నేలలు నీరు నిల్వ ఉండని తటస్ధ భూములైన ఎర్ర,చల్క,ఇసుక రేగడి మరియు ఒండ్రు నేలలు చాలా అనుకూలం. రకాలు కె.బి.ఎన్ .హెచ్ -1, కె.బి.ఎన్ .హెచ్ 44,ఎన్ ,డి,ఎస,హెచ్ -1, డి,ఆర్ .ఎస్ ,హెచ్ -1,ఎ,పి,ఎస్ ,హెచ్ -66 విత్తే సమయం ఖరీఫ్ : జూన్ రెండవ పక్షం- అగస్టు రెండవ పక్షం రబీ : నవంబర్ – డిసెంబర్ వేసవిలో (నీటి పారుదుల క్రింద ): జనవరి 2వ పక్షం-ఫిబ్రవరి మొదలు పక్షం . విత్తనమోతాదు: 2కిలోల/ఎకరానికి విత్తన శుద్ధి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు క్వింటాల్ (ఇప్రోడియోన్ 25% +కార్బండిజమ్ 25%) అనే మందును 2గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తనశుద్ధి చేయాలి. నెక్రోసిస్ వైరస్ అధికంగా వున్న ప్రాంతాల్లో కిల్లో విత్తనానికి ధయోమిధాక్సామ్ 4గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5గ్రాముల్లు వాడి విత్తనశుద్ధి చేయాలి. విత్తే దూరం తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 20-25 సెం.మీ ఎడం పాటించాలి. బరువు నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ మొక్కల మధ్య 30 సెం.మీ ఎడం విత్తుకోవాలి. కుదురుకు 2-3 విత్తనాలు నాటాలి. ఎరువులు యాజమాన్యం మొత్తం భాస్వరాన్ని (150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ) మరియు పొటాష్ (20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక ఎకరానికి దుక్కి వేయాలి. నత్రజని మొదటి దఫా విత్తేటపుడు 50% (26 కిలోల యూరియా), రెండవ దఫాగా విత్తన 30 రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో 25% (18 కిలోల యూరియా) మూడో దఫాగా 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో 25% (13 కిలోల యూరియా) ఒక ఎకరానికివ వేసుకోవాలి. కలుపు యాజమాన్యం విత్తన 30-40 రోజుల వరకు పంటలో కలుపు లేకుం డా చేయాలి. లీటరు నీటిని 5మి.లీ పెండిమిధాలిన్ 30% ఇ.సి లేదా 50% ఇ.సి కలుపుకొని విత్తన వెంటనే లేదా మరు సటి రోజు 200 లీటర్ల మందు ద్రావాణాన్ని పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజుల తరువాత గొర్రుతో అంతరకృషి చేయాలి. నీటి యాజమాన్యం వాతావరణాన్ని బట్టి ఎర్ర్రనేలలో 6-10 రోజుల వ్యవధిలో నల్లరేగడి నేలల్లో 15-20 రోజుల వ్యవధిలో నీటి తడులొవ్వాలి. నీటి తడులకు కీలకదశలు: మొగ్గతొడుగు, పువ్వు వికసించు మరియు గింజ కట్టు దశలు. పంట కోత పువ్వు వెనుక భాగం నిమ్మ పచ్చ రంగుకి మారిన తరువాత పువ్వులు కోసి వాటిని 2-3 రోజుల పాటు ఆరనివ్వాలి. కర్రలతో కొట్టిగాని, ఒలిచిగాని, విద్యుత్ తో నడిచే నూర్పిడి యంత్రాలతో ఒలచిగాని విత్తనాన్ని వేరు చేయాలి. చేయవల్సినవి చేయకూడనివి • వర్షాధార పరిస్థితుల్లో త్వరుతగతిన విత్తనం మొలకెత్తుటకు, ఆశించిన మొక్కల సాంద్రత పొందుటకు లీటరు నీటికి కిలో విత్తనం చోప్పున 14 గంటల పాటుమంచి నీటికి నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తినట్లైతే మొలక శాతం పెరుగుతుంది. విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తరువాత కుదురుకు ఒక మొక్కను వుంచి మిగిలిన మొక్కలు తీసి వేయాలి. దీని వలన మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందుటకు దోహద పడుతుంది. • పువ్వులలో గింజలు ఎక్కువగా ధృఢంగా తయారవాడానికి 2 గ్రా బోరక్స్ లీటరు నీటికి కలిపి • పూత దశలో (ఆకర్షక పత్రాలు విచ్చుకొనే) ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం పిచికారి చేయాలి. • మెరుపు రిబ్బనులను పైరు పైన అడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బను పై పడేటట్లు ఉత్తర మరియు దక్షిణ దిశగా కట్టినట్లైతే పక్షుల బారి నుండి రక్షించవచ్చును. • సరైన సమయంలో విత్తక పోతే పూత మరియు గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాలం వర్షంలో లేదా పగటి ఉష్ణోగ్రత 38 సెల్సియస్ కంటే ఎక్కువైతే దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. • పరపరాగ సంపర్కం కొరకు దోహదపడే తేనెటీగలకు హాని చేయరాదు. అవి ఎక్కువ ఉండే సమయాల్లో హానిచేసే పురుగు మందులను పిచికారి చేయరాదు. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, ప్రొద్దుతిరుగుడు పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447