అనువైన ప్రాంతాలు తెలంగాణాలో నిజామాబాద్, కరీంనగర్ , వరంగల్. జిల్లాలు మొక్కజొన్న పుష్ప విన్యాసం పర పరాగ సంపర్కం (దాదాపు 95%) ద్విలింగాశ్రయ మొక్క జల్లు-పీచు అంతరము 2-5 రోజులు పరాగ సంపర్కం గాలి ద్వారా పుష్పించు మరియు పరాగ సంపర్కం జరుగుట. పీచుకు ముందే జల్లు మరియు పుప్పొడి పుప్పొడి విడుదల 2-14 రోజులు (5-8 అత్యధికం) సూర్యోదయం తదుపరి 1గంట నుండి 4-5 గంటల పాటు ప్రతి జల్లు నుండి 2-5 కోట్ల పరాగరేణువులు(25,000 ప్రితి గింజకు (800-1000 గింజలు చొప్పున) పుప్పొడి జీవకాలం 10-30 ని పీచు పుప్పొడిని స్వీకరించు సమయం 8-10 రోజులు మొక్కజొన్న అభివృద్ధి సింథటిక్ రకాలు కాంపోజిట్ రకాలు హైబ్రిడ్ మొక్కజొన్న అభివృద్ధి ద్విసంకరణ రకాలు త్రి సంకరణ రకాలు ఏక సంకరణ రకాలు టాప్ క్రాస్ రకాలు రూపాంతర ఏక సంకరణ రకాలు కాంపోజిట్ రకాల విత్తనోత్పత్తి బ్రీడర్ విత్తనం పునాది విత్తనం సర్టిఫైడ్ విత్తనం హైబ్రిడ్ విత్తనోత్పత్తికి కావలసిన ఆవశ్యకతల సారవంతమైన నేల క్రితం పంట మొక్కజొన్న వేసి ఉండరాదు నీటి వసతి ఉండాలి అంతర దూరం పాటించాలి అధిక దిగుబడి నిచ్చు ఆడ రకం ఉండాలి సరియైన పుప్పొడి మోతాదు మరియు అధిక సమయం గల మగ రకమై ఉండాలి. విత్తనోత్పత్తిలో నైపుణ్యత కూలీల ఆవశ్యకత రబీ సీజన్ హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో కీలక విషయాలు అంతర దూరం: 200 మీ.కన్న ఎక్కువ అంతర సమయం:విత్తనం పంటలో 5.0% కన్న ఎక్కువపీచు ఉన్న దశలో ప్రక్క పంటలనుండి 0.2% కన్న తక్కువ. జల్లులు/మొక్కలు (ఏక సంకరణ, ద్వి సంకరణ, త్రిసంకరణ మరియు టాప్ క్రాస్ హైబ్రిడ్ల కొరకు) ఉండాలి. హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో కీలక విషయాలు ఆడ, మరియు మగ వరసల నిష్పత్తి: హైబ్రిడ్ రకం మరియు దశను బట్టి 1:2, 1:3, 1:4, 1:5, 2:4,2:6 లేక 2:8 విత్తనోత్పత్తికి అనువైన నేలలు మురుగు నీరు నిలవని, కలుపు మరియు తెగుళ్ళు లేని నేలలు. బెరుకులు లేకుండా మరియు జన్యు స్వచ్ఛత కొరకై నీటి తడిని ఇచ్చి క్రితం సీజన్ నేలలోని విత్తనాలను మొలకెత్తిన తర్వాత దున్ని నశింప చేయాలి. వాతావరణం మొలకెత్తుట: >13 డిగ్రీ C500లీటర్ల పంట పెరుగుదల: 21 – 32 డిగ్రీ C పూత దశ:< 38/40 డిగ్రీ C వర్షపాతం: నెలకు 15-20 సెం. 3-4 నెలల పాటు విత్తుసమయం ఖరీఫ్ : జూన/జూలై రబీ : అక్టోబర్ / నవంబర్ ఖరీఫ్ లో పూతదశలో అధిక వర్షాలకు పుప్పొడి రాలి అందక పోవచ్చు. రబీ అతి తక్కువ ఉష్ణోగ్రతలో పుప్పొడి నశించవచ్చు. విత్తన మోతాదు 25 కి/హె (మగ+ఆడ) హైబ్రిడ్ రకం, దశ, ఆడ మరియుమగ వరుసల నిష్పత్తి మరియు మగ వరుసల పుప్పొడి నిచ్చు శక్తిపై ఆధారపడి విత్తన విధానం విత్తనాన్ని బోదెకు దక్షిణం వైపున పైనుండి 1/3 వ వంతు ఎత్తులో విత్తుకున్నచో సూర్యరశ్మి బాగా ప్రసరించి పైరు ఎదుగుదల బాగుండును. ఆడ మరియు మగ సాళ్ళను గుర్తించుటకు వీలుగా లేబుల్ కట్ట వలెను. ఆడ. మగ విత్తనం 1:3,1:4,2:4 లేదా 2:5 నిష్పత్తిలో విత్తుకోవచ్చు. ఆడ, మగ విత్తన మోతాదు ఈ నిష్పత్తిని బట్టి మారుతుంది. అట్రజిన్ 50% పొడి మందును విత్తిన 1 -2 రోజులలో నేల రకాన్ని బట్టి హెక్టారుకు 2 -3కిలోలు నీటిలో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయాలి. ఎరువుల యాజమాన్యం హెక్టారుకు 20-25 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు +200 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం+80కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు. మొత్తం భాస్వరం+సగం పొటాష్ + 10% నత్రజని దుక్కిలో 20% నత్రజని మొక్క నాలుగు ఆకుల దశలో 30% నత్రజని మొక్క ఎనిమిది ఆకుల దశలో విత్తన ప్లాట్ల ధృవీకరణకు తనెఖీ చేయు దశలు విత్తినప్పుడు పూతకు ముందు పూత సమయంలో పూత తర్వాత కోత సమయంలో కోత, కోతానంతర జాగ్రత్తలు కండె పైపొరలు ఎండిపోయి, గింజ గట్టిపడి, గింజ అడుగు భాగమున నల్లటి చార కనబడిన తరువాత పంట పక్వదశలో వచ్చినట్లు గుర్తించవలెను. మగ సాళ్ళ లోని కండెలను ముందుగా కోసి వేరుగా ఉంచ వలెను. 2-3 రోజుల తర్వాత ఆడ సాళ్ళలోని కండె లను కోసి ఎండలో ఆరబెట్టవలెను. ఈకండెల నుండి వచ్చినవే ఏక సంకర విత్తనాలు. హెక్టారుకు 1.5-2.5 టన్నుల దిగుబడి వచ్చును. తెగులు సోకిన మరియు విత్తనానికి భిన్నమైన లక్షణాలను కల్గిన కండెలను ఎరివేయవలెను. గింజలలో 15% తేమ ఉన్నప్పుడు నూర్పిడి చేసి మరల గింజలను ఎండనివ్వవలెను. గింజ పరిమాణాన్ని బట్టి గ్రేడింగ్ చేసి శుభ్రమైన సంచులలో గాలి, వెలుతురు, అనువైన ఉష్ణోగ్రత తేమ తగల కుండా జాగ్రత్తలు తీసుకొన వలెను. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా : ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం. 040-24018447