నేలలు నీరు నిల్వ ఉండని తటస్థ భూములు, ఉదజని సూచిక 6.5 – 8.0 వరకు ఉన్న నేలలు ఈ పంటకు అనుకూలం. విత్తే సమయం ఖరీఫ్ : తేలిక పాటి నేలలు – జూన్ 2వ వారం నుండి జూలై 15 వ తేదీ వరకు నల్లరేగడి నేలలు – ఆగస్ట్ 2వ పక్షం. రబీ: రబీ (వర్షాధారం) – నవంబర్ రబీ (నీటి పారుదల క్రింద) – నవంబర్ 15 నుండి జనవరి 1 వరకు. అంతర పంటలు దీనిని ఏక పంటగాను లేక వేరుశనగ+ ప్రొద్దుతిరుగుడు (6 : 2), కంది + ప్రొద్దుతిరుగుడు (1 : 2 ), పైర్లతో అతర పంటగా వేసుకోవచ్చు. రకాలు రకం పంటకాలం (రోజులు) దిగుబడి గుణగణాలు (క్వి.హె) TNAU SUF-7 87 - 89 12 తక్కువ కాలపరిమితి రకం సంకరాలు BSH- 1 90 - 95 15 తుప్పు మరియు బూజు తెగులును తట్టుకుటుంది నూనె శాతం 43% MSFH-8 92 15 నూనె శాతం 36% MSFH-17 92 15 నూనె శాతం 43% KBSH- 1 90 - 95 16 మొక్కలు 130 – 150 సెం.మీ. ఎత్తు పెరుగుతాయి. నూనె శాతం 42% - 44% KBSH- 44 92 - 95 15 - 16 నూనె శాతం 43% MLSFH- 47 85 - 100 18 నూనె శాతం 43% NDSH-1 80 - 85 15 సంకర రకాలలో తక్కువ కాలపరిమితి బూజు తెగులును తట్టుకుటుంది నూనె శాతం 40%-42%. విత్తనం -విత్తే పద్దతి ఎకరానికి రకాలయితే 2.5 ను0చి 3.0 కిలోలు, సంకర జాతి రకాలయితే 2.5 కిలోలు విత్తనం వాడాలి. విత్తనం 3.5 సెం.మీ లోతున విత్త్తాలి. విత్తన శుద్ధి విత్తనాన్ని 14 గం|| నీటిలో నానబెటట్టి ఆరబెట్టి 2 – 3 గ్రా|| థైరమ్ లేక కాప్టాన్ తో విత్తన శుద్ధి చేయాలి. నెక్రోసిస్ తెగులు నివారణకు 5 గ్రా|| ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేయాలి. నేలలు అంతర (సెం.మీ) మొక్కల సాంద్రత (ఎకరాకు) నల్లరేగడి నేలలు 60 * 30 22,000 తేలిక నేలలు 45 * 20 44,400 మధ్యస్థ నేలలు 45 * 30 29,600 మొలిచిన 10 – 15 రోజుల లోపల కుదురుకు ఒక మొక్క ఉంచాలి. అప్పుడు పువ్వు పరిమాణం బాగా ఉండి దిగుబడి పెరుగుతుంది. ఎరువులు ఎకరాకు 3 టన్నులు పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేయాలి. నత్రజని కిఎ భాస్వరం కిఎ పొటాష్ కిఎ వర్షాధారపు పంట 24 (12+12) సగం ఆఖరి దుక్కిలో సగం 30రో|| తరువాత కలుపుతీసి తేమను బట్టి వేయాలి. 24 ఆఖరి దుక్కిలో భాస్వరం, పొటాష్ వేయాలి. 12 విత్తేటప్పుడు 26కి|| యూరియా 150కి|| సింగిల్ సూపర్ ఫాస్పేట్ 20కి|| మ్యూరెట్ పొటాష్ మరియు విత్తిన 30రో|| 26కి|| యూరియా పై పాటు ఎరువుగా వేయాలి. నీటి పారుదల క్రింద 24 (12+6+6) 12 కిలోల ఆఖరి దుక్కిలో ఆఖరి దుక్కిలో 6 కిలోలు 30 రో. తర్వాత 6 కిలోలు 45 రో|| కు వేయాలి 36 ఆఖరి దుక్కిలో భాస్వరం, పొటాష్ వేయాలి. 16 విత్తేటప్పుడు 26కి|| యూరియా 225 కి|| సింగిల్ సూపర్ ఫాస్పేట్ విత్తిన 30రో||.13కి|| యూరియా మరియు 45 రో||కు 13కి|| యూరియా వేయాలి. పైరు పూత దశ్లోఆకర్షక పత్రాలు విచ్చుకునే సమయంలో 2 గ్ర్రా. బోరాక్స్ లీ. నీటికి కలిపి పిచికారి చేసిన గింజ దిగుబడి, నూనె శాత పెరుగుతుంది అంతర కృషి 45 రోజుల వరకు పంటలో కలుపు లెకుండా 2 సార్లు దంతితో తోలి నివారించాలి. ప్లూక్లోరాలిన్ లేదా పెండిమిథాలిన్ ఎకరానికి 600గ్రా. మూల పదార్థము 200లీ. నీటిలో కలిపి కలుపు మొలకెత్తక ముందు పిచికారి చేయాలి. నీటి యాజమాన్యము పంటలో ఎట్టి పరిస్థితుల్లోను నీరు నిల్వ వుండరాదు. పైరు మొగ్గ మీద ఉన్నప్పుడు, పూత సమయంలో, గింజ కట్టే సమయంలో నీటి ఎద్దడికి పంట గురికాకూడదు. పువ్వురుద్దటం ప్రొద్దుతిరుగుడు పూలు విచ్చుకొనునప్పుడు తేనెటీగలు తక్కువగా ఉన్న యెడల ఉదయం 8 – 11 గం. మధ్య గుడ్డతో గాని దూదితో గాని పూలపై సున్నితంగా రోజు మార్చి రోజు 15 