నేలలు చౌడు నేలలు తప్ప నీరు ఇంకే అన్ని రకాల ఆముదం ఎక్కువగా ఖరీఫ్ లో వర్షాధారంగా మహబూబ్ నగర్, నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాలోని తేలికపాటి నేలల్లో సాగు చేస్తున్న ప్పటికి దిగుబడులు అంత ఆశాజనకంగా లేవు. కానీ తక్కువ నీటి సౌకర్యంతో అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరుతడి పంటగా రబీలో ఆముదం పొందవచ్చు. రకాలు పరిస్థితి సూటి రకాలు హైబ్రిడ్స్ బెట్టను తట్టుకునేవి క్రాంతి, కిరణ్ జిసిహెచ్ – 4, డిసిహెచ్ -177 ఎండు తెగులు హరిత, జ్యోతి, జ్వాల పిసిహెచ్ -111, పిసిహెచ్ -222, డిసిహెచ్ -519 విత్తన మోతాదు సీజన్ రకాలు బరువు నేలలు(కి./ఎ) బరువు నేలలు(కి./ఎ) ఖరీఫ్ సూటి రకాలు 2-2.5 4.0 సంకర రకాలు 2.0 2.5 రబీ సంకర రకాలు 2.0 2.0 విత్తే దూరం నేలలు ఖరీఫ్ రబీ బరువు 90x60 సెం.మీ 120x90 సెం.మీ తేలిక 90x45 సెం.మీ 90x90 సెం.మీ విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా కార్బండాజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తనశుద్ధి చేయాలి. విత్తే సమయం: ఖరీఫ్ జూన్ 15 నుండి జూలై 31 వరకు రబీ: అక్టోబ్ ర్. పోగుంతలు మరియు ఒత్తు మొక్కలు పీకి వేయుట విత్తనం మొలవని చోట పోగగుంతలు పెట్టుకోవాలి. విత్తిన 15-20 రోజులకు పొలంలో విత్తిన చోట ఒకే యొక్క ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎరువుల యాజమాన్యం సూటి రకాలను 12కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం 12కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. పై పాటుగా 6 కిలోల నత్రజనిని విత్తిన 30-35 రోజులకు మిగిలిన 6 కిలోల నత్రజని 60-65 రోజులకు వేసుకోవాలి. సంకర రకాలకు అదనంగా 6 కిలోల నత్రజని విత్తిన 90-95 రోజులకు వేసుకోవాలి. కలుపు యాజమాన్యం పెండిమిథాలిన్ 1.3-1.6లీ లేదా అలాక్లోర్ 0.8-1.0లీ చొప్పున విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటితో కలిపి పిచికాతి చేయాలి. క్విజాలాఫాప్ పి ఇథైల్ లేదా ఫినోక్సిఫ్రాప్ పి ఇథైల్ లేదా ప్రొపాక్విజాపాప్ 1.5మి.లీ లేదా సైహలో పాప్ పి బ్యుటైల్ 1.25 మి.లీ లీటరు నీటికి కలిపి గడ్డిజాతి కలుపును (3-4 ఆకుల దశ) నివారించవచ్చు. నీటి యాజమానయం ఖరీఫ్ లో వర్షాధారంగా పండించినప్పటికి నీటి వసతి వున్న ప్రాంతాలలో స్ప్రింకర్స్ ద్వారా 15-20% దిగుబడి పెరుగుతుంది. రబీలో అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 12-15 రోజుల వ్యవధిలో, జనవరి నుండి పెరిగే ఉష్ణోగ్రతలను బట్టి 8-10 రోజుల వ్యవధిలో బోదెలు/కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలి. ముఖ్యంగా మొక్కలు పుష్పిచే మరియు కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలి. చీడపీడల నివారణ ఆముదంలో ఆశించే వివిధ చీడపీడల నివారణకు సమగ్ర యాజమాన్యం పద్ధతులు పాటించాలి. వడలు తెగులు ఆశించే ప్రాంతాలలో తట్టుకొనే రకాలు సాగు చేయాలి. భూమిలోని శిలీంద్ర బబీజాలు పెరగకుండా 5 కిలోల ట్రైకోడెర్మా పొడి మందుకు 100 కిలోలు భాగా మాగిన పశువుల ఎరువు మరియు 2 కిలోల వేప పిండి కలిపి అభివృద్ధి పరిచి చాళ్ళలో వేసుకోవాలి. కాయ కుళ్ళు, బూజు తెగులు నివారణకు తుఫాను సూచనలు తెలిసిన వెంటనే, వర్షం కురవటానికి కనీసం 6-8 గం. ముందుగా కార్బండాజిమ్ 1గ్రా./లీ. నీటికి కలిపి ఎకరానికి 200లీటర్ల్ మందు ద్రావణాన్ని గెలలు తడిచేటట్లు పిచికారి చేయాలి. వర్షం తగ్గిన వెంటనే మరో సారి పిచికారి చేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియా +10 కిలోల పొటాష్ ను అదనంగా పైపాటుగా వేయాలి. పంట కోత గెలలో 80% కాయలు ముదిరి ఆకుపచ్చ నుండి లేత పసుపు రంగుకు మారినప్పుడు ఆ గెలల ను కోయాలి. గింజలలో 9-10% తేమ ఉండేటట్లుఎండనివ్వాలి. చేయవల్సినవి చేయకూడనివి • ఆముదంను రబీలో నీటి పారుదల క్రింద మాత్రమేసాగు చేయాలి.• రబీలో అక్టోబర్ మొదటి వారంలో ఆముదం విత్తుకొని అధిక దిగుబడిని పొందవచ్చును.• మొక్కల సాంద్రత తగ్గకుండా చూసుకుంటూ పై పాటుగా వేసే ఎరువులను భూమిలో తగినంత తేమ వున్న సమయంలోనే వేయాలి.• విత్తిన 40-60 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి.• ఎర్రగొంగళి పురుగుకు ఎర పంటగా పొలం గట్ల పైన అక్కడక్కడ దోస నాటి వాటి మీద పురుగును గమనించ గానే నివారణ చేపట్టాలి. • నీరు నిల్వ వుండే భూములలో ఆముదాన్ని సాగు చేయరాదు.• ఆగష్టు, సెప్టెంబర్ , నవంబర్ మాసాల్లో మైక్రోప్లైటిన్ , యూప్లైక్టిన్ అను పరాన్నజీవులు దాసరి పురుగును ఆశించి అదుపులో ఉంచుతాయి. కావున ఈ దశలో వాటికి హీని చేసే పురుగు మందులైన కార్బరిల్ , క్లోరిపైరిఫాస్ మొదలగు వాటిని వాడరాదు. • దీనికి బదులుగా హానిచేయని వేపసంబంధిత లేదా వేప నూనె లేదా నొవాల్యురాన్ వంటి మందులను వాడాలి. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, ఆముదం పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447