తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న నూనె గింజ పంటలలో ముఖ్యమైన వేరుశనగ. ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు, తుంపర పధ్ధతి ద్వారా నీటి యాజమాన్యం అధిక దిగుబడి నిచ్చే రకాలు లభించడం ద్వారా తెలంగాణలో పంట విస్తీర్ణంలో గణనీయంగా పెరుగుతున్నప్పాటికి వేరుశనగను ఆశించే పురుగుల వలన దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. ఈ పరిస్ధితుల్లో వేరుశానగకు ఆశించే పురుగులు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పొగాకు లద్దె పురుగు తల్లి పురుగులు లేత గోధుమ రంగులో ఉండి ఆకులపై అడుగు భాగాన గుంపులుగా గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకుపై పత్ర హరితాన్ని గీకి తినివేసి, జల్లెడాకుగా మారుస్తాయి. పగటివేళ ఈ పురుగులు చెట్ల అడుగు భాగాన లేక మట్టి పెళ్ళలు లేక రాళ్ళ కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి. నివారణ దీని నివారణకు వేసవిలో లోతు దుక్కి చేయాలి. నత్రజనిని ఎక్కువ మోతాదులో వాడరాదు. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి మగ రెక్కల పురుగులను ఆకర్షించాలి. ఎకరా వేరుశనగ పొలంలో 30-40 ఆముదం , పొద్దుతిరుగుడు మొక్కలు ఎర పంటలుగా ఉండేటట్లు చూడాలి. లింగాకర్షణ బుట్టల ద్వరా పురుగుల ఉద్రుతిని గమనించి టేలినోమన్ రిమస్ అనే గుడ్ల పరాన్న జివిని 50,000 ఒక ఎకరాకు 7-10 రోజుల వ్యవధిలో 4 సార్లు పొలంలో వదలాలి. 100 పురుగుల ద్వారా వచ్చిన ఎన్.పి.వి. ద్రావణాన్ని ఒక ఎకరాకు సాయంకాలం పిచికారీ చేయాలి. క్వినాల్ఫాస్ 400 మి. లీ లేదా ఎకరానికి 10 పక్షి స్దావరాలు ఏర్పాటు చేయాలి. ఎదిగిన లార్వాలకు ధయోడికార్బ్ 200 గ్రా. లేదా ప్లూబెండమైడ్ తయారు చేసి (వరి తవుడు 5 కిలోలు + బెల్లం అర కిలో + మోనోక్రోటోఫాస్ లేదా క్లోరి ఫైరిఫాస్ 500 మి.లీ.) ఎకరా పొలంలో సాయంత్రం పూత సమానంగా చల్లాలి. రసం పీల్చే పురుగులు తామర పురుగులు : ఈ పురుగు ఆకుల పై పచ్చదనాన్ని గీకి రసాన్ని పిలుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు ముడుచుకొని, మొక్కలు గిడసబారిపోతాయి. ఆకుల అడుగుభాగాన గోడుమరంగు వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగు వేరుశనగలో మొవ్వ కుళ్ళు, కాండం కుళ్ళ వైరస్ తెగుళ్ళను సంక్రమింపచేస్తాయి. పెనుబంక : తల్లి, పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చివర్లపైన, లేత ఆకుల అడుగుభాగాన, కొన్ని సందర్భాలలో పూతపై గుంపులుగా ఏర్పడి రసాన్ని పిలుస్తాయి. దీని వలన మొక్కలు గిడసబారతాయి. పూత దశలో ఆశించినప్పుడు పూత రాలిపోతుంది. ఈ పురుగులు తేనే వంటి జిగురు పదార్ధం స్రవించడం వల్ల దీని మీద నల్లటి బూజు ఏర్పడుతుంది. పచ్చదోమ (దీపపు పురుగు): పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేస్తాయి. మొదటి ఆకుపై భాగాన మొదటగా ‘వి’ ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి, క్రమేపి ఆకులన్నీ పసుపు పచ్చగా మారతాయి. నివారణ : తామర పురుగు నివారణకు ఎకరానికి మోనోక్రోటోఫాస్ 320 మి.లీ + వేరునూనె 1లీ. + ఒక కిలో సబ్బుపొడిని 200 లీటర్ల నీళ్ళకు కలిపి విత్తిన 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పెనుబంక, పచ్చదోమ నివారణకు డైమిధోయేట్ 400 మి.లీ లేదా మిధైల్ డేమటాన్ 400 మి.లీ. లేదా ధయోమీధాక్సామ్ అసిటామిప్రిడ్ లేదా ధయోక్లోప్రిడ్ 50 మి.లీ. మందును 200 లీటర్లు నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. వేరుశనగ పైరులో అక్షింతలు పురుగులు మొక్క ఒక్కింటికి 2 లేక అంతకంటే ఎక్కువగే ఉన్నప్పుడు క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలీ. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక