రైతులు వేసిన పంటలే మళ్ళీ వేస్తూ బాగా నష్టపోతున్నారు. పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గతుంది. పంట మార్పిడిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. పంట మార్పిడి వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏళ్ళ తరబడిగా వేసిన వెంటనే వేస్తూ ఒకరిని చూపి మరొకరు పంటలో మార్పు లేకుండా సాగు చేయడం జిల్లాలో అధికంగా కనిసిపిస్తుంది. ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. పంట మార్పిడి మూలంగా – నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి అవుతుంది. చీడపీడలు దూరం అవుతాయి. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గుతుంది. శిలీంధ్ర వ్యాధులను దూరం చేయవచ్చు. బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాణం ఉంది. సూచనలు జొన్న పంట సాగుచేసిన పొలంలో మిరప వేయొద్దు. వేరుశనగ సాగుచేసిన తరువాత మళ్లీ అదే పంట వేసుకోరాదు. దీనివల్ల ఎర్ర గొంగళి పురుగు, శనగ పచ్చ పురుగు ఆశించవచ్చు. రుశనగ తర్వాత ఆముదంలో పంట మార్పిడి చేసుకోవచ్చు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాట, ఉలవలు, మినుము, పెసర పంటలు వేస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి. అందుకు వాటిని పంట మార్పిడి చేయరాదు. జాగ్రత్తలు పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలవలు, పెసర పంటలు వేయడంతో నేలను కప్పి ఉంచుతాయి. కలుపు మొక్కలను నివారించవచ్చు. లెగ్యూమ్ జాతి (పప్పుదినుసులు) పైర్లపై వేయడం వల్ల రైజోబియం బుడిపెలు ఏర్పడతాయి. ఇవి గాలిలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించి నేలను సారవంతం చేస్తాయి. ఈ జాతి పంటలను పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవచ్చు. పత్తి పైరును మునుము, పెసర వంటి పంటతో మార్పిడి చేయడం వలన దోమ ఉధృతి తగ్గుతుంది. వేరుశనగ తరువాత జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు పండించాలి. దీనివల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని తగ్గించవచ్చు. వరిపైరు తరువాత పప్పుధాన్యాల పైర్లను నూనెగింజల పైర్లను గాని పండించడం వలన వరి పంటను ఆశించే టుంగ్రోవైరస్, దోమపోటులను నివారించవచ్చు. రైతులు పాటించాల్సింది భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తరువాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర, ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసే ఏడాదిలో పెండు పంటలు పండించుకోవాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక