ప్రత్తి సాగులో భారతదేశం ప్రపంచంలో మొదటిస్థానంలో (120 లక్షల హెక్టార్లు పైగా), ప్రత్తి ఉత్పత్తి మరియు ఎగుమతిలో రెండవ స్థానంలో వుంది. మన దేశంలో ప్రత్తిని అత్యధికంగా పండించు రాష్ట్రాలలో గుజరాత్ ,మహరాష్ట్ర తర్వాత మన తెలంగాణా రాష్ట్రం మూడవ స్థానంలో వుంది. తెలంగాణాలోని అన్నిబలమైన జిల్లాలో (హెదరాబాద్ తప్ప ) ప్రత్తి ఒక ప్రధాన పంటగా పండించుచున్నారు. ప్రత్తి (దూది) సరాసరి దిగుబడి మన దేశంలోమరియు రాష్ట్రంలో హెక్టారుకు దాదాపు 500 కిలోలుగా నమోదవుతుంది.ఇది ప్రపంచ దేశాల దిగుబడితో పోల్చినప్పుడు చాలా తక్కువగా వుంది. నేలలు నల్లరేగడి భూములు మరియు నీటి సదుపాయం గల మధ్యస్థ లేదా సారవంతమైన ఎర్రనేలలు ప్రత్తి సాగుకు అనుకూలం. ఇసుక నేలలు, మరీ తేలికపాటి చల్క భూములు ప్రత్తి సాగుకు అనుకూలం కావు. రకాల ఎంపిక ప్రత్తి సాగులో రైతిలందరూ కాయతొలుచు పురుగులను తట్టుకొనే బిటి హైబ్రిడ్ లను వాడుతున్నారు. తమ ప్రాంతానికి అనువైన వంగడాలను అనుభవం మీద ఎంచుకోవాలి. వర్షధారంగా సాగుచేసుకొన్నప్పుడు తొందరగా పూతకు,కాతకు వచ్చే మధ్యస్థ/చిన్న కాయసైజు (క్రూయినర్) 4 అనుభవం మీద ఎంచుకోవాలి. నీటి వసతి ఉన్న చోటసాగుకు కొంచెం ఆలస్యంగా పూత కాతెకు వచ్చే పెద్ద కాయ సైజు గల వంగడా లను/రకాలను ఎంపిక చేసుకోవాలి. వర్షాధారముగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాల నుకున్నప్పుడు మంచి సూటి రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది. నరసింహ, యన్ డి.యల్ హెచ్ –1938,డబ్ల్యుజిసివి – 48 మొదలగునవి. విత్తే పద్ధతి నల్లరేగడి భూమిలో : 120 x45 -60 సెం.మీ.,ఎర్రనేలలు:90x60 సెం.మీ.; తేలికపాటి నేలలు 90x30 సెం.మీ. విత్తు సమయం వర్షాధారంగా ప్రత్తిని విత్తేటప్పుడు, తేలికపాటి వర్షాలకే ప్రత్తిని విత్త కుండా, కనీసం రెండు దుక్కుల వర్షం అనగా 50-60 మి.మీ. వర్షం పడిన తర్వాతనే విత్తుకొంటే, ప్రత్తిలో మొలక శాతం బాగా వస్తుంది. తెలంగాణా జిల్లాలలో ప్రత్తిని జూన్ నుండి జులై మొదటి పక్షం వరకు విత్తుట అనుకూలం. నీటి వసతి వున్న చోట మే చివరివారం నుండి జూన్ మొదటి పక్షం లోపు విత్తుకొంటే అత్యధిక దిగుబడులు వస్తాయి. విత్తన మోతాదు/విత్తన శుద్ధి సూటి రకాలు: 2-4 కిలోల; హైబ్రిడ్: 1కిలో. విత్తనశుద్ధి చేయనిచో రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గడానికి ఇమిడాక్లోప్రొడ్ (గౌచో) 70 డబ్ల్యు ఎస్,5గ్రా. లేదా థయోమిథాక్సామ్ వంగడాలను/ గ్రా,లు కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తుకోవాలి. సిఫారసు చేసిన భాస్వరం మొత్తాన్నివిత్తేముందు ఆఖరి దుక్కిలో గాని లేదా నత్రజని మరియు పొటాష్ ఎరువులను నాలుగు దఫాలుగా విత్తనం వేసిన 80 రోజుల వరకు యూరియాను 10 కిలోల పొటాష్ తో కలిపి మొక్కల చాళ్ళకు దగ్గరగా భూమిలో పడేటట్లు వేయాలి. ఎరువుల యాజమాన్యం నత్రజని భాస్వరం పొటాష్ హైబ్రిడ్స్ 48-60 (100-125 కిలోల యూరియా) 24 (150 కిలోలసింగిల్ సూపర్ పాస్ఫేట్) 24 (40 ఎం ఓపి) సూటి రకాలు 35 (75 యూరియా) 18 (100 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్) 18 (22 ఎంఓపి) ఎరువులను భూమిలో సరియైన తేమ వున్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. అధిక వర్షాలు లేదా అధిక తేమ లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, సిఫారసు చేసిన ఎరువు జింక్. లతో పాటు, అదనంగా ఎకరాకు 25-30 కిలోల నత్ర జని, 10కిలోల పొటాష్ లను పై పాటుగా అందించాలి. బిటి ప్రత్తి సాగులో సిఫారసు చేసిన ఎరువులుతో పాటు, పూత, కాత సమయంలో అధిక దిగుబడులు సాదించాడానికి పైరుపై 2 శాతం యూరియా లేదా డి.ఎ.పి (అనగా 20గ్రా, లు లీటరు నీటికి) లేదా 12 శాతం పొటాషియమ్ నైట్రేట్ (మల్టికె) లేదా పాలీఫీడ్ (19:19:19 యన్ పి.కె)(10గ్రా.నీటికి) ద్రావణాన్ని వారం, పది రోజుల కొకసారి చొప్పున పిచికారి చేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులను ప్రత్తిలో పై పాటుగా ఏమాత్రం వాడరాదు. దీని వలన ఖర్చు పెరుగడమే గాకుండా భూములు చౌడు భూములుగా మారుతాయి మరియు దిగుబడులు క్రమేపి తగ్గుతాయి. సూక్మ పోషకాల లోపాలు – యాజమాన్యం ఒకే భూమిలో ప్రత్తిని అనేక సంవత్సరాలు పంట మార్పిడి లేకుండా పండించటం వలన పైరు పై జింకు, మెగ్నీషియం మరియు బొరాన్ వంటి పోషకాల లోపం కనిపిస్తుంది. ఈ లోపాలనుగుర్తించి, సకాలంలో సరియైన చర్యలు చేపట్టకపోతే, చాలా పంట నష్టం జరుగుతుంది. పంటలో జింకు ధాతు లోపం వున్నప్పుడు, ఆకుల ఈనెలు ఆకుపచ్చగా వుండి మధ్య భాగం పసుపు పచ్చగా మారుతుంది. ఆకులు చిన్నవిగా ముడుతలు పడివుండి కణుపుల మధ్యదూరం తగ్గుతుంది. మరియు మొక్కల పెరుగుదల తగ్గి మొక్క గిడసబారుతుంది. జొంకు లోప నివారణకు ఎకరాకు 20 కిలోల సల్ఫేట్ ను ప్రతీ మూడు పంటలకు ఒకసారి భూమిలొ దుక్కి తయారుచేసేటప్పుడు, వేరే(భాస్వ రపు) ఎరువులతో కలపకుండా విడిగా వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించినప్పుడు, 2 గ్రా. ల జింకుసల్ఫేట్ ను లీటరు నీటికి చొప్పున కలిపి లేదా 3 సార్లు ప్రతీ 5 రోజుల కొకసారి పిచికారి చేయాలి. దీనిని ఇతర పురుగు మందులతో కలప కూడదు. పైరులో మెగ్నీషియం లోపం వున్నప్పుడు ఆకుల అంచుల నుండి లోనికి పసుపు రంగుకు మారుతాయి. తర్వాత ఆకులు ఎర్రబడి ఎండి రాలిపో తాయి. ఆకుల ఈనెలు మాత్రం రంగుమారక ఆకు పచ్చగా వుంటాయి. మెగ్నీషియం లోపనివారణకు లీటరు నీటికి 10 గ్రా. ల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ ను కలిపి పైరుపై వారం పది రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. కలుపు నివారణ మరియు అంతర కృషి ప్రత్తిలో కలుపు నివారణకు, విత్తనం వేసిన 24-48 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరానికి 1.2 లీటరు చొప్పున 200లీటర్ల నీటిలో- లీటరు నీటికి 6. మి.లీ. చొప్పున కలిపి చేతిపంపుతో పొలం అంతా సమంగా తడిచేటట్టు పిచికారి చేయాలి. భూమిలో సరుయైన పదును/ తేమ వున్నప్పుడే పిచికారి చేసిన గడ్డి మందు చాలా సమర్ధవంతంగా పనిచేసి, కలుపును, నివారిస్తుంది. ప్రత్తి మొలకెత్తిన నెలరోజులకు చేనులో వచ్చు లేతగడ్డి మరియు వెడల్పు ఆకు గల కలుపు నివారణకు - క్విజలోఫాప్ ఇథైల్ (టర్గా సూపర్ ) 400మి.లీ మరియు పైరిథయోబ్యాక్ సోడియం (హిట్ వీడ్ ) 250మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. కలుపు మందులతో పాటుగా ప్రత్తిలో సమయానుకూలంగా ప్రతీ వరం-పది రోజులకొక సారు గొర్రు, గుంటక లతో 60-70రోజుల వరకు పలుదఫాలుగా అంతరకృషి చేసినట్లయితే కలుపు నివారణతో పాటు, పైరు పెరుగుదల బాగా వుండి, భూమిలో ఎక్కువ తేమ నిల్వవుండి, తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది. వర్షాలు ఎక్కువగా వుండి, అంతరకృషి ద్వారా కలుపు నివారణ వీలు కాని పరిస్థితులో పారాక్వాట్ (5మి.లీ/లీటరు నీటికి) మరియు లేదా గ్లైఫోసేట్ 10 మి.లీ మరియు 10గ్రా.ల యూరియా కాయ బాగా తయారయ్యే దశలో లీటరు నీటికి తో కలిపి ప్రత్తి మొక్కలపై పడకుండా, వరుసల మధ్య కలుపుమీద మాత్రమే పడేటట్లుగా పిచి కారి చేస్తే, కలుపు నివారణ బాగా జరుగుతుంది. నీటి యాజమాన్యము ప్రత్తిలో పూత, పిందె సమయములో బెట్ట వచ్చినప్పుడు పూత, కాయ రాలిపోవడం, మరియు అలా వచ్చిన ప్రత్తిని జిన్నింగు చేసినాప్పుడు దూది శాతం తక్కువ రావడం జరుగుతుంది. కావున నీటి వసతి వున్న చోట పూత మరియు కాయ తయారయ్యే దశలో నీటి తడులు తప్పని సరిగా ఇవ్వాలి. తద్వారా పంట దిగుబడి బాగా వస్తుంది. అలాగే ప్రత్తి పంట ఎక్కువ నీటి గాని లేదా అధిక తేమను గాని తట్టుకోలేదు. కావున అవసరం మేరకు నీరు పెట్టాలి. పూత,పిందె రాలకుండా తీసుకోవాల్సిన మెళకువలు ప్రతికూల పరిస్థితులలో (అధిక తేమ/బెట్ట) కూడ మొక్కల జీవన ప్రక్రియలో మార్పువలన ప్రత్తిలో గూడ, పూత మరియు పిందె రాలటం జరుగుతుంది. దీనిని సకాలంలో పోషక్ పదా ర్థాలు, మరియు హర్మోనుల పిచికారి ద్వారా సరిదిద్దుకోవచ్చు. ఫ్లానోఫిక్స్ ను విడిగా గాని లేదా 2 శాతం డి.ఎ.పి. లేదా యూరియాతో గాని (20 గ్రా. లీటరు నీటికి) లేదా ఒక శాతం మల్టి- కె (10 గ్రా. దల లీటరు నీటికి)తో గాని కలిపి పిచికారి చేసుకోవచ్చు. బి.టి.ప్రత్తిని సాగు చేసినప్పుడు మొక్క త్యుత్పత్తి దశలో అనగా పూత, పిందె మరియు కాయ బాగా తయారయ్యే దశలో భూమి ద్వారా అందించే ఎరువులతో పాటు, పై పాటుగా డిఎపి లేదా యూఐయా 2% ద్రావణాన్ని లేదా ఒక శాతం పొటాషియం నైట్రేట్ (మల్టికె) లేదా19:19:19 (పాలీఫీడ్ ) ద్రావణాన్ని 7 -10 రోజుల వ్యవధి లో 2-3 సార్లు పిచికారి చేయాలి. పండాకు తెగులు :ప్రత్తిలో ఆకులు ఎర్ర బడటాన్ని పండాకు తెగులు అంటారుబిటి ప్రత్తిలో గత కొంత కాలంగా పండాకు తెగులును ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఆకులు మొదట గులాబి రంగుకు మారి, తర్వాత పూర్తిగా ఎర్రబడుతాయిఅటు తర్వాత క్రమేపి ఎండిపోయి, రాలిపోతాయి. మొక్క 50-60 రోజుల దాటిన తర్వాత ఇది వచ్చే అవకాశం వుంది. దీని నివారణకు 1 శాతం మెగ్నిషియం సల్ఫేట్ ను (10గ్రా/లీటరు నీటికి), 2 శాతం యూరియాలేదా డిఎపితో (20గ్రా/లీటరు నీటికి) కలిపి వారం రోజులవ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. పేను బంక:ఈ పురుగులు కొమ్మల చివర గుంపులు గుంపులుగాను మరియు ఆకుల క్రింద వుండి ఆకుల నుండి ఆకులఅడుగు రసాన్ని పీలుస్తాయి. దీని వలన ఆకులు దోనెలుగా మారుతాయి. ఈ పురుగులు తేనె వంటి జిరుగు పదార్థాన్ని విసర్జించ డం వలన, మొక్కల ఆకులపై నల్లని బూజుఏర్పడు తుంది. అక్కడక్కడ సాగుచేస్తున్న నాన్ బిటి ప్రత్తి రకాల లో, అధిక సాంద్రత ప్రత్తి సాగులో (బిటి లేని రకాలువిత్తిన చోట) రసం పీల్చే పురుగులే కాకుండా, లద్దె పురు, కాయ తొలుచు పురుగులు ఆశిస్తున్నాయి సస్య రక్షణ : ప్రత్తి పైరును ముఖ్యంగా రసం పీల్చే పురుగులు మరియు కాయ తొలుచు పురుగులు ఆశిస్తాయి. రసం పీల్చే పురుగులు పైరు పూత, పిందె మరియుకాయ దశలో ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి.బి.టి. హైబ్రిడ్ లు ఎక్కువగా సాగు చేస్తున్న ప్రస్తుత తరుణంలో రసంపీల్చే పురుగులైన పచ్చదోమ, పేను బంక, తామర పురుగులు, తెల్లదోమ మరియు పిడినల్లి ప్రత్తి పైరును దాదాపు అన్ని దశల లోను ఆశిస్తున్నాయికొన్ని ప్రతికూలపరిస్థితులలోఎక్కువనష్టాన్నికలిగిస్తున్నాయి. పచ్చదోమ:పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. దీని వలన ఆకులు మొదట దోనెలుగా ముడుచుకొని లేత పసుపు రంగుకు మారి, ఆ తర్వాత ఎర్రబడి రాలిపోతాయి. పచ్చదోమ ఎక్కువగా వున్నప్పుడు పైరు పెరుగుదల క్షీణించి మొగ్గలు రాక దిగుబడి తగ్గుతుంది. పైరు లేత దశలో ఇది ఎక్కువగా ఆశి స్తుంది తామర ప్రురుగు:ఈ పురుగులు సన్నగా పసుపు గోధుమ రంగులో వుంటాయి వీటి పిల్ల, పెద్ద పురుగులు భాగాన చేరి ఆకులను గీకి రసాన్ని పెలుస్తాయిదీనివలన ఆకులు ముడుచుకొని పెళుసుగా మరుతాయి. ఆకుల భాగాన వెండివెలె మెరిసే చారలు, వేగంగా తిరుగుతూ వుండే గోధుమ రంగు సన్నని పేను పురుగును చూసి, దీని ఉధృతిని గమనించవచ్చును. తెల్ల దోమ: పైరు పిందె, కాయదశలో ఎక్కువగా ఆశిస్తుందిపురుగులు కదలకుండా ఆకుల అడుగు భాగాన తెల్లగా వుండి ఎగురుతూ వుంటాయి. తెల్లదోమ ఆశించి నప్పుడు ఆకులు పసుపు పచ్చ రంగుకు మారుతాయికొన్ని సార్లు పొడమచ్చలు ఏర్పడతాయి, తర్వాత ఆకులుఎండి రాలిపోతాయి. ఈ పురుగులు ఆకుల అడుగుభాగంఎండి రాలిపోతాయి. ఈ పురుగులు ఆకుల అడుగుభాగంకాయలు పక్వానికి రాకుండా పగిలి పోతాయి. రసంపీల్చు పురుగుల నియంత్రణ మరియు నివారణ పద్దతులు పచ్చదోమలను తట్టుకొనే వంగడాలను ఎంపిక చేసుకోవాలి. కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 5గ్రా ఇమిడా క్లోప్రిడ్ లేదా 4గ్రా. థయోమిథాక్సామ్ తో విత్తనశుద్ధి చేసి విత్తితే నెల రోజుల వరకు రసం: పీల్చు పురుగులను నివారిస్తుంది. పచ్చదోమ, పేనుబంక నివారణకు 1:4 నిష్పత్తిలో మోనో క్రోటోఫాస్ మరియు నీటిని కలిపిన ద్రావణాన్ని, ప్రత్తిమొక్క కాండానికి బొట్టు పెట్టినట్లుగా బ్రప్ /పుల్లతో పూస్తే(20,40,60 రోజులకొకసారి) చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. రసం పీల్చు పురుగుల నివారణకు – లీటరు నీటికి 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2.0మి.లీ ఫిప్రోనిల్ లేదా 1.5 గ్రా, ఎసిఫేట్ లేదా 0.3గ్రా. ఫ్లోనికామిడ్(ఉలాల) లేదా 1.25గ్రా. డైఫెన్ త్యురాన్ లేదా 0.2 గ్రా. ల ఎసిటామిప్రిడ్ / ధయామిథాక్సామ్ లను గాని కలిపి పిచికారి చేయాలి. ఎక్కువ సార్లు పిచికారి చేసినప్పుడు మందులను మారుస్తుఊ వడితేనే మంచి ఫలితం వుంటుంది. మొదట నాలుగు రకాల మందులను పైరు ;మొదటి దశలో 30-45 రోజుల వరకు, తర్వాత వాటిని పైరు ఎదిగిన తర్వాత వాడుకుంటే ఫలితం ఎక్కువ వుంటుంది. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 5మి.లీ వేప నూనె(1500 పిపియ్గలది)ను కలిపి నేరుగా లేదా2మి.లీ ప్రోఫెనోఫాస్ లేదా 1.5గ్రా ఎసిఫేట్ తో కలిపి గాని 1-2 సార్లు పిచికారి చేస్తే ఫలితం బాగుంటుంది. అలాగే తెల్లదోమ నివారణకు మార్కేట్ లో లభించు పసుపు రంగు జిగట కెలిగిన కార్డులను ఎకరానికి10 చొప్పున కర్రలకి కట్టి పైరులో పెడితే దోమలు ఆకార్డులకు అంటుకొని చాలా వరకు నివారించబడతాయి. ఎర్రనల్లి:పైరు పిందె, కాయ దశలో బెట్ట పరిస్థితులు వున్నప్పుడు ఇది ఆశిస్తుంది. ఎర్రనల్లి, తల్లి, పిల్లపురుగులుప్రత్తిమొక్క ఆకుల అడుగు భాగాన చేరి సాలీడు గూడులా అల్లికచేసి ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకుల పై పసుపు పచ్చని చుక్కలు ఏర్పడతాయి. తర్వాత ఆకుమధ్య భాగం నుండి ఎరుపుగా మారి ఎండిపోతుంది. ఎర్రనల్లి నివారణకు నీటిలో కరిగే గంధకము 3గ్రా. లేదా డైకోఫాల్ 5 మి.లీ లీటరునీటికి కలిపి పిచికారి చేయాలి. పిండి నల్లి:ప్రస్తుతం సాగులో వున్న బిటి ప్రత్తిని పిండినల్లి ఆశించి నష్టం కలుగచేస్తుంది. దీని పురుగులు తెలుపు రంగులోవుండి శరీరమంతా మైనపు పూతనుకలిగి వుంటాయి. పిండీ పురుగు యొక్క తల్లి, పిల్ల పురుగులు ప్రత్తి పైరు కొమ్మలు, కాండం మొగ్గలు, పువ్వులు, కాయలకు వ్యాప్తి చెంది ఆకులు, తొడిమలు, లేత కొమ్మలనుండి రసాన్ని పీల్చిమొక్కలు పూర్తిగా ఎండిపోయేలా చేస్తుంది.పిండీనల్లి ఆశించిన మొక్కలు చిన్న చిన్న కాయలను తక్కువ సంఖ్యలో ఉత్ప్త్తత్తి చేస్తాయి. కాయలు పక్వానికిరాకుండా పగిలి దిగుబడులు తగ్గుతాయి. నివారణ: పిండి పురుగు ఎక్కువగా వయ్యారిభామ, తుత్తురు బెండ, పాయలాకు లాంటి కలుపు మొక్కల ద్వారాచెందుతుంది. కావున పైరు చుట్టూ వున్న కలుపును కాల్చి వేయాలి. చేనులో వృధాగా వదిలిన ప్రత్తి మోడులను కూడా ఫీకి తగులబెట్టాలి.దీని నివారణకు ప్రోఫెనోఫాస్ 50ఇసి లేదా మిథైల్పెరాథియాన్ 50ఇసి 3 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5గ్రామరియు ట్రిటాన్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయతొలుచు పురుగులు ఈ పురుగు పైరును అన్ని దశలలో ఆశించి బాగా నష్టపరుస్తుంది. ఇది గ్రుడ్లనుగుంపులుగా/సముదాయ ములుగా ఆకుల అడుగు భాగాన పెడుతుంది. గ్రుడ్లనుండి వచ్చిన చిన్న లార్వాలు గుంపులుగా చేరి అదే ఆకుమీద పత్రహరితాన్ని గీకి తింటాయి. వ్యాప్తి లార్వాలుపెరిగే కొద్ది చేనంతా వ్యాపించి ఆకులను పీకి కొరికి తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. లార్వాలు మొగ్గలను, పువ్వులను, పిందెలను, కాయలను ఆశించి/తిని పంటలను బాగా నష్ట పరుస్తాయి`. శనగ పచ్చ పురుగు:ఈ పురుగు లార్వాలు మొగ్గలకు, పువ్వులకు చిన్న రంధ్రాలు చేసి నష్ట పరచటం వలన మొగ్గలు, పువ్వులు విపరీతంగా రాలిపోతాయి. ప్రత్తి కాయలను పిందెలను తింటూ బాగా పంటనష్టం చేస్తాయి. గులాబి రంగు పురుగు:ఈపురుగు గ్రుడ్ల నుండి బయటికి వచ్చిన చిన్న లార్వాలు మొగ్గలకు, కాయలకు కన్పించనంత చిన్న రంధ్రాలు చేసి, లోనికి ప్రవేశిస్తాయి. తర్వాత కాయలకుచేసిన రంధ్రం వూడిపోయి పురుగు కాయలోనే వుండి గింజలను తింటూ, దూదిని బాగా నష్టపరుస్తుంది. దూది రంగు, నాణ్యత పూర్తిగా దెబ్బతింటాయి. పురుగు లార్వా దశ మొత్తం కాయలోనే గడపడం వలన, కాయ పగిలిన తర్వాత మాత్రమే నష్టాన్ని గుర్తించగలం. మచ్చల పురుగు (తలనత్త) :ఈ పురుగు లార్వాలు (పిల్ల పురుగులు) లేత కొమ్మల ను, పూ మొగ్గలను మరియు కాయలను తొలచి నష్టము కలుగ జేస్తాయి. కాయతొలుచు పురుగుల నియంత్రణ మరియు నివారణపద్ధతులు ఈ పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధ తులను అవలంబించాలి. వేసవి దుక్కులను లోతుగా దున్నాలి. పంట మార్పిడి పద్దతి అవలంబించాలి. పెసర, బొబ్బెర, మినుము, సోయాచిక్కుడును అంతర పంటలుగా వేసుకోవాలి. శనగపచ్చ పురుగు, లద్దెపురుగుల ఉనికిని, ఉధృతి ని అంచనా వేయడానికి ఎకరాకు 4-6 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. ప్రతి బుట్టలో కొన్ని రోజులు వరుసగా రోజుకు గులాబి రంగు పురుగులు 8, శనగపచ్చ పురుగు ల్ 10, పొగాకు లద్దెపురుగులు 20, మచ్చల పురుగులు15 పడిన ఎడల సస్యరక్షణ చేపట్టాలి. పొగాకు లద్దె పురుగు గ్రుడ్ల సముదాయాలను, జల్లెడ ఆకులను ఏరి నాశనం చేయాలి. విత్తిన 80-100 రోజుల సమయంలో శనగపచ్చ పురుగు నష్ట ఆశించిన మొక్కల తలలు తుంచాలి. పురుగులను తినే పక్షులు వాలటానికి టీ ఆకారపు కర్రలను లేదా పంగల కర్రలను ఎకరాకు 15-20 వరకు పెట్టాలి. పురుగు గ్రుడ్లను, మొదటి దశ పిల్ల పురుగులను నివారించడానికి 5 శాతం వేపగింజల ద్రావణాన్ని (అనగా 10కిలోల వేపగింజల పొడి 200 లీటర్ల నీళ్లలో 24 గంటలు నానబెట్టి వడబోసిన ద్రావణం) లేదా 5మి.