ లు నాణ్యతా నిర్ధారణ కలిగి ఉన్నాయి.
అపరిపక్వ దశ/: చిన్నిపాటి ఎస్ ఎమ్ ఎఫ్ ఐ లకి వేగవంతమైన నాణ్యతా నిర్దారణ కావలసి రావచ్చు. ఇది ఎస్ డబ్ల్యూ ఒ టి విశ్లేషణ చేస్తే తప్ప , పూర్తి నిర్దారణ కాదు. వేగవంతమైన నాణ్యతా నిర్దారణ, ఈ కార్యక్రమం యొక్క స్థితిని, కవరేజ్ & కన్వెర్జెన్స్ లో సమస్యలని అర్థంచేసుకుని మరియు వదిలివేయ బడిన వాటిని గుర్తించి సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుంది.
ఈ కింది ఉద్దేశాల కోసం నాణ్యతా నిర్ధారణ (క్యుఎ) ను చేయవచ్చు.
ఏపిమాస్ ద్వారా రుసుముతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బ్యాంకులు మరియు ఇతర ఎస్ హెచ్ పి ఐ(స్వయం సహయకాభివృద్ధి సంస్థ) లు, ఎస్ హెచ్ జి సంయుక్త కూటములు (ఫెడరేషన్లు) /ఎమ్ ఎ సి ఎస్ లు నాణ్యతా నిర్ధారణను చేయడం జరుగుతున్నది.
నాణ్యతా నిర్ధారణ ప్రక్రియలో తీవ్రమైన మరియు విస్తృతమైన సమాచార సేకరణకి ప్రోత్సాహపరిచే సంస్థల ముఖ్యమైన సిబ్బందితో కూడిన మీటింగులను, కింది స్థాయిలో పనిచేస్తున్న నియామకులను సందర్శించడం మరియు సంబంధిత ఎస్ ఎమ్ ఎఫ్ ఐ చేత వ్రాస్తున్న పుస్తకాలను & రికార్డులను సమీక్షించడం, ఉన్నాయి. అంచనాలు ఎక్కువ భాగస్వామ్య పధ్ధతిలో ఉండి, ప్రోత్సహించే సంస్థ సిబ్బంది కూడా ఇందులో పాలుపంచుకుంటారు. ఎస్ హెచ్ జి కూటమి యొక్క ఉన్నత స్థాయి యాజమాన్యం (బోర్డ్) వారితో సన్నిహితత్వాన్ని పెంచుకోవడం, సంయుక్త కూటమి పనితీరుపై, కార్యనిర్వాహక సభ్యులకు, బోర్డ్ సభ్యుల కు మరియు సిబ్బంది చేత చిన్న బృందాల మధ్య చర్చను మరియు ప్రెజంటేషన్ లను కల్పించడం, అంచనా వేయడంలో ఉంటాయి. క్షేత్ర నిర్దారణలో ఆఖరిరోజున కూటమి బోర్డ్ సభ్యులతో సంక్షిప్త సమావేశా లను ఏర్పాటు చేస్తుం ది. ఎక్కడైతే ఎస్ హెచ్ జి సంయుక్త కూటమి మూడు విభాగాలలో సంయుక్త కూటమికన్నా అదనంగా ఉంటుందో అక్కడ రెండు గుంపు/ గ్రామ నిర్వాహక సంస్థల అంచనావేయ బడుతుంది.
నిర్వహణ ఖర్చులను రాబట్టే, నిశ్చితమైన ఖర్చు మరియు ఋణాలనష్టానికి జాగ్రత్తపడే సామర్ధ్యాన్ని కొలిచేది “స్వయంచాలిత నిర్వహణ (ఒ ఎస్ ఎస్)”. నిర్వాహక ఖర్చులకి సంబంధించిన జీతాలు, ప్రయాణ ఖర్చులు, పరిపాలన, విలువలో తగ్గుదల, ధరల కాలావధులను బట్టి వడ్డీ చెల్లింపులు, ఋణాల నష్టాలు సంయుక్త కూటమి యొక్క నిర్దారణ బృందం ఆర్దిక వివరాలను ఇది ప్రతిఫలిస్తుంది. నిర్వాహక ఆదాయాన్ని నిర్వాహక వ్యయాలను భాగించడం ద్వారా ఒఎస్ఎస్ గణించ బడుతుంది.
