నేలలు :నల్లరేగడి మరియు తేలికైన ఎర్రనేలలు. రకాలు సీజన్ హైబ్రిడ్స్ సూటి రకాలు ఖరీఫ్ సి.యస్ .హెచ్ – 10,11,14,16,18,21 సి.యస్ .వి – 1,10,11,13,15,23,31, పాలెం 2, శ్రీశైలం రబీ సి.యస్ .హెచ్ – 15,ఆర్,16 ఎన్ ఐజె-2,4,సి.ఎస్.వి.-216సి.ఎస్.వి.14ఆర్,ఎమ్ -1, కిన్నెర్,పూలే వసుధ, పూలే అనూరాధ వరి పంట తర్వాత వేసుకోవడానికి అనువైనవి: సి.యస్ .వి.-13 ఆర్ , సి.యస్ .హెచ-15ఆర్ , సి.యస.హెచ-16. విత్తే సమయం: ఖరీఫ్: జూన్ మొదటి వారం నుండి జులై రెండవ పక్షం;రబీ: సెప్టెంబర్ రెండవ పక్షం నుండి అక్టోబర్ చివరి వరకు. విత్తన మోతాదు: 3-4 కిలోలు/ఎకరానికి. విత్తనశుద్ధి: ధయోమిథాక్సామ్ 3గ్రా. మందును కిలో కలిపి తర్వాత ధైరమ/కాప్టాన్ 3గ్రా/కిలో విత్తనానికి కలపాలి. విత్తే దూరం : 45సెం,మీ x 12-15 సెంమీ ఎరువుల యాజమాన్యం ఎకరాకు నీటి పారుదల పంటకు 32 – 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16కిలోల పొటష్ ను వేయాలి . ఎకరాకు వర్షాధార పంటకు 24-32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువును రెండు సమ దఫాలుగా వేయాలి. నీటియాజమాన్యం: అట్రాజిన్ 4 గ్రా/లీ నీటికి చొప్పున కలిపి విత్తిన 48 hrs లోగా పిచికారి చేయాలి నీటియాజమాన్యం ఖరీఫ్ జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలలో రబీ జొన్నకు పూత మరియు గింజ పాలుపోసుకునే సమయంలో అవసరమైతే నీరు కట్టాలి. వేసవి పైరుకు వారానికి ఒకసారి, నల్లరేగడి నేలల్లో15 రోజులకొక సారి తడి ఇవ్వాలి. పంట కోత క్రింది వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలోఉన్నపాలు పిండిగా మరినప్పుడు, గింజ క్రింది భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంటన కోయాలి చిరుధాన్యాల సాగులో చేయదగిన అంశాలు జొన్నను ఆలస్యంగా విత్తుకోదలచి నప్పుడు ఎక్కువ విత్తన మోతాదు వేసుకోవాలి. జొన్న విత్తనాన్ని థయమిథాగ్జమ్ 3గ్రా/కిలో కలిపి విత్తు కోవాలి. జొన్నమల్లె మొలకెత్తిన తర్వాత లీటరు నీటికి 50గ్రా సల్ఫేట్ + 200గ్రా. యూరియాను కలిపి మల్లెపై పిచికారి. సజ్జలో పైరు 30 రోజుల వయస్సున్నప్పుడు ఎకరాకు 2 టన్నుల వేరుశనగ పొట్టును నేలమీద పరచడం ద్వారా భూమిలోని తేమను ఆవిరి కాకుండా కాపాడవచ్చును. వీలైన చోట్ల చిరు ధాన్యాలలో అంతర పంటలు వేసుకున్నచో చాలా లాభదాయకం. రాగి పంటను చెదలు ముఖ్యంగా తేలిక నేలల్లో అమ్మోనియం వర్షా భావ పరిస్థితుల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగ చేస్తాయి. వీటినివారణ కు చెదపుట్టల పైభాగంలో లీటరు నీటికి 5 మి.లీ.చొప్పున క్లోరిపైరిఫాస్ ను కలిపి ఒక్కోక్క పుట్టలో 10-12 లీటర్ల మందు ద్రావణాన్నిపోయాలి. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, చిరుధాన్యాలు జొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447