లీ వేప నూనె (1500 పిపియమ్ ) ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1 లేక 2 పర్యాయాలు 5 నుండి 7 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారి చేసినట్లయితే ఫలితం బాగా ఉంటుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ క్వి నాల్ ఫాస్ లేదా 3 మి.లీ థయోడికార్బ్ (లార్విన్ ) లేదా 1 మి.లీ ఇండాక్సాకార్బ్ (అవాంత్ ) లేదా 0.3 లీ స్ఫైనోసాడ్ (ట్రేసర్ )లేదా 0.5గ్రా ఇమామెక్టిన్ బెంజో యేట్ (ప్రొక్లెమ్ ) కలిపి పిచికారి చేయాలి. శనగ పచ్చ పురుగు గ్రుడ్లు ఎక్కువగా ఉంటే ప్రోఫినో2మి.లీ లేదా ధయోడికార్బ్ 1.5గ్రా లేదా ట్రైజోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పొగాకు లద్దె పురుగు నివారణకు లీటరు నీటికి 1 మిలీ. నొవాల్యురాన్ (రీమాన్ ) లేదా 1.25 మి.లీ లుఫెన్యురాన్(మ్యాచ్ )లేదా 1.5గ్రా ధయోడికార్ర్బ్ లేదా 0.5 గ్రా ఇమా మెక్టిన్ బెంజోయేట్ ను పిచికారి చేయాలి. మూడవ దశ దాటిన లద్దె పురుగును అదుపు చేయ డానికి విషపు ఎరను వాడాలి. దీనికి గాను ఎకరాకు 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, 750 మి.లీ క్లోరిఫైరిఫాస్ లేదా 300గ్రా. ధయోడికార్బ్ లను జోడించి, ఈ మిశ్రమాకి తగినన్ని నీళ్ళు కలిపి, చిన్న వుండలుగా చేసి సాయం త్రం వేళ చేనంతా చల్లాలి. గులాబి రంగు పురుగును అదుపు చేయడానికి పంట చివరి కాలంలో లీటరు నీటికి 2.5 మిలీ. క్వినాల్ ఫాస్ లేదా 1.5 గ్రా థయోడికార్బ్ లేదా 3మి.లీ క్లోరిఫైరిఫాస్ ను కలిపి పిచికాతి చేయాలి. తెగుళ్ళు – నివారణ వేరు తెగుళ్ళు ప్రత్తి పంటను ఆశించే ఎండు తెగులు మరియు వేరుకుళ్ళు తెగులునివారణకు వేసవి కాలంలో పొలాన్ని లోతుగా దున్నాలి. పొలంలో సేంద్రియ ఎరువులు/పశువుల ఎరువు ను ఎక్కువగా వాడాలి. 5 కిలోలు ట్రైకోడెర్మా విరిడిని 100కిలోల పశువుల ఎరువుతో కలిపి నీళ్ళు చల్లి కప్పివుంచి 15 రోజుల తర్వాత ఎకరంలోని ప్రత్తి మొక్కల సాళ్లలో వేసుకోవాలి. కిలో విత్తనానికి 2 గ్రా కార్బండిజమ్ లేదా 4గ్రా ట్రైకో డెర్మావిరిడి తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కల చుట్టూ నేలపై లీటరు నీటి కి 3 గ్రా. కాఫర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రా. . కార్బండిజమ్ కలిపిన ద్రావణాన్ని మొదలు బాగా తడిచేటట్లు పోయాలి. అవసరాన్ని బట్టి వారం వ్యవధిలో మార్చి మళ్లీ వేయాలి. వేరు కుళ్ళు తెగులు భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు పైరు అన్ని దశలలో వస్తుంది. తెగులు సోకినప్పుడు లేత మొక్కలు అర్ధాంతరంగా ఎండి పోయి చనిపోతాయి. వడలి పోయిన ఆకులు చాలా కాలం చెట్టు పై నుండి క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి. ఫ్యుజేరియం వడలు/ఎండు తెగులు పైరు పూత దశలో ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు వాడిపోయి మొదట ఈనెల మధ్య పసుపు రంగుగా, తర్వాత ఎర్రగా మారి ఆకులు ఎండిపోయి క్రింది నుండి పైకి రాలి పోతుం టాయి. కాండాన్ని చీల్చితే లోపల నల్ల బూజుతో చారలుగా కనిపిస్తాయి. వర్టిసీలియం వడలు/ఎండు తెగులు ఆశించినప్పుడు ఆకులు ఈనెల మధ్య పసుపురంగుకు మారి, లే నల్లని మచ్చలు ఏర్పడి, ఆకులపై పులి చారల కనిపిస్తాయి. తర్వాత ఆకు ఎండిపోయి రాలుతుంది. కాండం మరియు వేరును