వివిధ కార్తెల్లో చేయవలసిన వ్యవసాయ పనులు అశ్వని కార్తె సజ్జ : వేసవి పైరు కోతలు వరి : కోతలు, కత్తెరకు (కృత్తిక) వరి నారు పోయుట. జొన్న : వేసవి జొన్న పంట సాగు. మొక్కజొన్న : వేసవి పంట విత్తుట. వేరుశనగ : త్రవ్వకాలు భరణి కార్తె వేసవి పనులు కృత్తిక కార్తె వేసవి పనులు రోహిణి - మృగశిర కార్తెలు వరి : సార్వ లేక అబి వరినారు పోయుట, వరి వేయబోయే పొలాల్లో ఎరువులు వేయుట. మొక్కజొన్న : దమ్ములు చేయుట. ఎరువులు వేసి దుక్కులు దున్నుట, ఖరీఫ్ పంటలను విత్తుట. కాయ ధాన్యాలు : తక్కువ పంటకాలపు పెసర, మినుము, కంది విత్తుట, అంతర కృషి చేయుట. గోగు : రసాయనిక ఎరువులు వేయుట. పసుపు : భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, విత్తనం వేయుట (కడప, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో) కూరగాయాలు : బెండ, గోరుచిక్కుడు విత్తుట, గుమ్మడి, సొర, పొట్ల, కాకర పాదులు పెట్టుట. సజ్జ : ఎరువులు వేసి దుక్కులు దున్నుట. ప్రత్తి : ఎరువులు వేసి దుక్కులు దున్నుట. విత్తనం వేయుట. పండ్లు : ద్రాక్షకు క్రిమి సంహారక మందులు చల్లుట, ఎరువులు వేయుట, నిమ్మకు ఎరువులు, రేగు, దానిమ్మ మొక్కల నాట్లు. (అంటు కట్టే మొక్కలకు మామిడి టెంకలు నాటడం). వేరుశనగ : రసాయనిక ఎరువులు వేసి విత్తుట. సువాసన మొక్కలు : రూషాకామంచి, పాల్మా రోజా విత్తనాలు చల్లటం. ఆర్ధ్ర కార్తె వరి : నారుమళ్లలో అంతరకృషి, సస్యరక్షణ జొన్న : దుక్కులు దున్నుట, రసాయనిక ఎరువులు వేయుట, విత్తనం వేయుట. మొక్కజొన్న : సస్యరక్షణ - రెండవ దఫా ఎరువులు వేయుట. ప్రత్తి : అంతరకృషి, మొక్కలను పలుచన చేయుట. గోగు : అంతరకృషి, మొక్కలను పలుచన చేయుట. పండ్లు : అరటి, మామిడి, జామనాట్లు, కొబ్బరి చెట్లకు ఎరువులు వేయుట, రేగు, దానిమ్మ నాట్లు. పప్పుధాన్యాలు : వర్షాలు ఆలస్యం అయినచో కంది విత్తుటకు భూమిని తయారు చేయుట - విత్తుట. కూరగాయలు : బీర, సొర, పొట్ల, గుమ్మడి విత్తుట. సువాసన మొక్కలు : నిమ్మగడ్డి, కామాక్షిగడ్డి, సిట్రొనెల్లా నాట్లు. పునర్వసు కార్తె వరి : సార్వా లేక అబి వరినాట్లు, ముందుగా నాటిన వరిలో అంతరకృషి, సస్యరక్షణ. సజ్జ : రసాయనిక ఎరువులు వేసి పునాస లేక ఖరీఫ్ పైరు విత్తుట. వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ. ఆముదం : రసాయనిక ఎరువులు వేసి విత్తుట. మిరప : నారుమళ్లలో విత్తులు జల్లుట. పసుపు : దుగ్గిరాల ప్రాంతంలో నాట్లకు భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, గోదావరి