ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అవసరాలకు సరిపడా ఆహార ఉత్పత్తులను సాధించే క్రమంలో మన రైతాంగం సాంప్రదాయ సమగ్ర పంటల యాజమాన్యం కంటే చాలా మంది తమకు ఉన్న అనుభవంతో గాని తోటి రైతులు చేవడుతున్న యాజమాన్య పద్ధతులను బేరీజు వేసుకుని కొన్ని సందర్భాలలో సిఫారసు చేసిన మోతాదుకు మించి రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడటం వలన పర్యావరణ సమతుల్యత లోపించటం తో పాటు పురుగులలోని రసాయనాలను తట్టుకొనే శక్తి అధికమవడంతో పాటు సాగు ఖర్చులు పెరగటం జరుగుతుంది.వీటన్నింటికి కారణం సాంకేతిక పరమైన అంశాలకు సంబందించిన అవగాహన లేకపోవడమేఈ నేపధ్యంలో వివిధ పంటలలో ఆచరించవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులను క్లుప్తంగా పొందుపరచడం జరిగినది. ఆయా ప్రాంతానికి వాతావరణానికి, నేలకు అనుఅనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. అవకాశమున్న చోట ఆయా పంటలకు ముందు పచ్చిరొట్ట పైర్లను వేసి పూతకు ముందు కలియదున్నిభూసారాన్ని పంపొందించుకోవాలి. పచ్చిరొట్ట పైర్లను వేసుకొనుట వలన 20-25 శాతం మేర నత్రజని ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చు. పంటను బట్టి విత్తనశుద్ధి తప్పనిసరిగా పాటించాలి. భూసాత ఆధారిత సమతుల్య ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. ఆయా పంటల్లోని సూక్ష్మధాతు లోపాలను సకాలంలో గుర్తించి తగు నివారణ చర్యలు చేపట్టాలి. పంట దిగుబడి పెంచుకోనేందుకు, తెగుళ్ళు మరియు పురుగుల వ్యాప్తిని అరికట్టేందుకుసమగ్ర యాజమాన్య పద్ధతులు పంట దశను బట్టి సకాలంలో చేపట్టాలి. పంట యొక్క కీలక ధశ అనుగుణంగా నీటి యాజమాన్యం చేపట్టాలి, వీలైన చోట నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. విచక్షణ రహితంగా పురుగు మందులను వాడరాదు. మరియు పంటకు మేలుచేసే సహజశత్రువులను సంరక్షించాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను విధిగా పాటించాలి. సరైన పక్వదశలో పంటకోతను చేపట్టాలి. సిఫారసు చేసిన మేరకు తేమ శాతం వచ్చిన తర్వాత పంటలను కోసి నిల్వ చేయాలి. పంటల వారీగా పాటించాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతులను గురించి తెలుసుకోవాలి. వరి భూసారాన్ని కాపాడటానికి, వరిలో అధిక దిగుబడులు సాధించడానికి,చీడపీడలను తగ్గించడానికి వరికి ముందుగా జనుము, జీలుగ లేదా పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను వేసి భూమిలో పూతకు ముందు కలియ దున్నాలి. అనువైన రకాలు.ఖరీఫ్ దీర్ఘకాలిక రకాలు (140-150): సాంబ మషూరి (బి.పి.టి.5204), సిద్ధి(డబ్ల్యు.జి.యల్ 44), స్వర్ణ (యంటి.యు 7029) మధ్యకాలిక రకాలు (130 – 135రోజులు) : కృష్ణ (ఆర్ .ఎన్ .ఆర్ 2458), పొలాస ప్రభ(జె.జి.యల్ 384), జగిత్యాల మషూరి (జె.జి.యల్ 11470), కరీంనగర్ సాంబ (జె.జి.