రో. రుద్దాలి. దీనెవలన గింజ బాగా పడుతుంది. పైరుపూత దశలో ఉన్నప్పుడు రసాయనిక క్రిమిసంహారక మందులు వాడరాదు. అత్యవసర మైన ఎడల ఎండోసల్ఫాన్ లేక ఫాసలోన్ మందును సాయంత్రము 3 గ|| తరువాత పిచికారి చేయాలి. సస్యరక్షణ రసం పీల్చే పురుగు పచ్చదీపపు పురుగులు, పేనుబంక, త్రిప్స్ , తెల్లదోమ. దీపపు పురుగులు ఆశించిన ఆకులు చివర్లో పసుపు పచ్చ్గా మారి క్రమేపి ఆకు అంతా ఎర్రబడి ముడుచుకొని దోనెలాగా కనిపిస్తాయి. తెల్లదోమ,పేనుబంక, త్రిప్స్ ,ఆకుల నుండి పీల్చుట వలన ఆకులు పసుపు రంగుగా మారి మొక్కలు గిడసబారి ఎండిపోతాయి. వీటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా|| కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయుటవలన 20 – 30 రోజుల వరకు రసంపీల్చు పురుగులు ఆశించవు. ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లీటర్ నీటికి కలిపి లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి ఈ పురుగులను నివారించవచ్చు. ఆకులు తినే పురుగులు బీహార్ / గొంగళి పురుగు, పొగాకు లద్దె పురుగు, పచ్చ దాసరి పురుగు గ్రుడ్ల సముదాయాన్ని గమనించి నాశనం చేయాలి. 5 శాతం వెప గింజలు కషాయం ఎండోసల్ఫాన్ 2.5 మి.లీ. లేదా డైకక్లోరోఫాస్ 2 మిలీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా మిథైల్ పెరాధియాన్ 2 శాతం పొడిని ఎకరానికి 10 కిలోల చోప్ఫున చల్లాలి. పొగాకు లద్దె పురుగు నివారణను విషపు ఎర (5కి తవుడు, కిలో బెల్లం, 0.5 లీ. మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోఫైరిఫాస్ ఒక ఎకరానికి తయారు చేసి సాయంత్రం వేళ మొక్క కుదుళ్ళలో వేయాలి. పువ్వుతొలిచే పురుగు దీని లార్వాలు పువ్వులను, గింజల మధ్య చేరి తింటు అధిక నష్టాన్నీ కలుగుజేస్తాయి. నివారణకు ఎండోసల్ఫాన, క్వినాల్ ఫాస్ ,క్లోరోఫైరిఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా బి.టి. 800గ్రా. ఎకరానికి లేదా 200 ఎల్. ఇ . హెచ్.ఎన్. పి. వి. పిచికారి చేసి ఈ పురుగును నివారి0చవచ్చు. తెగుళ్ళు ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, వేరు మొదలుకుళ్ళ తెగులు: వీటి నివారణకు విత్తనశుద్ధి (థైరమ్ లేదా కాప్టాన్ 3 గ్రా. కిలో విత్తనానికి ) విత్తనాలు వాడాలి. -- లోతట్టు ప్రాంతాలలో ప్రొద్దుతిరుగుడు వేయరాదు. తెగులు సోకిన మొక్కల పై మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కాలిక్సిన్ 1 గ్రా. లేదా దొరోవరాల్ 2 గ్రా. 2 మి.లీ. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి నివారించవచ్చు. తలకుళ్ళు తెగులు ఈ తెగులు సోకిన మొక్క చివరి భాగంలో మరియు పువ్వు క్రిందున్న ఆకులు క్రిందకు ముడుచుకుంటాయి.పువ్వు క్రింద భాగము నీటితో తడిసినట్లుండి గోధుమరంగుకు మారుతాయి. నివారణ: కాపర్ ఆక్సీక్లోరైడ్ 4గ్రా. లేదా మాంకోజెబ్ 3గ్రా+ఎండోసల్ఫాన్ కలిపి పూత దశలో చల్లాలి. ఫెన్ థియాన్ 1మి.లీ. నీటిలో కరిగే గంధకం 2గ్రా. లీ. నీటిలో కలిపి పూతదశలో 10రో| | వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. బూజు తెగులు ఈ తెగులు సోకిన ఆకులు మధ్య ఈనెల పత్రహరితం కోల్పోయి, ఈనెల ఉబ్బి ఆకులు క్రిందకు ముడుచుకుంటాయి.ఆకులు పసుపురంగుకు మారి అడుగిభాగాన బూజును గమనించవచ్చు. నివారణ: మెటలాక్సిల్ 6గ్రా. కిలో విత్తనాని కలిపి విత్తనశుధ్ధి చెయ్యాలి. రిడోమిల్ 2గ్రా. లేదా మెటలాక్సిల్ 2గ్రా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారిన్ చేయాలి. ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంతోష్ నగర్ సైదాబాద్, హైద్రాబాద్.