పశుగ్రాస సజ్జ అనువైన నేలలు : అన్ని రకాల నేలలు అనుకూలం. నీటిపారుదల సౌకర్యం గల నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు అనువైనవి. నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. పొలాన్ని 2-3 సార్లు బాగా దుక్కి చేయాలి. విత్తే సమయం : మాఘీ - సెప్టెంబర్, యాసంగి అక్టోబర్-నవంబర్ లో విత్తుకోవచ్చు. విత్తన మోతాదు : ఎకరానికి 10-12 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తేదూరం : వరుసల మధ్య దూరం 30 సెం.మీ. మొక్కకు మొక్కకు మధ్య దూరం 10 సెం.మీ. రకాలు ఏకకోత రకాలు: పి.సి. -6, పి.సి. -9, సి.ఎస్.వి.30 ఎఫ్. పలు కోత రకాలు: పి.సి.-23, ఎం.పి. చారి ఎస్.ఎస్.జి 59-3, పలు కోత హైబ్రిడ్స్ : సి.ఎస్.ఎచ్.-24, ఎం.ఎఫ్., సి.ఎస్.ఎచ్.-20 ఎం.ఎఫ్. గడ్డి, గింజ రకాలు : సి.ఎస్.వి.-27, పి.ఎస్.వి. -31, పి.ఎస్.వి.-56 బహువార్షికాలు : కో. ఎఫ్.ఎన్.-29, కో.ఎఫ్.ఎస్.-31, సి.వి.ఎస్.33 ఎం.ఎఫ్. రకాలు సాగు చేయవచ్చు. విత్తనశుద్ధి : 3 గ్రా. థైరంతో గాని కాప్టాన్తో గానీ కిలో విత్తనాన్ని విత్తనశుద్ధి చేయాలి. మొవ్వ ఈగ నివారణకు 3 గ్రా. థయోమిథాక్సాం కిలో విత్తనానికి కలిపి పిచికారీ చేయాలి. ఎరువుల యాజమాన్యం ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కిలోల నత్రజని, 16 కిలోల ఫాస్ఫరస్, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. రెండవ దఫా నెల రోజులకు ప్రతి కోత తర్వాత 8 కిలోలు వేయాలి. కలుపు నివారణ : తొలిదశలో కలుపు నివారణకు విత్తిన 24-48 గంటల లోపు అట్రజిన్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసి వెడల్పాకు కలుపును నివారించవచ్చు. కోత సమయం : 50 శాతం పూత దశలో కోయాలి. తర్వాత కోతలు ప్రతి 40 రోజుల వ్యవధిలో పంటను పూత దశకు ముందు కోస్తే పశువుల్లో వాయు వ్యాధి సోకే అవకాశం ఉంది. దిగుబడి ఏకకోత రకాలు నీటి వసతి కింద 18–20 టన్నులు/ ఎకరానికి పలు కోత రకాలు – మొదటి కోతలో 16-18 టన్నులు, తర్వాత కోత కోతకి 8-10 టన్నులు / ఎకరానికి పచ్చిమేత దిగుబడి వస్తుంది. ముడి మాంసకృత్తుల 6-7 శాతం పశుగ్రాసపు సజ్జలో ఉంటాయి. ఆధారం: పాడి పంటలు , వ్యవసాయ పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్.