ఉద్ధేశ్యం పంటకోత తర్వాత దిగుబడి నష్టాలను తగ్గించుకోవడం మరియు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకున్నప్పుడు తద్వారా నికర ఆదయాన్ని పెంపొందుంచుకోవడం. నిలువలో గింజ/ విత్తన నాణ్యతను కాపాడుకుని అధిక మార్కెట్ ధర పొందడం మరియు ఎగుమతి చేసుకోవడం, తద్వారా ఆహార భద్రత మరియు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించుకోవడం. ఉపోద్ఘాతం మనదేశంలో విత్తన పంట మరియు వాణిజ్య పంటల్లో పంటకోతానంతరం కలిగే నష్టాలు 30-35% వరకు ఉంటాయని అంచనా వేయడం జరిగింది. పండించిన ధాన్యాన్ని రైతులు వివిధ కారణాల కొరకు నిల్వ చేసుకుంటారు. ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి మరియు ఆహార అవసరాల కొరకు దాచుకుంటారు.ఈనిల్వ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వివిధ రకాలైన పురుగులు, బూజు తెగుళ్ళు మరియు ఎలుకలు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. దీని వలన నాణ్యతతో పాటు మొలక శాతం, విత్తన ధారుడ్యత తగ్గిపోవడమేకాక, గింజ రంగు, రుచి కోల్పోయి, వాసన మారిపోయి తినడానికి పనికిరాదు. బూజు ఆశించినట్లయితే ధాన్యం అట్టలు కట్టి ముక్క వాసన వస్తుంది, తద్వారా అప్లోటాక్సిన్లు అనె విషపదార్ధాలు ఉత్పన్నమై మనుషులకు వ్యాధులు కలుగజేస్తాయి. కనుక రైతులు ధాన్యం నిల్వలో శ్రధ వహించి తగు జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన విత్తనాన్ని ఎక్కువ కాలం దాచుకొని మంచి ధర పలికినపుడు అమ్ముకోవచ్చు. విత్తన పంటల విషయానికొస్తే వ్యవసాయంలో రైతులు పెట్టే అన్ని పెట్టుబడులలో నాణ్యమైన విత్తనం అతి ముఖ్యమైన నాణ్యమైన విత్తనమె 15-20% వరకు అధిక దిగుబడినిస్తుందని అంచనా వేయడమైనది. ఈ విత్తన నాణ్యత ప్రమాణాన్ని కాపాడుకోవడానికి లేదా పెంపొందించుకోవడానికి రైతులు పాటించవలసిన అంశాలు విత్తన పంటల్లో యంత్రాల ద్వారా పంటకోత, నూర్పిడి చేసినట్లయితే, ముందుగా కోసిన పంటల మిగిలిపోయిన విత్తనాలు లేకుండా బాగా సుభ్రపరచుకోవాలి. దీని ద్వారా రకాల కల్తీని నివారించుకోవచ్చు. పంటకోతకు వచ్చినప్పుడు వివిధ పంటల్లో పక్వదశను గమనించి ఆలస్యం చేయకుండా సకాలంలో కోసుకోవాలి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో అంటే అధిక తేమ వర్షపాతం ఉన్నప్పుడు పంటలను కోయరాదు. నూర్పిడి తర్వాత గింజలు విత్తనాన్ని శుభ్రపరచుకొనేటప్పుడు, వ్యర్థ పదార్ధాల్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఆరబెట్టేటప్పుడు నేరుగా తీవ్రమైన ఎండలో ఆరబెట్టకూడదు, తీవ్రమైన ఉష్ణోగ్రతల వలన గింజ విత్తన్ నాణ్యత దెబ్బతింటుంది మరియు మొలకెత్తే శక్తి కూడా తగ్గిపోతుంది. ఆరబెట్టిన తర్వాత ధాన్యపు పంటల్లో అయితే 12-14%, పప్పుదినుసుల్లో 8-10% మరియు నూనెగింజల పంటల్లో 7-9% గరిష్టంగా తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇంతకన్నా తేమ శాతం ఎక్కువగా ఉంటే, నిల్వలో నాణ్యత దెబ్బతింటుంది. నిల్వలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వకు ఎల్లప్పుడు గాలి తేమ చొరబడని సంచుల్ని లేదా నిల్వ పాత్రల్ని మాత్రమే ఎంచుకోవాలి. పొడి, చల్లని వాతావరణంలో నిల్వ ఉంటే గింజ విత్తన నాణ్యత బాగా ఉంటుంది. గిడ్డంగుల్లో ధాన్యాన్ని/విత్తనాలను నిల్వ చేసినప్పుడు, ఎప్పుడూ పరిశుభ్రమైన కొత్త సంచులలోనే నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసే గదులు, గోదాములు శుభ్రం చేసుకొని, పగుళ్ళు లేకుండా చూసుకొని సున్నం వేసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే పూడ్చి వేయాలి. పాత సంచులను వాడేటప్పుడు వాటిని డెల్టామెత్రిన్ 1.5 మి.లీ (కె.బయోల్ ) లేదా 3.5 మి.లీ.(డెసిస్)/ ఇమామెక్టిన్ బెంజోయేట్ 2గ్రా/లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముంచి ఆరబెట్టి వాడుకోవాలి. మంచి నాణ్యత కలిగిన పాలిథీన్ లైనింగ్ ఉన్న జ్యూట్ సంచులు, సూపర్ గ్రెయిన్ బ్యాగ్ , పురుగు మందుల లేపనం బ్యాగ్, హెచ్ .డి.పి.ఇ. ప్లాస్టిక్ సంచులు, మ్యాజిక్ బ్యాగ్ లు విత్తన నిల్వకు వాడడం మంచిది. బస్తాలను బ్లాక్ పద్ధతిలో అనగా ఒకటి పొడవుగా రెండవది అడ్డంగ ఉండేటట్లు అమర్చుకోవాలి. బస్తాలను నేలకు, గోడలకు ఆనించకుండా ఎత్తైన చెక్క బల్లపై పెట్టుకోవాలి. సోయాచిక్కుడు లాంటీ విత్తన పంటల్లో విత్తన పొర పలుచగా ఉంటే యంత్రాలద్వారా కోత, నూర్పిడి చేయరాదు. అలా చేస్తే మొలకశాతం దెబ్బతింటుంది. ఒకవేళ తప్పనిసరిగా చేయవలసి వస్తే విత్తనానికి రాపిడి జరగకుండా యంత్రంల్లో సరైన మార్పులు చేసి ఉపయోగించు కోవాలి. కొత్త ధాన్యాన్ని పాత ధాన్యంతో కలుపరాదు. కొత్త ధాన్యాన్ని నింపే ముందు, గోడల పైకప్పుకు మరియు గోనె సంచులపైన మలాధియాన్ 10 మి.లీ/డైక్లోర్ వాస్ 7మి.లీ/డెల్టామెత్రిన్ 1.5 మి.లీ/లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. సోయాచిక్కుడు లాంటీ విత్తన పంటల్లో విత్తన పొర పలుచగా ఉంటే యంత్రాలద్వారా కోత, నూర్పిడి చేయరాదు. అలా చేస్తే మొలకశాతం దెబ్బతింటుంది. ఒకవేళ తప్పనిసరిగా చేయవలసి వస్తే విత్తనానికి రాపిడి జరగకుండా యంత్రంల్లో సరైన మార్పులు చేసి ఉపయోగించు కోవాలి. కొత్త ధాన్యాన్ని పాత ధాన్యంతో కలుపరాదు. కొత్త ధాన్యాన్ని నింపే ముందు, గోడల పైకప్పుకు మరియు గోనె సంచులపైన మలాధియాన్ 10 మి.లీ/డైక్లోర్ వాస్ 7మి.లీ/డెల్టామెత్రిన్ 1.5 మి.లీ/లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. విత్తన నిల్వలో విత్తనశుద్ధి వృక్షసంబంధిత పదార్థాలైనవేప నూనె (5మి.లీ) వేప గి&జల పొడి (5గ్రా) వస కొమ్ముల పొడి (5గ్రా) సీతాఫలం గింజల పొడి (5 గ్రా) మొదలైనవి. కిలో ధాన్యానికి /విత్తనానికి కలిపి పెడితే పురుగు పట్టకుండా ఉంటుంది. అపరాలు పుచ్చుపట్టకుండా, బూడిద ప్లెయాష్ , వరి పొట్టు మసి, ఎ.బి.సి. పొడి, డైఆటమేషియన్ మట్టి లాంటివి. 