మన దేశంలో వరి ప్రధాన ఆహారపంటగా సుమారు 44 మి. హెక్టార్లలో సాగు చేయబడుతుంది. దీనిలో సుమారుఅంటే 1.32,మి. హెక్టార్లలో హైబ్రిడ్ వరి వంగడాలు సాగుచేయబడుచున్నాయి. రానున్న కాలంలో వరి దిగుబడిని పెంచాలంటే సూటి రకాలతో పాటు హైబ్రిడ్ వరి విస్తీర్ణంపెంచాల్సిన అవసరం వుంది. భారతదేశానికి 2025 సంవత్సరం వరకు పెరుగుతున్న జనాభకు అనుగుణంగా వరిఉత్పత్తిని 130 మిలియన్ టన్నుల సాధించాల్సి ఉంది.దీనిని సాధించాలంటే వరి సాగు చేసే విస్తీర్ణంలో 20% వరకుసంకర వరిని .సాగుచేసుకోవల్సిన అవసరం వుంది. హైబ్రిడ్వరి విస్తీర్ణం పెంచాలంటే అధిక దిగుబడినిచ్చే సంకర వంగడాలతో పాటు నాణ్యమైన విత్తనం రైతులకు అందుబాటులోఉంచాలి.ప్రస్తుతం మనదేశంలో సుమారు 40కు పైగా వివిధ ప్రభుత్వ మరియ్ ప్రైవేటు సంస్థలు సంకర వరి విత్తనోత్పత్తి ప్రభుత్వ మరియ్ ప్రైవేటు సంస్థలు సంకర వరి విత్తనోత్పత్తి చేపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం,వరంగల్,నిజామాబాద్ జిల్లాల్లో వరి సంకర విత్తనోత్పత్తి రబీ కాలంలో చేపట్టడం జరుగుతుంది. కావున రైతులు హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి లో కొన్ని మళకువలు పాటించి నట్లయితే మంచినాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేస్తూ అధిక లాభాలు గడించవచ్చు. హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో నాణ్యత పెంచాలంటే ఈ క్రిందతెలిపిన అంశాలపై అవగాహన పెంపొందించు కోవాలి. హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఎ) అనువైన కాలం:రబీ పంట కాలం సంకర వరివిత్తనోత్పత్తికిఅనుకూలమైనది. ఎందుకంటే ఈ కాలంలోఆడ, మగ రకాలను నాట్లు వేసినట్లయితే పుష్పించే దశలోవర్షాల బారిన పడదు.తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. బి) అనువైన ఉష్ణోగ్రతలు సాధారణ పగటి ఉష్ణోగ్రత 24-30 C, పగటి, రాత్రి 3% ఉష్ణోగ్రత లలో తేడా 8-10 C ఉండవలెను. గాలిలో తేమ శాతం 72 – 80% పంట పూత దశలో ఉన్నప్పుడు వరుసగా 3రోజులువర్షం రాకుండా ఉండాలి. ఉష్ణోగ్రతలు 20 C.కన్నా తక్కువగా లేదా 35 డిగ్రీ Cకంటే ఎక్కువగా ఉంటే విత్తన దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. సి)నేలలు:సాధారణంగా మంచి సారం కలిగి, నీటివసతితో పాటు మురుగు నీరు పోయే వసతి కలిగిన నేలలు అనుకూలం. ఈ నేలలు ఆడ, మగ రకాలు ఒకేసారి పూత దశకు వచ్చేవిధంగా దోహదపడిఅధిక దిగుబడికి అనుకూలిస్తాయి. ఈ నేలల్లో ఇంతకు ముందు వేసిన పంట. ఇప్పుడు వేసే పంట ఒకటి కారాదు. వరిలో సంకర విత్తనాన్ని A(పురుష వంధ్యత్వం గల జనిని) మరియు R (పురుష జనకము) లనుసంకర పరచి విత్తనం ఉత్పత్తి చేయబడును. విత్తుసమయం డిశంబర్ నుంచి జనవరి వరకు A మరియు R జనకములను విత్తుకొనుటకు అనుకూలమైన సమయం. విత్తన సేకరణ మరియు మోతాదు A మరియు Rలకు చెందిన విత్తనాలను అధీకృత సంస్థల నుండి మాత్రమే తీసుకోవాలి. A -15 కేజీలు/హె. వేర్పాటు(ఐసోలేషన్) హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో జన్యు స్వచ్ఛత ప్రమాణాలకనుగుణంగా ఉండాలంటే సిఫారసు చేయ బడిన వేర్పాటు దూరం తప్పని సరిగా పాటించాలి. రిలో వేర్పాటు మూడు విధాలుగా;పరిస్థితులను బట్టి పొంద వచ్చు. అంతర వేర్పాటు (స్పేస్ ఐసోలేషన్): వేరే వరి రకాలు నుంచి100 మీ. వేర్పాటు కల్పించాలి. సమయ వేర్పాటు (టైమ్ ఐసోలేషన్): ఏకారణం చేతనైనా అంతర వేర్పాటు వీలు కానప్పుడు హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేసే పంటకు, అంతకు ముందు వేసిన పంటకు విత్తే సమయంలో తేడా కనీసం 21 రోజులు ఉండేవిధంగా చేసుకోవలెను. అవరోధ పంటల ద్వారా వేర్పాటు (బారీయర్ ఐసోలేషన): పంట చుట్టూ ఎక్కువ ఎత్తు పెరిగే పంటలు అనగా చెఱకు,మొక్కజొన్న, సజ్జ, సేసేనియా వంటివి 30 మీ, వరకు వేసు మొక్కజొన్న, సజ్జ, సేసేనియా వంటివి 30 మీ, వరకు వేసు ఎత్తు పొలం చుట్టూ పెట్టాలి. నారుమడి పెంపకం ఒక హెక్టారు విస్తీర్ణం నాటుకోవడానికి 100 చ.మీ. నాతు మడి అవసరం. ఎంపిక చేసిన నారుమడిని రెండుసార్లు పొడిదుక్కి చేయాలి. ఒక హెక్టారుకి సరిపోయే నారుమడికి 500కిలోలు బాగా చివికిన అశువుల ఎరువు వేయాలి. నారుమడిని 2-3 సెం.మీ. నిల్వ వున్న నీటిలో 2 నుంచి3 సార్లు ఐదు రోజుల వ్యవధిలో భాగా దమ్ము చేయాలి. దమ్ముచేసిన తర్వాత 5 నుంచి 10సెం,మీ ఎత్తుతో మరియు 1మీ వెడల్పుతో అవసరానికి అనువైన పొడవుతో ఎత్తు మళ్ళు తయారుచేయాలి. మడికి మడికి మధ్యలో అధికమైన నీరు మొక్కల పోయేవిధంగా మురుగు నీటి కాల్వలు ఏర్పాటు చేయాలి. 100 చ.మీ గల నారుమడికి 5-10 కిలోల నత్రజని, 5 కిలోల పాస్ఫరస్ , 5కిలోల పొటాష్ ల నిచ్చే ఎరువులను ఆఖరి దమ్ములో వేసుకోవాలి. అవసరాన్ని బట్టి అంటే తక్కువ ఉష్ణోగ్రతల వల్ల నారు ఎదుగుదల ఆగే పరిస్థితు ల్లో పాస్ఫరస్ నిచ్చే ఎరువుల మోతాదును రెట్టింపు చేయాలి. జింక్ లోపం వచ్చే ప్రాంతాల్లో నారుమడికి 3-4 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. అదేవిధంగా ఇనుము ధాతు లోపం గమనించినట్లయితే 20గ్రా. ల అన్నభేదిని 8 లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని 2-3 సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి. నారుమడిలో విత్తనం విత్తుట నారుమడులు తయారు చేసిన తర్వాత మోతా దు మేరకు విత్తనాన్ని నీటిలో 24 గంటలు నానబెట్టాలి. విత్తనాలు నానబెట్టేటప్పుడు విత్తనాలను కలియబెట్టాలి. తర్వాత నీటిపై తేలిన విత్తనాలను తీసివేయాలి. ఈ విత్తనాలను కార్బండిజమ్ మందులో (4గ్రా/కిలో విత్తనానికి) విత్తన శుద్ధి చేయాలి. నానబెట్టిన విత్తనాలను పొడిగా, నీడగా ఉండే ప్రదేశంలో గోనె సంచులలో ఉంచిన ఎడల మంచి మొలక శాతం వస్తుంది. ఈ వ్ధింగా మొలక వచ్చిన విత్తనాలను నారు మడిలో 20చ.మీ లకు ఒక కిలో చొప్పున విత్తుకోవాలి. నారుమళ్ళలో ఎప్పుడూ నీరు పలుచగా ఉండేలా చూసుకోవాలి. విత్తిన పదిహేను రోజుల తర్వాత నారుమడికి6-8 కిలోల నత్రజని నిచ్చే ఎరువులను పైపాటు గా వేయాలి. అవసరానికి అనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నాట్లు వేయుట హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో అధిక దిగుబడులుసాధింధాలంటే ఆడ(A), మగ (R)మొక్కలను నిర్దిష్టమైన వరుసలలో నాటుకోవాలి. A మరియు R వరుసల నిష్పత్తి ప్రాంతాల వారిగా కనుగుణంగా,మొక్కల యొక్క లక్షణాల ఆధారంగా మారుతుంది. సాధారణంగా మరియు వరుసలను 8:2 (8A వరుసలను 2 R వరుసల)ఉండే విధంగా నాటుకోవాలి. నాటే దూరం: సాధారణంగా A మరియు R మొక్కలు 21నుంచి 25 రోజుల వయస్సులో ఉన్నప్పుడు నాటు పెట్టుటకు అనుకూలం. ఎక్కువ వయస్సున్న నారు నాటడంవలన పూత ఆలస్యంగా రావటం అదేవిధంగా తక్కువ వయస్సు గల నారు నాటు పెట్టుట వలన తొందరగారావటం జరుగుతుంది. దీని వలన A మరుయు Rవరుసల మధ్య పూత సమయంలో తేడా వచ్చి దిగుబడి తగ్గడానికి అవకాశముంది. A మరియు R మొక్కల మధ్య పంట కాలంలోఉండే తేడాను బట్టి స్త్రీ, పురుష మొక్కలలో ఏది ముందు నాటు వేయాలో నిర్ణయించు కోవాలి. ముందుగా కోతకు వచ్చే (స్త్రీ లేదా పురుష) మొక్కలను ఆలస్యంగా, ఆలస్యంగా కోతకు వచ్చే వాటిని ముందుగా నాట్లు పెట్టాలి. స్త్రీ మరియు పురుష మొక్కల్ మధ్య గల పంట కాలంలోమరియు గల తేడాను బట్టి అదే వ్యత్యాసంతో (రోజులలో) నాటాలి.ఈ జిబ్బరెల్లిక్ సాధారణంగా వరి సంకర విత్తనోత్పత్తిలో ఈ క్రింద తెలిపిన దూరాలను పాటిస్తారు. 25 మి.లీ. 70% దూరాలను పాటిస్తారు,మొక్కల మధ్య దూరం - 15 సెం.మీ,మగ (R) మరియు ఆడ (R) వరుసల – 20-30 సెం.మీ,మధ్యదూరంమొక్కకి, మొక్కకి మధ్య దూరం – 15సెం.మీ R మొక్కలు నాటే దూరం:రెండు ‘R’ వరుసల మధ్యలో 8 వరుసల R మొక్కలనుఒక బ్లాద్ లో వేసుకోవాలి. నాటేటప్పుడు ఒక కుదురుకు1-2 మొక్కలు ఉండే విధంగా 15 సెం.మీ X 15 సెం.మీ ఎడంతో నాటుకోవాలి. R మొక్కలు నాటే విధానం:ప్రధాన క్షేత్రంలో మొక్కలను రెండు R వరుసలలో నాటుకోవాలి. రెండు R వరుసల మధ్యలో R మొక్కలను 8 వరుసలలో నాటడానికి 145 సెం.మీ వదలి వేయాలి.నాటేటప్పుడు ఒక్కో కుదురుకు 2-3 మొక్కలు ఉండేమొక్కలను ఏరి విధంగా 30సెం.మీ వేయా X 15సెం.మీ దూరంతో నాటాలి. కేళీల ఏరివేత (రోగింగ్) సంకర విత్తనోత్పత్తి మంచిజన్యు స్వచ్ఛత మరియు భౌతిక స్వచ్ఛత సాధించాలంటే కేళీల ఏరివేత పకడ్భందీగా అమలు చేయాలి.కేళీలను వివిధ దశలలో అంటే శాఖీయ దశ ( మొక్కఆకుల యొక్క బాహ్య లక్షణాలు), పూత దశలో(పంటకాలంలో తేడా, వెన్ను బయటకు వచ్చేవిధానం,వెన్నులక్షణాలు, పుప్పొడిరంగు), పక్వదశలో (స్త్రీ మొక్కలగింజ శాతం, గింజ రకం, గింజ ఆకారం ఆధారంగా) 3సార్లు చేపట్టాలి. జిబ్బరెల్లిక్ ఆమ్లం పిచికారి వరి హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ప్రధాన సమస్య జనని మొక్కల (A క్రమంలో)పొటాకు నుండి వెన్ను పూర్తిగా వెలువడదు, అందుకొరకు జిబ్బరెల్లిక్ ఆమ్లంని హెక్టారుకు 45-60 గ్రా చొ ప్పున రెండు దఫాలుగా 500లీ. నీటిలో కలిపి 5-10% వెన్నులు బయటకు వచ్చిన దశలో (40%)తర్వాత రోజున (60%) పిచికారి చేయాలి.