యల్ 3855), ప్రాణహిత (జె.జి.యల్ 11727), వరంగల్ సన్నాలు (డబ్ల్యు..జి.యల్ 32100), విజేత (యం.టి.యు 1001). స్వల్ప కాలిక రకాలు (120 – 125 రోజులు): కాటన్ దొర సన్నాలు (యం.టి.యు 1010), తెల్ల హంస (ఆర్. ఎన్ .ఆర్ 10754), జగిత్యాల సన్నాలు (జె.జి.యల్ 11118), శీతల్ (డబ్ల్యు.జి.యల్ 1798),అంజన (జె.జి.యల్ 11118), శీతల్ (డబ్ల్యు.జి.యల్ 288), జగిత్యాల సాంబ(జె.జి.యల్ 38448), ఎర్రమల్లెలు (డబ్ల్యు.జి.యల్ 20471), సువాసన కలిగిన రకాలు: సుమతి (ఆర్.ఎన్.ఆర్ 18833 – 140 రోజులు) సుగంధ సాంబ ((ఆర్.ఎన్.ఆర్ 2465 – 130 రోజులు), శోభిణి (ఆర్.ఎన్.ఆర్ 2354 – 135 రోజులు) అతి స్వల్ప కాలిక (105 -110) : రాజేంద్ర (ఆర్ ఎన్ ఆర్ 12329), ప్రద్యుమ్న (జె.జి.ఎల్ 17004), వరాలు (డబ్ల్యు.జి.యల్ 14377). రబీ:స్వల్పకాలిక రకాలు: కాటన్ దొర సన్నాలు,తెల్ల హంస, శీతల్ , జగిత్యాల సాంబ, ఎర్రమల్లెలు, నెల్లూరు మషూరి, అంజన, ఐ.ఆర్ .64 అతిస్వల్ప కాలిక రకాలు: రాజేంద్ర,ప్రద్యుమ్న, వరాల. ప్రత్యేక పరిస్థితులకు అనువైన రకాలు:అగ్గి తెగులును తట్టుకొనే రకాలు: కృష్ణ నెల్లూరు మషూరి, ఐఆర్ – 64, విజేత, కాటన్ దొర సన్నాలు, ఆర్ ఎన్ ఆర్ – 15048 (విడుదలకు సిద్ధంగా ఉన్న రకం). బ్యాక్టీరియా ఎండాకు తగులు తట్టుకునే రకాలు: స్వర్ణ, ఆర్ .పి.బయో 226 (ఇంప్రూవుడ్ సాంబమషూరి డబ్ల్యు.జి.యల్ -14 (వరంగల్ సాంబ.) ఉల్లికోడును తట్టుకునే రకాలు: సిద్ధి, పొలాస ప్రభ,జగిత్యాల మషూరి, కరీంనగర్ సాంబ, ప్రాణహిత,జగిత్యాల సాంబ, అంజన, ప్రద్యుమ్న. సుడిదోమ తట్టుకునే రకాలు: విజేత, కాటన్దొర,సన్నాలు,ఇంద్ర. చౌడును తట్టుకునే రకాలు: శీతల్ , వికాస్ చలిని తట్టుకునే రకాలు: తల్లహంస, శీతల్ , అంజన. విత్తేసమయం ఖరీఫ్ దీర్ఘ కాలికజూన్ 20 వరకు మధ్యకాలికజూలై 10 వరకు స్వల్పకాలికజూలై 30 వరకు గమనిక: ఖరీఫ్ లో చలి తక్కువగా వుండే జిల్లాలైన ఖమ్మం, నల్గొండలలో వరిని మరొక 10 రోజులు ఆసస్యంగా వేసుకోవచ్చు. విత్తన శుద్ధి: పొడి విత్తన శుద్ధి – కర్బండాజిమ్ 3గ్రా తడి విత్తన్ శుద్ధి కార్బండాజిమ-1గ్రా/కిలో విత్తనం విత్తెన మోతాదు (కిలోలు/ఎకరాకు) నాట్లు వేయడానికి (20–25) డ్రమ్ సీడర్ (10-12) వెదజల్లుటకు (12-15) మిషన్ తో నాట్లు వేయడానికి (10-12) వరిసాగులో నూతన పద్ధతులు: కూలీల సమస్యను అధిగమించడానికి ఈ క్రింది పద్ధతులపై అవగాహన పెంచుకొని ఆచరించాలి. దమ్ముచేయకుండ : మెట్టవరి, ఎరోబిక్ వరి దమ్ముచేసి: డ్రమ్ సీడర్ వరి, నేరుగా వెదజల్లే వరి యంత్రంతో వరి నాట్లు, శ్రీవరి, యాంత్రీకరించిన శ్రీవరి. నారు మడి: ఎకరాకు (5 సెంట్లలో లేదా 200 చ మీ.) 