పాడి పశువులు సకాలంలో ఎదకు వచ్చి చూలు కట్టి ఈనితేనే లాభసాటిగా వుంటుంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పశువులను ఒకసారి పరిశీలించి ఎదను గమనించాలి. ఎదకు వచ్చిన తర్వాత సకాలంలో కృత్రిమ గర్భధారణ చేయించాలి. ఒక ఎద తప్పితే, 500 రూపాయలు విలువ గల ఉత్పత్తి నష్టపోవలసి వస్తుంది. మొదటిసారి గర్భధారణ చేసే పశువు బరువు కనీసం 250 కిలోలు ఉండేటట్లు మేపాలి. గర్భధారణ జరిగిన 90 రోజుల లోపల చూడి పరీక్ష చేయించాలి. సంకర జాతి పశువులు 15 మాసాలకు గ్రేడెడ్ ముర్రా గేదెలు 2 – 3 సంవత్సరాలకు, దేశవాళి గేదెలు మరియు ఆవులు 3 – 4 సంవత్సరాల వయస్సులో మొదటి సారి ఎదకు రావాలి. దాణా తయారిలో రైతు సోదరులు పాడి పశువుల పునరుత్పత్తి క్రమము పునరుత్పత్తి క్రమము దేశవాళి ఆవు సంకరజాతి ఆవు ముర్రా గేదెలు మొదటి సారి ఎదకు 3 – 4 14 – 18 2.5 – 3.5 వచ్చేవయస్సు సం.లు మాసాలు సం.లు ఎదకు ఎదకు మధ్యకాలం 21 రోజులు 21 రోజులు 21 రోజులు ఎద కాలం (గంటలు) 18-24 18-24 18-36 చూలు కాలం 280 280 310 మొదటిఈత వయస్సు 4 – 5 సం. 2 – 3 సం. 3.5 – 4.5 సం. ఈతకు, ఈతకు మధ్య కాలం 2 సం.పైన 12 – 14 మాసాలు 14 – 16 మాసాలు ఈతలో పాడికాలం 200 రోజులు 300 రోజులు 300 రోజులు సరాసరి పాల ఉత్పత్తి 1 – 2 లీటర్లు 8 – 10 లీటర్లు 6 – 10 లీటర్లు సంకరజాతి ఆవు అయితే 2 – 3 సంవత్సరాల లోపు, గ్రేడెడ్ ముర్రా గేదె అయితే 3 – 4 సంవత్సరాల లోపు మొదటి ఈత్ ఈనాలి. ఈత్కు ఈతకు మధ్య కాలం 12 – 14 మాసాలకు మించకూడదు. 10 సంవత్సరాల వయస్సులో కనీసం 5 – 6 ఈతలు ఈనాలి. పాడికాలంలో అనగా 10 నెలలో 1800 – 2000 లీటర్లకు తక్కువగా కాకుండా పాల దిగుబడి ఇవ్వగల్గేటట్లు మేపాలి. చూడి పశువు పోషణకు పెట్టిన ఖర్చు మున్ముందు పొందబోయే లాభాలకు పెట్టుబడి అని రైతులు భావించాలి. చూడి పశువు ఈనటాన్కి రెండు నెలల ముందు నుండి రోజుకు 1 – 2 కిలోల దాణా మరియు మంచి పచ్చి గడ్డిని మేతగా ఇవ్వాలి. చూడి పశువు ఈనటానికి రెండు నెలల ముందు నుండి క్రమంగా పాలు పితకడం మాని వేయాలి. పొదుగు వాపు వ్యాధి రాకుండా పాడిపశువులలో జాగ్రత్త వహించాలి. పరిశుభ్రమైన పాల ఉత్ప్త్తికి పశువులు మరియు పాలు పితికే వ్యక్తి శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలి. పాలు నిల్వ చేసే పొదుగు వాపు వ్యాధి సోకిన పొదుగు పాత్రలు మరియు పరిసరాలు కూడ శుభ్రంగా ఉండాలి. పాడి పరిశ్రమలో పాలు పితకడం చాలా ముఖ్యమైన పని. పాలు పితకే విధానం బట్టి పాల నాణ్యత మరియు పొదుగు వాపు వ్యాధి రావటం అధార పడి ఉంటుంది. పాల ధర దాని నాణ్యత (శుభ్రత మరియు పాలు చెడిపోకుండా నిల్వఉండే సమయం) మీద ఆధారపడి ఉంటుంది. శుభ్రమైన పాలను శీతల గిడ్డంగి (కోల్డ్ స్టోరేజి) సదుపాయం లేకుండా ఎక్కువ నమయం నిల్వ చేసుకోవచ్చును. కాబట్టి రైతులు పరిశుభ్రమైన పాకలో, ఆరోగ్యవంతమైన పాడి పశువు నుండి పాలు ఉత్పాధన చేసి అధిక లాభాలను ఆర్జించవచ్చును. ఆరుబయట పాలు పితకటం వల్ల దుమ్ము, దూళి పాలలో కలసి పాల నాణ్యత తగ్గి, తొందరగా పాడవుతాయి, కాబట్టి పాలను పాకలోనే పితకాలి. పాలు పితికే పాకను ప్రతి రోజు కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి. పాడి పశువు వెనక కాళ్ళ లోపలి వైపు మట్టి, పేడ ఎక్కువగా అతుక్కొని ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు పాలు పితకటానికి ముందు బ్రష్ తో అక్కడ శుభ్రంగా కడగాలి. ప్రతిరోజు పాలు పితకటానికి ముందు పొదుగును శుభ్రంగా గోరువెచ్చని నీటితో కడిగి, పొడిగుడ్డతో తుడవాలి. మొదటి పాలదారలను స్ట్ర్ప కప్పులోకి వదలి, పొదుగువాపు వ్యాధి ఉన్నది/లేనిది నిర్ధారణ చేసుకోవాలి. పాలు పితికిన తర్వాత చనుమొనలను డిటర్జంట్ శానిటైజింగ్ నీళ్ళలో ఒక్కసారి డిప్ చెయ్యాలి. పాలు పితికే వ్యక్తి పరిశుభ్రమైన దుస్తులు ధరించి, తలకు టోపి (జుట్టురాలి పాలల్లో పడకుండా) పెట్టుకోవాలి. పాలు పితికే వ్యక్తి తన గోళ్ళను క్రమం తప్పకుండా కత్తిరించు కోవాలి. పాలు పితికే వ్యక్తి పితకటానికి ముందు తన చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.