చీల్చితే లోపల గోధుమ రంగు చారలు కనబడతాయి. ప్రత్తి ఆకులు, కాండం, కొమ్మలు, కాయల మీద వచ్చుతెగుళ్ళు ఇవి ఐదు – ఆరు రకాలు, అవి నల్లమచ్చ తెగులు(బ్లాకామ్ ), ఆకు మచ్చ తెగులు, బూడిద తెగులు,తుప్పు తెగులు, కాయ కుళ్ళు తెగులు మరియు టొబాకో స్ట్రీక్ వైరస్ తెగులు. నల్ల మచ్చ తెగులు (బ్లాకామ్ లేదా బ్యాక్టీరియల్ బ్లైట్) ఆకులపై కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత నల్లగామారతాయి. ఆ తర్వాత ఆకుల ఈనెలకు వ్యాపించి ఈనెలన్నీ నల్లగా మారతాయి. తర్వాత తెగులు ఆకుల ఈనెలకు వ్యాపింక్ష్హి ఈనెలన్నీ నల్లగా మారతాయి.తర్వాత ఆకులు పండి రాలిపోతాయి. తెగులు ఉధృతంగాఉన్నప్పుడు కొమ్మలకు వ్యాపించి కొమ్మలు నల్లగా మారిఎండిపోతాయి. అందువలననే దీనిని బ్లాకామ్ అంటారు. ఈ మూడు తెగుళ్ళ నివారణకు సూడోమోనాస్ తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మ్యాంకోజబ్ లేదా 3గ్రా బ్లైటాక్స్ / పైటోలాన్ లేదా 4 మి.లీ క్యూమాన్ యల్ చొప్పున కలిపి 4 -5 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. బూడిద తెగులు ఈ తెగులు ముఖ్యంగా పైరు మీద ఎక్కువగా డిసెంబరు, జనవరిమాసాలలో వాతావరణంలో తేమవున్నప్పుడు కనిపిస్తుంది. ఆకులమీద కోణా కారపు తెల్లటి మచ్చలు ఏర్పడి బూడిద తెగులు శిలీంధ్రబీజాలు ఆకుల అడుగుభాగానఏర్పడుతాయి. ఆకులు పసుపు రంగులోకి మారి పండుబారి రాలిపోతాయి. కాయల మీద నల్లని మచ్చలు ఏర్పడి కుళ్ళుతాయి దీని నివారణకు విత్తన శుద్ది చాలా ముఖ్యము. కిలో విత్తనానికి 10గ్రా. సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ తో విత్తన శుద్ధి చేయాలి. తెగులు ఉధృతిని బట్టి సెప్టెంబరు నుండి నవంబర్ వరకు 3-4 పర్యాయాలు 15 రోజులకొక సారి 10 లీటర్ల నీటికి 1గ్రా ఫ్లాంటోమైసిన్ లేదా పౌషామైసిన్ మరియు30గ్రా. బ్లైటాక్స్ (కాపర్ ఆక్సీక్లోరైడ్ ) ను కలిపి పిచికారి చేయాలి.నివారణకు లీటరునీటికి 3 గ్రా. సల్ఫెక్సు (నీటిలో కరిగే గంధకము) లేదా 1 గ్రా. కార్బండిజమ్ కలిపి పిచికారి చేయాలి. తుప్పు తెగులు ఈ తెగులు ఎక్కువగా కాయ పక్వ దశలో వస్తుంది ముదురు ఆకులఅడుగు భాగాన రుప్పు మచ్చలు ఏర్పడి, అవి క్రమంగా లేత ఆకులకు వ్యాపిస్తాయి తెగులు ఉధృతి పెరిగిన కొద్ది ఆకుల పై భాగాన ఈ తెగులు ఎక్కువాఅ కనిపిస్తాయి. నవంబరు-ఫిబ్రవరి మాసాల్లో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. నివారణకు 3 గ్రా సల్ఫెక్సు లేదా 1 మి.లీ ట్రైడిమార్ఫ్ లీటరు నీటికి కలిపి 10 – 12 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి. కాయకుళ్ళు తెగులు ప్రత్తికాయ దశలో వున్నప్పుడు వర్షాలు ఎక్కువగా పడితే వివిధ రకాలశిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్ళిపోతాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 30గ్రా బ్లైటాక్స్ మరియు1గ్రా ప్లాంటోమైసిన్ కలిపి 10 రోజులకొకసారి రెండు సార్లు పిచికారి చేయాలి. టొబాకోస్ట్రీక్ వైరస్ తెగులు ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన మొక్కల్లో కొమ్మల చివర ఆకులు కొద్దిగా పసుపు రంగుకు మారి చిన్న చిన్నవిగా ఉంటాయి. ఆకులోని కొంత భాగం మాడి పోయినట్లు నల్లగా అవుతుంది.కొత్త చిగురు, పూత ఏర్పడదు. ఈ తెగులు మొక్కలోని ఎ కొమ్మకు ఆశిస్తే ఆ కొమ్మవరకే పూత, కాత లేకుండా వుంటుంది. మిగతా మొక్క కాయ వేస్తుంది. దీని నివారణకు తామర పురుగుల ఉధృతి తగ్గిం చాలి. తామర పురుగు నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 2 మి.