జమాఖర్చులతో నిధుల వ్యయం, నిధుల లభ్యత మార్కెట్ (వ్యాపార) ధర ద్వారా, ఫెడరేషన్ మొత్తం నిధుల అవసరానికి, ఎఫ్ ఎస్ ఎస్ సంస్థ నిధుల అవకాశాన్ని కలిగి ఉంటుం ది. ఆదాయ నిర్వహణ ను, మొత్తం సర్దుబాటు చేసిన నిర్వాహక ఖర్చుతో భాగించడం ద్వారా ఎఫ్ ఎస్ ఎస్ గణింపబడుతుంది. సర్దుబాటు చేసిన మూలధనం గణించడానికి, అంతకు ముందు సంవత్సరం ద్రవ్యోల్బణ రేటుకి రొక్కం మరియు ఇతర చరాస్తులు సర్దుబాటు చేసి మరియు తీసుకువచ్చిన మార్కెట్ ధరకు వడ్డీని పరిగణిస్తారు
సంయుక్త కూటముల యొక్క సమర్ధతను నిర్వాహక వ్యయ నిష్పత్తి (ఒ సి ఆర్) అంచనా చేస్తుంది. అత్యధిక ఒ సి ఆర్, ఫెడరేషన్ అతివ్యయాన్ని చేస్తున్నట్లుగా మరియు దానికి కేటాయించిన విధిని తగినంతగా విస్తరించలేక పోతుందని సూచిస్తుంది. అల్ప నిష్పత్తి, పెద్ద ఎత్తున వ్యాపార లావాదావీలు అల్పవ్యయంతో చేసే సామర్ధ్యం కలిగి ఉన్నదని సూచిస్తుంది. ఫెడరేషన్ యొక్క ఒ సి ఆర్ 5-10 శాతం మధ్య కలిగి ఉండి, దాని ని మించకుండా ఉండాలి. జీతాలు, కమీషన్, విలువలో తగ్గుదల, ప్రయాణ వ్యయం, కార్యాలయ ఖర్చులు , బీమా, లెక్కల తనిఖీ రుసుము వంటి పరిపాలనా ఖర్చులు నిర్వహణ వ్యయంలో ఉంటాయి. అలాగే వడ్దీ చెల్లింపులు, ఋణ నష్టాలకు ముందుగానే చేసిన ఏర్పాట్లు మినహాయించి ఉన్నటువంటి అర్ధిక వ్యయా లుంటాయి. గత సంవత్సర మొత్తం నిర్వహణ ఖర్చులతో గత సంవత్సర సగటు ఋణాన్ని భాగించడం ద్వారా, ఒ సి ఆర్ గణింపబడుతుంది.
విపత్తు విభాగం (పి ఎ ఆర్) ఫెడరేషన్లలో ఉన్న చురుకైన విభాగంతో ఉన్న ప్రమాదాన్ని కొలుస్తుంది. ఎక్కువ పార్ (పి ఎ ఆర్), నాణ్యత స్వల్పమని మరియు భవిష్యత్తులో ప్రమాదం ఎక్కువుంటుందని సూచిస్తుంది. మామూలుగా 90 రోజుల కన్నా ఎక్కువ ఉన్న బకాయిలను పార్ లెక్కిస్తుం ది. పోర్టుపోలియో అంటే ఫెడరేషన్ యొక్క అన్ని ఋణాలనిచ్చే ఉత్పాదనలలో రావలసిన మొత్తం. ఫెడరేషన్ సూక్ష్మ ఆర్ధిక సహాయ నిర్వహణలలో పెద్ద మొత్తాన్ని చేసే ఒక ముఖ్యమైన ఆస్తి. 90 రోజులను మించి ఉన్న బకాయిలను మిగిలి వున్న ప్రధాన ఋణ భాగాన్ని మిగిలి ఉన్న పోర్టుపోలియో విభజించి 90 రోజుల పార్ ను,లెక్కిస్తారు.
క్యాపిటల్ అడక్వేట్ రేషియో ఫెడరేషన్ యొక్క అప్పు తీర్చే శక్తిని సూచిస్తుంది. అవసరమైతే స్వయంగా పెట్టిన మూలధనం నుండి ఆస్తి విపత్తు సేవలకు కావలసిన సామర్ధ్యాన్ని చూపడం ద్వారా సూచిస్తుంది.
ఆధారము: http://shggateway.in/