అన్ని కాలాల్లో పచ్చి మేతను అందించే బహు వార్షిక పశుగ్రాసాలు ముఖ్యమైనవి క్రింద వివరించబడినవి. హైబ్రిడ్ నేపియర్ ఇది నేపియర్ గడ్డిని సజ్జతో సంకర పరుచగా ఉద్భవించిన పశుగ్రాస రకం. రకాలు ఎ.పి.బి.ఎన. 1, కో.3, ఐ.జి.ఎఫ్ . ఆర్ . ఐ. 6, ఎన్ .బి. 21. విత్తేసమయం ఫిబ్రవరి – ఆగస్ట్ మధ్యలో (చలి కాలంలో తప్ప) విత్తనంలు 22 -30 వేల కాండపు మొక్కలు ఒకసారి నాటితే 3 –4 సం ఉంటుంది విత్తు పద్ధతి వరుసలలో, వరుసల మధ్య అంతరము 50 - 75 సెం.మీ, ఎరువులు వాడకం 20 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాష్ (ఒక ఎకరాకు). నీటి తడులు ఎండ కాలంలో 8-21, చలికాలంలో 15 నుండి 20 రోజుల వ్యవధికి ఒక్కసారి మొదటి కోత నాటిన తర్వాత 60 – 75 రోజులకు కోతలు ప్రతి 40-45 రోజులకు ఒకసారి 5 – 6 కోతలు వస్తుంది. దిగుబడి పచ్చిమేత 72 నుండి 160 టన్నులు ఒక ఎకరానికి ఇస్తుంది. పశుగ్రాసాల సాగులో రైతులకు శిక్షణ (హైబ్రిడ్ నేపియర్) పార గడ్డి రకాలు హమిల, మాకుని, రివర్స్ డేల్ , గ్రిన్ పానిక్ , గాటన్ పానిక్ , పి.పి.బి.14 విత్తేసమయం ఫిబ్రవరి – ఆగస్ట్ మధ్యలో (చలి కాలంలో తప్ప) కావలసిన నారు మొక్కలు 30 – 40 వేల నారు మొక్కలు నాటు పద్ధతి వరుసలలో, చాళ్ళ మధ్య అంతరము 45 – 60 సెం.మీ ఎరువులు వాడకం 60 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్ (ఒక ఎకరాకు). నీటి తడులు ఎండ కాలంలో 8-10, చలికాలంలో 15 నుండి 20 రోజుల వ్యవధికి ఒక్కసారి మొదటి కోత నాటిన తర్వాత 50 – 60 రోజులకు కోతలు ప్రతి 40-45 రోజులకు ఒకసారి 3 – 4 కోతలు వస్తుంది దిగుబడి పచ్చిమేత 20 నుండి 24 టన్నులు (ఒక ఎకరాకు). ప్రత్యేకత లోతట్టు మరియు మురుగు ప్రాంతాలలో వీటిని పెంచవచ్చు. స్టైలో రకాలు స్టైలో హమట, స్టైలోహమిలిస్, స్టైలోస్కాబ్రా విత్తేసమయం జూన్ –ఆగస్ట్ (నీటీపారుదల క్రింద) కావలసిన విత్తనాలు స్టైలో హమట, 20 – 25 స్టైలోస్కాబ్రా మరియు స్టైలోహమిలిస్ 10 – 15 కిలోలు. విత్తు పద్ధతి చల్లాలి ఎరువులు వాడకం 35 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ (ఒక ఎకరాకు). నీటి తడులు 20 నుండి 30 రోజుల వ్యవధికి ఒక్కసారి. మొదటి కోత చల్లిన తర్వాత 75 – 80 రోజులకు కోతలు రెండు కోతలు ప్రతి 35 – 40 రోజులకు ఒకటి. దిగుబడి పచ్చిమేత 30 నుండి 35 టన్నులు. స్టైలో హమట లూసర్ను రకాలు టి-9, ఆనంద్ -2, ఎస్ -244, కాంప్-3,కో-1 విత్తేసమయం అక్టోబర్ -నవంబర్ విత్తు పద్ధతి సాళ్లలో, సాళ్ళ మధ్య అంతరము 20-25 సెం. మీ ఎరువులు వాడకం 30 కిలోల నత్రజని, 100 కిలోల పొటాష్ (ఒకహెక్టారుకు) నీటి తడులు 2 నుండి 3 తడులు వారానిక ఒక్కసారి. ఆ తర్వాత 10-12 రోజులకు. మొదటి కోత 70 రోజులకు కోతలు ప్రతి 25-30 రోజులకు కొకసారి 6 -7 కోతలు. దిగుబడి పచ్చిమేత 60 నుండి 75 టన్నులు. లూసర్ను ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.