రకాలు రకం ఋతువు పంటకాలం (రోజులు) దిగుబడి (క్వి.హెక్టారుకు) గుణగణాలు గోదావరి ఖరీఫ్, రబీ 120 – 125 30- 40 దక్షిణ తెలంగాణ అనుకూలం రత్నగిరి ఖరీఫ్, రబీ 110 – 115 30- 40 దక్షిణ తెలంగాణ అనుకూలం గౌతమి ఖరీఫ్, రబీ 110 – 115 30- 40 అగ్గి తెగులును తట్టుకుంటుంది. పద్మావతి ఖరీఫ్, రబీ 105 – 110 30- 40 కోస్తా ప్రాంతములకు అనుకూలం. ఎక్కువ పిలకలు వేస్తుంది. సప్తగిరి ఖరీఫ్, రబీ 110 – 115 30- 40 చిత్తూరు జిల్లాకు అనుకూలం మారుతి ఖరీఫ్, రబీ 85 – 90 25- 30 బెట్టను, అగ్గి తెగులును తట్టుకుంటుంది. చంపావతి అన్నిఋతువులకు 80 – 85 40 అంతర పంటకు అనుకూలం మరియు బెట్టను, తట్టుకుంటుంది వి.ఆర్.762 అన్నిఋతువులకు 105 – 110 35 - 40 అగ్గి తెగులును తట్టుకుంటుంది విత్తనం - విత్తే పద్దతి 3 కిలోల విత్తనం 10 సెంట్లలో పెంచిన నారు హెక్టారుకు సరిపోతుంది. వెదజల్లే పద్దతిలో హెక్తారుకు 4 కిలోల విత్తనం వాడాలి. నాటటం మరియు నాటే దూరం నారు పోసిన 21 రోజులకు స్వల్పకావాలి రకాలను వరుసల మధ్య 15 సెం. మీ. వరుసలలో 10 సెం.మీ. దూరంతో నాటుకోవాలి. దీర్ఘకాలిక రకాలకు 30 రోజుల నారు వరుసల మధ్య 15 – 20 సెం.మీ. వరుసలలో 15 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. పశువుల ఎరవు వెసి నారుమడిని మంచిగా దిక్కి చెయాలి. హెక్టారుకు 10 టన్నులు పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసి దున్నాలి. హెక్టారుకు 30 కిలోల నత్రజని, 30కిలోల భాస్వర0, 30 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను నారు నాటేటప్పుడు వేయాలి, నాటిన 30 రోజు, 30 కిలోల నత్రజనిని పై పాటుగ వేసుకోవాలి. అంతర కృషి నారు నాటటానికి ముందు ఫ్లూక్లోరలిన్ 45 ఇ.సి. మందును హెక్టారుకు2.2లీ. పిచికారి చేసి కలుపును నివారించాలి. నీటి యాజమాన్యం పూత గింజ, పాలుపోసుకునే దశల్లోపైరు నీటి ఎద్దడికి గురి కాకూడదు. సస్యరక్షణ అగ్గి తెగులు నివారణకు కిలో విత్తనానికి3 గ్రా. థైరమ్ / కాప్టాన్ / కార్బన్ డైజిమ్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. అగ్గి తెగులు సోకిన ఎడల కార్బన్ డైజిమ్ 1 గ్రా. ఒక లీటరు నీటికి కలిపు పిచికారి చేయాలి. ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.