అరికలు లేదా కోడో మిల్లెట్ మన దేశం లో ఆవిర్భవించిన చిరు ధాన్యాలలో ఒకటి. ఈ పంట ఉష్ణమండల ప్రాంతాలలో అధికంగా పెరుగుతుంది. మన దేశంలో మధ్యప్రదేశ్,చ్చత్తీస్గఢ్,ఉత్తర్ ప్రదేశ్,తమిళనాడు,మహారాష్ట్ర,కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రంతాలలో ఈ పంట ఎక్కు వ గా పండిస్తారు. ఈ పంట దేశంలో షుమారుగా 2.44 లక్షల హెక్టర్ లో(2005-06) విస్తరించి, హెక్టర్ క్క 312 kg వరకు దిగుబడిని ఇస్తుంది. అరికల్లో మిగతా ధాన్యాల తో పోలిస్తే అనేక పోషక విలువలు ఉంటాయి. వీటిలో37–38 శాతం పీచు పదార్థం (Dietary fibre) ఉండటం వలన సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహింది. ఇతర ఉపయోగకరమైన కొవ్వులు (PUFA) మరియు కాల్షియమ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మరియు జంక్ వంటి లవణాలు మరియు విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే లెసిథిన్ (lecithin) అనే కొవ్వు పదార్థం నాడీ వ్యవస్థని చురుకుగా పనిచేసేందుకు దోహదపడుతుంది. రోజు వారి ఆహారం లో అరికలన్న వాడటం వల్ల హృదయ సంబంధిత రోగాలను, అధిక రక్తపోటును నియంత్రించవచ్చును.అరికలు తక్కువ నేల స్తరాన్నిమరియు నీటి ఎద్దడి తట్టుకొని పెరగడం వలన అవి ఎలాంటి నేలలో ఐనా మంచి దిగుబడి ఇవ్వగలవు. అరిక పంట సాగు లో పాటంచవలసిన మెళకువలు వాతావరణం - అరికలు అధిక ఉష్ణోగ్రత ని తట్టుకొని పెరగగలవు. ఐతే పంట కు 26 -30° సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలమైనది. పంట కాలంలో సుమారు 25 -30 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది. ఎక్కువ తడులు ఇచ్చిన లేదా 50-60 సె.మీ. వర్షపాతం ఉన్నట్లయితే మంచి పంట దిగుబడిని ఆశించవచ్చు. నేలలు - అరికలు ఎలంటి నెలల్లో ఐనా పండించవచుు. తేలికపాటి ఇసుక నేలలు, ఎర్ర నేలలు మరియు నల్లరేగడి నేలలు కూడా అరిక పంట కు అనువైనవే. నీరు నిలబడి ఉండే నేలలో మాత్రం ఈ పంట సాగుకు పన్నకి రావ్వ. పొలన్ని సార్లు వ్యతిరేక దిశలో దుక్కి చేసి మట్టిని మెత్తటి పొడిలా చేసుకున్నట్లైతే కలుపు ని నియంత్రించవచ్చును. విత్తనాలు, విత్తే సమయం, విత్తిన శుద్ధి - అరికలు జూన్ మధ్య నుండి జూలై నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. మంచి పంట కోసం జూన్ నెల రెండవ పక్షంలో విత్తడం శ్రేయస్కరం. స్థలాల్లో వేసుకోవడానికి హెక్టర్ కు 5 -6 కేజీలు మరియు వెదజల్లడానికి 8 -10 కేజీల విత్తనం అవసరం.స్తళకిె మధా 25 సె. మీ. మరియు మొక్కకి మధ్య 10సె. మీ. దూరం ఉన్నట్లు చూసుకోవాలి.