కిటకనాశనుల వినియోగ౦లో ర్తెతులు పాటి౦చవలసిన భద్రతాసూచనలు ఆహార పదార్దాలతో బాటుకిటనాశక మందులను రవాణా చేయరాదు. కిటకనాశక మందులను తాశ౦ వేసి భద్రపరచ౦డి. కిటకనాశక మందులను పిల్లలకు అందకుండా ఉండే చోట నిల్వచేయాలి. ఆసల్తేన ప్యాకింగులతోనే కీటకనాశని మందులను కొనండి. ఉపయోగించే ముందు లేబులును ,వివరాలపత్రాన్ని పూర్తిగా చదవ౦డి. రక్షణ కల్వ౦చే వస్త్తాలను ధరి౦చ౦డి. సిఫారను చేసినపరిమాణాన్ని సరిగ్గాకొలిచి తీసుకోండి. నీటితో కలిపేటప్పుడు కర్రతో బాగా కలియబెట్ట౦డి. మందు చిందకుండా ఉండటానికి గరాటును ఉపయోగి౦చ౦డి. కిటకనాశిని మందు డబ్బాలను నీరులేదా ఆహారాన్ని నిల్వచేయడానికి ఉపయోగించకండి. గాలి వీచే దిశలోనే పిచికారీ చేయండి. నాజల్ ను శుభ్రపరచడానికి నోటితో గాలిని ఊదకండి. పిచికారీ చేసేటప్పుడు తీనకండి,త్రాగకండి,పొగ త్రాగకండి. చిల్లుపడిన ,పాడయిన స్వ్తేయరును లేదా డస్లరునువాడకండి. ప్రయాదవశాత్తూ మందు పడితే ,మలినమైన దుస్తులను,శరీరాన్ని నీటిలోశుభ్ర౦ చేసుకోండి. పిల్లల చేత పిచికారీ చేయి౦చవద్దు. మందు చల్లు తున్న ప్రదేశముల వద్ద ఆహార పదార్దాలను ఉంచవద్దు. తినే ము౦దు ,తాగే ముందు చేతులను శుభ్ర౦గా కడుక్కోవాలి. ప్రమాదవశాత్తూ విష ప్రభావ౦ కలిగితే,ప్రాధమిక చికిత్స చేసి డాక్లరును సంప్రదించ౦డి. డాక్లరుకు కిటకనాశని మందుడబ్బా వివరాల కరపత్రాన్ని చూపించి వెంటనే మంచి వైద్యచికిత్స చేయి౦చ౦డి. ఖాళీ డబ్బాలను విరగగొట్టి భూమిలో పాతీపెట్ట౦డి. మందు చల్లడంపూర్తయిన తరువాత స్నానం చేయండి,దుస్తులను ఉతకండి. పరిసరాలుకలుషితంకాకుండాజాగ్రత్తలు తీసుకో౦డి. మందుచల్లిన పోల౦లో హెచ్చరికబోర్డులనుపెట్ట౦డి. పురుగుల మందుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు డబ్బాల మీద ఉండే త్రిభుజ రంగును బట్టి పురుగు మందు విష ప్రభావం తెలుసుకోవాలి. ఎరుపు - అత్యంత విషపూరితం (90%) పసుపు - ఎక్కువ విషపూరితం (70%) నీలం - సాధారణ విషపూరితం (50%) ఆకుపచ్చ - తక్కువ విషపూరిత౦ (30%) ఉపయోగి౦చే ము౦దు లేబులును,వివరాల పత్రాలను చదవండి. మ౦దు పిచికారి చేసేతప్పుడుముఖానికి మాస్కు ధరి౦చాలి. పిల్లలకు, పెంపుడు జంతువులకు అందకుండా ఉండేచోట నిల్వచేసి,తాళ౦ వేసి భద్రపరచండి. పురుగు మ౦దు డబ్బా మూతను నోటిలో తీయరాదు .మందు డబ్బా,ప్యాకెట్ సిలు సరిగ్గా ఉన్నదో చూసి బిల్లు తీసుకోనండి.మ౦దు డబ్బా మూతలను చిన్న పరికరాలతో . చేతులకు రబ్బరు తొడుగు వేసుకోనే పిచికరి చేయాలి.చెవులకు దూది పెట్లుకొని ముక్కుకు మాస్కు ధరించి ముఖానికి రక్షణ కవచం ధరించాలి. తలకు టోపి పెట్టుకోవాలి. శరిరం మొత్త౦ క్ప్పుబడేలా లేవు, కాళ్ళకు బూట్లు వేసుకోవాలి. పురుగు మందు కోలవడానికి కోలత గ్లాసును వాడాలి.కావలసిన మోతాదులో నిరు కలపాలి. పుల్లతో మందు ద్రావణ౦ కలపాలి.చేతులతో కలపరాదు. వాజిల్ ను శుభ్రపరిచే ము౦దు నోటితో ఊదకుండా పిస్ను సహయ౦ తిసుకో౦డి. గాలివీచే దశలోనే ము౦దు పిచికారి చేయండి. నాణ్యమైన చిల్లులు లేని స్తేయర్ను వాడాలి.మ౦దు పడిన దుస్తులను , శరీరాన్ని నీటితో శుభ్రపరచండి.పిల్లలచేత పిచికారి చేయి౦చరాదు.మ౦దు జల్లే ప్రదే శాల్లో తినుబ౦డారాలు ఉంచవద్దు. మొక్కలు పూర్తిగా తడిసేలా పిచికారి చేయాలి. చల్లని సమయాలలో మ౦దును పిచికారి చేయాలి. పిచికారి చేసేటప్పుడు తినడ౦,పోగ త్రాగడం చేయరాదు. పిచికారి చేసే సమయంలో పానీయాలు, ఆహరం తీసుకోరాదు. పిచికారి చేసిన పిమ్మట శుభ్ర౦గా చేతులను కడుగుకొని ఆహారాన్ని తినాలి. పోల౦లో పురుగు మందులను ఆహర పదార్దాలకు దుస్తులను శుభ్ర౦ చేయాలి. పురుగు మందుల పిచికారి చేసిన తర్వాత దుస్తులను శుభ్ర౦ చేయాలి. వాడిన డబ్బాలను పగలగోట్టి భూమిలో పాతండి. సాయంత్ర౦ మందు చల్లడం పూర్తయిన తర్వాత స్నానం చేయండి. పరిసరాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోని, మందుచల్లిన పోల౦లో హెచ్చరిక బోర్ధు హెట్ట౦డి. మందు జల్లడ౦ వలన విషప్రభావం కలిగితే ప్రాధమిక చికిత్స చేసి,వెంటనే డాక్లరు కబురు ప౦పి, మందు వైద్య చికిత్స చేయి౦చ౦డి. ఆహార పదార్దాలతో పాటు కిటక నాశిని మందులను రవాణా చేయరాదు. వివిద మి శ్రమాల తయారిలో జాగ్రత్తలు వేప ద్రావణం తయారి: వేప గింజలను తీసుకొని,పొడిగా చేసి ,కిలో పొడిని పలుచని గుడ్డ సంచి పోసి,మూతిని కట్టి 20లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన సంచిని వీలైనన్నిసార్లు గట్టిగా పిండాలి.అలా చేయటం వలన పొడిలో వున్న ఆజాడిరాక్టిన్ మూల పదార్దం కషాయంలోకి బాగా వస్తుంది.పూర్తిగా పిండిన తరువాత పిప్పి కలిగిన సంచిని పారవేయాలి.ఈ విధంగా వేప కషాయం తయారవుతుంది. ఈ ద్రావణానికి 20 గ్రా.సబ్బు పొడి కలిపి బాగా కరిగించాలి.ఈ కలిపిన కషాయాన్ని పలుచని గుడ్డ ద్వారా వడపోయాలి.లేనట్లయితే కషాయంలో ఉండిపోయిన పదార్ధాలు స్ప్రేయర్ నాజిల్ లో చిక్కుకొని పిచికారీకి అంతరాయం కలుగుతుంది. ఈ విధంగా అవసరమైనంత ద్రావణాన్ని తయారుచేసుకొని అన్ని పంటలలో,అన్ని పురుగుల నివారణకు పిచికారి చేయవచ్చు.పురుగుల గ్రుడ్ల దశను గమనించి వెంటనే పిచికారి చేసిన ఎడల మంచి ఫలితాలను పొందవచ్చును. బోర్డోమిశ్రమ౦ మరియు బోర్దోపేస్ట్ ఎలా తయారు చేయాలి? బోర్డోమిశ్రమ౦ తయారి:మైలతుతం,(కాపర్ సల్ఫేట్)పోడిసున్నం(లైమ్),నీటిని 1:1:100 నిష్పత్తిలో కలిపి తయారుచేస్తే 1% బోర్దోమిశ్రమం తయారవుతుంది. పోడిసున్నం లభించకపోతే,తడిసున్నం వాడొచ్చుకాని,పై మూడింటిని 1:1.5:100 నిష్పత్తిలో కలపాలి.సున్నంలో మట్టి,ఇసుక లేకుండా ఉండాలి.బజార్లలో దొరికే సున్నం సీల్డు సంచులలో ఉంటే మంచిది. మైలతుత్తంను మెత్తగా నూరాలి.రేపు మిశ్రమం చేస్తామనగా ముందురోజు మైలతుత్త౦ పొడిని నీటిలో కరగబెట్టాలి. బోర్దోమిశ్రమాన్ని రెండు విధాలుగా తయారుచేయవచ్చు. మొదటి విధానం: సూచించిన మోతాదులో మైలతుత్త౦,సున్నం తీసుకొని వేరు వేరు పాత్రలలో తగినంత నీరుపోసి బాగా కలపాలి.సున్నం నీరున్న పాత్రలోకి మైలతుత్తం నీరు పోయాలి.పాత్రలన్నీ మట్టి,చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసినవే వాడాలి. రెండవ విధానం: మైలతుత్తం మరియు సున్నం పొడులను విడి విడి పాత్రల్లో తగినంత నీటిలో కలిపి ఈ రెండు పాత్రల్లోని నీటిని ఒకేసారి మూడవ పాత్రల్లోకి పోయాలి. ఉదాహరణకు,విడివిడి పాత్రల్లో 50 లీటర్ల నీటిని తీసుకొని ఒక దానిలో కిలో ,మైలతుత్తం,రెండో పాత్రలో కిలో సున్నం కలపాలి.ఈ రెండు పాత్రల్లోని నీటిని ఒకేసారి మూడవ పాత్రలోకి పోయాలి.అంటే ఒక శాతం బోర్దోమిశ్రమం తయారవ్తుంది. బోర్దో మిశ్రమాన్ని ఉపయోగించే ముందు పరీక్ష చేయాలి.లిట్మస్ పేపరును మిశ్రమంలో ము౦చినపుడు ఎర్రగా మారకూడదు.లిట్మస్ పేపరు దొరకనిచో కొత్త బ్లేడు లేదా చాకును మిశ్రమంలో ము౦చినపుడు వాటిపై రాగిధాతువు చేరుకోకూడదు.అలా చేరితే మరికొంత సున్నం నీటిని కలపాలి.సున్నం ఎక్కువైతే మొక్కలకు హాని చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా పరీక్షిస్తూ మిశ్రమాన్ని తయారు చేయాలి. బోర్దో పేస్టు:ఇందుకు ఒక కిలో మైలుతుత్తం పొడి,1.5కిలోల పొడిసున్నం,13.5 లీటర్లు నీరు కలపాలి.బోర్దో మిశ్రమంలాగే పరీక్షించి వాడాలి.బ్రష్ ను ఉపయోగించి విరిగిన,కత్తిరించిన కొమ్మ భాగాలకు,గాయమైన భాగాలకు,చెట్ల మొదళ్ళకు రాస్తే తెగుళ్ళు ఆశి౦చవు. ఎన్.