కందిలో విత్తనోత్పత్తిలో విత్తనోత్పత్తి ఖరీఫ్ మరియు రబీలో చేసుకోవచ్చు. విత్త నోత్పత్తికై పండించేటప్పుడు అంతర పంటలు వేయకూడదు. కందిలో స్వతహాగా కొత పరపరాగ సంపర్కం జరుగుతుంది. కావున తగు జాగ్రత్తలతో విత్తనోత్పత్తి చేపట్టాలి. పరిపక్వత లేని యెడల అధికోత్పత్తినిచ్చే రకాలు జన్యుపరంగా పచ్చ రంగు క్షీణించి వాటి శక్తిని కోల్పోయే అవకాశం వుంది. వివిధ రకాల కంది పంట మరియు విత్తనోత్పత్తి పొలం మధ్య మూల విత్తనోత్పత్తికి కనీసం 250మీ. ధృవీకరణ విత్తనోత్పత్తికి కనీసం 100మీ. వేర్పాటు దూరాన్ని రోజులు పాటించాలి. నాణ్యమైన బ్రీడర్ విత్తనాన్ని పరిశోధనా స్థానం నుండి సేకరించి తరుపరి విత్తనోత్పత్తికి వాడుకోవాలి. ప్రధాన పొలము బాగా తయారుచేసిన సిఫార్సు మేరకు సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు వేయవలెను. తమ ప్రాంతానికి అనువైన, చీడపీడలు/రోగ నిరోధక శక్తి కలిగి అధిక దిగుబడి నిచ్చు రకాలు ఎన్నుకోవాలి. కంది విత్తనోత్పత్తికి ఎన్నుకున్న పొలం ఇంతకు ముందు కంది వేసిన పొలం కాకుండా చూసుకోవాలి. విత్తనపు పంటకు అంతరకృషి సకాలంలో చేసి సూచిం చిన మేర నీరు పారించవలెను. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. పైరు మొలక దశనుండి కోత సమయం వరకు బెరకు మొక్కలు కనిపిస్తే పీకి వేయాలి. అదేవిధంగా తెగులు సోకిన మొక్కల్ని తీసివేయాలి. అవసరమైన సస్యరక్షణ చర్యలను సకాలంలో తీసుకోవాలి. కంది పూత దశ నుండి 45-60 రోజులలో చెంది కోతకు వచ్చును. కాయలు సహజ నుండి ఛాయ నలుపు లేదా గోధుమ రంగు మారిన తర్వాత పరిపక్వత చెందినట్లుగా గుర్తించి 80శాతం పైగా మొక్కలు పరిపక్వతకు వచ్చిన యెడల పంటను మొక్కలతో సహా కోసి గూళ్ళుగా పెట్టి 10-12 ఎండనిచ్చి తరువాత నూర్పిడి చేయాలి. విత్తనాన్ని 8 శాతం తేమ వచ్చే వరకు ఎండబెట్టి, శుద్ది వేసి కొత్తపాలిథీన్ సంచులలో నిలువచేసుకోవాలి. విత్తన ధృవీకరణ ప్రమాణాలు విత్తనప్రమాణాలు మూలవిత్తనం సర్టిఫైడ్ విత్తనం వేర్పాటు దూరం 250 100 కేళీలు (అత్యధిక శాతం) 0.10 0.2 జన్యు స్వచ్ఛత (అత్యధిక శాతం) 99.5 98 ఇతర పంట విత్తనాలు (అత్యధిక శాతం) 5 కిలోలు 10 కిలోలు ఇతర నిర్ధారిత కంది రకాలు 10 కిలోలు 20కిలోలు మొలక శాతం (అత్యల్పంగా) 75% 75% తేమ శాతం అత్యధికంగా 9 9 ఇతర పదార్థాలు (అత్యధిక శాతం) 2 2 మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447