రైతులు వివిధ పంటలలో అధిక దిగుబడులను సాధించడానికి మరియా నేలను పరవంతంగా ఉంచడానికి సేంద్రియ ఎరువులు వాడకం అవసరం. సేంద్రియ ఎరువులతో పెంపకాన్ని వర్మీకంపోస్టు ఒకటి. ఏది వానపాములతో తయారుచేసే ఎరువు. వానపాములు పెరిగేటప్పుడు సేంద్రియ వ్యర్ధ పదార్ధములను ఆహారంగా ఉపయోగించుకొని, విసర్జించే పదార్ధాన్ని వర్మీకంపోస్టు అంటారు. వానపాములను వాడితే ఎక్కువ వానపాముల ఎరువును తయారు చేయవచ్చు. వర్మికరల్చర్ కు కావాల్సిన పదార్ధాలు: పశువుల పేడ, ఆకులు, కూరగాయలు, చేత వరిగడ్డి, కాగితం, అరటి ఆకులు, చెరుకు, కలుపుగడ్డి, కుళ్ళిన కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు. వర్మాకల్చర్బెడ్ లో తయారుచేయు పద్దతి : సూర్యుని వేడి, వర్షం నుండి వానపాములను కాపాడడానికి పాక్లో బెడ్ వేసుకోవాలి. భూమి పైన 30 సెం.మీ. ఎత్తు, 90 సెం. మీ. వెడల్పుతో అవసరం మేరకు పొడవు ఉండేటట్లు బెడ్ తయారు చేసుకోవాలి. బెడ్ అడుగు భాగాన 2 -3 సెం.మీ. ఎత్తున ఇటుక ముక్కలు వరుసగా పేర్చాలి. ఇటుక వరుస పైన 2 -3 సెం.మీ. ఎత్తున ఇసుక వరుసవేసి, దాని పైన 2 -3 సెం.మీ. ఎత్తున మట్టి వరుస వేయాలి. చెదలు పట్టకుండా ఉండడానికి వేప లేదా కానుగ ఆకులు మట్టిపైన చల్లాలి. మట్టి వరుస పైన 7 -8 సెం.మీ. ఎత్తున సగం కుళ్ళిన వ్యర్ధపదార్ధాల వరుస వేయాలి. చెత్త వరుస పైన ఎండిన పేడ వరుస వేయాలి. వానపాములు తినడానికి ఎప్పుడు బెడ్ లో తిండి ఉండేట్లు చూడాలి. బెడ్ కి పచ్చిపెడ వాడితే వానపాములు చనిపోతాయి. ప్లాస్టిక్, గాజు, రబ్బరు, టిన్ మొదలైన పదార్ధాలు బెడ్ లో వేయరాదు. బెడ్ పూర్తిగా తడిచేటట్లు నీళ్ళుపోయాలి. బెడ్ లో అడుగు బాగానే నీరు నిల్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. బెడ్ తయారు చేసిన తరువాత ( ఒక చదరపు మీటరుకు 1000 -2000 వానపాములు ) వదలాలి. బెడ్ లో ఎప్పుడు తేమ ఉండేట్లు చూడాలి. వానపాములు వదలిన తర్వాత బెడ్ ను గోనెసంచి లేదా చేత తో కప్పాలి. వానపాములు వదలిన తర్వాత 60 -90 రోజుల్లో వర్మీ కంపిస్తూ తయారవుతుంది. బెడ్ ను కోళ్లు, ఎలుకలు, తొండాలు, కప్పలు, పక్షులు ఇతర జాతుల బారి నుండి కాపాడుకోవాలి. కిలో వానపాములు రోజుకు 6 కిలోల చెత్తను కంపోస్టు గా మారుస్తాయి. వర్మీకంపోస్టు తయారైన తర్వాత 4 -5 రోజులు నీరుపోయటం ఆపి బెడ్ లోని కంపోస్టు ను ఒక ప్రక్కకు కుప్పగా వేయాలి. ఇలా చేయటం వలన వానపాములు బెడ్ క్రింద వరుసలోకి వెళ్తాయి. ఆ తరువాత కంపోస్టులో ఎక్కడైనా వానపాములు మిగిలిన యెడల అవి మరల బెడ్ లలో వేసుకోవాలి. జల్లెడ పట్టిన ఎరువులను సంచులలో నింపుకోవాలి. వర్మీకంపోస్టులో 0 .5 -3 శాతం నత్రజని, 0 .5 -1 శాతం భాస్వరం, 0 .5 -1 .5 శాతం పోటాష్, పోషకాలు కాక, కాల్షియం, మెగ్నీషయం, కాపర్, మాంగనీసు, జింక్, మాలిబ్డినం వంటి సూక్ష్మపోషక పదార్ధాలు కూడా పోద్దిమోతాదులో ఉంటాయి. ఒక బెడ్ లో సంవత్సరానికి 4 -5 సార్లు వర్మీకంపోస్టు తయార చేసుకోవచ్చు. హెక్టారుకు సాలీనా 10 టన్నుల వ్యర్ధ పదార్ధాలు ఆహారంగా వానపాములకు కావాలి. 10 కిలోల వానపాములు టన్ను సేంద్రియ పదార్ధాలను 30 రోజుల్లో కంపోస్తుగా మారుస్తాయి. వర్మీకంపోస్టు వాడుట వలన లాభాలు: నత్రజని, బస్వరా, పోటాష్ పోశాలలలో బాటు సూక్మపోషకాలను పంటకు అందిస్తుంది. పంటలు పురుగులను, తెగుళ్లును తట్టుకొనే శక్తి పెరుగుతుంది. భూమిలో గాలి బాగా ఆడేటట్లు , నీరు ఇకెట్లు తేమ నిల్వ వుండేగుణాన్ని పెంచుతుంది. భూమిని ఆరోగ్యాంగా తయారుచేసే సూక్మక్రిములు సంఖ్యను గణనీయంగా పెంచుతుంది. భూమిని బలంగా తయారు చేయటమే కాకుండా పంట ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది . వర్మీకంపోస్టు వాడుటవలన నెల బైతిక , రసాయన, జీవన గుణాలు వృద్ధి చెందుతాయి. రసాయన ఎరువుల పై పెట్టె ఖర్చు తగ్గించవచ్చు. పండ్లు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండటమే కాక ఎక్కువ రుచి, మంచి రంగు, వాసన కలిగి ఉంటాయి. కాలుష్య రహిత ఎరువు లభిస్తుంది. ఎరువుల విక్రయం ధ్వారా ఆదాయం పొందవచ్చు. గ్రామీణ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్మీ ప్రోటీన్ (వర్మీటిన్) ను తయారు చేయవచ్చు. దీన్ని కోళ్లు, పందులు చేపలకు ఆహారంగా వాడవచ్చు. వానపాములు పంట పెరుగుదలను ప్రోత్సహించే యాంటీబయాటిక్స్, ఏంజెమ్స్, హర్మీనులు మరియు విటమిన్స్ విడుదల చేసి నెల ఉత్పాదక గుణాన్ని పెంపొందిస్తాయి. ఎకరాకు 1 టన్ను వర్మీకంపోస్టు వాడాలి. పండ్ల తోటలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి చెట్టుకు 5 -10 కిలోల వరకు వాడుట వలన మంచి ఫలితాలు సాధించవచ్చు. వర్మీకంపోస్టు సంవత్సరానికి 1 లేదా 2 సార్లు వేయవచ్చు. వర్మికం పోస్టు తయారీ చాల సులభమైన పద్దతి. పనికిరాని చేత చెదారాలకు కాస్త పేడలో కలిపి వానపాములను వాడినపుడు నాణ్యమైన ఎరువు తయారవుతుంది. ఈ విధమైన ఎరువు ఇతర సంస్థల నుండి కొనేటప్పుడు ఎక్కువ ధారు అవుతుంది. అదే స్వయంగా తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎరువు లభిస్తుంది.