పి.వి.వైరస్ తో సస్యరక్షణ: వివిధ సమగ్ర సస్య రక్షణ పద్దతుల్లో జీవ నియంత్రణ పద్దతులు చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.మనకు అందుబాటులో ఉన్న అనేక జీవ నియంత్రణ పద్దతుల్లో న్యూక్లియర్ పొలిహేడ్రోసిస్ వైరస్(ఎన్.పి.వి) ద్రావణం,తక్కువ ఖర్చుతో,రైతు స్తాయిలో తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంది.ఎన్.పి.వి అనేది పురుగులకు వ్యాధిని కలుగచేసే ఒక వైరస్.ఈ వైరస్ కణాలు ఆకుల ద్వారా కానీ,ఇతర మొక్క భాగాల ద్వారా కానీ,పురుగు తిన్నప్పుడు జీర్ణకోశంలోకి ప్రవేశించి,అక్కడ ప్రత్యుత్పత్తి జరిపి జీర్ణాశయాన్ని బలహీనపరుస్తాయి.క్రమేపి వైరస్ కణాలు ఆకుల ద్వారా కానీ,ఇతర శరీరభాగాలన్ని౦టిలో ప్రవేశించడం వలన అన్ని వ్యవస్థలు దెబ్బతిని పురుగు చనిపోతుంది. ఇలా ఎన్.పి.వి వ్యాధి బారినపడి చనిపోయిన పురుగుల శరీరం ఉబ్బి,చర్మం వదులుగా ఉండి,తాకితే చర్మం పగిలి,అందులోంచి పోలలాంటి తెల్లని చిక్కటి ద్రవం బయటకు వస్తుంది.వ్యాధి సోకిన పురుగులు మొక్కల అంచులకు పాకి,తలక్రిందులుగా వేలాడుతూ చనిపోతాయి. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏ పురుగుతో తయారయ్యే వైరస్ అదే రకం పురుగును మాత్రమే చంపగలదు.ఉదా:శనగపచ్చ పురుగు నుండి వేరు చేసిన వైరస్,లద్దె పురుగుకు వ్యాధిని కలిగించలేదు.కాబట్టి ఏ జాతి పురుగుల వైరస్ ను అదే జాతికి చెందిన పురుగుల నివారణకు మాత్రమే వాడాలి. పచ్చ పురుగు ఎన్.పి.వి తయారు చేయు విధానం: లార్వాలను సమీకరించుట: పంట పొలాల నుంచి ఆరోగ్యంగా ఉన్న నాల్గవ దశ లార్వాలను ఇంజక్షన్ సీసాల్లోకి లేదా సెల్ వెల్స్(గదుల డబ్బాలు) ఒక్కోదానిలో ఒక్కొక్క లార్వాను సమీకరించు కోవాలి. చిన్న లార్వాలైతే వైరస్ ఉత్పత్తి తగ్గుతుంది.పెద్ద లార్వాలను ఎంచుకుని ఉన్నట్లయితే వాటిని చంపడానికి ఎక్కువ మోతాదులో వైరస్ వాడవలసి ఉంటుంది.కాబట్టి ఒక మోస్తరు సైజు(1.0-1.5 సెం.మీ.పొడవు) లార్వాలను ఎంచుకోవడం మంచిది. లార్వాలను వైరస్ జబ్బులకు గురి చేయుట: ముందుగా శనగ గింజలను 6-8 గంటలు నానబెట్టి తరువాత ఒక పొడి గుడ్డపై ఆరబెట్టాలి.ఈ గింజల పై సరియైన మోతాదులో (ఒక కిలో విత్తనానికి 40ఎల్.ఇ) శుద్దమైన వైరస్ ద్రావణాన్ని (మదర్ కల్చర్)చిలకరించాలి. ఈ మదర్ కల్చర్ ద్రావణము వ్యవసాయ శాఖ వారి జీవ నియంత్రణ ప్రయోగశాలలో (బి.సి.లాబ్స్) లేదా రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం లేదా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలికి అనుబంధానమైన కొన్ని పరిశోధన మండలికి అనుసంధానమైన కొన్ని పరిశోధనా కేంద్రాలలో లభిస్తుంది సీసాలలో సమీకరించిన లార్వాలకు ఈ వైరస్ కలిపినా 2లేదా 3శనగ గింజలను ఆహారంగా ఇవ్వాలి. తర్వాత సీసా మూతిని దూదితో బిగించాలి.వీలైతే ఈ సీసాలను అనుకూలమైన వాతావరణ పరిస్థితులలలో అంటే 25-30 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత మరియు 60-70 శాతం తేమ ఉన్న ప్రదేశంలో ఉంచాలి.అవసరం అయితే 3వ రోజు తర్వాత ఈ లార్వాలను మాములు ఆహారం అనగా వైరస్ కలపని,నానబెట్టిన శనగలను ఇవ్వవచ్చు. వైరస్ లార్వాలను సమీకరించుట: వైరస్ గురిచేసిన లార్వాలు 4-5రోజులకు వ్యాధి సోకి చనిపోతాయి.లార్వాలను మాత్రమే ఒక సీసాలో సమీకరించుకోవాలి.చనిపోయిన లార్వాలు మెత్తగా ఉంటాయి.కాబట్టి వాటి మీద బాక్టీరియా వృద్దిచెంది కుళ్ళిపోయిన చెడు వాసన రావడానికి ఆస్కారం ఉంది.కనుక సీసాల నుంచి చనిపోయిన లార్వాలను తీసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి.వైరస్ వ్యాధి సోకి చనిపోయిన లార్వాలను సమీకరించిన వెంటనే ఫ్రిజ్ లో ఉంచుట వలన బాక్టీరియా వృద్ది ఆగిపోయి చెడు వాసన తగ్గుతుంది. వైరస్ ను శుద్ధి చేయుట: వైరస్ వ్యాధి సోకి చనిపోయిన లార్వాలను సమీకరించుకొన్న తరువాత,సమపాళ్ళలో శుభ్రమైన నీటిని కలిపి (250 లార్వాలకు 250మీ.లీ.నీరు),వాటిని గ్రైండర్లో వేసి చిక్కని ద్రవముగా మారే వరకు రుబ్బవలెను.ఈ ద్రావణాన్ని ఒక పలుచని గుడ్డతో వడపోస్తే,పురుగులు శరీర భాగాలు వేరు చేయబడతాయి.చిక్కటి వైరస్ ద్రావణం మిగులుతుంది.వీలు ఉన్న ఎడల,వడగట్టిన ద్రావణాన్ని మరింత శుభ్రపరచడం కోసం చిన్న ట్యుబులలో పోసి సె౦ట్రిఫ్యూజ్లో 5000ఆర్.పి.ఎమ్. వద్ద 15నిమిషాలు తిప్పాలి.ఇలా చేయడం వలన ట్యూబు అడుగుభాగంలో వైరస్ కణాలు చేరి పేస్ట్ లాంటి పదార్ధంగా కనిపిస్తుంది.పై తేటను పొరవేసి,క్రింద చేరిన వైరస్ కణాలను ప్లాస్టిక్ డబ్బాలలో పోసి ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలి.వైరస్ ద్రావణం నాణ్యతను హీమసైటో మీటరు మరియు అధిక శక్తి గల మైక్రోస్కోప్ ల ద్వారా పరీక్షించి వైరస్ కణాలను లెక్కించుట ద్వారా అంచనా వేయవచ్చు. లద్దె పురుగు వైరస్ ను కూడ పైన తెలిపిన విధంగానే ఉత్పత్తి చేయవచ్చు.