నేలలు తేలికైన నేలలు, మురుగు నీరు నిలువని నేలలు అనుకూలం. నేల తయారు చేయు విధానము 2 నుండి 4 సార్లు మెత్తగా దున్నాలి. 2 సార్లు గుంటకతోలి, చదును చేయాలి. విత్తనం – విత్తే పద్ధతి రెండు కిలోల విత్తనం ఒక ఎకర్రకు సరిపోతుంది. విత్తనానికి మూడు వంతుల ఇసుక కలిపి గొర్రుతో విత్తుకోవాలి. విత్తన శుద్ధి ఒక కిలో విత్తనానికి 3 గ్ర్రముల ధైరమ్ లేక కాప్టాన్ లేక మాంకోజెబ్ కలిపి విత్తటం మంచిది. విత్తే దూరం వరుసల మధ్య 30 సెం.మీ (అడుగు) మరియు మొక్కల మధ్య 15 సె0.మీ. (6 అంగుళాలు) ఉండేటట్లు విత్తుకోవాలి. విత్తే సమయం ప్రాంతము ఖరీఫ్ రబీ 1 వేసవి ఆంధ్రతీరం మే నెల డిసెంబర్ ఆఖరి వారం నుండి జనవరి చివరివారం వరకు రాయలసీమ మే-జూన్ జనవరి 2 – 3 వారాలు ఉత్తర తెలంగాణా జూలై 2వ వారం జనవరి 2వ వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం దక్షిణ తెలంగాణా జూన్ జనవరి 2వ పక్షం. అనువైన రకాలు రకము ఋతువు పంటకాలం (రోజుల్లో) దిగుబడి (కి.ఎకరాకు) నూనె శాతం గుణగణాలు గౌరి ఖరీఫ్ 90 200 50 ముదురు గోధుమ రంగు విత్తనం కోస్తా జిల్లాలకు అనువైనది కోడు ఈగకు తట్టుకుంటుంది. మొదటిగా రబీ/వేసవి 85 300 మాధురి 70 200 50 ముదురు గోధుమ రంగు విత్తనం 70 250 51 యెలమంచిలి - 11 85 250 52 ముదురు గోధుమ రంగు విత్తనం పంట ఒకేసారి కోతకు వస్తుంది. యెలమంచిలి - 17 80 250 51 కోస్తా జిల్లాలకు అనువైనది. 75 300 బూడిద తెగులును తట్టుకుంటుంది. రాజేశ్వరి ఖరీఫ్ 90-100 250 50 తెల్ల రంగు విత్తనం. తెలంగాణా ప్ర్రాంతాని అనుకూలం ఆఖరిగా, రబీ/వేసవి 80-85 300 51 కాండం కుళ్ళు, బూడిద తెగులును తట్టుకుంటుంది. శ్వేతాతిల్ ఖరీఫ్ 85 - 90 250 51 కాండం కుళ్ళు, బూడిద తెగులును తట్టుకుంటుంది. ఆఖరిగా, రబీ/వేసవి 85 450 52 ఎగుమతికి ప్రాధాన్యత కలదు. చందన ఖరీఫ్ 85 250 50 గోధుమ రంగు విత్తనం. అన్నికాలాలకుఅనుకూలం.వెర్రితల తెగులును తట్టుకుంటుంది రబీ/వేసవి 80 180 ఎరువులు కాలము ఎరువు కిలోలు ఎకరాకు వేయుసమయం ఖరీఫ్ పశువుల ఎరువు 4,000 దుక్కిలో వేసి కలియదున్నాలి. నత్రజని 16 విత్తేటప్పుడు 81 కిలోలు విత్తన నెలకు 8 కిలోలు భాస్వరం 24 ఆఖరి దుక్కిలో వేయాలి. పొటాష్ 16 ఆఖరి దుక్కిలో వేయాలి. రబీ/వేసవి నత్రజని 8 అదనముగా వేసుకోవాలి. గమనిక: భాస్వరం ఎరువు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ పొలంలో వాడినపుడు పంటకు అధికంగా కాల్షియం, గంధకం అభించి దిగుబడి పెరుగుతుంది. నీటి యాజమాన్యం విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి మరియు గింజకట్టు దశల్లో నీటి తడులు తప్పకుండా ఇవ్వాలి. అంతర కృషి కలుపు మొక్కల నివారణకు అలాక్లోర్ అనే మందును 3 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి విత్తిన 1 – 2 రోజులలో ఎకరానికి 200 లీటర్ల మందు నీటిని పిచికారి చేయాలి. అదనపు మొక్కలను విత్తిన 20 రోజుల లోపు తీసివేయాలి. -- తొలి దశలో కలుపు మొక్కలు లేకుండా చూచుకోవాలి. సస్యరక్షణ పురుగుల నువ్వులు ఆశించే పురుగులలో ముఖ్యముగా నల్లి, త్రిప్స్ , పచ్చదోమ ఔరుగు, ఆకు ముడత మరియు కాయ తొలుసు పురుగు, కోడు ఈగ మొదలగునవి. నల్లి ఆకు అడుగు బాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీని వలన ఆకులు ముడుచుకొని పోయి, దోనె ఆకారంగా మారి పాలిపోతాయి. నివారణ: నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి. త్రిప్స్ , పచ్చ దీపపు పురుగు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేస్తాయి. ఆకులు ముందుగా పాలిపోయి, ఎండిపోతాయి. నివారణ: మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా డైమిధోయేట్ 2 మి.లీ. ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి. ఆకుముడత మరియు కాయ తొలుక్జు పురుగు చిన్న గొంగళి పురుగులు రెండు – మూడు ఆకులను కలిపి గూడు కట్టి లోపల నుండి ఆకులను తినివేస్తాయి. కాండాన్ని కాయలను తొలచి గింజలను తినేస్తాయి. నివారణ: మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ. ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి. కోడు ఈగ లేత మొగ్గ, పూత తిని వేయడం వలన గి0జ కట్టక తాలుకాయలు ఎర్పడుతాయి. పూత రాలిపోతుంది. తెగుళ్ళు వేరు కుళ్ళు, కాండం కుళ్ళు నివారణ: కాపర్ ఆక్సీక్ర్లొరైడ్ లేదా మాంకోజెబ్ 3 గ్రా. ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి. ఆకు మచ్చ (ఆల్టర్నేరియా) ఆకులపైన, కాండం పైన కాయల మీద ముదురు గోధుమ మచ్చ్లు ఏర్పడతాయి. నివారణ: కాప్టాన్ 2గ్రా. మా0కోజెబ్ 2 గ్రా. కార్బండైజిమ్ 1గ్రా.ఒక లీటరు నీటిని కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు – మూడు సార్లు పిచికారి చేయాలి. వెర్రి తెగులు (ఫిల్లోడి) ఆకులు చిన్నవై పూలలోని భాగాలన్ని ఆకుల మాదిరిగా కాయలు ఏర్పడవు. వెర్రితల వలె అగుపడుతుంది. నివారణ: తెగులు సోకిన మొక్కలను పూర్తిగా తగుల బెట్టాలి. బూడిద తెగులు – నివారణ నీటి కరిగే గంధకపు పోడి 3గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పంటకోత ఆకులు పసుపురంగుకు మారి రాలటం ప్రారంభమయినపుడు 75 శాతం కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినపుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టలతో కొట్టి నూర్పిడి చేయాలి. నిల్వ చేయడం గింజలలో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి. గోనె సంచుల్లో నిల్వ చేయాలి. నిల్వ ఉంచిన సంచుల పై మలాథియాన్ పోడిని చల్లాలి. మధ్య మధ్య పురుగు పట్టకుండాఎండాలో ఆరబెట్టాలి ముఖ్య సూచనలు నేలను మెత్తగా దున్ని చుదును చేయాలి. ప్రాంతానికి, సీజనుకు అనువైన అధిక దిగుబడి వంగడాలను ఎన్నుకొని సకాలంలో విత్తుకోవాలి. విత్తనం వరుసలలో వుత్తాలి. తొలిదశలో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. అదనపు మొక్కలను తొలగించి మొక్కల సాంద్రత తక్కువ చేయాలి. విత్తనం లోతుగా విత్తరాదు. విత్తనం వెదజల్లి విత్తరాదు. పూత, కాయాభివృధ్ధి మరియు గింజకట్టు దశలో నీటి ఎద్దడిని నివారించాలి. ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంతోష్ నగర్ సైదాబాద్, హైద్రాబాద్.