వాతావరణ అనుకూల పంటలు వేద్దాం.. ఎల్నినో ప్రభావం నుండి బయటపడదాం.. - వ్యవసాయశాఖ, తెలంగాణ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం! భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశం ఉంది. రైతులు ముందస్తు ప్రణాళికతో పంటల ఎంపిక చేసుకోవడం అవసరం. ఎల్నినో అంటే ఏమిటి? ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితి. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. ఎల్నినో వల్ల ఏమి జరుగుతుంది? వర్షపాతం తగ్గే అవకాశం వేడి తరంగాలు పెరిగే అవకాశం భూగర్భ జలాల రీఛార్జ్ తగ్గే అవకాశం ఖరీఫ్ పంటలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు దిగుబడులు తగ్గే అవకాశం ఉంది తెలంగాణలో వానాకాలం 2026 పరిస్థితి జూన్ నెలలో : సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం జూలై - ఆగస్టు నెలల్లో : పొడి విరామాలు రావచ్చు వర్షాల పంపిణీలో అసమానతలు ఉండవచ్చు కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చు తెలంగాణలో వర్షపాత అంచనా : ఉత్తర తెలంగాణ : సాధారణం కంటే తక్కువ వర్షపాతం - ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్. మధ్య తెలంగాణ : సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం - సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం. దక్షిణ తెలంగాణ : సాధారణం కంటే తక్కువ వర్షపాతం - హైదరాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేద్దాం : కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు వరి రైతులకు ప్రత్యేక సూచన : జూలై 15 వరకు సరిపడా వర్షాలు లేకపోతే 125 రోజుల లోపు పండే స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకోండి రైతులకు ముఖ్య సూచనలు : వర్షాల పరిస్థితిని గమనించి విత్తనాలు వేయండి ఒకే పంటపై ఆధారపడవద్దు పంట వైవిధ్యీకరణ చేపట్టండి తక్కువ కాలంలో పండే రకాలను ఎంచుకోండి నీటి సంరక్షణ చర్యలు చేపట్టండి వ్యవసాయ శాఖ సూచనలు పాటించండి రైతు మిత్రులారా... ఎల్నినో ప్రభావం వల్ల వర్షాల పంపిణీలో మార్పులు, పొడి విరామాలు, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఒకే పంటపై ఆధారపడకుండా కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి ప్రమాదాన్ని తగ్గించుకుందాం. పంట వైవిధ్యీకరణ చేపడదాం.. ఎల్నినో ప్రభావాన్ని తగ్గిద్దాం.. ఆధారం - వ్యవసాయశాఖ, తెలంగాణ ప్రభుత్వం పాడిపంటలు మాసపత్రిక