పాడి పశువుకు ఎండుమేత, పచ్చి మేత కలిపి మేపేటప్పుడు ప్రతి 100 కిలోల శరీర బరువుకు 1 కిలో ఎండుమేత, 4 -5 కిలోల పచ్చిమేత మేపవచ్చు. ఎండు గడ్డి, పచ్చిగడ్డి కలిపి మేపితే రోజుకు ఒక పశువుకు 5-6 కిలోల గడ్డి 15 కిలోల పచ్చిమేత కావాలి. గడ్డి పదార్థములను పాలు పితకడానికి ఒక గంట ముందు మేపాలి. ఎండు గడ్డిని ముక్కలుగా నరికి మేపాలి. జొన్న, సజ్జ, మొక్కజొన్న, కాండములు పెద్దగా, లావుగా ఉండుట వలన వర్ర్టిని చిన్న ముక్కలుగా నరికి మేపాలి లేనియెడల మెత్తని భాగము ఆకులు మాత్రమే తిని మిగరాది తొక్కి మల మూత్రాలతో కలిసి 40 శాతము వరకు మేత వృధా అయిపోతుంది. ముక్కలుగా నరికిన మేతలో, తవుడు, బెల్లపు, మడ్డి లవణ మిశ్రమము లాంటి అనుబంధ పదార్థాలు కలిపి పశువులకు మేపుకోవచ్చు. సంచులలో వుంచి కూడా నిలువ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు తప్పని సరిగా పశుగ్రాసాన్ని ముక్కలు చేసి మేపాలి. పచ్చిమేత దొరకనప్పుడు దాణా పాడికి ఇవ్వవలసి వుంటుంది. దాణా మోతాదును పశువు పాల ఉత్పత్తిని బట్టి ఇవ్వాలి. అది ఇచ్చు పాలలో రెండు కిలోల పాల తర్వాత అదనంగా ఇచ్చే ప్రతి 3 లీటర్ల పాలకు, గేదెలకు ప్రతి 2.5 లీటర్ల పాలకు ఒక కిలో చొప్పున దాణా ఇవ్వాలి. దాణా రెండు సమాన భాగాలు చేసి ఉదయం మరియు సాయంత్రం, పాలు పితికే ముందు మేపాలి. చూడి ఆవుకు 1 బర్రెకు అదనంగా 1.5 – 2 కిలోల దాణా మేపటం వలన దూడ ఎదుగుదల తోడ్పడుతుంది. పాడి పశువులకు పుష్కలంగా పరిశుభ్రమైన నీరు త్రాగడానికి ఎల్లప్పుడు అందుబాటులో వుంచాలి. ప్రతి పాడి పశువుకు రోజు 35 – 45 లీటర్ల నీరు త్రాగడానికి ఇంతే మోతాదులో దానిని కడగడానికి శుభ్రతకు కావాలి. సుమారు ప్రతి పశువుకు రోజుకు 100 లీటర్ల నీరు కావలసి వస్తుంది. పాడి పశువులకు ఇవ్వవలసిన పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా మోతాదుల పట్టిక పశువుల ఆవుకు పాల ఉత్పత్తి ఆవుకు పచ్చిమేత (కిలోలు) ఎండుమేత (కిలోలు) దాణా (కిలోలు) గేదెకు 1.పుష్కలంగా పచ్చిమేత లభించే సమయంలో 5 కిలోల వరకు 30 4 -- -- 5-8 కిలోల వరకు 30 4 -- -- 8-11 కిలోల వరకు 30 4 -- -- 11-15 కిలోల వరకు 30 4 -- -- 2. పచ్చిమేత కొరత సమయంలో 5 కిలోల వరకు 4 8 2.0 1.5 5-8కిలోల వరకు 4 8 2.0 1.5 8-11 కిలోల వరకు 4 8 2.0 1.5 పాడి పశువుల పోషణ ఖర్చులో 60 – 70 శాతం మేపు కొరకు ఖర్చవుతుంది. మేపు గురించి శాస్త్రీయ పరిజ్ఞానం వుంటే అందుబాటులో వున్న దాణా దినుసులతో సమీకృత దాణా మిశ్రమాన్ని తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని లాభదాయకంగా పశువులను పోషించుకోవచ్చు. వేరుశెనగ చెక్క, తవుడు, శనగపొట్టు, ఎండు సుబాబుల్ ఆకుతో దాణా మిశ్రమం ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.