ప్రాంతంలో పైరులో కలుపు తీయుట, గొప్పు త్రవ్వుట, (త్రవ్వటం). పూలు : చేమంతి నారు పోయుట, గులాబి, మల్లె కనకాంబరం చెట్లకు ఎరువులు వేయుట. సస్యరక్షణ. జొన్న : పునాస లేక ఖరీఫ్ జొన్న విత్తుట. విత్తిన పంటకు ఎరువులు వేయుట. సస్యరక్షణ. మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ. నెలాఖరులో ఎరువులు వేయుట. పసుపు : దుగ్గిరాల ప్రాంతంలో పసుపు నాట్లు. చెరకు : సస్యరక్షణ, ఎరువులు వేయుట. పండ్లు : మామిడి, నిమ్మ, నారింజ, అరటి, సపోటాలకు ఎరువులు వేయుట, ద్రాక్ష తీగలను పారించుట, మందులు చల్లుట. జామ, సపోటాలకు అంట్లు కట్టుట. దానిమ్మ, రేగు, అనాస నాట్లు వేయుట. కొర్ర : ఎరువులు వేయుట, దుక్కి తయారు చేయుట. వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ. ఆముదం : కలుపు తీయుట, సస్య రక్షణ. మిరప : నారుమళ్ళలో సస్యరక్షణ. కూరగాయలు : చేమ, వంగనాట్లు. సువాసన మొక్కలు : కామంచి గడ్డి, నిమ్మగడ్డి మొక్కల నాట్లు. పుష్యమి కార్తె వరి : సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట. జొన్న : అంతరకృషి, మొక్కలు పలుచన చేయుట, సస్యరక్షణ. మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ. కొర్ర : విత్తనం వేయుట. మిరప : నాట్లకు భూమి తయారు చేయుట. పొగాకు : నారుమళ్లు తయారు చేయుట. పండ్లు : తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మ జాతి మొక్కలు నాటుట. దానిమ్మ, రేగు, అనాస నాట్లు. వనమహోత్సవం : చెట్లనాట్లకు తయారీ, పొలాల గట్లపై చెట్లనాట్లకు తయారి. పశువులు : దొమ్మ, పారుడు, గురక, గాలికుంటు మరియు యితర వ్యాధుల నుండి కాపాడుటకు చర్యలు. ఆశ్లేష కార్తె జొన్న : అంతరకృషి, రెండవ దఫా ఎరువులు వేయుట, సస్యరక్షణ సజ్జ : అంతరకృషి, సస్యరక్షణ వేరుశనగ : సస్యరక్షణ. ఆముదం : రసాయనిక ఎరువులు వేయుట, అంతరకృషి, సస్యరక్షణ. మిరప : నారుమళ్ళలో సస్యరక్షణ. పొగాకు : నారుపోయుట, తర్వాత సస్యరక్షణ. పసుపు : అర్మూర్, మెట్టుపల్లి, కోరట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పసుపులో కలుపు తీయుట, ఎరువులు వేయుట, కృష్ణా జిల్లాలో భూమిని తయారు చేయుట, విత్తడం పూర్తి చేయుట. వరి : అంతరకృషి, సస్యరక్షణ, ఉల్లికోడు తట్టుకొనే రకాల నాట్లు పూర్తిచేయుట. మొక్కజొన్న : రసాయనిక ఎరువులు వేయుట. కొర్ర : ఆలస్యంగా వర్షాలు పడినచో వెంటనే విత్తనం వేయుట. రాగి : మే నెలలో విత్తిన రాగి కోతలు. కాయధాన్యాలు : తక్కువ పంటకాలపు పెసర, మినుము కోతలు, కంది పంటకు కలుపు తీయుట. ప్రత్తి : అంతరకృషి, రసాయనిక ఎరువులు వేయుట. మాఘ కార్తె జొన్న : మాఘీ జొన్నకు నేల తయారీ. సజ్జ : సస్యరక్షణ. కొర్ర : రసాయనిక ఎరువులు వేసి అంతరకృషి చేయుట. ఆముదం : అంతరకృషి, సస్యరక్షణ, దాసరి పురుగు నివారణ పొగాకు : నారుమళ్ళలో సస్యరక్షణ, పొగాకు వేయు చేలలో దుక్కులు తయారు చేయుట. పసుపు : మే, జూన్, జూలై నెలల్లో నాటిన పైరులో సస్యరక్షణ, ఎరువులు వేయుట. వరి : సస్యరక్షణ, కలుపు తీయుట, రెండవ దఫా ఎరువులు వేయుట. కాయధాన్యాలు : తక్కువ పంటకాలపు మినుము పంటకు వస్తుంది. వేరుశనగ : సస్యరక్షణ. ప్రత్తి : సస్యరక్షణ మిరప : నారుమడిలో సస్యరక్షణ, నాట్లకు దుక్కులు తయారు చేయుట. పశుగ్రాసాలు : చలికాలపు పశుగ్రాసాల నాట్లకు నేలను తయారు చేయుట, విత్తనం సేకరించుట. పశువులు : వ్యాధులు రాకుండా టీకాలు వేయించుట. చేపల పెంపకం : మడుగులు నిర్మించుట, విత్తనం సేకరించుట. అటవీ శాస్త్రం : మెట్టపొలాల గట్లపై చెట్లు నాటుట. పండ్లు : జీడిమామిడి తోటల నాట్లు, మామిడి మొక్కల నాట్లు, ఎరువులు వేయుట. పుబ్బ కార్తె వరి : రసాయనిక ఎరువులు వేయుట, సస్యరక్షణ, కలుపు తీయుట. జొన్న : రబీ జొన్న వేయుటకు దుక్కులు తయారు చేయుట. వేరుశనగ : సస్యరక్షణ, ఎరువులు వేయుట. పసుపు : ఆగష్టులో నాటిన పైరులో కలుపు తీయుట, జూన్‌లో నాటిన పంటకు పొటాష్ వంటి ఎరువులు వేయుట. సస్యరక్షణ చర్యలు. కూరగాయలు : క్యాబేజి, కాలిఫ్లవర్ పంటలకు నారు పోయుట. ఉత్తర కార్తె సజ్జ : రబీ పంటలకు రసాయనిక ఎరువులు వేయుట, విత్తుట. వేరుశనగ : సస్యరక్షణ. ఆముదం : సస్యరక్షణ. మిరప : మిరప తోటలలో ఖాళీలను పూరించుట, సస్యరక్షణ, అంతరకృషి. పొగాకు : నారుమడిలో సస్యరక్షణ, పొగాకు వేయబోయే చేలలో దుక్కులు దున్నుట. కూరగాయలు : వంగ, టొమాటో నాట్లు. పండ్లు : ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మ మొక్కలు నాటుట. అరటి నాట్లకు నేలను తయారు చేయుట. విత్తనం పిలకలను సేకరించుట. సజ్జ : కోతలు నువ్వులు : జూన్ నెలలో వేసిన పైరు కోతలు ప్రత్తి : సస్యరక్షణ పశుగ్రాసాలు : శీతాకాలపు పశుగ్రాసాల విత్తనం సేకరించుట, నేలను తయారు చేయుట. హస్త - చిత్త కార్తెలు జొన్న : జూలై నెలలో విత్తిన పైరులో సస్యరక్షణ. రబీ జొన్న విత్తుట, సస్యరక్షణ. కాయధాన్యాలు : కోతలు, దీర్ఘకాలపు కందికి సస్యరక్షణ, ఉలవ, శనగ విత్తుట. వేరుశనగ : గుత్తి రకం కాయ తీయుట. మిరప : అంతరకృషి, సస్యరక్షణ, పచ్చికాయ ఏరుట. ఉల్లి : నారు పోయుట. పూలు : గులాబి కత్తిరించుట, ఎరువులు వేయుట. మొక్కజొన్న : కోతలు. ప్రత్తి : సస్యరక్షణ. ఆముదం : అరుణ పైరులో కాయ తీయుట ప్రారంభించుట. పొగాకు : నాట్లు, మూడవ వారంలో ఖాళీలను పూరించడం. పసుపు : సస్యరక్షణ, జూన్ నెలలో నాటిన పైరులో కలుపు తీయుట, రసాయనిక ఎరువులు వేయుట, జూలై నెలలో నాటిన పైరులో అంతరకృషి. కొర్ర : కోతలు కుసుమ : విత్తుట. ధనియాలు : విత్తుట. వాము : విత్తుట. పశుగ్రాసాలు : లూసర్న్, బర్సీము, పిల్లిపెసర, జనుము విత్తుట. పండ్లు : కోస్తా జిల్లాల్లో అరటి పిలకల నాట్లు, రేగు పండ్ల మొక్కలు, దానిమ్మ మొక్కల నాటు. స్వాతి కార్తె వరి : తక్కువ పంటకాలపు రకాల కోతలు. జొన్న : రబీ జొన్నలో సస్యరక్షణ, ఖరీఫ్‌లో వేసిన తక్కువ పంట కాలపు రకాలు కోతకు వచ్చుట. వేరుశనగ : తీగ రకం కాయ తీయుట. గోగు : కోతలు. పొగాకు : అంతరకృషి ఆలుగడ్డ : నాటుటకు భూమిని తయారు చేయుట. మొక్కజొన్న : రబీ పంటకు విత్తనాలు వేయుట. పశుగ్రాసాలు : చలికాలపు పశుగ్రాసాలు విత్తుట. (పిల్లిపెసర, లూసర్న్) చిలగడ దుంప : నాటుట. విశాఖ కార్తె జొన్న : రబీ జొన్నలో అంతరకృషి, తొందరగా విత్తిన వాటికి సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట. మొక్కజొన్న : రబీ పంటకు విత్తనం వేయుట. గోధుమ : భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, రెండవ వారంలో విత్తుట. ప్రత్తి : ఖరీఫ్ ప్రత్తిలో ఎరువులు. గోగు : కోసిన గోగు మొక్కలను నీటిలో ఊర వేయుట. మిరప : అంతరకృషి, సస్యరక్షణ. పొగాకు : అంతరకృషి, సస్యరక్షణ. ఉల్లి : నాట్లు. కాయధాన్యాలు : తక్కువ పంట కాలపు పెసర, మినుము, వరి పండిన పొలాల్లో చల్లుట, కందికి సస్యరక్షణ. పసుపు : సస్యరక్షణ, జూన్ నెలలో నాటిన పైరులో ఎరువులు వేయుట, ఆఖరి సారి నాగలితో అంతరకృషి. కాయగూరలు : క్యాబేజి, కాలిఫ్లవర్ నాట్లు, కంద నాట్లు, బిన్నీసు విత్తుట. పండ్లు : మామిడి తోటలకు సస్యరక్షణ, అరటి నాట్లు. అనూరాధ కార్తె వరి : మధ్య కాలిక రకాల కోతలు, రబీ పైర్లకు నారు పోయుట. మొక్కజొన్న : సస్యరక్షణ. మిరప : తోటలలో సస్యరక్షణ. చెరకు : చెరకు తోటలు కొట్టడం ప్రారంభం. కార్శి తోటల పెంపకం, బెల్లం తయారి, చెరకు పిప్పిని పాతరవేయుట. గోధుమ : ఇంకా విత్తనచో వెంటనే విత్తనం వేయుట. జొన్న : రబీ పైరులో సస్యరక్షణ. గోగు : నార తీయుట. పసుపు : సస్యరక్షణ. పశుగ్రాసాలు : చెరకు పిప్పిని పాతర వేసి పశుగ్రాసంగా మార్చడం. కాయధాన్యాలు : కంది విత్తడం పశువులు : ఈనిక కాలంలో మాయ పడనిచో తగు జాగ్రత్తలు తీసికొనుట, దూడలకు ఏలిక పాములు రాకుండా నివారణ చర్యలు. పండ్లు : ఫాల్సా కత్తిరింపులు, ఉసిరి కాయలు మార్కెటింగ్, పచ్చళ్ళ తయారీ. సువాసన మొక్కలు : కోతలు, సుగంధ తైలం తీయుట. జ్యేష్ఠ కార్తె వరి : దీర్ఘకాలిక రకాల కోతలు, రబీ నారుమళ్ళకు ఎరువులు వేయుట, సస్యరక్షణ. మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట. గోధుమ : అంతరకృషి, సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట. కాయధాన్యాలు : దీర్ఘకాలిక కంది రకాలు కోతకు వచ్చుట. మిరప : సస్యరక్షణ. పొగాకు : తలలు త్రుంచుట, సస్యరక్షణ. చెరకు : నరుకుట, బెల్లం తయారీ. పసుపు : ఆగష్టులో నాటిన పైరుకు రసాయనిక ఎరువులు వేయుట. అన్ని ఋతువుల్లో నాటిన పైర్లకు సస్యరక్షణ, ఎరువులు వేయుట. పూలు : గులాబీల్లో బడ్డింగ్ చేయుట, ఎరువులు వేయుట. ప్రత్తి : మాగాణి ప్రత్తికి భూమిని తయారు చేయుట. ఆముదం : దీర్ఘకాలిక రకాల కాయ తీయుట ప్రారంభించుట. పండ్లు : ఫాల్సా కత్తిరింపులు, ఉసిరిక, నిమ్మకాయ పచ్చళ్ల తయారీ. సువాసన మొక్కలు : కోతలు, తైలం తీయుట. మూల కార్తె వరి : నారుమడికి ఎరువులు వేయుట, దాళ్వా లేక తాబి వరినాట్లకు పొలం తయారు చేయుట. మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ, ఎరువులు వేయుట. గోధుమ : సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట. రాగులు : రాగి విత్తుట. కాయధాన్యాలు : పెసర, మినుములను వరి పండించిన భూముల్లో విత్తుట, కంది కోతలు, కంది మొడెం పంటగా సాగు చేయుట. మిరప : పండు కాయలు కోయుట. చెరకు : తెలంగాణా జిల్లాలో నాట్లు. ఉల్లి : వరి పండించిన నేలల్లో నాటుట. వేరుశనగ : వరి పండించిన చేలలో విత్తుట. పండ్లు : అరటికి పిలకలు తీయుట. నాటిన పిలకలకు ఎరువులు వేయుట. పూర్వాషాడ - ఉత్తరాషాడ కార్తెలు వరి : తాబీ లేక దాళ్వా వరి నాట్లు, నాటిన వరికి కలుపు తీయుట, సస్యరక్షణ. జొన్న : సంకర జొన్నకు నేలను తయారు చేయుట, విత్తనం వేయుట. సజ్జ : వేసవి పంటకు నేల తయారి - విత్తనం వేయుట. ప్రత్తి : మాగాణి ప్రత్తికి నేలను తయారు చేయుట. మొక్కజొన్న : ఎరువులు వేయుట, అంతరకృషి. పసుపు : మే నెలలో ఆర్మూర్, కొరుట్ల, మెట్టుపల్లి మరియు యితర ప్రాంతాలలో నాటిన కస్తూరి రకం పసుపు త్రవ్వుట, విత్తనం నిల్వ చేసుకొనుట. వేరుశనగ : డిశంబరులో విత్తిన వేరుశనగకు అంతరకృషి, తెలంగాణా ప్రాంతంలో నీటి వసతి క్రింద విత్తుట. ఆముదం : విత్తుట చెరకు : తెలంగాణా జిల్లాల్లో నాటిన పైరుకు, కార్శి తోటల్లో ఎరువులు వేయుట, సస్యరక్షణ, కోస్తా రాయలసీమల్లో క్రొత్త తోటలను నాటుట. పప్పు దినుసులు : వరి పొలాలందు (మాగాణిలో) నవంబరులో వేసిన మినుము, పెసర కోతలు. కూరగాయలు : బఠాణికాయ ఏరుట, ధనియాలు కోతలు పండ్లు : మామిడిపై తేనె మంచు పురుగు నివారణ చర్యలు, అరటి, ద్రాక్ష నాట్లకు గుంతలు త్రవ్వుట, ఉసిరి కాయలు అమ్ముట, నిల్వచేయుట. పువ్వులు : గులాబి, మల్లెల కత్తిరింపులు, ఎరువులు వేయుట, చామంతి పూల కోతలు. ధాన్య నిల్వలు : విత్తనాలు నిల్వ చేసుకొనుటలో జాగ్రత్తలు తీసుకొనుట, నిల్వ ఉంచిన ధాన్యానికి పురుగు పట్టకుండా శాస్త్రీయ పద్ధతులను పాటించుట. శ్రవణం కార్తె ధనిష్ఠా కార్తె వరి : ముందు మాసాల్లో నాటిన వరికి రెండవ దఫా ఎరువులు వేయుట, కలుపు తీయుట. జొన్న : రబీ జొన్న కోతలు, వేసవి పంటకు ఎరువులు వేయుట, అంతరకృషి. గోధుమ : కోస్తా జిల్లాల్లో కోతలు, తెలంగాణాలో నీరు పెట్టుట, సస్యరక్షణ, ఎలుకల నిర్మూలన. సజ్జ : వేసవి పంట విత్తుట, ఎరువులు వేయుట. ప్రత్తి : మొక్కలు పలచన చేయుట. ఎరువులు వేయుట, సస్యరక్షణ చెరకు : మూలకార్తెలో (ముందు మాసాలలో) నాటిన పంటకు, కార్శి తోటలకు ఎరువులు వేయుట. వేరుశనగ : వరి పొలాల్లో వేసిన పంటకు సస్యరక్షణ కుసుమ : కోతలు మార్కెట్‌కు పంపుట ఆముదం : ముందు మాసాలలో విత్తిన పంటకు సస్యరక్షణ పొగాకు : ఆకు కోత, క్యూరింగ్ చేయుట. మిరప : కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పండు కాయ ఏరుట, అమ్ముట పండ్లు : ద్రాక్ష గుత్తులు కత్తిరించుట - మార్కెట్‌కు సస్యరక్షణ, పండ్లను నిల్వ చేయుట. శతభిషా కార్తె మినుము : వరి మాగాణుల్లో వేసిన మినుము కోతలు. వేరుశనగ : వేసవి పంటకు సస్యరక్షణ, తెలంగాణా జిల్లాల్లో విత్తిన పంటకు ఎరువులు వేయుట. ఆముదం : సస్యరక్షణ, తెలంగాణాలో విత్తిన పంటకు అంతరకృషి. పసుపు : సస్యరక్షణ, తెలంగాణాలో విత్తిన పంటకు అంతరకృషి. కూరగాయలు : బెండ విత్తుట, బీర, సొర పాదులు వేయుట, టమాట, వంగ విత్తనం తీయుట. మెంతులు : కోతలు - విత్తనం తీయుట. జీలకర్ర : కోతలు - విత్తనం తీయుట. పండ్లు : ద్రాక్ష గుత్తులు కోయుట - అమ్ముట, పండ్ల పానీయాలు తయారు చేయుట. మిరప : ఏరుట, మార్కెట్‌కు పంపుట. పూర్వాబాధ్ర కార్తె వరి : రెండవ పంటకు ఎరువులు వేయుట, సస్యరక్షణ గోధుమ : తెలంగాణా రాయలసీమ జిల్లాల్లో కోతలు. జొన్న : వేసవి పంటకు సస్యరక్షణ. ప్రత్తి : ఎరువులు వేయుట - సస్యరక్షణ, ఎడ సేద్యం. రాగి : రబీ రాగి కోతలు సజ్జ : సస్యరక్షణ వేరుశనగ : ఎరువులు - సస్యరక్షణ పసుపు : జూలైలో నాటిన పసుపు త్రవ్వుట. మిరప : ఎండు కాయలు అమ్ముట, విత్తనం తయారు చేయుట. పొగాకు : ఆకు కోయుట, క్యూరింగ్ చెరకు : జనవరిలో నాటిన పైరుకు ఎరువులు వేయుట, సస్యరక్షణ పప్పుదినుసులు : మాగాణిలో విత్తిన పెసర, మినుము పంటకు వచ్చుట. ఆకుకూరలు : పాల, తోట, చుక్క కూరలు విత్తుట. అల్లం : పంట త్రవ్వకాలు పువ్వులు : చామంతి పూలు ఏరుట. ఉత్తరబాధ్రా కార్తె పసుపు : పంటకాలు మార్కెట్‌కు పంపుట, విత్తనం సేకరించుట. ఆముదం : సస్యరక్షణ అల్లం : త్రవ్వకాలు, అమ్మకాలు, శొంటి తయారీ. గోధుమ : ఆలస్యంగా విత్తిన పంట కోతలు వేరుశనగ : డిశెంబర్లో విత్తిన పంట నుండి కాయ త్రవ్వుట. పండ్లు : ద్రాక్ష పండ్ల ఎగుమతి, నిల్వలు పానీయాలు తయారు చేయుట. కూరగాయలు : వేసవి కూరగాయల పెంపకం. పప్పు దినుసులు : పెసర, మినుము కోతలు ఖర్భూజ తర్బూజ : సస్యరక్షణ, తొందరగా విత్తిన పంటలు కోతలకు తయారగుట. ఉల్లిగడ్డ : డిశంబర్‌లో నాటిన ఉల్లి త్రవ్వకాలు వరి : అశ్వని కార్తెలో వేయబోయే వరిని విత్తుట రేవతి కార్తె వరి : స్వల్పకాలిక రకాల కోతకు తయారి, అశ్వనీ కార్తె వరికి పొలం తయారి. జొన్న : జనవరి మొదటి వారంలో విత్తిన జొన్న కంకులకు పురుగుల నుండి రక్షణ. వేరుశనగ : డిశంబర్ ఆఖరులో విత్తిన పంట త్రవ్వకాలు. ప్రత్తి : మాగాణి ప్రత్తిలో కాయ తొలిచే పురుగు నివారణకు మందులు చల్లుట చెరకు : అంతరకృషి, నీరు పెట్టుట, బోదె సవరింపులు పసుపు : ఆగష్టులో నాటిన పంట త్రవ్వకాలు, వండుట, మార్కెట్‌కు పంపుట. పొగాకు : అమ్మకాలు. పండ్లు : నిమ్మ, నారింజలో ఎండు కొమ్మల కత్తిరింపు, బోర్డో మిశ్రమం పూయుట, గజ్జి రాకుండా మందులు చల్లుట, ద్రాక్ష అమ్మకాలు పూర్తి చేయుట, అరటికి అంతరకృషి. కూరగాయలు : ఉల్లిగడ్డల త్రవ్వకం, ఆకు కూరలకు ఎరువులు వేయుట, కాకర పాదులు తయారు చేయుట. అల్లం : త్రవ్వకాలు పూర్తి చేయుట, దుక్కులు తయారు చేయుట. ముద్రణలు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతి సంవత్సరం ఏ కార్తెలో ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయి, ఏ నేలలో ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేస్తే అధిక లాభాలు వస్తాయి వంటి అనేక విషయాలను కూలంకషంగా వివరించిన పుస్తకాన్ని ముద్రించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అంకితమిస్తుంది. ఆధారము: వికీపీడియా