పశువులకు సోకే వివిధ వ్యాధుల పట్ల రైతులు జాగ్రత్త వహించాలి. ఎందు కంటే వ్యాధుల వల్ల పశువులలో పని పాట శక్తి మరియు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇటువంటి వ్యాధులలో ముఖ్యమైనవి గొంతువాపు జబ్బవాపు మరియు గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధులు సోకడం వల్ల లేగ దూడలు, పెయ్యలు, పడ్డలు ఎక్కువ సంఖ్యలో మరణిస్తాయి, పాడి పశువులలో పాల దిగుబడి తగ్గి ఆర్థిక నష్టం కలుగుతుంది. చూడి పశువులలో పిండము పడిపోవచ్చు. దుక్కెటి (దున్నె) పశువులకు వ్యాధులు సోకడం వల్ల సేద్యపు పనులకు అంతరాయం కలుగుతుంది. ఇటువంటి వ్యాధులు ఒకసారి సోకిన తరువాత చికిత్స వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పశువులు తిరిగి కోలుకున్న వాటి ఉత్పాదన శక్తి మరియు సామర్థ్యం తగ్గిపోతుంది, దీర్ఘకాలం ప్రభావాన్ని చూపిస్తాయి. కావున వ్యాధులు రాకముందే సరైన సమయంలో రోగనిరోధక టీకాలు పట్టికలో చూపిన విధంగా వేయించడం వల్ల చికిత్సకు అయ్యే ఖర్చు నుండి బయట పడవచ్చు. అధిక పాలు ఇచ్చే పాడి పశువులలో పాల జ్వరము ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధి పాడి పశువులలో ఈనిన మొదటి వారంలోనే కాల్షియం ధాతువు లోపం కారణంగా వస్తుంది. కాబట్టి పశువులకు ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగినంతగా దాణాలో కలపాలి. పశువులలో గాలి కుంటు వ్యాధి లక్షణాలు గొంతువాపు వ్యాధి సోకిన ఆవుగొంతు వాస్తుంది గాలి కుంటు వ్యాధి సోకిన ఆవు నోటి నుండి చొంగ కారుతుంది. పాడిపశువులలో వచ్చే వ్యాధుల నివారణకు ఇచ్చే టీకాల టీకా పేరు మొదటి సారి మోతాదు తిరిగి చేయాల్సిన సమయం గాలి కుంటు వ్యాధి 2 నెలలు 2 – 3మి.లీ. 9 నెలల తర్వాత గొంతు వాపు వ్యాధి 6 నెలలు కండరంలోనికి 12 నెలల తర్వాత జబ్బవాపు వ్యాధి 6 నెలల 2 – 3మి.లీ. చర్మం 12 నెలల తర్వాత ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.