నేలలు ఇసుకతో కూడిన గరపనేలలు, చల్కా భూములు మరియు ఎర్ర గరపనేలలు అనుకూలం. రకాలు ఋతువు అనుకూలత రకం పంటకాలం దిగుబడి (మెట్రిక్ టన్నులు హె||కు) ఖరీఫ్ అత్యల్ప వర్షపాతం వేమన(కె.134) 105 – 110రోజులు 1.8 నుండి 2.4 తిరుపతి - 4 105 – 110రోజులు 1.8 నుండి 4.5 టి.ఎ0వి. – 2 105 – 110రోజులు 1.5 నుండి 3.5 కొద్దిపాటి నీటి వసతి వేమన(కె.134) 105 – 110రోజులు 1.8 నుండి 2.4 జె.ఎల్ – 4 100 – 110రోజులు 1.5 నుండి 3.75 తిరుపతి - 4 105 – 110రోజులు 1.8 నుండి 4.5 కదిరి – 5 105 – 110రోజులు 1.8 నుండి 4.0 అధిక వర్షపాతం తిరుపతి - 4 125 – 130రోజులు 2.0 నుండి 4.5 కదిరి – 3 115 – 120రోజులు 1.5 నుండి 2.0 కదిరి – 3 105 – 110రోజులు 1.8 నుండి 4.0 రబీకి వేమన (కె.134), తిరుపతి-4, జె.ఎల్ – 4, కదిరి – 5, తిరుపతి – 2, కాళహస్తి మొదలగునవి అనుకూలమైనవి. విత్తనం -విత్తే పద్దతి విత్తనం మోతాదు ఖరీఫ్ లో హెక్టారుకు 120 – 150 కిలోలు మరియు రబీలో 150 – 180 కిలోలు విత్తనం కావాలి. విత్తన శుద్ధి క్రొత్తగా వేరుశనగ వేయు ప్రదేశాలలో రైజోబియంతో విత్తన శుద్ధి చేయాలి. వేరు పురుగు ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 6.5 మి,లీ. క్లోరోఫైరిఫాస్ లేదా 5 గా. ఇమిడాక్లోప్రిడ్ , కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. విత్తే దూరం ఖరీఫ్ లో 30 సె0.మీ x 10 – 15 సెం.మీ మరియు రబీలో 22.5 సెం.మీ దూరంలో పాటించి విత్తుకోవాలి. ఎరువులు ఆఖరి దుక్కిలో హెక్టారుకు 10 టన్నులు పశువుల ఎరువు కనీసము రెండు లేదా మూడు సంవత్సరములకు ఒకసారి వేయాలి. మరియు వర్షాధార పంటకు హెక్టారుకు 20,40,40 కిలోలు నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అదే నీటి పారుదల పంటకు హెక్టారుకు 30,40,50 కిలోలు నత్రజని, భాస్వరం మరియు పొటాష్ నిచ్చే ఎరువులు వాడాలి. మొత్తం భాస్వరం, పొటాష్ లను విత్తే సమయములో వేయాలి. వర్షాధార పంటకు హెక్టారుకు 250 కిలోల సూపర్ ఫాస్పేట్ మరియు 70 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ లను ఆఖరి దుక్కిలో వేయాలి. అదే నీటి పారుదల పంటకు అయితే హెక్టారుకు 250 కిలోల సూపర్ ఫాస్పేట్ మరియు 75 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ లను ఆఖరి దుక్కిలో వేయాలి. వర్షాధార పంటకు హెక్టారుకు 70 కిలోల యూరియా విత్తే సమయంలో వేయాలి. నీటి పారుదల పంటకు అయితే హెక్టారుకు 40 కిలోల యూరియా, విత్తే సమయ0లో మరియు 25 కిలోలు విత్తిన 30 రోజుల తరువాత పూత సమయంలో వేయాలి. నీటి పారుదల క్రింద హెక్టారుకు 500 కిలోల జిప్సంను 30 రోజుల తరువాత పూత సమయంలో కలుపు తీసి మొక్కల మొదళ్ళ దగ్గర చాళ్ళలో వేసి మట్టిని ఎగ దోయాలి. వర్షాధార పంటకు హెక్టారుకు 500 కిలోల జిప్సంను వూడలు దిగే సమయంలో (విత్తిన 45 