ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మెళకువలు - ఫ్యామిలీ డాక్టర్‌ను వదులుకో ఫ్యామిలీ ఫార్మర్ను పెట్టుకో ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ముందు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు లభ్యత బోర్డును డిస్ప్లే చేయాలి. ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులు పండించే వివరాలను సోషల్ మీడియాలో (ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం) ఫార్మ్ స్టోరీస్ ద్వారా ప్రచారం చేసి ఉంచాలి. వెబ్సైట్ క్రియేట్ చేసుకుని ఆన్లైన్ /నెట్ మార్కెటింగ్ చేసుకోవాలి. యోగా సెంటర్ లు, ఆధ్యాత్మిక సంస్థలు, మిలిటరీ స్కూళ్లు, పొలిటికల్ లీడర్లు, స్కూల్ టీచర్స్ అన్ని కార్యాలయాల అధికారులకు ప్రకృతి వ్యవసాయదారుల వివరాలు ఇచ్చి వారినిసంప్రదించి ఇండెంట్స్ తెచ్చుకుని వారికి అమ్మగలం. జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం గ్రీవియెన్స్ డే రోజున ప్రకృతి వ్యవసాయ దారులకు వారి వారి ఉత్పత్తుల అమ్మకానికి ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయగలిగితే 45 డిపార్ట్మెమెంట్ ఆఫీసర్ల గ్రీవియెన్స్ సబ్మిషన్కు వచ్చిన ప్రజానీకం కొనుక్కోవడానికి వీలుకలుగుతుంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్యాకింగ్‌పై వాటి ఔషధ విలువలను, పోషక విలువలను ముద్రించి బాగా ప్రచారం చేయాలి. ప్రతి ప్రకృతి సాగు రైతు తన భూమికి ప్రభుత్వం తరపున ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెలంగాణ స్టేట్ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా చేయించాలి. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై ప్రభుత్వమే పునుకుని మోడరేట్‌గా ఉండేలా రెగ్యూలేషన్ చేయగలిగితే చాలా మంది కొనుక్కోవడానికి వీలు కలుగుతుంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు స్పెషల్ గిట్టుబాటు ధరలను ప్రభుత్వం ఇప్పిస్తే రైతులు ఇంకా ఇంకా ప్రాడక్ట్స్ పండించి నెమ్మది నెమ్మదిగా ఆరోగ్య సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది. ఉత్పత్తులకు విలువ జోడించడం అంటే నిలువ ఉంచుకునే పచ్చళ్ళు, జామ్‌లు మొదలైన రూపంలో మార్చుకుని అమ్ముకుంటే లాభాలు సాధించవచ్చు. ప్రజలు మెల్లి మెల్లిగా ఫ్యామిలీ డాక్టర్‌ను వదలి ఫ్యామిలీ ఫార్మర్ను పెట్టుకుంటే ఆరోగ్యంగా జీవితాన్ని గడపగలరు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రైతుల ఆదాయాన్ని పెంచే ఆచరణాత్మక మార్గాలు భారత దేశంలో నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్ / ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటి పథకాల మూలంగా ప్రకృతి వ్యవసాయం వేగంగా విస్తరిస్తుంది. రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని పెంపొందించాలన్నది ముఖ్యలక్ష్యం. అయితే అలా పండించిన రైతుల ఉత్పత్తులకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు మార్కెటింగ్, గిట్టుబాటు ధర, వినియోగదారులు లేకపోతే రైతు ఆశించే ఆదాయం పొందలేకపోతున్నారు. రైతు ఆదాయం పెంచే కొన్ని మార్గాలు చూద్దాం. రైతు ఉత్పత్తికి బ్రాండ్‌ను సృష్టించాలి ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబుల్, రైతు పేరు, గ్రామం, మొబైల్ నెంబరు, పంట ప్రత్యేకతలతో విక్రయిస్తే ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఒకసారి బ్రాండ్ ఏర్పడితే అదే రైతు ఉత్పత్తిని వినియోగదారులు మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు. ఉదా: కె.లావణ్య రెడ్డి అనే మహిళా రైతు కారవంగా గ్రామం, తెల్కపల్లి మండలం, నాగర్‌కర్నూలు జిల్లా తను పండించే కారానికి 'లావణ్య' అనే బ్రాండ్ పేరుతో ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు నాణ్యమైన వారి వంట ఉత్పత్తులను అమ్ముకోగలుగుతున్నారు. వ్యవసాయ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలి. వారాంతాల్లో నగర ప్రజలను, యువతను పొలాలకు ఆహ్వానించడం, వారికి ప్రకృతి వ్యవసాయం ఎలా చేస్తున్నామో చూపించడానికి అవకాశం ఇవ్వడం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా కొనుకొని తీసుకెళ్లే విధానం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలను కుటుంబంతో పొలాన్ని సందర్శించి వారే స్వయంగా కోసుకుని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించడం. గ్రామీణ అనుభవాన్ని కల్పించడం, ఎద్దుల బండి ప్రయాణం, వరి నాట్లు వేయించడం, పశువులకు మేత వేయడం లాంటి అనుభవాలను కల్పించడం. సాంప్రదాయ ఆహారం తినిపించడం, దేశీ బియ్యంతో, పలు రకాల వంటలు, జొన్న రొట్టె, రాగి సంగటి, సహజ ఆహారాన్ని రుచి చూపించడం. ప్రతి సందర్శకుడిని శాశ్వత కష్టమర్‌గా మార్చుకోగలగాలి. వారి ఫోన్ నెంబర్లను తీసుకుని కొత్త పంటల వివరాలు, ఆఫర్లు తెలియజేయాలి. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు