సంపన్న రైతాంగం ప్రగతిశీల భారతం స్వయంసమృద్ధి భారత్ కు వ్యవసాయమే మూలస్తంభం. కాబట్టి అన్నదాత సంక్షేమం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో కృషి చేస్తోంది. దీనికి అనుగుణంగా ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లుగా కనీస మద్దతు ధర (ఎం.ఎస్సీ) నిర్ణయం, రైతు ఆదాయం రెట్టింపు. 2019 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్లో పిఎం కిసాన్ సమ్మాన్ విధి పథకం ప్రకటన తదితరాల ద్వారా రైతు ఆర్థిక సాధికారతపై నిబద్ధతను చాటుకుంది. ఇవన్నీ ఉత్తుత్తి హామీలు కావు. పూర్తిగా నెరవేరిన వాగ్దానాలు. దేశానికి అన్నదాతలైన రైతుల సంక్షేమం దిశగా విత్తనం నుంచి విపణి దాకా ప్రభుత్వం అన్ని విధాలుగామా శ్రద్ధ చూపుతోంది. వికసిత భారత్ సంకల్ప సాకారంలో రైతుల పాత్ర కీలకం కావడమే ఇందుకు కారణం. వివిధ పథకాలు, విధానాలు, కార్యక్రమాం ద్వారా విత్తనం చల్లే ముందు, నారుపోసే వేళ, నాట్ల తర్వాత... ఇలా అన్ని దశల్లోనూ రైతు అండగా నిలుస్తుండటంతో దేశ ప్రగతి ప్రయాణంలో ప్రధాన భాగస్వామి అయిన రైతు సాధికారతలో నవ శకం అరంభమైంది. ఆర్థిక సాధికారత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 4.09 లక్షల కోట్లకు పైగా నిధులను 21 వాయిదాలలో డీబీటీ ద్వారా రైతులకు పంపిణీ చేశారు. పీఎం కిసాన్ పథకం కింద 9.34 కోట్ల మందికిపైగా లబ్ధిదారులు లబ్ధి పొందారు. వారి 'ఇ-కేవైసీ' ప్రక్రియ పూర్తికాగా. మరో 42.85 లక్షల మందికి పూర్తి కావాల్సి ఉంది. పీఎం కిసాన్ అనేది సాగు భూమిగల రైతులకు ఉద్దేశించిన ఆదాయ మద్దతు పథకం, దీనికింద ఏటా 26,000 వంతున 3 సమాన వాయిదాలలో నిధులు పంపిణీ అవుతున్నాయి. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ అధ్యయన ఫలితాల ప్రకారం- పీఎం కిసాన్ పథకంతో రైతులకు రుణ లభ్యత అవరోధాలు తొలిగాయి. తద్వారా వారు ఆత్మవిశ్వాసంతో రుణసాయం పొందడానికి మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ అవసరాలతో పాటు ఈ మొత్తాన్ని విద్య, వైద్య, వివాహ అవసరాల కోసం కూడా. ఉపయోగించారు. పీఎం కిసాన్ పథకం తోడ్పాటుతో పంట నష్టాలు లేదా అత్యవసర వైద్య పరిస్థితులలో అనధికారిక రుణాలపై ఆధారపడాల్సిన దుస్థితి తప్పడమేగాక వ్యవసాయ ఆదాయం పెరిగిందని లబ్దిదారులైన రైతులలో 85 శాతానికి పైగా తెలిపారని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. పీఎం ధనధాన్య కృషి యోజన వ్యవసాయం- రైతు సంక్షేమ బడ్జెట్ 480 శాతం పెరుగుదల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 అక్టోబరు 11న రూ.24,000 కోట్లతో 'ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన'ను ప్రారంభించారు. ఈ పథకం కింద వ్యవసాయ కమతాల దిగుబడి సాగు వ్యవధులు, రుణ సౌలభ్యం. పారామితుల ప్రాతిపదికన దేశంలోని 100 జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అలాగే 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 ఉప పథకాలను సమన్వయం చేస్తూ ఆకాంక్షిత జిల్లాల్లో పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. లక్ష్యం: ఎంపిక చేసిన 100 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణ, సుస్థిర పద్ధతులకు ప్రోత్సాహం, పంట కోత అనంతర నిల్వ సదుపాయాల విస్తరణ, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, స్వల్ప-దీర్ఘకాలిక రుణ లభ్యత పెంపు. పంట ఉత్పత్తులకు సముచిత మార్కెట్ రైతుకు గిట్టుబాటు ధర పీఎం కృషి ఉడాన్ పథకం ప్రభుత్వం 2021లో ప్రారంభించిన కృషి ఉడాన్ పథకం వల్ల అస్సాంలోని గువహటి నుంచి 'కింగ్' మిరప, బర్మీస్ ద్రాక్ష, అస్వామి నిమ్మ: త్రిపుర నుంచి పనస) బీహార్లోని పలు జిల్లాల నుంచి 'లిటీ' వంటి ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకి కాకుండా ఇతర దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 35 విమానాశ్రయాల్లో శీతల గిడ్డంగి సదుపాయం అందుబాటులో ఉంది. ఇక ఈ పథకం కింద 58 విమానాశ్రయాలను ఎంపిక చేయగా ఈశాన్య, పర్వత, గిరిజన ప్రాంతాల్లోని 25 విమానాశ్రయాలపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వ్యవసాయ ఎగుమతులు వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతి పెంపుతోపాటు ప్రపంచ వాణిజ్యంలో వాటి వాటాను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. 2024-25 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 519 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు. ఎగుమతయ్యాయి. ఇ-నామ్ (e NAM ) పంట ఉత్పత్తులపై రైతుకు మెరుగైన ధర లక్ష్యంగా 'ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్' (ఇ-నామ్)ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ వేదిక ద్వారా ₹4.40 లక్షల కోట్లకు పైగా విలువైన వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం నమోదైంది. మొత్తం మీద 1.79 కోట్ల మందికి పైగా రైతులు, 3.90 లక్షల మంచి వ్యాపారులు కమీషన్ ఏజెంట్లు సహా 4,642 రైతు ఉత్పత్తిదారు సంస్థలు ఈ వేదికలో నమోదయ్యాయి. అలాగే 2025 డిసెంబరు 31 నాటికి 27 రాష్ట్రాల్లోని 1,522 మండీలు (విపణులు) దీనితో సంధానమయ్యాయి. కనీస మద్దతు ధర పెంపు ప్రభుత్వం 2018-19 నుంచి అన్ని నిర్దిష్ట ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. దీనివల్ల దేశవ్యాప్తంగా పంటల సగటు ఉత్పత్తి వ్యయంపై రైతులకు కనీసం 50 శాతం లాభం చేకూరుతుంది. గత దశాబ్దం ఇదే వ్యవధిలో ప్రభుత్వ ఆహార ధాన్యాల కొనుగోళ్లు 761.40 లక్షల టన్నుల నుంచి 1,175 లక్షల టన్నులకు పెరిగాయి. కనీస మద్దతు ధర కింద రైతులకు చెల్లింపు దాదాపు మూడు రెట్లు పెరిగింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల బలోపేతం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ₹1 లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల మెరుగుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక నిధిని ప్రారంభించింది. దీనికింద 3 శాతం వడ్డీతో 72 కోట్ల మేర ఆర్థిక సహాయంతోపాటు రుణ హామీ సదుపాయం కూడా లభిస్తుంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద 2025 అక్టోబరు 30 వాటికి 1,34,372 ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ₹75,140 కోట్లు మంజూరు చేసింది. తద్వారా వ్యవసాయ రంగంలో 1.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయి.. ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగార పథకం సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగార పథకానికి కేంద్ర మంత్రిమండలి 2023 మే 31న ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాల్లోని 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) పరిధిలో గిడ్డంగుల నిర్మాణం పూర్తయింది. 