ఆమ్లం నీటిలో కరగదు కావున 1గ్రా. ని ఆల్కహాలులో కలిపి కరిగిన తర్వాత ద్రావణం తయారు చేసుకోవాలి. పరపరాగ సంపర్కం పెంపొందించే చర్యలు/ అనుబంధ సంపర్క్ం వరి స్వపరాగ సంపర్క మొక్క. దీనిలో పరపరాగ సంపర్కం పెంపొందించడానికి తాడు లాగుట లేదాకర్రలతో మగ ( R) మొక్కలను ఊపుట వలన అధికపుప్పొడి ఆడ మొక్కలపై పడి పరపరాగ సంపర్కం జరుగును. మొదటిగా అనుబంధ సంపర్క చర్యను 30-40% వెన్నులు బయటకు వచ్చినప్పుడు ఉదయం 10గం. నుండి మధ్యాహ్నం 1గంట వరకు మరియుమధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో 30 నిమిషాల వ్యవధిలో రోజుకు 3-4 సార్లు సుమారు వారం రోజుల పాటు చేయాలి. కలుపు నివారణ నాటిన 3-5 రోజులలోపు 2.5 బ్యుటాక్లోర్ అనే కలుపు నాశని మందును 50-70 కి. లోల ఇసుకలో కలిపి ఒక హెక్టారు క్షేత్రంలో చల్లుకో వాలి. అవసరాన్నిబట్టి కలుపు మొక్కలను ఏరి విధంగా వేయించాలి. పోషకాల యాజమాన ఎకరాకు సుమారు 8 టన్నుల పశువుల ఎరువు లేదా టన్నుల కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువు వేయాలి. ఎకరాకు 75కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం, 16కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. అనగా సుమారు50 కిలోల డి.ఎ.పి, 150 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అదేవిధంగా నత్రజనినిచ్చే ఎరువులను 3 దఫాలుగా అంటే ఆఖరి దుక్కిలో, పిలక తొడిగే దశ మరియు కంకి ఏర్పడే దశలో వేయాలి. నత్రజనిని ఎక్కు వగా వాడినట్లయితే పూత రావటం ఆలస్యం అవుతుంది. వగా వాడినట్లయితే పూత రావటం ఆలస్యం అవుతుంది. వస్తుంది. ఎకరానికి 20కిలోల జింక్ సల్ఫేట్ ను దమ్ములో వేసుకోవాలి. సస్యరక్షణ చర్యలు అవసరాన్ని బట్టి సస్యరక్షణచర్యలు చేపట్టాలి. పంట కోత వెన్ను చొప్ప పసుపు రంగుకు మారినప్పుడు నీటి తడులను నిలిపి వేసిన మొక్కలోని తేమశాతం తగ్గి ఆరడం మొదలవుతుంది. సంకర విత్తనోత్పత్తిలోమొదట మగ వరుసలు కోసి పొలం నుండి తీసిన తర్వాతనే ఆడ వరుసలను కోయాలి. నూర్పిడి కల్తీలు ఏమాత్రం జరగకుండా నూర్పిడి చేపట్టాలి. వీలయితే ఆడ, మగ కుప్పలను వేర్వేరు నూర్పిడి బల్లలపై చేస్తే కల్తీలు తగ్గించవచ్చు ఆరబెట్టుట నూర్పిడి చేసిన విత్తనాలను 10-13% తేమ వచ్చే వరకు ఆరబెట్టాలి. విత్తన ప్రమాణాలు క్రమసంఖ్య ప్రమాణాము హైబ్రిడ్ ధృవీకరణ 1 స్వచ్ఛమైన విత్తనం 98.00% 2 కేళీలు 0.20% 3 R) జనని మొక్కల వరుసలలోఇతర మొక్కలు 0.20% 4 జనకుల మొక్కలలో ఇతరమొక్కలు 0 0.20% 5 . జనని (A) వరుసల మొక్కలలోపుప్పడినిచ్చు మొక్కలు 0.10% 6 అభ్యంతరకరమైన కలుపు మొక్కలు 0.02% మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447