20-24 కిలోల విత్తనం నారుమడిలో విత్తుకోవాలి యూరియా 2.2 కిలోలు+ సింగిల్ సూపర్ పాస్ఫేట్ 6.2 కిలోలు+మ్యూరెట్ ఆఫ్ పొటాష్ 1.75 కిలోలు చివరి ఎకరానికి దుక్కిలో వేయాలి. పైపాటుగా 2.2 కిలోల యూరియా విత్తిన 12-14 రోజులలోపు వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సిగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెట్టింపు మోతాదులో వేయాలి. నారు మడిలో ఊద నిర్మూలనకు బ్యుటా క్లోర్ 5 మి.లీ/లీ. నీటికి విత్తిన 7-8 రోజున లేదా సైహలోపాప్– పి-బుటైల్2మి.లీ/లీ. నీటికి విత్తిన 14-15 మడిలో నీటిని తీసివేసి పిచికారి చేయాలి. రబీలో చలి వలన కనపడే జింక్లోలోప లక్షణాల సవరణకు జింక్ స్ల్ఫేట్ 2గ్రా/లీ నీటికి చొప్పున వారం రోజుల వ్యవధిలో రండు సార్లు పిచికాతీ చేయాలి. నారు తీయడానికి వారం రోజుల ముందు ఎకరా నారుమడికి 800గ్రా. కార్బోఫ్యూరాన్ జి 3 గుళికలు పలుచగా నీరు వుంచి వేయాలి. ప్రధాన పొలంలో పారించవల్సిన మళకువలు నాల్గు నుండి ఆరు ఆకులు తొడిగిన నారును (25-30) నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 22 సెం.మీ విత్తిన మోతాదు (కిలోలు/ఎకరాకు) వెడల్పుకాలి బాటలను వర్షాకలంలో తూర్పు పడమరలుగా రబీలో ఉత్తర దక్షిణ దిశగా తీయాలి. చివరి దమ్ములో ఒక బస్తా డి.ఏ.పి (50 కిలోలు)+యూరియా (10కిలోలు)+మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (15కిలోలు)వేసుకొని నాట్లు చేపట్టాలి. పై పాటుగా నత్రజని ఎరువును యూరియా రూపంలో (90కిలోలు) పైరు ఎదుగుదలను బట్టి 2 – 3 దఫాలుగా బురద పదనులో వేయాలి. చివరి దఫా యూరియాతో పాటు అంకురందశలో, మ్యూరేట్ ఆఫ్ పొటాష్(15 కిలోలు) తప్పనిసరిగావేయాలి. జికంకు లోప సవరణకు తగు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ప్రతి రెండు పంటలకు ఒకసారి ఎకరానికి 20 కిలోలు జింక్ సల్ఫేట్ చొప్పున భూమిలో వేయాలి. పొలాన్ని అడపా దడపా ఆరబెట్టాలి. వివిధ తెగుళ్ళ నివారణకు పొలం లోను, గట్ల మీద కలుపు లేకుండా చూడాలి. ఆర్ధిక నష్ట పరిమిత స్థాయిని బట్టి వివిధ పురుగులకు, తెగుళ్ళకు సిఫారసు చేసిన మందు లను మాత్రమే పిచికారి చేయాలి. కలుపు యాజమాన్యం నాటిన 3-5 రోజులలోపు: బ్యుటాక్లోర్ 1.25లీ లేదా అనిలోఫాస్ 0.5లీ. లేదా ప్రెటిలాక్లోర్ 0.5లీ. లేదా ఆక్లాడయార్జిల్ 35గ్రా లేదా బెన్ సల్ఫ్యురాన్ మిధైల్+ ప్రెటిలాక్లోర్ 4 కిలోలు 20కిలోల ఇసుకతో కలిపి పొలంలో పలుచగా నీరు వుంచి చల్లాలి. 10 – 12 రోజులు: పైరజోసల్ఫ్యురాన్ ఇధైల్ 80గ్రా. లేదా ఇధాక్సి సల్ఫ్యురాన్ 50గ్రా. లేదా సైహలోపాప్ -పి-బ్యూటైల్ 250-300 మి.లీ లేదా పినాక్సిప్రోప్ పి. ఇధైల్ 200-250 మి.లీ లను 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేయాలి. 20-25 రోజులకు: బిన్ పైరిబ్యాక్ సోడియం 100మి.లీ లేదా 2.4డి. సోడియం సాల్ట్ 500-600 గ్రా. లేదా 2 -4 డి.ఇధైల్ ఎస్టర్ 1.25లీ. పిచికారి చేయాలి. నీటి యాజమాన్యం నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా వుండాలి. పచ్చబడిన తర్వాత నుండి దుబ్బు చేసే దశ వరకు ఒక ఇంచు (1”) (2-3 సెంమీ.) నీరు వుండాలి. చిరు పొట్ట దశ నుండి గింజ కట్టే దశ వరకు రెండు ఇంచుల (2”) (5 సెం.మీ) నీరు వుండాలి కోతకు పది రోజుల ముందు నీటిని నెమ్మదిగా తగ్గించి పొలాన్ని ఆరబెట్టాలి. చీడ పీడల యాజమాన్యం వివిధ చీడ పీడల ఉధృతిని అదుపులో వుంచడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను విధిగా అవలంబించాలి. కేవలం పురుగు మందులపైన ఆధారపడి సేద్యం చేయరాదు. తట్టుకొనే రకాలను సాగు చేయాలి. నాట్లు ఆలస్యమైనపుడు నారు కొనలు త్రుంచి నాటాలి. ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలు పెట్టి కాండము తొలిచే పురుగు ఉధృతి పై నిఘా వుంచాలి. సుడిదోమ ఆశించే ప్రాంతాలలో కాలి బాటలు తీయడం తప్పని సరి. నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదులో పలు దఫాలుగా వేయాలి. సస్యరక్షణ పురుగులు కాండం తొలుచు పురుగు: పురుగు సోకిన పిలకలు చనిపోతాయి, వెన్నులు తెల్లకంకులుగా మారుతాయి.5% మొవ్వులు చనిపోయిన యెడల సస్యరక్షణ చేపట్టాలి. కార్టావ్ హైడ్రోక్లోరైడ్ 2.0గ్రా. లేదా ఎసిఫేట్ 1.5గ్రా.లు లేదా క్లోరాన్ర్టానిలిప్రోల్ 0.4 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా కార్బోప్యురాన్ 3జి 10 కిలోలు లేదా కార్టావ్ హైడ్రోక్లోరైడ్ 4జి 8 కిలోలు లేదా క్లోరాన్ర్టానిలిప్రోల్ 0.4 శాతం 4 కిలోలు/ ఎకరాకు చొప్పున వేయాలి. ఉల్లికోడు: వారం రోజుల ముందు 5 సెంట్లు నారుమడికి కార్బోప్యూరాన్ 3జి గుళికలు 800గ్రా. లేదా ఫోరేట్ 10జి గుళికలు 250గ్రా. చొప్పున వేయాలి. నాటిన 15 రోజులకు కార్బోప్యూరాన్ 10 కిలోలు/ ఎకరానికి వేయాలి • దోమపోటు/సుడిదోమ: గోధుమ వర్ణపు దోమ మరియు తల్ల మచ్చ దోమ వరిపైరును ఆశిస్తాయి. పిల్ల, పెద్ద దోమలు దుబ్బులు మొదళ్ళ దగ్గర వుండి రసం పీల్చుట వలన పైరు సుడులు సుడులుగా ఎండి పోతుంది. • పిలక దశలో దుబ్బుకి 10 – 15 దోమలు పూత దశలో దుబ్బుకి 20 – 25 దోమలు ఉన్నప్పుడు ఎసిఫేట్1.5గ్రా.లు లేదా మోనోక్రోటోఫాస్ 2.2మి.లీ లేదా ఇధోఫెన్ ప్రాక్స్ 2.0 మిలీ లేదా బ్యూప్రోఫెజిన్ 1.6 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ + ఎథిప్రోల్ 0.25గ్రా.లు లేదా డైనోటెప్యురాన్ 0.4 గ్రా.లు లేదా పైమెట్రోజైన్ 0.50 గ్రా.లీటరు నీటికి కలిఇ పిచికారి చేయాలి. లేదా క్లోరాన్ర్టానిలిప్రోల్ 0.4 మి.లీ లేదా ఫ్లుబెండమైడ్ 20 డబ్ల్యు.డి.జి. 0.25గ్రా. లేదా ఫ్లుబెండమైడ్ 48 ఎస్ .సి 0.1 మి.లీ.లీటరు నీటికి పిచికారి చేయాలి. • ఆకు నల్లి/కంకినల్లి: ఆకునల్లి ఆశించినప్పుడు ఆకులలోని పత్రహరితాన్ని గోకి తినివేయుట వలన ఆకుల పాలిపోయి తెల్లని పిండి ఏర్పడుతుంది. కంకినల్లి వెన్ను అభివృద్ధి చెందే దశలో అండాశయాన్ని, పుప్పొడిని నష్ట పరుచుట వలన తాలు గింజలు ఏర్పడతాయి. ఈ పురుగును తొందరగా గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టిన నష్టాన్ని చాలా వరకు తగ్గించ వచ్చును. ఆకు నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైకోఫాల్ 5 మి.