500 కుపైగా 'పీఏసిఎస్'లను ఈ పథకం కింద ఎంపిక చేయగా, 108 సంఘాల పరిధిలో నిర్మాణం మొదలు కాగా, 24 సంఘాల కింద పనులు ముగిసిన నేపథ్యంలో మిగిలినవాటికి 2026 డిసెంబరు దాకా గడువు నిర్దేశించారు వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల (కేవీకే) నెట్వర్క్ విస్తరణ భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) నిర్వహణలోగల ఈ కేంద్రాలు రైతులకు శిక్షణ ఇవ్వడంలో ముందంజ వేశాయి. 2021-22 నుంచి 2023-24 మద్య 58.02 లక్షల మంది రైతులకు శిక్షణ ఇవ్వగా, 2024-25లో 19 లక్షల మందికి పైగా శిక్షణ పొందారు. ఈ కేంద్రాల్లో స్థానిక పరిస్థితులకు తగినట్లుగా ఆధునిక వ్యవసాయ శాస్త్రం, పశు సంరక్షణ, భూపారం, పంట కోత అనంతర సాంకేతికతలు వంటి కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. వాతావరణంపై కృత్రిమ మేధ ఆధారిత అంచనాలు 3.8 కోట్ల మందికిపైగా రైతులకు ఈ విశిష్ట కార్యక్రమం కింద 'ఎం-కిసాన్' పోర్టల్ ద్వారా నిరుడు 5 ప్రాంతీయ భాషలలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రుతుపవన అంచనాల సమాచారం అందింది. రైతుల జీవితాలకు భద్రత విస్తరణ కిసాన్ క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకాన్ని ప్రభుత్వం 2019లో పశుసంవర్ధక, పాడి--మత్స్య పరిశ్రమలకూ వర్తింపజేసి, దీనికింద రుణ పరిమితిని 2025-26 బడ్జెట్లో ₹3 లక్షల నుంచి 25 లక్షలకు పెంచింది. 7.7 కోట్ల నుందికిపైగా రైతులు, మత్స్య కార్మికులు, పొడి రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నారు. ₹10 లక్షల కోట్లకు పైగా రుణాలుసహా 2024-25లో వడ్డీ రాయితీ రూపంలో మరో ₹1.62 లక్షల కోట్లకు పైగా నిధులు కూడా ఈ కార్డుదారులకు అందాయి. రైతు ఉత్పత్తిదారు సంస్థలు (ఎఫ్పీఓ) దేశవ్యాప్తంగా 10,000కు పైగా ఎఫ్పీఓలు రైతు సాధికారతకు తోడ్పడ్డాయి. ఇక 2025 అక్టోబరు నాటికి 62 లక్షల మంది రైతులు ఈ సంస్థలలో చేరారు. 'ఎఫ్పీఓ'లలో 1,100 సంస్థలు రూ.1 కోటి వ్యాపార స్థాయిని సాదించగా, మొత్తం వార్షిక వ్యాపార పరిమాణం ₹15,000 కోట్లకు పైగా నమోదైంది. ఈ సంస్థలకు 2027-28 ఆర్థిక సంవత్సరం దాకా ₹6,800 కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించింది. పీఎం మాన్ధన్ దేశంలో 14 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన' పేరిట స్వచ్ఛంద-సహకార పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తద్వారా వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత ₹8,000 దాకా కనీస వెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం కింద 2025 జూలై వరకూ 24,88 లక్షల మంది రైతులు పేరు నమోదు చేసుకున్నారు. శ్రీ అన్న (చిరుధాన్యాల) మార్కెటింగ్ ప్రగతి ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం 2025 మే నెలలో రాగి వంటకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు ₹596 వంతున పెంచేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఇది రెండో అత్యధిక పెంపు కావడం గమనార్హం. భారత్ 2024-25లో 180.15 లక్షల టన్నుల చిరుధాన్యాలను ఉత్పత్తి చేసి, అందులో 89,000 టన్నులకు పైగా ఎగుమతి చేసింది. ఉత్పాదనలో రాజస్థాన్ అగ్రస్థానం సాధించగా మహారాష్ట్ర, కర్ణాటక తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆధారం: న్యూ ఇండియా సమాచార్