5గ్రా. కిలో ధాన్యానికి కలిపి దాచుకోవాలి. కొత్తరకం సురక్షితమైన పురుగు మందులైన స్పైనోశాడ్ 4 గ్రా లేదా ఇమామెక్టిన్ బెంజుయేట్ 40 గ్రా మరియు శిలీంధ్రాలను అదుపులో ఉంచటానికి ధైరామ్ లేదా కాప్టాన్ 250 గ్రా లను 100 కిలోల విత్తనానికి పట్టించి, ఆరబెట్టి, పొడి బస్తాలలో నింపి దాచుకోవాలి. ఈ మందుల మోతాదును అరలీటరు నీటిలో కలిపి దానిని 100 కిలోల ధాన్యానికి కలిపి, ఆరబెట్టి బస్తాలలోకి ఎత్తుకొని ఉంచుకోవాలి. గమనిక : ఆహార అవసరాలకి దాచుకున్న ధాన్యంలో విషపూరిత రసాయనిక పురుగు మందులను కలుపరాదు. విషవాయువులతో ఊదరబెట్టడం ఒక టన్ను ధాన్యానికి 3 గ్రా. అల్యూమినియం ఫాస్పైడ్ (సెల్ఫాన్) బిళ్ళలతో ఊదరబెట్టి పురుగులను నివారించవక్చు. ఈ బిళ్ళలను ధాన్యం సంచుల మద్యలో పెట్టి, గాలి చొరబడకుండా టార్పాలిన్ కప్పి ఉంచి వారం రోజులు ఊదరబెట్టాలి. గమనిక: ఈ బిళ్ళనుండి ఫాస్ఫీన్ విష వాయువు వెలువడుతుంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిలో ఈ మందులు వాడరాదు. ఈ బిళ్ళలకు నీరు తగిలితే పెలుతాయి కనుక జాగ్రత్త వహించాలి. ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటింకినట్లయితే ధాన్యాన్ని ఎక్కువకాలం సురక్షితంగా నాణ్యత తగ్గకుండా నిల్వ చేసుకోవచ్చు. విత్తే ముందు చేయవలసిన పనులు విత్తన మొలక శాతం పరీక్ష చేసుకొని ,భారతీయ కనిష్ఠ విత్తన ధృవీకరణ ప్రమాణం కంటే ఎక్కువ మొలకలు వచ్చినప్పుడు మాత్రమే, ఆ విత్తన్నాన్ని పొలంలో వేసుకోవాలి. అపరాలో మొలక శాతం మరియు మొలక ధారుడ్యం పెంచడానికి 6-8 గంటల పాటు నీటిలో నానబెట్టి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో ఆశించు పురుగులు, విత్తనం ద్వారా మరియు నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు రాకుండా విత్తనశుద్ధి విధిగా పాటించాలి. విత్తనశుద్ధికి వాడదగ్గ శిలీంధ్ర నాశనులు క్రమ సంఖ్య పంట తెగుళ్ళు మందు మోతాదు (కిలో విత్తనానికి) 1 వరి మాగుడు తెగులు/పాము పొడ కార్బండజిమ్ 1 గ్రా 2 ప్రత్తి ఆకుమచ్చ, వేరుకుళ్ళు, కాండంకుళ్ళు, కార్బాక్సిన్, విటావాక్స్ 2.5 గ్రా, 3 గ్రా 3 మొక్కజొన్న, సజ్జ,జొన్న బూజు తెగుళ్ళు మెటలాక్సిల్ 7 గ్రా 4 కంది వేరుకుళ్ళు, ఎండు తెగులు, మొదలుకుళ్ళు విటావాక్స్ (కార్బాక్సిన్+థైరామ) 4 గ్రా 5 సోయాచిక్కుడు బొగ్గుకుళ్ళు, మొదలుకుళ్ళు విటావాక్స్ 3 గ్రా 6 ప్రొద్దుతిరుగుడు బూజు తెగులు మెటలాక్సిల్ 6 గ్రా 7 ఆముదం బూజు తెగులు మెటలాక్సిల్ 6 గ్రా 8 కూరగాయలు మాగుడు తెగులు కాప్టాన్ 20-30 గ్రా గమనిక విత్తన శుద్ధి చేసిన విత్తనాలు తినడానికి పనికి రావు. పశువులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. విత్తనశుద్ది మందులు మనుషులకు హానికరం కనుక జాగ్రత్తలు పాటించాలి. విత్తన శుద్ధి ప్రక్రియలో వరుస క్రమం: విత్తనం+కీటకనాశిని + శిలీంధ్ర నాశిని + జీవ శిలీంధ్ర నాశిని + జీవ ఎరువు ఈ క్రమాన్ని తప్పక పాటించాలి.తినడానికి ఉపయోగించే ధాన్యంలో పురుగు మందులు కలుపరాదు. క్రమ సంఖ్య పురుగు రకం మందు మోతాదు (కిలో విత్తనానికి) 1 వివిధ పంటలలో ఆశించే రసం పీల్చే పురుగు (ప్రత్తి, బెండ, మిరప, జొన్న, సజ్జ, ఆవాలు) ఇమిడక్లోప్రిడ్ ధయోమిధాక్సామ్ 5గ్రా – 10గ్రా 4-8 గ్రా 2 శనగ, వేరుశనగలో చెదలు వేరుపురుగు క్లోరిపైరిఫాస్ క్లోరిపైరిఫాస్ 15-30 మి.లీ 6 మి.లీ మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన చిరునామా:ప్రొఫెసర్ మరియు హెడ్ , విత్తన విభాగము, రాజేంద్రనగర్ హైదరాబాద్ ఫోన్ నెం. 040-24015382