మన రాష్ట్రంలో శీతాకాలంలో పండించే సాంప్రదాయేతర కూరగాయలలో ఫ్రెంచి చిక్కుడు ఇప్పడిప్పడు ప్రాచుర్యాన్ని పొందుతోంది. దీని లేతకాయలను కూరగాయగా వాడుతారు. ఉత్తర భారతదేశంలో ఎండిన ఫ్రెంచి చిక్కుడు గింజలను రాజ్మా అంటారు. వీటిని పప్పదినుసుగా వాడతారు. వీటికి ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా డిమాండ్ పెరిగింది. వాతావరణం ఫ్రెంచి చిక్కుడు సాగుకు చల్లని వాతావరణం అనుకూలమైనది. మొక్క పెరుగుదల 15o - 21o సెల్సియస్ వద్ద బాగుంటుంది. అధిక మంచును, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. కావున మనరాష్ట్రంలో శీతాకాలం పంటగా సాగుచేసేందుకు అనువుగా వుంటుంది. ఎత్తైన కొంద ప్రాంతాలలో అంటే సముద్ర మట్టం నుండి 700 - 2500 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాలలో వేసవి పంటగా సాగుచేయవచ్చు. నేలలు ఈ పంట సాగుకు ఉదజని సూచిక 6.0 - 7.0 వరకు వున్న నేలలు ముఖ్యంగా ఇసుకతో కూడిన ఎర్ర గరప నేలలు, ఒండ్రు నేలలు, మరుగు నీటి వసతి గల బరువైన నేలలు అనుకూలం. క్షార నేలలు పనికిరావు. రకాలు ఫ్రెంచి చిక్కుడులో ప్రధానంగా తీగ రకాలు, పొద రకాలు వున్నాయి. ఎక్కువగా పొద రకాలు సాగు చేస్తున్నారు. తీగరకాలు : టీ.కె.డి. 1 : పంటకాలం : 90 - 100 రోజులు, దిగుబడి 2.0 - 2.4 ట/ఎ. కె.కె.ఎల్.-1 : మొరింగాబీన్ : కొండప్రాంతాలకు అనువైనది. కూరగాయ దిగుబడి : 2.8 ట/ఎ. గింజ దిగుబడి : 1.2 ట/ఎ. పాదరకాలు : కంటెండరు : 50 - 55 రోజులకు పూతకు వస్తుంది. కాయ పొడవు 14 - 15 సెం.మీ. గింజలు లేత గోధుమ రంగులో వుంటాయి. దిగుబడి 3.2 - 3.8 ట/ఏ. బూడిద తెగులు, వెర్రి తెగులును తట్టుకుంటుంది. అర్మాకోమల్ : నాటిన 70 రోజులకు కోత కొస్తుంది. కాయలు చదునుగా వంకర లేకుండా నిటారుగా వుంటాయి. మంచి నాణ్యతతో రవాణాను తట్టుకుంటుంది. కాయ దిగుబడి : 40 - 4.8 ట/ఏ. అర్కా సువిధ : విత్తిన 70 రోజులకు కోత కొస్తుంది. కాయలు 16 – 17 సెం.మీ. పొడవుండి ఉపరితలం ఉబ్బెత్తుగా మంచి కండకలిగి తాజాగా వుంటాయి. కాయదిగుబడి : 6, 5 – 7.0 ట/ఎ. బౌంటీపుల్ : మన ప్రాంతంలో సెప్టెంబరు నుండి ఫిబ్రవరి వరకు వేసుకోవడానికి అనువుగా వుంటుంది. గుత్తులుగా కాసూ మొక్క మీద కాయలు 4 - 5 రోజులు ఎక్కువగా వున్నప్పటికీ లేతగా వుంటాయి. దిగుబడి : 40 - 4.8 ట/ఎ. ప్రీమియర్ : విత్తిన 55 - 60 రోజులకు కోతకొస్తుంది. కాయలు 11.13 సెం.మీ. పొడవుంటాయి. దిగుబడి : 3.0 - 3.6 ట/ఎ. గింజలు నల్లగా కాఫీ రంగులో వుండి రాజ్మాష్గా కూడా వాడవచ్చు. వడలు తెగులును, వెర్రి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. పూసాపార్వతి : 45 - 50 రోజులలో కోత కొస్తుంది. కాయలు 15 - 18 సెం.మీ. పొడవుతో ఆకుపచ్చగా వుంటాయి. గింజలు లేత గోధుమ రంగులో వుండి చిన్నగా వుంటాయి. వెర్రి తెగులును, బూడిద తెగులును తట్టుకొంటుంది. దిగుబడి : 3.2 - 3.3 ట/వి. పంత్ అనుపమ : 55 – 65 రోజులలో మొదటి కోతకొస్తుంది. కాయలు ఆకుపచ్చగా వుండి గింజ త్వరగా పట్టదు. గింజలు మధ్యస్తంగా గోధుమ రంగులో వుంటాయి. ఈ రకం కానింగ్కు, ఫ్రీజింగ్కు అనువైనది. ఆకుమచ్చ తెగులును, వెర్రి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. కాయ దిగుబడి : 3.6 ట/ఎ. గింజ దిగుబడి : 0.4 ట/ఎ కూరగాయ రకాలలో కొన్నింటిని రాజ్మా కొరకు పండిస్తారు. ఫ్రెంచి చిక్కుడు గింజలు వివిధ రంగులలో వుంటాయి. ప్రధానంగా నలుపు, ముదురు ఎరుపు, గోధుమ రంగు, నలుపు గింజలపై తెలుపు చుక్కలు, గోధుమ రంగుపై నల్లటి మచ్చలు గల రకాలున్నాయి. రాజ్మా కొరకు ప్రత్యేకంగా కొన్ని రకాలు విడుదల చేశారు. ఉదయ్ : ఈ రకం పప్పు గింజల పరిశోధనా సంచాలయం, కాన్పూర్ నుండి విడుదలయింది. విత్తన సైజు పెద్దగా అంటే 100 గింజల బరువు 45 గ్రాముల వరకుంటుంది. పంటకాలం : 110 - 115 రోజులు దిగుబడి 12 - 14 ట/ఎ). హెచ్.యు.ఆర్-137 : బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి నుండి విడుదలయింది. పంటకాలం : 115 - 120 రోజులు. దిగుబడి : 10 - 12 ట/ఎ. హెచ్.యు.ఆర్-15 : బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి నుండి విడుదలయింది. గింజ పెద్దది. దిగుబడి : 10 - 12 ట/ఎ). వి.యల్. -63 : ఈ రకం పర్వతీయ కృషి అనుసంధాన్, ఆల్మోరా నుండి విడుదలయింది. పంటకాలం: 120 రోజుల, దిగుబడి : 10 - 12 ట/ఎ. విత్తనమోతాదు 20 - 24 కిలోలు/ఎకరాకు. విత్తుకాలం ఈ పంటసాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు మనరాష్ట్రంలో శీతాకాలంలో వుంటాయి. కనుక నవంబరు-డిసెంబరులో విత్తుకోవాలి. కొండ ప్రాంతాలలో ఫిబ్రవరి - మార్చి అనుకూలం. ఆలస్యమయితే ఉష్ణోగ్రత పెరిగి పెరుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. నేల తయారీ నేల అదనుకు వచ్చే వరకు బాగా దున్నాలి. బోదెలు తోలి వాటిపై విత్తనాన్ని విత్తుకోవాలి. వరుసల మధ్య 30 - 35 సెం.మీ. వరుసల్లో మొక్కల మధ్య 25-30 సెం.మీ. దూరం వుండాలి. ఎరువుల వాడకం ఆఖరు దుక్కిలో 8 - 10 టన్నుల పశువుల ఎరువుతో బాటు ఎకరానికి 10 కిలోల నత్రజని, 24 క్రిలోల భాస్వరం, 20 కిలోల పాటాష్ నిచ్చే ఎరువులను వేసి బాగా కలియదున్నాలి. మొదటిసారి ఈ పంటను వేసేట్లయితే నత్రజని స్థాపించే రైజోబియం కల్చరుతో తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. పూత సమయంలో ఎకరాకు 10 కిలోల నత్రజని ఎరువు పైపాటుగా వేయాలి. అంతర కృషి కలుపు నివారణకు ఎకరానికి అలాక్లోర్ లేదా బ్యూటాక్లోర్ 800 గ్రా. మూలపదార్థం లేదా పెండిమిథాలి 1.2 లీ. చొప్పన 200 లీటర్ల నీటిలో కలిపి గింజలు విత్తిన మరుసటి రోజు పిచికారీ చేయాలి. తర్వాత 30-45 రోజులకు ఒకటి రెండుసార్లు గొప్ప త్రవ్వి మట్టి మొక్క మొదళ్ళకు ఎగదోయాలి. నీటి తడుపు నేల స్వభావాన్ని బట్టి 7 - 10 రోజుల కొకసారి నీటి తడులివ్వాలి. అధిక తేమ ఉండరాదు. పిందె దశలో కనీసం 50 శాతం తేమ వుండేటట్లు చూడాలి. లేనిచో పూత పిందె రాలిపోతుంది. సమగ్ర సస్యరక్షణ ఫ్రెంచి చిక్కుడు సాగులో వెర్రి తెగులు ప్రధాన సమస్య. ఈ వైరస్ తెగులు నివారణకు తెగులు వ్యాప్తి చేసే రసం పీల్చే పరుగులు ముఖ్యంగా తెల్లదోమను, పేనుబంకను నివారించాలి. అందుకు విత్తిన వెంటనే ఎకరానికి 6 కిలోల చొప్పన కార్యోప్యూరాన్ గుళికలు వేయాలి. డైమిధోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫిప్రానిల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడంతోపాటు వైరస్ సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి నాశనం చేయాలి. తెగులు తట్టుకునే రకాలను సాగుచేయాలి. కాయతొలుచు పరుగు నివారణకు ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చివరగా పరుగులు, తెగుళ్ళ నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. డై ఫోల్టాన్ + 2 మి.లీ. డైమిధోయేట్ లేదా 2 మి.లీ. మిథైల్ డెమిటాన్ లీటరు నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేయాలి. కోత కూరగాయ కొరకు లేతకాయలను కోయాలి. గింజల కోసం కాయలు ముదిరి పూర్తిగా ఎండే ముందు మొక్కతో సహా పీకి ఎండబెట్టి గింజలు తీయాలి. దిగుబడి పొదరకాలు : 3, 6 - 40 ట/ఎ. తీగరకాలు : 4.8 - 6.0 ట/ఎ. అధిక దిగుబడినిసూ, పురుగులు మరియు తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపికచేసి, సకాలంలో విత్తుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.