లీ లేదా స్ప్రైరోమెసిఫెన్ 1 మి.లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. కంకి నల్లి లేదా నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ + ప్రొపికోనజోల్ 1 మి.లీ లేదా డైకోఫాల్ 5 మి.లీ + ప్రొపికోనజోల్ 1.మి.లీ లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ + ప్రొపికోనజోల్ 1 మి.లీ/లీటరు నీటికి కలిపి అంకురం దశలో ఒకసారి, మరలా 15రోజుల తర్వాత ఒకసారి,పైమందులను మార్చి మార్చి పిచికారి చేయాలి. తెగుళ్ళు • అగ్గి తెగులు: ఆకులపై నూలు కండె ఆకారం గల గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, చివరి ఆకుల వరకు పూర్తిగా ఎండిపోయి తగులబడినట్లుగా కనిపించును. పైరు పూత దశలో వున్నప్పుడు వెన్ను, మెడ భాగంలో ఈ తెగులు ఆశిస్తే మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి.• అగ్గితెగులును తట్టుకొనే రకాలను సాగుచేయుట, తెగులు కనిపించిన వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా.లేదా ఐసోప్రొథయో లేన్ 1.5మి.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. • బాక్టీరియా ఎండాకు తెగులు: ఆకు అంచుల వెంబడి పసుపు రంగు మచ్చలు ప్రారంభమై చివరకు ఆకులు పూర్తిగా ఎండిపోతాయి.• తెగులును తట్టుకొనే రకాలను సాగు చేయుట, సిఫారసు చేసిన నత్రజని ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయుట.చివరి దశ వరకు ఆశిస్తుంది. మొక్కల క్రింద భాగాన ఆకుల పై గోధుమ రంగు కలిగిన మచ్చ్లు ఏర్పడి క్రమేపి పెద్దవై పాము పొడ వంటి మచ్చలుగా ఏర్పడతాయి. తెగులు ఉదృతి ఎక్కువైనప్పుడు మచ్చ్లు పోటాకు వరకు వ్యాపించి పైరు పూర్తిగా ఎండిపోతుంది. • నివారణకు ప్రొఫికొనజోల్ 1మి.లీ లేదా హెక్సాకొనజోల్ 2మి.లీ లేదా వాలిడామైసిన్ 2మి.లీ లేదా ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ + టెబుకొనజోల్ 0.4 ఒక లీటరు నీటికి కలిపి పొలంలో నీరు తీసివేసి మొదళ్ళ దగ్గర బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి. • కాండంకుళ్ళు తెగులు: ఈ తెగులు అంకురమేర్పడే దశ నుండి పైరు పాలు పోసుకొనే దశ వరకు వ్యాప్తి చెందే అవకాశముంది. ముందుగా దుబ్బు లోని ఒక కర్ర లేదా పిలకలోని క్రింద వరుస ఆకులు పసుపు రంగుకి మారుతాయి. మొదలు వద్ద నున్న కణుపు లోపలి భాగం కుళ్ళిపోవుట వలవ పైరు పాలు పోసుకొని గింజ గట్టిపడే దశలో కుళ్ళిన కాండం బలహీనపడి విరిగిపోతుంది.• నివారణ తగులు గమనించిన వెంటనే హెక్సాకొన జోల్ 2.మి.లీ లేదా వాలిడామైసిన్ 2.మి.లీ లేదా బినోమిల్ 1 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి • మానిపండు తెగులు: పైరు పుష్పించు దశలో ఆశిస్తుంది. అండాశయం ఆకుపచ్చ రంగు ముద్దగా మారి, తర్వాత గింజలన్నీ పసుపు రంగు ఉండలాగ మారి దిగుబడి తగ్గుతుంది. సమగ్ర సస్తరక్షణ వేసవిలో లోతు దుక్కులు చేయాలి. చీడపీడలను/తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి.(సుడిదోమ, ఉల్లికోడు, అగ్గితెగులు) విత్తనశుద్ధి తప్పక పాటించాలి. ·ఎత్తైన నారుమళ్ళను ఏర్పర్చుకొని సాళ్ళలో మొలకెత్తిన విత్తనాన్ని చల్లాలి. నారుమడికి సిఫారసు చేసిన సేంద్రియ ఎరువులతో బాటు రసాయనిక ఎరువులను వాడాలి. నారుమడికి సస్యరక్షణకు గాను నారు పీకే 7 – 10 రోజుల ముందు కార్భోప్యూరాన్ 3జి ఒక కిలో/ఎకరానికి సరిపోయే నారు మడిలో వేయాలి. ప్రధాన పొలంలో జనుము, జీలుగా, పిల్లిపెసర లేదా పెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను వేసి పూత సమయంలో కలియ దున్నాలి. గత పంట అవశేషాలను నిర్మూలించాలి. పొలంలోను, గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. సకాలంలో నాట్లను వేసుకోవాలి. నాటేటప్పుడు నారు కొనలను త్రుంచి నాటాలి. ముఖ్యంగా ముదిరిన నారు నాటే పరిస్థితులలో లేదా నాట్లు ఆలస్యమయినప్పుడు. పొలంలో ప్రతి రెండు మీటర్లకి 20మ్ సెం.మీ కాలి బాటలు తూర్పు, పడమర (ఖరీఫ్) మరియు ఉత్తర-దక్షిణ (రబీ) దిశల్లో తీయాలి. లింగాకర్షక బుట్టలు (3/ఎకరానికి) అమర్చి మొది పురుగు ఉధృతిని గమనించాలి. వారానికి బుట్టకు 25 – 30 మగ రెక్కల పురుగులు గమనించిన వారంలోపు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎర పంటగా పూసా బాసుమతి – 1 రకాన్ని ఉపయోగించి ప్రధాన పంటపైన కాండం తొలుచు పురుగు ఉధృతిని, ప్రధాన వరి రకాలలో తగ్గించుకోవచ్చు. ట్రైకోగ్రామా గ్రుడ్డు పరాన్న జీవులను నాటిన 30 రోజుల నుంచి ఎకరాకు 4 కార్డుల చొప్పున 5 దఫాలుగా పొలంలో 10 రోజుల వ్యవధితో వదలాలి. సిఫారసి మేరకు ఎరువులను వేయాలి. ముఖ్యంగా నత్రజని ఎరువును మోతాదుకుమించి వాడరాదు. దోమ ఉధృతిని పెరగకుండా పొలాన్ని అడపాదడపా ఆరగట్టాలి. మురుగునీరు బయటకు తీయడం ద్వారా తెగుళ్ళు, పురుగుల అభివృద్ధిని అదుపులో ఉంచవచ్చును. తప్పని సరి పరిస్థితుల్లో పురుగు/తెగుళ్ళ మందులను సిఫారసు చేసిన మేరకు పిచికారి చేయాలి. రెండు,మూడు రకాల మందులను కలిపి పిచికారి చేయరాదు వరి కోత వెన్నులోని 80 శాతం గింజలు పక్వానికి వచ్చిన కాండం పచ్చగా ఉన్నపుడే కోత కోయడం మంచిది. కోసిన తర్వాత ధాన్యాన్ని నేరుగా సూర్యరశ్మి తగిలేలా కాకుండా నీడలో వుంచి నెమ్మదిగా తగ్గించే టట్టు చూడాలి. లేనట్లయితే నూక శాతం పెరుగును. చేయవల్సినవి చేయకూడనవి • పంట కాలాన్ని బట్టి సకాలంలో విత్తుకోవాలి.• రబీలో కలినుండి నారును కాపాడటానికి నీటిని సాయంత్ర వేళలో తీసివేసి మరుసటి రోజు ఉదయాన్నే నీళ్ళు పెట్టాలి. నారును పాలథీన్ సంచితో కుట్టిన బరకాలతో గాలి చొరబడ కుండా సాయంత్రం కప్పివుంచి ఉదయాన్నే తీసివేయాలి.