బంగారాన్ని తూకం వేయడానికి ఉపయోగించే గురివింద గింజలు గురించి తెలుసుకుందాం. దీని గురించి ఎన్నో సామెతలున్నాయి. పద్యాలున్నాయి. “గురివిందగింజ తన పైనున్న ఎరుపే గానీ కిందనున్న నలుపెరగదు” అనే సామెత ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తుంది. తన లోపల గురించి వదిలేసి మిడిసిపడేవాళ్ళకు ఈ సామెతను ఆపాదిస్తారు. ఇంకావాళ్ళింట్లో “గురివింద గింజెత్తు బంగారమన్హాలేదు” అంటూ పేదరికాన్ని ఎత్తిచూ పేటప్పుడు అంటారు. అసలు ఈ గురివిందగింజ ఎలాపుడుతుందా? ఎలాపెరుగుతుందో? తెలుసుకుందాము. గురివిందమొక్క “ఫాబేసి” కుటుంబానికి చెందిన మొక్క దీని యొక్క శాస్త్రీయ నామం“ ఏట్రస్ ప్రికటోరియస్”. దీనిని ఇంగ్లీషులో “జేక్విరిటి” లేదా “రోజరీ పీ (Rojary Pea)” అంటారు. ఇవి చూడటానికి అందంగా ఉంటాయి గానీ విషపూరితమైనవి. ఇవి ప్రస్తుతం మూడురంగులలో లభ్యమవుతున్నాయి. ఎరుపురంగు అంటే మనకందరకూ తెలిసిన విషయమే. ఈ గురివిందగింజలు తెలుపు, నలుపు రంగులలో కూడా లభిస్తాయి. బఠాణి విత్తనాలు కాయల్లో కాసినట్లుగా ఈ గురివిందగింజలు కూడా సంయుక్త ఫలకాయల్లో కాస్తాయి. ఇది కూడా బఠాణవలే తీగజాతి మొక్కే ఎదో ఒక ఆధారాన్ని ఎంచుకుని "పైకి ఎగబాకుతుంది. దీని ఆకులు చింతాకులలాగా చిన్నగా ఉంటాయి. దీర్షవృత్తాకారంలో ఉండే చిన్న పత్రకాలు ఉంటాయి. దీని పువ్వులు కెంపు రంగులో ఉంటాయి. పూర్వం రోజుల్లో బంగారు ఆభరణాలు తయారుచేసే వారి దగ్గర ఈ గురివిందగింజలు ఉండేవి. అప్పట్లో గ్రాములు, మిల్లీగ్రాములు అంటూ తూకం వేసేవారు కాదు. ఈ గురివిందగింజలతోనే బంగారాన్ని తూకం వేసేవారు. అసలు ఎవరైనా ఈ గురివింద గింజల్బ్చి స్వర్ణకారుల వద్దే చూసేవారు. ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రతి గురివిందగింజా దాదాపు ఒకే బరువును కలిగి ఉండటం. అంతే కాదు. బుతువులు మారినా వీటి ద్రవ్యరాశి పెద్దగా మారదు. ఇది చూడటానికి చిన్నమొక్కలా కనిపిస్తుంది. తీగలు మాత్రం పైకి పాక్కుంటూ వెళతాయి. అలాగే వేర్లు కూడా భూమిలోపలకు బాగా పాతుకుని పోతాయి. ఈ చెట్టును వీకేయాలంటే ఓపట్టాన రాదు. భూమిలోకి పాతుకుపోతాయి. ఈ చెట్లను పశువులు, జంతువులూ తినవు. ఈ చెట్లకు తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశించవు. ఇది బాగా వేగంగా పెరుగుతుంది. గురివింద గింజలు చాలా గట్టిగా ఉంటాయి. త్వరగా పగలవు. ఈ గింజలు వికారాన్ని వాంతుల్ని కలగజేస్తాయి. ఇవి కాలేయం మీద ప్రభావం చూపిస్తాయి. ఇంకా మూర్చను కూడా కలుగ చేయవచ్చు. గింజలు విషపూరితం అంటారు గానీ, ఆకులూ, వేర్లలో మాత్రం జెషదగుణాలున్నాయని, వాటిని సాంప్రదాయ ఆయార్వేదవైద్యంలో వాడతారని చెబుతారు. ఈ గింజలతో గిరిజనులు కళాకృతులు చేస్తారు. ముఖ్యంగా ఇవి ఎర్రగా పగడాలవలె ఉటాయి కాబట్టి వీటిని దండలుగా గుచ్చుకుని మెడలో ధరిస్తారు. రుద్రాక్షలను మనం మెడలో మాలగా ధరించినట్లుగా ఆదివాసీ స్రీలు ఈ గురివింద గింజలు దండలను ధరిస్తారు. నేనైతే బండి గురివింద గింజలతో బొమ్మలు తయారుచేశాను. నాకీ గింజలు హైదరాబాద్లోని పబ్లిక్షార్డెన్లో దొరికాయి. బండి గురివింద గింజలు కూడా అచ్చం ఇలాగె ఉంటాయి. కానీ నల్లమచ్చ మాత్రం ఉండదు. ముదురు ఎరుపురంగుతో కేంపుల్చి పోలి ఉంటాయి. బండి గురివింద చెట్టు కూడా ఫాబేసి కుటుంబానికి చెందినటువంటిదే. కానీ దీని జాతి మాత్రం వేరుగా ఉంటుంది. దీని శాస్త్రీయనామం “ఎడినాం తెరపాదోనినా” అంటారు. ఇది పెద్దగా పెరుగుతుంది. దాదాపు 20 మీటర్ల ఎత్తు పెరిగే చెట్టు. వీటి ఆకులు కోలగా పొడవుగా నున్నగా ముదురాకు పచ్చరంగులో ఉంటాయి. దీనికాండం, బెరడు కూడా ముదురుగోధమ రంగులో ఉంటుంది. దీని ఆకులు గురివింద ఆకుల్లా ఒకదాని ఎదురుగా మరొకటి ఉండదు. ఒకదాని తర్వాత మరొకటి వస్తుంది. దీని పూవులు పసుపురంగులో సన్ననికాడకు చుట్టూ గుత్తులుగా పూస్తాయి. కాయలు ఎండిన తర్వాత వంకర్లు తిరిగి పగిలిపోతాయి. కాయలు గుత్తులుగా ఉండటం వలన పగిలినకాయల్లో నుంచి ఎర్రగా ఉండే విత్తులు రత్ప్చాలవలె తొంగి చూస్తుంటాయి. ఈ బండిగురివింద గింజలు ముదురు ఎరుపురంగులో ఉండి గుండ్రని టాబ్లెట్లవలే కనిపిస్తాయి. ఈ గింజలకు మెరుపు ఉండదు. నల్లని మచ్చ ఉండదు. గురివిందగింజలు పూర్తి గుండ్రంగా ఉండవు. కొద్దిగా దోసకాయ ఆకారంలో ఉండి బాగా నున్నగా ఉండి మెరుస్తుంటాయి. గురివిందగింజలు కింది భాగం నల్లగా ఉంటుంది. ఈ రెండు రకాల మధ్య తేడాలు ఇదే. ప్రస్తుతం అన్ని చెట్ల లాగానే అడవుల్లో గురివింద చెట్లు కూడా కనుమరుూగై పోతున్నాయి. నగరాలలో నివసించే వారికీ వీటిని చూసే అవకాశమే లేదు. ఈ తరానికైతే గురివిందగింజ పేరు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బంగారు దుకాణాలలో వీటిని వాడటంలేదు. బండిగురివింద చెట్లను చాలా పార్కులలో పెంచుతున్నారు. కానీ గురివింద చెట్లు మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. పూర్వకాలాలలో గురివిందగింజలపై పాటలు కూడా పాడుకునేవారు. జానపదుల సాహిత్యంలో కూడా వీటి ప్రస్తావన కనిపిస్తుంది. ఆధారం : Vigyan Prasar