క్రిటోసిస్ వ్యాధి ముఖ్యంగా అధిక పాలదిగుబడి ఇచ్చే పశువుల్లో వస్తుంది. సంకరజాతి పశువులలో, ముర్రా గ్రేడెడ్ గేదెలలో కూడా ఈ వ్యాధి వస్తుంది. దీనినే అనిటోనివిుయా, ఎండువాతం వ్యాధి హైపోగైసిమియా అనికూడా అంటారు. ఈ వ్యాధి పశువు ఈనిన నెలలోపు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ వ్యాధి మొదటి ఈత పశువులలో కన్నా నాల్గవ ఈతలో ఉన్న పశువులకు ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి వలన పశువుల్లో గూకోజు శాతం తగ్గిపోవడం, కిటోనిమియా, కిటోన్యూరియా కూడా ఉంటుంది. వ్యాధి కారణాలు ఎక్కువగా సైలేజి తినిపించడం, ఇందులో బ్యూటిరిక్ ఆమ్లం అనే కిటోన్ బాడి ఎక్కువగా ఉంటుంది. తక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలు తినిపించడం ముఖ్యంగా ఈనిన తరువాత, పోషకాహార లోపం వలన కూడా వస్తుంది. ఖనిజ లవణాల లోపం ముఖ్యంగా కోబాల్డ్, భాస్వరం. అత్యధిక పాలదిగుబడి ప్రభావం. కాలేయం సరిగా పనిచేయక పోవడం. ధైరాయిడ్ గ్రంది తక్కువగా పనిచేయడం వలన, కొన్ని హార్మోన్ల కొరత వలన ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం గేదెలలో ఎక్కువగా వస్తుంది. దీనినే వేస్టింగ్ ఫామ్ అంటారు. మేత మేయవు, దాణా తినవు కాని చొప్ప తింటాయి. పశువులు చురుకుదనం కోల్పోయి మగతగా ఉంటాయి. శరీర బరువు త్వరగా తగ్గుతుంది. పేడ గట్టిగా వేస్తుంది. అరల పొట్టలో కదలికలు తగుతాయి. పశువు నడక బిగబట్టినట్లుగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత, శ్వాస, నాడి సాధారణంగా ఉంటాయి. చర్మం గరుకుగా, జీవం కోల్పోయినట్లుగా ఉంటుంది. వ్యాధి ముదిరిన కొద్ది శ్వాస, పాలలో తియ్యటి వాసన (కిటోన్ వాసన) వస్తుంది. రెండవ రకంలో సంకరజాతి ఆవులలో నరాల సంబంధమైన లక్షణాలు కనిపిస్తాయి. పశువు గుండ్రంగా తిరగడం, కాళ్ళు అడ్డంగా పెట్టడం, చర్మాన్ని వస్తువుల్ని అతిగా నాకుతాయి. చొంగ అధికంగా కారుతుంది. కండరాలలో వణుకు, గుడ్డితనం, గమ్యంలేకుండా తిరగడం వంటి లక్షణాలు గంట రెండు గంటల వరకు ఉండి, మళ్ళీ ప్రతి ఎనిమిది నుండి పన్నెండు గంటల్లో కనిపిస్తాయి. ఈ దశలో పశువుకు గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. చికిత్స ఇరవై శాతం గూకోజ్ను అర లీటరు నుండి లీటరు వరకు రక్తంలోకి రోజుకు రెండుసార్లు ఎక్కించాలి. గ్లిసరిన్ లేదా ప్రొఫైలిన్ గైకాల్ 225 గ్రా. రోజుకి రెండుసార్లు మొదటి రెండు రోజులు, తరువాత రెండు రోజులు 125 గ్రా. జాగ్రత్తగా పశువుకి త్రాగించాలి. సోడియం ప్రాపయినేట్ 100-200 గ్రా. మూడు రోజులు తినిపించాలి. లాక్లేటులు ముఖ్యంగా (కాలియం, సోడియం, అమెనియం) రోజుకి 200 గ్రా. ఇవ్వాలి. ఇన్సులిన్ సూది మందులు 200-300 యూనిట్లు ఒక్కో పశువుకి ఇప్పించాలి. దీనివలన గూకోజ్ వినియోగం ఎక్కువవుతుంది. కోబాలు, భాస్వరం ఉన్న ఖనిజ లవణాల మిశ్రమం తినే ఆహారంలో వాడాలి. కాల్టికోస్టిరాయిడ్ వంటి ఇంజక్షన్లు ఇప్పించాలి. కిటోనిల్ జల్లు, మెటబొలైట్, కిటోనెక్స్ బోలసలు, ఈ-బూస్టర్ వంటి పదార్థాలను ఇప్పించాలి. నివారణ చర్యలు పశువు మరీ సన్నగా, మరీ లావుగా కాకుండా చూడాలి. ముఖ్యంగా పాల ఉత్పత్తి తగ్గే సమయంలో, పశువు ఈనే సమయంలో అధికంగా వేువకూడదు, ఉవ వానం ఉంచకూడదు. పాడి పశువులకు ప్రతీ రోజు వ్యాయామం చేయించాలి. ఈనిన తరువాత, పాల దిగుబడి పెరుగుతున్న సమయంలో దాణా పరిమాణం పెంచాలి. పశువుల మందలో మెటబాలిక్ ప్రొఫైల్ టెస్ట్లు నిర్వహించాలి. ఈనిన ఆరు వారాల వరకు సోడియం ప్రాపయనేట్ 100 గ్రా. రోజుకు అందివ్వాలి. మొక్కజొన్నలను తినే దాణాలలో భాగంగా ఇవ్వాలి. దాణాలో సరైన పాళ్ళలో కోబాలు, అయోడిన్ ఉండాలి. సైలేజి ఎక్కువగా ఇవ్వకూడదు. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక