ఆయిల్ పామ్ సాగు స్థిరమైన ఆదాయానికి స్మార్ట్ ఎంపిక ఇటీవల కాలంలో వరి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.ఉత్పత్తి ఖర్చులు అధికమవడం వల్ల వరి సాగు అంతగా లాభదాయకంగా లేకపోవడం రైతులనుఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు స్థిరమైన ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మళ్లించడం అత్యవసరం అయింది. ఈ సందర్భంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్ పామ్ సాగు రైతులకు ఒక ఉత్తమ అవకాశంగా ఎదుగుతోంది. ఒకసారి తోటను సక్రమంగా నాటుకుంటే, ఇది అనేక సంవత్సరాల పాటు నిరంతర ఆదాయాన్ని అందించే శాశ్వత పంటగా నిలుస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశముండడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగు రైతులకు బంగారు భవిష్యత్తును అందించగలదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు ప్రత్యేక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోంది. నాట్లు, సాగు పద్ధతులు, నీటి సదుపాయాల కోసం సబ్సిడీలు, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. అనేక మంది రైతులు వరి వంటి సంప్రదాయ పంటల నుంచి ఆయిల్ పామ్ సాగు వైపు మారుతూ, తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. వరి సాగులో పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్ ధరల్లో మార్పులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థిరమైన ఆదాయం ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల అవసరం పెరిగింది. ఆయిల్ పామ్ అలాంటి పంటల్లో ముఖ్యమైనది. ఒకసారి తోటను నాటితే 25-30 సంవత్సరాల పాటు నిరంతర ఆదాయం వచ్చే శాశ్వత పంటగా ఇది రైతులకు బలమైన ఆర్థిక భద్రతను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ కొత్త తోట ఏర్పాటుపై పూర్తి అవగాహన, సరైన ప్రణాళిక, శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారా రైతులు దీర్ఘకాలికంగా లాభాలను పొందగలరు. ఈ వ్యాసంలో ఆయిల్ పామ్ తోట నాటడం నుంచి నిర్వహణ వరకు అన్ని ముఖ్య అంశాలను సులభంగా తెలుసుకుందాం. కొత్తగా ఆయిల్ పామ్ పంట వేసుకోదలిచిన రైతులు ముందుగా ఆ మండల ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ మండలానికి కేటాయించిన కంపెనీ రైతుకు సబ్సిడీ మీద మొక్కలు సరఫరా చేస్తుంది. అనుకూల వాతావరణం & నేల 25-35° ఉష్ణోగ్రత అనుకూలం లోతైన, సారవంతమైన, నీరు నిల్వ కాకుండా డ్రైనేజ్ ఉన్న నేల ఉత్తమం pH స్థాయి: 4.5- 6.5 మధ్య ఉండాలి. భూమిని బాగా దున్ని సమతలంగా చేయాలి 60x60x60 సెం.మీ. గుంతలు తవ్వాలి గుంతల్లో పశువుల ఎరువు (FYM), నేల మిశ్రమం కలపాలి నీరు నిల్వ కాకుండా డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. నాటే విధానం మొక్కలు వేసుకునే పద్ధతి రెండు రకాలు చతురస్రాకార పద్ధతి : ఎకరానికి 48మొక్కలు త్రిభుజాకార పద్ధతి : ఎకరానికి 57 మొక్కలు. నాటే దూరం : 9x9 మీటర్లు (త్రిభుజాకార పద్ధతి), ఒక్క ఎకరాకు సుమారు 55-60 మొక్కలు,నాణ్యమైన నాట్లను మాత్రమే ఎంపిక చేయాలి. నీటి నిర్వహణ : ఆయిల్ పామ్‌కు ఎక్కువ నీరు అవసరం, డ్రిప్ ఇరిగేషన్ఉత్తమ పద్ధతి, వేసవిలో తరచుగా నీరు ఇవ్వాలి, మల్చింగ్ ద్వారా తేమ నిల్వ ఉంచాలి. ఎరువుల నిర్వహణ : ప్రతి సంవత్సరం సేంద్రియ ఎరువులు (FYM) ఇవ్వాలి నత్రజని, భాస్వరం, పొటాష్ సరైన మోతాదులో ఇవ్వాలి మైక్రోన్యూట్రియెంట్స్ అవసరాన్ని బట్టి ఇవ్వాలి మొక్క వయస్సును బట్టి ఎరువుల మోతాదు మార్చాలి. తెగుళ్లు & కీటక నియంత్రణ రైనోసెరాస్ బీటిల్, రెడ్ పామ్ వీవిల్ ప్రధాన కీటకాలు అవసరమైతే సమగ్ర కీటక నియంత్రణ (IPM) పాటించాలి చెట్లను తరచుగా పరిశీలించాలి సేంద్రీయ, రసాయన నియంత్రణ పద్ధతులు అనుసరించాలి. మెరుగైన మొక్కల ఎదుగుదలకు : కలుపు నియంత్రణ తప్పనిసరి పొడి ఆకులుతొలగించి మల్చింగ్లాగా కవర్ చేయడంతో నేలలో తేమ నిల్వ ఉంటుంది. అంతర పంటలు ఎప్పటికప్పుడు పాత ఆకులను తొలగిస్తే కొత్త ఆకులు చిగురించటంతోపాటు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. కాపునకు ముందు మొక్క తోట నిర్వహణ: ఖాళీలను క్రమం తప్పకుండా పూరించాలి. మొదటి సంవత్సరంలో 3 వ వంతు ఎరువులు వేయాలి. క్రమం తప్పకుండా కలుపు తీయాలి. నీటి తడులను క్రమం తప్పకుండా అందించాలి. మొక్కలు బెట్టకు గురికాకుండా చూడాలి. పంట పండే ముందు దశలో మరింత సేంద్రియ ఎరువులు వేయాలి. పోషకాల లోపాలను గమనించడానికి క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. అంతర పంటల ఎంపిక : అంతర పంటలు సాంద్రత ప్రధాన పంటతో పోషకాలు, నీరు, సూర్యరశ్మి కోసం పోటీపడ కూడదు. ఎంపిక చేసిన పంట ఉత్పత్తికి క్రమబద్ధమైన మార్కెట్ సౌకర్యం ఉండాలి. తోటల్లో పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా చూడాలి. యూనిట్ విస్తీర్ణం నుంచి అదనపు ఆదాయాన్ని పొందడానికి అంతర పంటలను సాగు చేయాలి. ఆయిల్ పామ్ + వేరుశనగ, ఆయిల్ పామ్ + పత్తి, ఆయిల్ పామ్ + మొక్కజొన్న, ఆయిల్ పామ్ + పొద్దుతిరుగుడు, ఆయిల్ పామ్ + కూరగాయలు, ఆయిల్ పామ్ + కోకో, ఆయిల్ పామ్ + మిరియాలు సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ఆయిల్ పామ్ సాగు సరైన పద్ధతిలో చేస్తే రైతులకు స్థిరమైన ఆదాయం కలిగించే పంట. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