ప్రత్తిలో ఎక్కువగా హైబ్రిడ్ (సంకరజాతి రకాలు) విత్త నోత్పత్తి జరుగుతుంది. ఈ విత్తనోత్పత్తిని అభ్యుదయ రైతులు ప్రైవేట్ విత్తన కంపెనీల పర్యవేక్షణలో వారి అవసరార్ధం విత్తన రేటు కాంట్రాక్టు పద్దతిలో చేయు చున్నారు. అనుకూల పరిస్థితులలో మంచి లాభా లను పొందుతున్నారు. హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ఆడ, మగ రకాలను 4:1 నిష్పత్తిలో అనగా 4 వరుసల ఆడ రకానికి 1 వరుస మగ రకం విత్తనాన్ని విత్తుతారు. విత్తనోత్పత్తి చేసే రైతులు తప్పకుండా నీటి పారుదల వసతి (బోరు/బావి) కలిగి వుండాలి. విత్తనోత్పత్తిని మంచి బలమైన భూమిలో అన్ని వసతులతో చేసినప్పుడే లాభదాయకంగా వుంటుంది. విత్తనోత్పత్తిలో ప్రధానంగా ఆడవరుసలలో ప్రత్తి పూలను అనగా తెల్లవారితే పువ్వుగా విచ్చుకొనే మంచి మొగ్గలను ఎంపిక చేసి వాటిని ముందు రోజు గిల్లు తారు, అనగా మొగ్గ యొక్క ఆకర్షక పత్రావళిని మరియు దానికి అంటుకొని లోపల వున్న పుప్పొడి సంచుల సముదాయాన్ని మొత్తం చేతితో తీసి పడే స్తారు. అప్పుడు కేవలం ఆ మొగ్గపై ఆడ పువ్వుకు సంబందించిన అండకోశం, కీలం, కీలాగ్రం మాత్రమే వుంటాయి. ఈ విధంగా గిల్లిన ప్రత్తి మొగ్గను తెల్లవారి గుర్తించే టట్లు పేపర్ ట్యాగ్స్ వేస్తారు. ఈ గిల్లిన మొగ్గల మీద తెల్లవారి ఉదయం 9.30 నుండీ 12.00 గంటల లోపు మగ వరుసలలో నుంచి తెంపిన వికసించిన పూల లోని పుప్పొడితో సున్నితంగా అద్దుతారు. ఇలా ఒక మగ పువ్వును 4-5 గిల్లిన మొగ్గ్ల మీద అద్దుతారు. ఈ విధంగా గిల్లి, పుప్పొడి అద్దిన మొగ్గల నుండి వచ్చు కాయాలలో హైబ్రిడ్ ప్రత్తి విత్తనాలుంటాయి. ప్రత్తి కాయలు బాగా తయారయి పగిలిన తర్వాత పత్తిని తీసి దానిలోని గింజలను జిన్నింగ్ యంత్రంలో వేరు చేస్తారు. అలా వచ్చిన హైబ్రిడ్ గింజలను/విత్తనాన్ని శుద్ధి చేసి తెగుళ్ళు/పురుగు మందులను పట్టించి, ప్యాకింగ్ చేసి అమ్ముతారు. హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ఎకరానికి 200-400 కిలోల విత్తనాన్ని పండించ వచ్చును. ప్రత్తి పూతలో ఉన్న 60-80 రోజులు, ప్రతీ రోజు ఎకరానికి దాదాపు 10మంది కూలీలను పెట్టి మొగ్గలు గిల్లించాలి. ఆ గిల్లిన మొగ్గలను మరుసటి రోజు ఉదయం మగ పువ్వుల పుప్పొడితో అద్దాలి. మరల సాయంత్రం మొగ్గలు గిల్లాలి. ఈ ప్రక్రియ దాదాపు 2 ½ నెలలు కొన సాగాలి. అప్పుడే మంచి విత్తన దిగుబడి మొక్కల వరుసల మధ్య దూరాన్ని మరియు మొక్కల మధ్య దూరాన్ని, భూమి స్వభావాన్ని మరియు వేసే ప్రత్తి రకాన్ని బట్టి నిర్ణయించు కోవాలి. వీలైనంతవరకు చాళ్ళ మధ్యదూరం ఎక్కువగా వుండేటట్లు చూసుకొంటే మొగ్గలు గిల్లటానికి, అద్దటానికి, మిగతా అన్ని పనులకు వీలుంటుంది. ఎరువులు మరియు పోషకాల పిచికారి విత్తనోత్పత్తి క్షేత్రానికి సమృద్ధిగా, సమయాను కూలంగా వేయ వలసి /చేయవలసి వుంటుంది. విత్తనోత్పత్తి క్షేత్రానికి సిఫారసు చేసిన ఎరువుల మోతాదు కంటే 25-30 శాతం మేర ఎక్కువ వేయ లసిన వుంటుంది. మేలైన అన్ని సాగు పద్దతులతో పాటు సమగ్ర సస్య రక్షణా పద్ధతులను కూడ అవలంబించాలి. నిపుణుల సలహాతో విత్తనోత్పత్తి చేసినప్పుడు మంచి లాభాలు వస్తాయి. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా : ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం. 040-24018447