శనగలో విత్తనోత్పత్తి సారవంతమైన మురుగునీరు నిల్వని, గత పంటకాలంలో శనగ పంటను వేయని పొలాన్ని విత్తనోత్పత్తికి ఎన్నుకోవలయును ఇతర శనగ పంట పొలాల నుండి కనీసం 5మీ. ఏర్పాటు దూరం ఉండేలా చూసుకొనవలయును. విత్తుకోవడానికి అక్టోబర్ – నవంబర్ 15 వరకు అనువైన సమయం. ఆయా ప్రాంతానికి అనువైన, తెగుళ్ళను తట్టుకొని బాగా ప్రాచుర్యం పొందిన అధిక దిగుబడినిచ్చు రకాలను ఎన్ను కొని మూల విత్తనాన్ని అధీకృత సంస్థల నుండి సేకరించి విత్తనోత్పత్తికి వాడవలయును. సిఫార్సు చేయబడిన అత్యుత్తమ సేద్య పద్దతులు, సస్య రక్షణ చర్యలు పాటించవలయును. సాధారణంగా మిగులు తేమ, మంచు ఆధారంగా పండే పంట అయినప్పటికి అవకాశమున్న చోట విత్తిన 30 నుండి 40 రోజుల సమయంలో తేలిక పాటి తడి స్ప్రింక్లర్ల ద్వారా ఇచ్చినచో దిగుబడి పెరిగి నాణ్యమైన విత్తనం లభించును. పూతకు ముందు, తరువాత పిందె లేదా కాయ త తయారగు సమయంలో తప్పనిసరిగా కేళీలు తీసి వేయవలెను. కోసే 10రోజుల ముందు క్వినాల్ ఫాస్ (2మి.లీ/లీ) పంట పై పిచికారి చేసినచో విత్తన నిల్వలో ఆశించే పురుగుల బెడద చాలా వరకు తగ్గి తద్వారా నష్టాన్ని అరికట్టవచ్చు. కోత, నూర్పిడి సమయంలో కూడా తగు వేర్పాటు. దూరాన్ని పాటించి 9శాతం తేమ ఉండే విధంగా ఎండనిచ్చి కొత్త సంచులు ఉపయోగించి బల్లలపై నిల్వచేయాలి. విత్తన నాణ్యత ప్రమాణాలు క్రమ.సంఖ్య ప్రమాణాలు మూల విత్తనం సర్టిఫైడ్ విత్తనం 1. విత్తన స్వచ్ఛత 98% 98% 2. భౌతిక ఇతర పదార్థాలు (అత్యధికంగా) 2% 2% 3. ఇతర పంటల విత్తనాలు (అత్యధికంగా) 10/కెజి 10/కెజి 4. కలుపు మొక్కల విత్తనాలు (అత్యధికంగా) ...... ....... 5. మొలక శాతం 88 88 6. తేమశాతం 9 9 మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం. 040-24018447