కానీ లద్దె పురుగు ఆహారంగా నానబెట్టిన శనగల బదులు లేత ఆముదము ఆకులు వాడాలి.ఆకులను మదర్ కల్చర్(లద్దె పురుగు ఎన్.పి.వి)లో ముంచి,ఆరబెట్టి లార్వాలను తినిపించాలి. వైరస్ వాడకంలో మెళుకువలు: ఎన్.పి.వి ద్రావణం పిచికారి చేసే ముందు మాత్రమే నీటితో క్కలిపి తయారు చేసుకోవాలి.నిల్వ ఉంచిన ద్రవాణాన్ని పిచికారి చేస్తే వైరస్ సామర్ధ్యం తగ్గుతుంది. వైరస్ మందు లార్వాతొలి దశలో ఉన్నప్పుడు సమర్ధవంతంగా పనిచేస్తుంది.కాబట్టి లింగాకర్షక బుట్టల ద్వారా రెక్కల పురుగు ఉలికిని ముందుగా గుర్తించి తదనుసారంగా వైరస్ పిచికారి చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. తగిన మోతాదులో వైరస్ ద్రావణం వాడకం ముఖ్యమైనదిగా గుర్తించుకోవాలి.ఉదా:పచ్చపురుగు ఎన్.పి.వి హెక్టారుకు కందిలో 500ఎల్.ఇ,శనగ,పొద్దుతిరుగుడు,టమాటా 250ఎల్.ఇ చొప్పున వాడాలి. వైరస్ మందు ఇతరత్రా రసాయన క్రిమిసంహారక మందులతో పోలిస్తే కాస్త ఆలస్యంగా పనిచేస్తుంది.పిచికారి చేసిన 4-5రోజుల వరకు కూడ పురుగులు పొలంలో కనిపించినా.వాటి వల్ల కలిగే నష్టం మాత్రం తగ్గుతూ వస్తుంది. పొలంలో పెద్ద లార్వాలు 4వ దశ దాటినవి అధిక శాతం వుంటే ఎన్.పీ.వి. సమర్ధవంతంగా పనిచేయదు.కనుక ప్రత్యామ్నాయ పద్దతులు ఎంచుకోవడం మంచిది.ఎన్.పి.వి ద్రావణ౦తో పాటు ఒక ఎకరానికి సరిపడే నీళ్ళల్లో(సుమారు 200 లీ.)1/2 కిలో బెల్లం మరియు 100మీ.లీ టీపాల్ మరియు 50గ్రా.రాబిన్ బ్లూ(నీలి మందు) కలిపి పిచికారి చేసుకోవాలి. వైరస్ ద్రావణం మొక్కల అంతట సమంగా తడిచేటట్లు,ముఖ్యంగా లేత ఆకులు,కాయలు,పిందెల మీద కూడ పడే విధంగా పిచికారి చేయాలి.పురుగు ఉధృతిని బట్టి వైరస్ ద్రవణాన్ని తగిన మోతాదులో 5-7రోజుల వ్యవధిలో 4-5సార్లు పిచికారి చేయాలి. పిచికారి వాడే నీళ్ళ క్షారత తటస్థమైనదిగా ఉండాలి. వైరస్ సోకిన లార్వాలను పెంచేటపుడు శుభ్రతను పాటించడం చాలా అవసరం.ఇంజక్షన్ సీసాలు లేదా సెల్వెల్స్ ను వాడకముందు,వాడిన తరువాత 4శాతం క్లోరాక్స్ ద్రావణంతో శుద్ధి చేయాలి. మంచినీరు పొగాకు కషాయం తయారి పొగాకు కషాయం తయారు చేయుటకుగాను 500గ్రాముల పొగాకును 4.5లీటర్ల నీటిలో 24గంటలు నానబెట్టాలి.320గ్రాముల బార్ సబ్బు పొడిని కలియబెట్టి తయారు చేసుకున్న పొగాకు కషాయానికి కలపాలి.ఈ ద్రావణాన్ని 6-7రెట్ల నీటిలో కలిపి పిచికారి చేసుకొనవచ్చు. ఆధారం : వ్యవసాయ శాఖ