సేంద్రియ ఎరువులు : భూమికి బలం - పంటకు ఆరోగ్యం- మనకు సంపూర్ణ ఆహారం సేంద్రియ ఎరువులు నేల సారాన్ని పెంచి. సూక్ష్మజీవాల కార్యకలాపాలను పెంపొందించి, పంటల నాణ్యతను మెరుగుపరుస్తాయి. వాతావరణ మార్పులను తగ్గించడంలో, భూ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పశువుల ఎరువు (Farm Yard Manure - FYM) ప్రయోజనాలు: నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. నేలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. సూక్ష్మ జీవుల సంఖ్యను పెంచుతుంది. పోషకాలు (సగటు శాతం): పోషకాలు సగటు శాతం సేంద్రియ కర్బనం (OC) 12 – 18 % నత్రజని (N) 0.5 – 0.8 % భాస్వరం (P₂O₅) 0.2 – 0.4 % పొటాషియం (K₂O) 0.5 – 0.8 % కాల్షియం (Ca) 0.5 – 1.0 % కోళ్ల ఎరువు (Poultry Manure) ప్రయోజనాలు: పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నత్రజని అధికంగా ఉండే మంచి ఎరువు. వేగంగా పనిచేస్తుంది. పోషకాలు (సగటు శాతం): పోషకాలు సగటు శాతం సేంద్రియ కర్బనం (OC) 20 – 30 % నత్రజని (N) 1.5 – 2.5 % భాస్వరం (P₂O₅) 1.5 – 3.5 % పొటాషియం (K₂O) 1.5 – 2.5 % కాల్షియం (Ca) 4 – 8 % వర్మి కంపోస్ట్ (Vermicompost) ప్రయోజనాలు: పోషకాలు సులభంగా గ్రహించే రూపంలో ఉంటాయి. మొక్కల వేగవంతమైన ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. నేల సారాన్ని, నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. పోషకాలు (సగటు శాతం): పోషకాలు సగటు శాతం సేంద్రియ కర్బనం (OC) 12 – 20 % నత్రజని (N) 1.0 – 1.8 % భాస్వరం (P₂O₅) 0.5 – 1.0 % పొటాషియం (K₂O) 0.8 – 1.2 % కాల్షియం (Ca) 1.5 – 2.0 % పచ్చి రొట్ట ఎరువులు (Green Leaf Manures) ప్రయోజనాలు: నేలలో సేంద్రియ పదార్థాలను పెంచుతుంది. నత్రజనిని స్థిరీకరించి నేల సారాన్ని పెంచుతుంది. మట్టి నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. పోషకాలు (సగటు శాతం): పోషకాలు సగటు శాతం సేంద్రియ కర్బనం (OC) 8 – 15 % నత్రజని (N) 2 – 3.5 % భాస్వరం (P₂O₅) 0.5 – 6 % పొటాషియం (K₂O) 1.0 – 2.0 % కాల్షియం (Ca) 1.0 – 1.5 % సేంద్రియ ఎరువుల ఉపయోగాలు నేల సారాన్ని జీవక్రియను పెంచుతాయి నీటి నిల్య సామర్ధ్యాన్ని పెంచుతాయి సూక్ష్మ జీవుల చలనం పెరుగుతుంది పంటల ఉత్పదకత మరియు నాణ్యత మెరుగుపరస్తాయి రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి మానవ ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి హానికరం కాదు. వినియోగ సూచనలు పంట రకం, నేల రకం, ఉత్పత్తి స్థాయికి అనుగుణంగా వాడాలి పూర్తిగా కుళ్ళిన (Well decomposed) సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి ఎకరానికి సాధారణంగా 4 నుండి 5 టన్సుల వరకు పశువుల ఎరువు కంపోస్ట్ వాడాలి సేంద్రియ, రసాయన ఎరువులను సమతుల్యంగా ఉపయోగిచడం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. " సేంద్రియ ఎరువు వాడండి - ఆరోగ్యమైన ఆహారం పండించండి - ఆరోగ్యంగా జీవించండి " ఆధారం: ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