డిశంంబరులో వచ్చిన వరాల కారణంగా వరి మాగాణుల్లో అపరాల పంటలు దెబ్బతిన్నవి. ఆదశలో నువ్వులను ప్రత్యామ్నాయంగా పండించ వచ్చా

వరి మాగాణుల్లో అపరాలు వీలు కానప్పడు, నువ్వులను మంచి ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకోవచ్చును. అయితే ఈ పంటను మెత్తని దుక్కి చేసుకున్న తరువాత, జనవరి నుండి ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవచ్చును.

నువ్వులలో తెల్లగింజ మరియు గోధుమ / నలుపు గింజ రకాలున్నాయా. వాటిలో ఏవి అధిక దిగుబడి నిసాయి.

సాధారణంగా తెలంగాణా జిల్లాలకు తెల్లగింజ రకాలైన రాజేశ్వరి, శ్వేతాతిల్ (80-85 రోజులు) రకాలు లేట్ ఖరీఫ్ అంటే జులై 15 నుండి ఆగష్టు 15 వరకు అలాగే లేట్ రబి/ వేసవిలో జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు వేసుకొనేందుకు అనుకూలంగా ఉంటాయి. కోస్తా ప్రాంతాలకు గౌరి (85-90 రోజులు) మాధవి (70-75 రోజులు) యలమంచిలి (11, 17 (80-85 రోజులు) రకాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలను ఎర్లీ ఖరీఫ్ అంటే మే నెలలో, లేట్ రబీ / వేసవి అంటే డిశంబరు ఆఖరి వారం నుండి జనవరి చివరి వరకు వేసుకోవాలి. ఇవి నలుపు / గోధుమ రంగుగింజ రకాలు. కోడు ఈగ ఉధృతి ప్రాంతాలకు గౌరి రకం అనుకూలంగా వుంటుంది. తెల్లగింజ రకాలు అధిక నూనె శాతాన్ని కలిగి వుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అనువుగా వుంటాయి. తెల్లగింజ రకాలకు మార్కెట్లో ధర కూడా ఎక్కువగా పలుకుతుంది.

నువ్వులను ఏక పంటగానే సాగు చేయాలా. అంతర పంటగా కూడా వెయ్యవచ్చునా.

అధిక వరాభావ పరిస్థితులలో నువ్వులు + జొన్న 3:1 నిష్పత్తిలో, ସିଂର୍ଷ୦°ର୍ତ୍ତ వర్షపాతం పరిస్థితులలో నువ్వులు + వేరుశనగ 4:2 నిష్పత్తిలో సాగు చేయడం లాభదాయం. ఈ విధానం ముఖ్యంగా తెలంగాణా ప్రాంతాల్లోని చల్కా నేలలకు బాగా వర్తిస్తుంది. కోస్తా జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో నువ్వులు + కంది కూడా వేసి రైతులు లాభాలు పొందుతున్నారు. నువ్వుల పైరు తొలి దశలో నెమ్మదిగా ఎదుగుతుంది కాబట్టి అంతరపంటల విధానం ద్వారా పంట భూమిని, కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ అంతరపంటల నువ్వులో కోడు ఈగ, ఆకు ముడత, కాయతొలుచు పరుగుల ఉధృతి తగ్గుతుంది.

అధిక వరాలకు దెబ్బతినకుండ నువ్వులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

భూమిలో ఏ మాత్రం తేమ ఎక్కువైన నువ్వులో పూత, పిందె రాలడం, మొక్కలు కూడా ఎర్రబడి పంటకు చాలా నష్టం జరుగుతుంది. కావున ఈ పరిస్థితుల్లో మురుగునీటి సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. పై పాటుగా ఎకరానికి 15 కిలోల యూరియాను బూస్టర్ డోసుగా వేయాలి. లేదా 2 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా పంటను కొంత వరకు కాపాడుకోవచ్చును.

నువ్వులలో ఆకు గూడు మరియు కాయ తొలుచు పరుగుల నివారణ ఎలా.

ఖరీఫ్ తొందరగా వేసిన పంటకు ఈ పురుగు తక్కువగా ఆశిస్తుంది. నివారణకు ఎండోసల్బాన్ 2.0 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి రెండుమార్లు పిచికారీ చేయాలి.

నువ్వుల్లో పూత రాలి పోతుంది. ఏం చేయాలి. లేదా నువ్వుల్లో గాల్ పై నివారణ ఎలా.

సెప్టెంబర్ - నవంబరు మాసాల్లో ఈ పురుగు పూ మొగ్గలను, పూలను ఆశించటం వల్ల పూభాగాలు గాల్స్గా మారి పాలిపోయి, రాలిపోతాయి. నివారణకు గాల్స్గా మారిన భాగాలను తృంచాలి. రాలి పోయిన మొగ్గలను, పువ్వులను ఏరి నాశనం చేయాలి. మొగ్గల ఏర్పడే సమయంలో మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

నువ్వుల్లో మిడతలు నష్టం చేస్తున్నాయి? ఏం చేయాలి.

మిడతల ఉధృతి ఎక్కువగా వుంటే ఎండోసల్ఫాన్ 4 శాతం లేదా కార్బరిల్ 5 శాతం లేదా మిథైల్ పెరాథియాన్ 2 శాతం పొడి మందును ఎకరానికి 10 కిలోలు చల్లి వాటి వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు.

నువ్వుల్లో వేరుకుళ్లు మరియు కాండం కుళ్ళు ఎలా నివారించాలి.

తెగుళ్ళను తట్టుకొనే రకాలైన రాజేశ్వరి, శ్వేతాతిల్ లను సాగు చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. మిగిలిన వాటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆధారం: apagrisnet.gov.in