సాధారణంగా బంజరు భూముల నుండి లభించే పశుగ్రాసం తక్కువ పోషక విలువలు కలిగి ఉంటుంది మరియు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పశువులు రోజు మేయటం వల్ల అక్కడ ఉన్న గడ్డి అంతగా పెరగదు. దీనివల్ల పశువులకు కావలసిన పోషకపదార్థములు తగినంత పరిమాణంలో లభించక పాడిపశువులలో ఉత్పాదన తగ్గిపోతుంది, పెయ్యలలో ఎదుగుదల మందగిస్తుంది, గేదలలో ఎదలక్షణాలు కనబడవు. కాబట్టి, బంజరు భూములలో వర్షాలు పడేముందే సింకరస, స్టైలో, స్వీట్, సూడాన్, రోడ్స్ , సిరాట్రో లాంటి గడ్డి జాతుల విత్తనాలను చల్లి, అవి మంచిగా పెరిగేవరకు పశువులు మెయ్యకుండా ఆ గ్రామంలోని ప్రజలందరు కట్టుబాటు చేసుకోవాలి. మొత్తం బంజరు భూమిని నాలుగు ప్రాంతములుగా విభజించుకొని, వరుసగా 15 రోజులు ఒక ప్రాంతములో ఆ తర్వాత మరొక ప్రాంతాంలో పశువులను మేపాలి. ఈ విధంగా ప్రతి 15 రోజులకు మేసే ప్రాంతం మార్చడం వల్ల మొదట మేసిన ప్రాంతములోనికి మరల నెల రోజుల తర్వాత పశువులు వస్తాయి. ఈ నెల రోజుల వ్యవధిలో అక్కడ ఉన్న పచ్చిక గడ్డి బాగా పెరుగుతుంది. స్టైలోహమట లూసర్ను మొక్కజొన్న పచ్చిమేత గడ్డి రకాల సాగు వివరములు సాగు వివరములు నేపియర్ పారగడ్డి గినీగడ్డి రకములు యస్ బి .21 కో - 1, కో - 2 ఎ . పి . బి . యన్ . 1 లోకల్ గ్రీన్ పానిక్ గాటన్ పానిక్ పి . పి . జి .14 విత్తు సమయము ఫిబ్రవరి - ఆగస్టు నెలల మధ్యలో చలికాలంలో తప్ప జూన్ - జూలై దక్షణ భారతదేశంలో ఎప్పుడైన ఫిబ్రవరి ఆగస్టు నెలల మధ్యలో చలికాలంలో తప్ప హెక్టారుకు కావలసిన నారు మొక్కలు 22 -30 కాండపు మొక్కలు , ఒకసారి నాటితే 3 - 4 సం . లు ఉంటుంది 8-10 క్వింటాళ్ళ బరువుగల కాండపు ముక్కలు లేదా 30,000 నారు మొక్కలు . 30 - 40 వేల నారు మొక్కలు నాటు పద్ధతి వరుసలలో, వరుసల మధ్య అంతరము 50-75 సెం . మీ వరుసలలో, వరుసల మధ్య అంతరము 45-60 సెం . మీవరుసలలో, వరుసలలో, చాళ్ళ మధ్య అంతరము 45-60 సెం . మీ ఎరువు (హెక్టారుకు) 150 కిలోల నత్రజని 60 కిలోల పొటాష్ 150 కిలోల నత్రజని 60 కిలోల పొటాష్ 150 కిలోల నత్రజని 60 కిలోల పొటాష్ నీటితడుపు వేసవి కాలంలో 8-21 రోజులకు ఒకసారి, చలికాలంలో 15-20 రోజులకు ఒకసారి, వేసవి కాలంలో 8-16 రోజులకు ఒకసారి, చలికాలంలో 15-20 రోజులకు ఒకసారి, వేసవి కాలంలో 8-21 రోజులకు ఒకసారి, చలికాలంలో 08-10 రోజులకు ఒకసారి, 15-20 రోజులకు ఒకసారి, మొదటి కోత నాటిన తర్వాత 60-75 రోజులకు నాటిన తర్వాత 75 - 80 రోజులకు నాటిన తర్వాత 50-60 రోజులకు కోతలు ప్రతి 40-45 రోజులకు ఒక్కసారి 5-6 కోతలు ప్రతి 40-45 రోజులకు ఒక్కసారి 6-9 కోతలు ప్రతి 40-45 రోజులకు ఒక్కసారి 3-4 కోతలు దిగుబడి పచ్చిమేత 180-250 టన్నులు పచ్చిమేత 180-250 టన్నులు పచ్చిమేత 180-250 టన్నులు ధాన్యపు రకము పచ్చిమేతల సాగు వివరములు సాగు వివరములు జొన్న మొక్కజొన్న స్వీట్ సూడాన్ గడ్డి రకములు పి . సి .6, పి . సి .23 యంపి . చారి ఆఫ్రికన్ టాల్ , గంగ జవార్ యస్ యస్జి .59-3 వత్తుసమయము వర్షాధారంగా జూన్ ఆగస్టు నీటీ పారుదల క్రింద జనవరి - మే వర్షాధారంగా జూన్ ఆగస్టు నీటీ పారుదల క్రింద జనవరి - మే వర్షాధారంగా జూన్ ఆగస్టు నీటీ పారుదల క్రింద జనవరి - మే విత్తనాలు ( హెక్టారుకు ) 25- 40 కిలోలు 50- 60 కిలోలు 15 కిలోలు విత్తుపద్దతి సాళ్ళలో , సాళ్ళమధ్య 30 సెం . మీ . అంతర సాళ్ళలో , సాళ్ళమధ్య 30 సెం . మీ . అంతర సాళ్ళలో , సాళ్ళమధ్య 30 సెం . మీ . అంతర ఎరువు (హెక్టారుకు) 80 కిలోల నత్రజని 30 పోటాష్ 120 కిలోల నత్రజని 120 పోటాష్ 80 కిలోల నత్రజని 30 పోటాష్ నీటితడుపు 10-15 రోజులకు ఒకసారి 10-15 రోజులకు ఒకసారి 10-15 రోజులకు ఒకసారి మొదటి కోత విత్తిన తర్వాత 50-55 రోజులకు (50 శాత 0 పూతదశలో) విత్తిన తర్వాత 60- 70 రోజులకు (కం కి వేసేటప్పుడు) విత్తిన తర్వాత 55 - 60 రోజులకు కోతలు ప్రతి 35-40 రోజులకు 3 కోతలు ప్రతి 60 - 70 రోజులకు ఒక్క కోత ప్రతి 30 - 35 రోజులకు 4 - 5 కోతలు దిగుబడి పచ్చిమేత 40-50 టన్నులు పచ్చిమేత 40-50 టన్నులు పచ్చిమేత 40-50 టన్నులు కాయజాతి పచ్చిమేతల సాగు వివరములు సాగు వివరములు అలసందలు లూసర్ను స్టైలో రకములు రష్యన్ జెయంట్ ఇ . సి .4216, యు . పి . సి . టి .9, ఆనంద్ 2 స్టైలో హమాట స్టైలో స్కాబ్రా వత్తుసమయము జూన్ – జూలై / ఫిబ్రవరి – జూన్ అక్టోబర్ – నవంబర్ జూన్ - ఆగస్టు (నీటీ పారుదల క్రింద) హెక్టారుకు కావలసిన విత్తనాలు 30- 40 కిలోలు 10-15 కిలోలు స్టైలో హమాట :20-25 కిలోలు స్టైలో స్కాబ్రా 10-15 కిలోలు విత్తుపద్దతి వరుసలలో , వరుసల మధ్య అంతరం 45 సెం . మీ . సాళ్ళలో , సాళ్ళ మధ్య అంతరం 20-25 సెం . మీ. చల్లాలి ఎరువు (హెక్టారుకు) 20 కిలోల నత్రజని 60 కిలోల పోటాష్ 30 కిలోల నత్రజని 100 కిలోల పోటాష్ 35 కిలోల నత్రజని 60 కిలోల పోటాష్ నీటితడుపు 12-15 రోజులకు 2-3 తడువులు, వారానికి ఒకసారి, ఆ తర్వాత 10-12 రోజులకు 20-30 రోజులకు ఒకసారి మొదటి కోత నాటిన తర్వాత 55-60 రోజులకు (పూతదశలో) నాటిన తర్వాత 70 రోజులకు విత్తిన తర్వాత 55 – 60 రోజులకు కోతలు ఒకటే కోత ప్రతి 25-30 రోజులకు ఒకసారి 6-7 కోతలు ప్రతి 35-40 రోజులకు ఒకసారి 4 - 5 కోతలు దిగుబడి పచ్చిమేత 30 – 35 టన్నులు పచ్చిమేత 60 – 70 టన్నులు పచ్చిమేత 30 – 35 టన్నులు ఈ పద్దతిలో మేపడం వల్ల పశువులకు కావలసినంత పశుగ్రాసం లబించి వాటి ఉత్పాదన నిలకడగా ఉంటుంది. బంజరు భూములలో గడ్డి జాతులే కాకుండా సుబాబుల్ , గ్లెరిసిడియం, వేప, తుమ్మ, అవిశ, దిరిశెన, రావి, నల్ల తుమ్మ మొదలైన పశుగ్రాసంగా వాడుటకు ఉపయోగపడే చెట్లు కూడ నటవచ్చు. దీనివల్ల వేసవికాలంలో పచ్చగడ్డి దొరకనప్పుడు ఈ చెట్ల ఆకులు మరియు కాయలను పశువులకు మేతగా పాడుకోవచ్చును. ఈ చెట్ల ఆకులు మరియు కాయలలో గడ్డి జాతులకంటే విలువైన పోషక పదర్థములు ఎక్కువగా ఉంటాయి. మరియు వీటిని పశువులు చాలా ఇష్టంగా తింటాయి. ఇంతేకాక బత్తాయి, నారింజ, దానిమ్మ, మామిడి; మొదలగు పండ్ల తోటలలో, చెట్ల మధ్య ఖాళేగా ఉన్న భూమిలో సికసస్ , స్టైలో, స్ట్వీట్ సూడాన్, రోడ్స్ , సిరాట్రో లాంటి గడ్డి జాతులను పెంచుకోవచ్చు.ఈ విధంగా అభివృద్ధి చేసుకున్న పండ్ల తోటలలో, రెండవ సంవత్సరము ను0డి జీవాలను (గొర్రెలను / మేకలు) మేపవచ్చు. అంతేకాక సుబాబుల్ గ్లైరిసిడియం లాంటి చెట్లను పండ్ల తోటలలో ఒకవైపు సరిహద్దు వంబడి ఒక వరుస నాటి నట్లయితే, వాటికొమ్మలను కోసి, ఆకులు మరియు కాయలను సాయంత్రం పూట మేతగా, దాణాకు బదులుగా ఉపయోగి0చుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల పండ్ల తోటలలో కలుపు మొక్కల సమస్య పోవుటయే గాక, జీవాల నుండి కూడా ఆదాయం వస్తుంది. దీని వల్ల పండ్ల తోట రైతులు మరి0త లాభ పడతారు అభివృద్ధి పరచిన బంజరు భూమిలో గడ్డి మరియు గడ్డిజాతి చెట్లను మేస్తున్న దెక్కనిజాతి జీవాలు. మామిడి తోటలలో నెల్లూరు జాతి గొర్రెల పెంపకం. పచ్చిమేతలను పొలంగట్టు మీద, ఇతర పంటల సాళ్ళ మధ్య,పండ్లతోటలలోను సాగు చేసుకోవచ్చు. (పట్టిక 1,2 మరియు 3), పశు గ్రాస సమస్యను అధిగమిం చుటకు వర్షాధారముగా సగుచేయు సాలుసరి పశుగ్రాస పంటలను (జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసందలు, పిల్లి పెసర, ఉలవలు మొదలైనవి) మరియు బహువార్షిక పంటలను (సింకరస్ , స్టైలో, స్వీట్ సూడాన్ , రోడ్స్ మొదలైన గడ్డి జాతులతో పాటు సుబాబుల్ , గ్లైరిసిడియం, వేప, తుమ్మ, అవిశ, దిరిశెన, రవి, నల్లతుమ్మ మొదలైన పశుగ్రాసంగా పనికి వచ్చే క్జెట్లను కూడా) తమ ప్రాంతానికి అనువైన వాటిని (నేల స్వభావం మరియు వర్ష రీతిని బట్టి) ఎంచుకొని సాగుచేసుకోవాలి. నీటి గుంటల గట్లమీద గినీ గడ్డిని పె0చుకొన్నట్లయితే వర్షాకాలంలో గట్లు తెగిపోకుండా కాపాడుకోవచ్చు మరియు దానివల్ల పశువులకు మేత లభిస్తుంది. సాగు నీరు ఉన్న రైతులు కో-1,కో-3, ఎ.పి.బి.ఎన-1, నేపియర, పార్ గడ్డి మొదలైన పచ్చిమేత గడ్డి రకాలను సాగు చేయవచ్చు. పశుగ్రాసం ఎక్కువగా భించేకాలంలో, వృధాకాకుండా పచ్చిమేతను పాతర వేసుకోవడం (పాతర గడ్డి) కాని లేదా ఎండుమేతగా చేసుకొని కానినిల్వచేసుకోవాలి. ఈ విధంగా నిల్వచేసున్న గడ్డిని అవసరాన్ని బట్టి వాడుకోవాలి. ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.