కొత్త విత్తనాలు రైతుకు కొత్త ఆశలు రైతులకు కొత్తగా తొమ్మిది వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో ఆరు, మినుము, చెరకు, పొగాకుల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త వంగడాలను విడుదల చేశారు. ఈ వంగడాల విశిష్టతలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శాస్త్రవేత్తలు వివరించారు. రకాలను రైతు స్థాయిలో పరీక్షలు పూర్తి చేసి, మార్కెట్లోకి విడుదల చేసేందుకు రాష్ట్ర విత్తన సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. రానున్న ఖరీఫ్, రబీ సీజన్లకు అనువైన ఈ రకాలను రైతులకు సరఫరా చేయనున్నారు. వరిలో 6 కొత్త వంగడాలు ఎంటీయూ 1290 : దీన్ని ఎంటీయూ 1010, ఎఫ్ ఎల్ 478 లను సంకరపరిచి అభివృద్ధి చేశారు. మార్టేరు వరి పరిశోధన స్థానంలో రూపొందించారు. ఇది వంగని, తక్కువ ఎత్తు ఎదుగుదలతో లవణీయతను తట్టుకునే రకం. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో హెక్టార్‌కు 6,500 నుంచి 7,000 కిలోలు, ఒత్తిడిలో 5,000 నుంచి 5,500 కిలోల ఉత్పాదకత వస్తుంది. ఎకరాకు ఖరీఫ్ లో 38-39 బస్తాలు, రబీలో 50 బస్తాల దిగుబడి నిస్తుంది. ఎంటీయూ 1282 : దీన్ని ఎంటీయూ 1001, కేఎంపీ 150 రకాలను సంకరపరచి అభివృద్ధి చేశారు. మార్టేరు వరి పరిశోధన స్థానంలో రూపొందించారు. వంగని స్వభావం కలిగి పాక్షికంగా నిటారుగా పెరుగుతుంది. హెక్టార్‌కు ఖరీఫ్ లో 6,500 - 7,000 కిలోలు, రబీ లో 7,000-7,500 కిలోల ఉత్పాదకత వస్తుంది. దీని పంటకాలం ఖరీఫ్ లో 135 రోజులు, రబీలో 125 రోజులు. గింజరకం మధ్యస్థంగా సన్నగా, మెత్తగా ఉంటుంది. బీపీటీ 5204 కంటే 8.3 శాతం, డబ్ల్యూజిఎల్ 14 కంటే 5.81 శాతం అధిక దిగుబడినిస్తుంది. ఉత్తరకోస్తా, కృష్ణా డెల్టా, రాయలసీమల్లో ఖరీఫ్ లో బీపీటీ 5204, ఎంటీయూ 1121, జేజీఎల్ 384 రకాలకు ప్రత్యామ్నా యంగా సాగు చేయవచ్చు. నీటిపారుదల గల చిత్తడినేలల్లో సాగుకు అనువైన రకం. ఎంసీఎం 125: దీన్ని ఎంటీయూ 1042, ఎంటీయూ 1061లను సంకరపరిచి అభివృద్ధి చేశారు. మచిలీపట్నం పరి శోధన స్థానంలో తయారైంది. ఖరీఫ్ కాలానికి అనువైన ఈ రకం లవణీయతను తట్టుకుంటుంది. పంట పడిపోదు. బీపీ హెచ్, బ్లాస్ట్ తెగుళ్లను నిరోధిస్తుంది. బీపీటీ 5204 కంటే మెరుగ్గా తెగుళ్లు, వ్యాధులను తట్టుకుంటుంది. బీపీటీ 5204తో పోలిస్తే ఎకరాకు సాధారణ పద్దతిలో 27 క్వింటాళ్లు, సేంద్రియ పద్ధతిలో 24-25 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. 135-140 రోజుల పంటకాలం కలిగిన ఈ వంగడం ఆకుమచ్చ తెగులు, బీపీ హెచ్‌ను మధ్యస్థంగా తట్టుకుంటుంది. 4.5-5 అడుగుల ఎత్తు పెరగడం వలన గడ్డి ద్వారా రైతు ఎకరాకు రూ.10 వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చు. ఎంటీయూ 1061, బీపీటీ 5204లతో పోలిస్తే ఎక్కువ ఎన్ఏ/కే నిష్పత్తి గల లవణనేలల్లో మంచి పెరుగుదల ఉంటుంది. యూటీఆర్ 181 : దీన్ని ఎన్‌ఎల్‌ఆర్ 34449, ఎంటీయూ 1010 రకాలను సంకరపరిచి అభివృద్ధి చేశారు. ఊటుకూరు పరిశోధన స్థానంలో తయారైంది. ఖరీఫ్‌లో నీటిపారుదల కలిగిన లోతట్టు భూముల్లో సాగుకు అనువైన వంగడం. బలమైన కాండంతో వంగిపోదు. గింజలు తక్కువగా రాలతాయి. 150-155 రోజుల పంట కాలం. 2 వారాలు నిద్రాణస్థితిలో ఉంటుంది. ఆకుమచ్చ, కంకి మచ్చ తెగులు, బిపిహెచ్ లను మధ్యస్థంగా తట్టు కుంటుంది. పొట్టుతో కూడిన మధ్యస్థ సన్నని గింజ, పారదర్శకమైన గింజలు, అధిక కంకి దిగుబడి వస్తుంది. బీపీటీ 5204, ఆర్ఎల్ 2537 రకాల కంటే 10.9 శాతం అధిక దిగుబడి సాధించవచ్చు. జేఎంపీ 132 : దీన్ని బీపీటీ 1235, బీపీటీ 5204 రకాలను సంకరపరిచి అభివృద్ధి చేశారు. జంగ మహేశ్వరపురం పరిశోధన స్థానంలో తయారైంది. వంగిపోకుండా దృఢమైన కాండం, మధ్యస్థ ఎత్తు కలిగి అధిగ దిగుబడినిచ్చే వంగడమిది. హెక్టార్ 6,500-7,000 కిలోల ఉత్పాదకతను అందిస్తుంది. 150-155 రోజుల పంట కాలం. రెండు వారాలు నిద్రాణస్థితిలో ఉంటుంది. బ్లాస్ట్, షీత్రెట్ తట్టుకుంటుంది. మధ్యస్థ. సన్నని గింజ రకం. నీటి పారుదల కలిగిన లోతట్టు భూముల్లో సాగుకు అనువైనది. ఆర్ఎల్ 7016: దీన్ని ఎన్‌ఎల్‌ఆర్ 34449, జేజిఎల్ 38550 సంకరపరిచి అభివృద్ధి చేశారు. రాగోలు పరిశోధన స్థానంలో తయారైంది. నేలకొరగని స్వభావం కలిగి గింజలు తక్కువగా రాలతాయి. నేరుగా విత్తుకోడానికి, పాత నారుమడికి అనువైనది. వారాలు హెక్టార్‌కు 6,000-6500 కిలోల ఉత్పాదకతని స్తుంది. 145-150 రోజుల పంటకాలం. రెండు నిద్రాణస్థితిలో ఉంటుంది. గాల్ మిడ్జ్ బయోటైప్ 4, బీపీహెచ్, బ్లాస్ట్, షీత్ బ్రైట్లను తట్టు కుంటుంది. మధ్యస్థ సన్నని గింజ రకం. నీటిపారుదల కలిగిన లోతట్టు ప్రాంతాలకు అనువైనది. మినుము ఎల్బిజి 932 : దీన్ని కేయూ 96-3, ఎల్బీజీ 20, ఎల్బీజీ 752 రకాల నుంచి అభివృద్ధి చేశారు. లాం పరిశోధన స్థానంలో తయారైంది. 85-90 రోజుల పంటకాలం. మధ్యస్థ లావు పాటి, నిగనిగలాడే నల్లని విత్తనం. హెక్టారుకు 22-25 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. వైఎంవి (YMV) ని తట్టుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మెట్ట, మాగాణులకు అనువైనది. ఆధారం: పాడిపంటలు