లీ ఫెప్రోనిల్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రత్తి తీతలో మెళుకువలు ప్రత్తిలో పూత దఫ దఫాలుగా రావడ& వల్ల ప్రత్తిని దాదాపు 4 సార్లు తీయవలసి వస్తుంది. బాగా ఎండిన ప్రత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి. లేనిచో ప్రత్తితో పాటు తొడిమలు, కాడలు ఆకులు వస్తాయి. ప్రత్తి తీత ఎక్కువగా చలికాలంలో తీయడం జరుగుతుంది. ఈ కాలంలో ఎక్కువగా మంచు కురియటం వలన ఉదయాన్నే ప్రత్తి తేమగా ముద్దగా ఉంటుంది. కాబట్టి ప్రత్తిని ఉదయం 10గం. ల నుండీ 1 గం. వరకు, సాయంత్రం 3 నుండి 6 గంటలలోపు తీయాలి. మరీ ఎండ సమయంలో మధ్యాహ్నం ఎక్కువ తీసిన ప్రత్తితో పాటు తొడిమలు, కాడ కూడవస్తుంది. కావున సమయాన్ని పాటించాలి. ప్రత్తి తీసిన తర్వాత నీడలో ప్లాస్టిక్ పట్టాల మీద/తాటి పత్రాల మీద వేసి ఆరబెట్టినట్లయితే గింజ గట్టిపడి ప్రత్తిలో తేమ శాతం తగ్గి శుభ్రంగా వుంటుంది. తర్వాత గోనె సంచులలో తొక్కి తేమ తగలకుండా నిల్వ చేసుకొని, మార్కెట్ రేటు బాగా వున్నప్పుడు అమ్ముకోవాలి. ప్రత్తి తీసిన వెంటనే ఆరబెట్టకుండా సంచులలో తొక్కి నిల్వచేస్తే లోపలవున్న తేమకు గింజ ముడుచుక పోవడం, దూది నాణ్యత తగ్గటం జరుగుతుంది. ప్రత్తి సాగులో పాటించవలసిన ముఖ్య మెళకువలు వీలైనంత తొందరగా విత్తనాన్ని విత్తాలి. మే చివర చేయాలి.దీనివలన నుండి జూన్ 15 లోపు విత్తితే దిగుబడులు ఎక్కువగా జులై 15 తర్వాత వీలైనంత వరకు ప్రత్తిని విత్తరాదు. తేలిక నేలలో తప్పని సరిగా ప్రత్తిని సాగు చేసినప్పుడు మొక్కల సంఖ్య మామూలు కంటే ఎక్కువగా వుండేటట్లు దగ్గరగా విత్తుకోవాలి. నేల స్వభావాన్ని, నీటి వసతులను దృష్టిలో వుంచు కొని సరియైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. కలుపు మందులు వాడి మొదటి దశలో వచ్చు కలుపు ను సమర్ధవంతంగా ఎంపిక నివారించుకోవాలి. కాంప్లెక్సు ఎరువులను ఎట్టి పరిస్థిరులలో పై పాటుగా వేయరాదు. నత్రజని, పొటాష్ ఎరువులను మాత్రమే పై పాటుగా వేసుకోవాలి. ఎరువులను భూమి లోపల మొక్కకు దగ్గరగా పడునట్లు గొర్రుతో గాని/చేతితో గాని వేయాలి. డ్రిప్ పద్దతిలో ప్రత్తిని సాగు చేసినప్పుడు వరుసల మధ్య దూరాన్ని పెంచి, మొక్కల మధ్య 11/2 –2 అడుగులు వుండేటట్లు విత్తుకోవాలి. బిటి ప్రత్తి సాగులో కూడా సమగ్ర సస్యరక్షణా పద్దతులను తప్పకుండా ఆచరించాలి. దీని వలన సాగు ఖర్చు తగ్గటమే కాకుండా దిగుబడులు పెరుగుతాయి. పైరు పూత, కాత దశలో ఉన్నప్పుడు భూమిలో వేసే ఎరువులతో పాటు, పై పాటుగా ప్రతీ వారం పది రోజులకు ఒకసారి పోషకాల పిచికారి (డిఎపి పైరు పూత, కాత దశలో సాధారణంగా వచ్చేఆకు మచ్చలు బ్యాక్టీరియా నల్ల మచ్చ తెగుళ్ళను వెంటనే గుర్తించి సిఫారసు చేసిన మందులను 1 లేదా 2సార్లు పిచికారి చేసినట్లయితే పైరుబాగుండి మంచి దిగుబడులు వస్తాయి, పురుగు మందులను విచక్షణా రహితంగా కొట్ట కూడదు. దేనికి ఏది అవసరమో తెలుసుకొని మాత్రమే వాడాలి. ప్రత్తి పండించే భూములలో భూసారం తగ్గకుండా తగిన మోతాదులో సేంద్రయ ఎరువులను క్రమం తప్పకుండా వేయాలి. ప్రత్తి తర్వాత జనవరిలో పప్పుధాన్యపుపంటలైన పెసర, బొబ్బెర, మినుము పంటల వేసుకొని.ప్రత్తి తీతలో మెళుకువలు పాటించి, మంచి రేటు పొందాలి. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, ప్రత్తి పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం. 040-24018447