విత్తనాన్ని కార్బెన్డజిమ్లే లేదా క్లోరోఠాలోనిల్ @ 2 గ్రా./కేజీ విత్తనం తో విత్తన శుద్ధి చేయడం వలన నెల ద్వారా సంక్రమించే వ్యాదులను నివారించవచ్చును. ఎరువులు మరియు నీటి యాజమాన్యం - పంటకు పశువుల ఎరువు వెయ్యడం శ్రేష్టం . ఇది రసాయనిక ఎరువుల మోతాదు తగ్గిస్తుంది. అఅరికాల్లో ఎరువులు మోతాదు ముఖ్యమైన సాగు చేసే రాష్ట్రాలకు వేరు వేరుగా ఉన్నాయి. హెక్టర్ కు తమిళనాడులో 40 కేజీల నత్రజని మరియు 20కేజీల భాస్వరం; మధ్య ప్రదేశ్లో 20 కేజీల నత్రజని మరియు 20కేజీల భాస్వరం; ఈశాన్య రాష్ట్రాలు 60 కేజీల నత్రజని 30కేజీల భాస్వరం మరియు 30కేజీల పొటాష్ ; ఆంధ్ర ప్రదేశ్ మరియు ఇతర సాగు చేస్తే రాష్ట్రాలు 20 కేజీల నత్రజని, 20కేజీల భాస్వరంమరియు 20కేజీల పోటాష్ సిఫార్సు చేయబడ్డాయి. అరికలు వర్షాధార పంట. నీటి పారుదల సదుపాయం ఉంటే పంట కాలం మధ్యలో 2 -3 తడులు ఇచ్చినట్లయితే మంచి దిగుబడి పొందవచుు. కలుపు యాజమాన్యం - గడ్డి జాతి మరియు వెడల్పు జాతి మొక్కలను గడ్డపార సహాయం తో తీసివేయాలి . 2-3 సార్లు కలుపు తీయడం వలన కలుపుని పూర్తిగా నియంత్రించవచ్చు . విత్తన వెంటనే ఐసోప్రోటూరోన్ ఎకరాకు 400 గ్రా., చొప్పున పిచికారీ చేయాలి. పంట మార్పిడి మరియు అంతర పంటలు - అంతర పంటలుగా కంది,పెసర,మినుము,సోయాబీన్ వంటి పంటలను 2:1 నిష్పత్తి లో వేయవచ్చును. సోయాబీన్/ఒడిసలును అరికల తో పంట మార్పిడి చేయడం ద్వారా మంచి పంట దిగుబడులు ఆశంచవచుు. పురుగులు మరియు తెగుళ్లు మొవ్వు తెగులు: ఇది సోరోస్పోరియం పసిపాలితున్బర్జి ని అనే వలన సిలింద్రం సోకుతుంది. ముఖ్యం గా వ్యాధిసోకినా విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్న లేదా పంట కోత కు ముందు వర్షం తో తడిసిన ఈ సిలింద్రం వృధి చెందుతుంది. విత్తనాన్ని క్లోరోటలోల్లే లేదా మాంకోజెబ్ @ 2 గ్రా./ కేజీ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. కండం తొలుచు పురుగు: పంట ను ముందు గా నాటుకోవడం ద్వారా ఈ పురుగు బెడద ను నివారించవచు. అరికలలో ఎక్కువ దిగుబడినిచ్చే రకాలు రకం దిగుబడి q/ha రకానికి కు సిఫార్సు చేయబడిన రాష్ట్రాలు Dahod Kodo 1 (CKMV 3) 30 ఆంధ్రప్రదేశ్, చ్చత్తీస్గఢ్,ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు CKMV 1 (ATL 2) 28 ఆంధ్రప్రదేశ్, చ్చత్తీస్గఢ్,ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు,గుజరాత్,కర్ణాటక,తెలంగాణ CKMV 2 (GAK 3/Dahod Kodo) 25 ఆంధ్రప్రదేశ్, చ్చత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు KMV-543 25-27 ఆంధ్రప్రదేశ్, చ్చత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు,ఝార్ఖండ్,కర్ణాటక Jawahar Kodo 137 26-29 మధ్యప్రదేశ్ RK 390-25 25 - 28 అన్ని రాష్ట్రాలు TNAU 86 27- 30 అన్ని రాష్ట్రాలు INDIRA KODO1 22- 25 చ్చత్తీస్గఢ్ DPS 9-1 26- 28 మధ్యప్రదేశ్ JK 98 25- 30 మధ్యప్రదేశ్ JK 36 10- 12 మధ్యప్రదేశ్ JK 65 25 - 30 అన్ని రాష్ట్రాలు JK 106 19 - 20 మధ్యప్రదేశ్ JK 13 22 - 30 అన్ని రాష్ట్రాలు JK 439 22 - 2 మధ్యప్రదేశ్,చ్చత్తీస్గఢ్ KK 2 20 - 23 ఉత్తరప్రదేశ్ JK 48 26 - 27 అన్ని రాష్ట్రాలు JK 155 (RBK 155) 20 - 22 మధ్యప్రదేశ్,కర్ణాటక KK1 (ICK 7125) 18 - 20 ఉత్తరప్రదేశ్