• భూసారాన్ని పరిరక్షించు కొనుటకు వీలైన చోట్ల సేంద్రియ ఎరువులు, కానుగ చెక్క (200 కి/ఎ), వేప చెక్క (200 కి/ఎ), అజోస్పైరిల్లమ్ , అజటో బాక్టర్, వివిధ మేలు చేసే నాచులను సిఫారసు మేరకు వాడాలి.• ముదురు నారు నాటినప్పుడు కుదుళ్ళ సంఖ్యను పెంచి (4 – 5) మొక్కలు చొప్పున) దగ్గర దగ్గరగా నాట్లు వేయాలి. నత్రజని ఎరువును సిఫారసు కంటే 25% పెంచి 70% దమ్ములోను మిగతా 30% చిరు పొట్ట దశలో వేయాలి.• యూరియా (50కిలోలు)కు 10 కిలోల వేప పండి కలిపి రెండు రోజులు నిల్వ వుంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది.• రసాయనిక ఎరువులను బురద పదునులోనే చల్లాలి.• కలుపు మందులు, గుళికలు చల్లినప్పుడు నీరు పలుచగా వుంచి, నీరు పొలంలో ఇంకేటట్లు జాగ్రత్త వహించాలి.• కలుపు 2 – 3 ఆకుల దశలోనే కలుపు మందులు వాడాలి.• మెట్ట నారుమళ్ళ లేత చిగురు ఆకులు తెల్లగా మారి ఇనుపధాతు లోపం ఏర్పడినప్పుడు లీటరు నీటికి 20గ్రా. అన్నభేది + 2గ్రా. నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేయాలి. • ఎంపిక చేసుకున్న రకాన్ని అధీకృత డీలర్ లేదా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మాత్రమే రశీదుతో సహ కొనుగోలు చేసి, వెంటనే మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. తగిన రశీదు లేకుండా విత్తనం కొనుగోలు చేయరాదు.• నీటి లభ్యత తక్కువగా వున్న ప్రాంతాల్లో ముఖ్యంగా రబీలో వరి పైరును సాగు చేయరాదు.• దీర్ఘకాలిక రకాలను (140-150 రోజుల) ఎట్టి పరిస్థితుల లోను ఆలస్యంగా విత్తుకోరాదు.• స్వల్ప కాలిక రకాలు ఎట్టి పరిస్థితిలోను ముదురు నారు నాటరాదు.• రసాయనికి ఎరువులతో ఏవిధమైన గుళికలను, పురుగు మందులను కలిపి పొలంలో చల్లరాదు.• కాంప్లెక్స్ (మిశ్రమ) ఎరువులను పైపాటుగా వేయరాదు.• భాస్వరం ఎరువులను జింక్ సల్ఫేట్ తో కలిపి వేయకూడదు.• ఆయా ప్రాంతాన్ని బట్టి ఉధృతిని పెంచే పురుగు మందులను వాడరాదు. (సుడిదోమ: క్లోరోపైరిఫాస్ , ప్రొఫెనోఫాస్ , ల్యామ్ డా సైహలో త్రిన్ మరియు ఇతర సింథటెక్ పైరిత్రాయిడ్స్) నల్లిజాతి పురుగులు : ఎసిఫేట్ , ఆకుముడత: పోరేట్ • వాడే పంపును బట్టి ఎకరానికి వాడే మందు ద్రావణం మారుతుంది (చేతి పంపు 200 లీ తైవాన్ : 150లీ. పవర్ పంపు:100లీ.) పంపు ఏదైనప్పటికీ ఎకరానికి సిఫారసు చేసిన మందు మోతాదు మారదు. కలుపు మందులు వాడేటప్పుడు మామూలు నాజిలు కాకుండా ప్లడ్ జైట్ నాజిల్ ను లేదా ప్లాట్ పాన్ నాజిల్ ను మరియు ప్రక్క పొలానికి హాని కలుగకుండా హుడ్ ను వాడాలి.• వరుసలలో నాటిన వరిలో పిలకల సంఖ్య మరియు దిగుబడి పెంచడానికి కలుపును పొలంలోనే కలియ దున్నడానికి కొనోవీడర్ లేదా పవర్ వీడర్ ను 15-45 రోజులలోపు 2-3 సార్లు వినియోగించాలి.• ఎలుకల ఉధృతి పెరగకుండా ఉండటానికి పొలం గట్లు సన్నగా ఉండే విధంగా చూసుకోవాలి. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం. 040-24018447