మొక్కజొన్న ఆహార పంటలలో చాలా ముఖ్యమైన పంట, మన రాష్ట్రంలో మొక్కజొన్నపంటను చాలా ప్రదేశాల్లో వర్షాధారంగా వానాకాలంలో, నీటి పారుదల కింద ఆరుతడి పంటగా యాసంగిలో సాగు చేస్తూ ఉంటారు. మొక్కజొన్న పంట చాలా సున్నితమైన పంట. ఈ పంటకు సరైన సమయంలో ఎరువులను వేయకపోతే పోషక లోపాలు ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్, జోరాన్ వంటివి పంటపైన కనిపిస్తాయి. అంతే కాకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితులో కూడా పోషకలోపాలు వచ్చే ఆస్కారం ఉంది. ఈ లోపాలను సరైన సమయంలో నివారించనట్టైయితే దిగుబడి తగ్గే ఆస్కారం ఉంది. కావున కింద తెలిపిన నివారణ చర్యలు చేపట్టాలి. జింక్ ధాత లోపం వాతారణం చల్లగా ఉన్నపుడు, మొతాదు మించి భాస్వరం ఎరువులను వేసినపుడు, అధిక నీటి ముంపుకు గురైనపుడుఈ జింక్ ధాతులోపం కనబడుతుంది. ఈ ధాతు లోపం వచ్చినపుడు ఆకుల ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు, తెలుపు రంగుగా మారుతాయి. దీని నివారణకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేటు 2-3 పంటలకు ఒకసారి ఆకరి దుక్కిలో వేసుకోవాలి. పంటపై జింక్ లోపం వచ్చినపుడు 2 గ్రా. జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. నత్రజని పోషక ధాతులోపం నత్రజని ధాతులోపం వచ్చినట్లైతే మొదట కింద ఆకులు పసుపు పచ్చగా మారి తర్వాత క్రమక్రమంగా మొక్క మొత్తం పాలిపోయి పసుపు పచ్చ రంగులోకి మారుతాయి. ఈధాతు లోపం చాలా రోజులు కొనసాగితే ఆకు అంచున మొదలువైపు మధ్య ఈనెల గుండ 'వి' ఆకారంలో మొత్తం పసుపు రంగుకు మారి ఎండిపోతుంది. నత్రజని లోపం సరైన తేమ లేనపుడు కాని లేదా ఎక్కువ తేమ ఎక్కువైనపుడు లేదా నేల సారవంతం లేనపుడు వస్తుంది. దీని నివారణకు 2 శాతం యూరియా ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. భాస్వరం ధాతు లోపం నేలలో భాస్వరం లోపించినపుడు లేదా వాతావరణంచల్లగా ఉన్నపుడు లేదా పొలంలో నీరు నిలిచినపుడు ఈ భాస్వరం ధాతు లోపలకనబడుతుంది. ధాతు లోపం వచ్చినపుడు మొక్క పెరుగుదల ఆగిపోయి ఆకులు ఎరుపుతో కూడిన నీలి రంగులోకి మారుతాయి. దీని నివారణకు సిఫారసు చేసిన భాస్వరాన్ని ఆకరి దుక్కిలో తప్పకుండా వేయాలి. పంటపై 2 శాతం డి.ఎ.పి. 4 నుండి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పోటాష్ ధాతు లోపం ఈ ధాతు లోపం ఆమ్ల, చౌడు నేలలో, సారవంతంగాని నేలలో ఎక్కువగాఉన్న నేలల్లో కన్పిస్తుంది. ఈ ధాతులోపం వచ్చినపుడు మొక్క ముదురు ఆకులు చివర్లలో మొదలై అంచుల వెంబడి పసుపు, గోధుమ రంగుకి మారి క్రమంగా ఎండిపోతాయి. దీని నివారణకు సిఫారసు చేసిన పొటాష్ ఎరువును తప్పకుండా వేయాలి. అలాగే పంటపై పోషక నివారణకు 10 గ్రా పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి కలిపి 2 నుండి 3 సార్లు 4 నుండి 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. పోటాష్ ధాతు లోపం ఈ ధాతు లోపం ఆమ్ల, చౌడు నేలలో, సారవంతంగాని నేలలో ఎక్కువగాఉన్న నేలల్లో కన్పిస్తుంది. ఈ ధాతులోపం వచ్చినపుడు మొక్క ముదురు ఆకులు చివర్లలో మొదలై అంచుల వెంబడి పసుపు, గోధుమ రంగుకి మారి క్రమంగా ఎండిపోతాయి. దీని నివారణకు సిఫారసు చేసిన పొటాష్ ఎరువును తప్పకుండా వేయాలి. అలాగే పంటపై పోషక నివారణకు 10 గ్రా పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి కలిపి 2 నుండి 3 సార్లు 4 నుండి 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. బోరాన్ ధాతు లోపం భూమిలో సేంద్రియ కర్బనం లోపించినవుడు, సున్నపు శాతం ఎక్కువైనపుడు, చౌడు నేలలో ఈ ధాతు లోపం కన్పిస్తుంది. ఈ ధాతు లోపం వచ్చిన పంటపై కొత్తగా వస్తున్న ఆకులు చిన్న చిన్నవిగా ఉండి పూర్తిగా విచ్చుకోకుండా కుచించుకుపోయి గుబురుగా, కురచగా కనిపిస్తాయి. దీని నివారణకు 4 కిలోల బోరాక్స్ ఎకరానికి దుక్కిలో వేసి కలియదున్నాలి. పంటపై 1గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఆధారం: పాడిపంటలు , వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్