రోజులు) వేయాలి. జింక్ లోపం ఉన్న యెడల హెక్టారుకు 500 కిలోల జింక్ సల్ఫేట్ ప్రతి మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేయాలి. అంతర కృషి పంట 45 రోజులు వచ్చు వరకు కలుపు లేకుండా చేయాలి. వూడలు దిగే సమయము నుంచి (పంట వేసిన 45 రోజులు తరువాత నుంచి) పంటలో ఏవిధమైన అంతరకృషి చేయరాదు. విత్తనము వేసిన మూడు రోజులలోపు బ్యూటాక్లోర్ లేదా పెండిమిథాలిన్ 1.0 ను0డి 1.5 లీ. ఒక హెక్టారుకు వేసి కలుపు మొక్కలు నివారిచవచ్చును. సస్యరక్షణ ఎర్ర గొంగళి పురుగు ఇవి ఆకులను తిని రెమ్మల మొదళ్ళను మిగులుస్తాయి. వర్షము పడిన రెండవ రోజు మూడవె రోజు రాత్రి 7 – 9గ0టల మధ్య సామూహికంగా ఎకరాకు 5 చోట్ల మంటలు పెట్టాలి. గ్రుడ్లను, చిన్న లార్వాలను ఏరివేసి నాశనం చేయాలి. క్వినాల్ ఫాస్ / కార్బరిల్ పొడిని హెక్టారుకు 25 కిలోలు చల్లి చిన్న లార్వాల (ఎర్లి లార్వాస) ను నివారించాలి. పెద్ద లార్వాలను డైమిథియేట్/ మొనోక్రొటోఫాస్ 0.5 శాతం పిచికారి చేసి నివారించాలి. పంట చుట్టు లోతు సాలు చేసి అందులో కార్బరిల్ పొడి మందు చల్లాలి. అలసంద, ఆముదమును ఎర పంట వేయాలి. వేరుపురుగు ఖరీఫ్ పంటను జూన్ 15 లోపల వేసు కొని వేరుపురుగు బారి ను0డి పంటను తప్పించవచ్చును. లోతు దుక్కి చేయడం వలన కోశస్థ దశ నశిస్తుంది. విత్తనము వేసే ముందు ఫోరేట్ గుళికలు హెక్టారుకు 1.5కిలోలు వేయాలి. క్లోరోఫైరిఫాస్ 6 మి.లీ. ఒక కిలో వత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. రసం పీల్చే పురుగు (పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు) క్వినాల్ ఫాస్ 0.05 శాతం లేదా మోనోక్రోటోఫాస్ 0.05 శాతం లేదా డైమిథియేట్ పిచికారి చేయాలి. కాయ తొలుచు పురుగు 5 శాతం మాలాధియాన్ కాయల మీద, సంచుల మీద పిచికారి చేయాలి. వేప నూనె 5 మి.లీ. ఒక కిలో కాయలకు పట్టించాలి అల్యూమినియం ఫాస్పైడైతో (3-5 మాత్రలు ఒక టన్ను కాయలకు) పొగ పెట్టాలి. తెగుళ్ళు తిక్కా ఆకుమచ్చ తెగులు ఆకు మీద, కాండము మీద, ఆకు కాండము మీద, ఊడల మీద, గుండ్రటి గోధుమ రంగు గల నల్లటి మచ్చలు ఏర్పడతాయి. నివారణ: తెగులు తట్టుకొను రకాలైన (వేమన, జె.సి.గి – 88) సాగు చేయాలి. వేరుశనగలో సజ్జ పంటను 7 : 1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి. మాంకోజెబ్ కార్బన్ డైజిమ్ 2.5 గ్రా|| ఒక లీటరు నీటికి కలిపి, మచ్చ కనిపించిన వెంటనే మరియు 15 రోజులలో పిచికారి చేయాలి. కుంకుమ తెగులు / తుప్పు ఎరువు – ఇటుక రంగు పొక్కులు ఆకుల అడుగుభాగంలో ఏర్పడి, పైన పసుపు రంగు మచ్చలుగ ఏర్పడతాయి. నివారణ: మాంకోజెబ్ 3 గ్రా|| ఒక క్లో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. తెగులు కనిపించగానే మాంకోజెబ్ 2 గ్రా|| ఒక లీటరు నీటికి కలిపి, 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.